అప్పుడే పుట్టిన తన బాబును ఎత్తుకుని.. ఆనందం తట్టుకోలేక.. | Viral Video: First Time Father Reaction Holding His Newborn Son | Sakshi
Sakshi News home page

Viral Video: అప్పుడే పుట్టిన తన బాబును ఎత్తుకుని.. ఆనందం తట్టుకోలేక..

Published Fri, Sep 24 2021 5:44 PM | Last Updated on Fri, Sep 24 2021 6:00 PM

Viral Video: First Time Father Reaction Holding His Newborn Son - Sakshi

దంపతులను తమ జీవితాల్లోని మధుర క్షణాలను గురించి అడిగితే వారు ఫస్ట్‌ చెప్పేది.. వారి మొదట సంతాన జననం, ఆ సమయంలో వారికి కలిగిన ఆ ఆనందం. ఎందుకంటే భార్యాభర్తలు తొలిసారి తల్లిదండ్రులుగా మారినప్పుడు ఇక వాళ్ల ఆనందానికి అవధులు ఉండ‌వు. అదొక ప్రత్యేకమైన అనుభూతి. అది అనుభవించడం తప్ప మాటల్లో వర్షించలేం. తమకో బంధం దొరికిందని మురిసిపోతారు భార్యాభర్తలు.

అలానే ఓ తండ్రి.. త‌న‌కు కొడుకు పుట్టాడ‌ని తెలుసుకొని సంబరపడి పోయాడు. వెంటనే ఆసుప‌త్రికి వ‌చ్చి తన బాబుని ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. అంతలో నర్సు ఆ బాబును తీసుకొచ్చింది. తన కొడుకుని చూడగానే ఆ తండ్రి త‌న దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయాడు. త‌న కొడుకును చేతుల్లో తీసుకోవాలనే తొందర ఓ వైపు, కళ్ల నిండా కనీళ్లు మరో వైపు అలా ఆ తండ్రి భావోద్వేగానికి గుర‌య్యాడు. చివరకి ఆ బాబుని తీసుకున్నప్పుడు ఆ తండ్రి కళ్లలో తన ప్రేమను కన్నీళ్ల రూపంలో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆ తండ్రి భావోద్వేగాన్ని చూసి చలించిపోతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement