వ్యాన్‌తో బీభత్సం.. అసలు విషయం తెలిస్తే షాక్‌ | Patient Relative Plunges Truck Inside Hospital Damages Several Vehicles | Sakshi
Sakshi News home page

వ్యాన్‌తో బీభత్సం.. అసలు విషయం తెలిస్తే షాక్‌

Published Sun, Dec 20 2020 3:17 PM | Last Updated on Sun, Dec 20 2020 6:09 PM

Patient Relative Plunges Truck Inside Hospital Damages Several Vehicles - Sakshi

గురుగ్రామ్‌ : హర్యానాలోని గురుగ్రామ్‌లో శనివారం రాత్రి జరిగిన ఒక సంఘటన తీవ్ర కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని బసాయ్‌ చౌక్‌లో ఉన్న బాలాజీ ఆసుపత్రి వద్ద ఒక వ్యక్తి ట్రక్‌‌తో బీభత్సం సృష్టించాడు. వ్యాన్‌తో వచ్చిన ఆ వ్యక్తి ఆసుపత్రి గోడను ఏడెనిమిది సార్లు బలంగా ఢీకొట్టాడు. వ్యక్తి బీభత్సం కారణంగా ఆసుపత్రి ముందు ఉన్న మెడికల్‌ షాపు పాక్షికంగా దెబ్బతినడంతో పాటు సుమారు 15 వాహనాలు ధ్వంసమయ్యాయి. తరువాత ఆ వ్యక్తి ట్రక్కును అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డుయింది. కాగా ఆసుపత్రి యాజమాన్యం అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. (చదవండి : అన్న ప్రాణాలు తీసిన కంచె పంచాయితీ!)

అయితే ఆ వ్యక్తి ఆసుపత్రిపై దాడికి ఎందుకు దిగాడనేది తెలిస్తే కచ్చితంగా షాక్‌ అవుతారు. అసలు విషయంలోకి వెళితే.. బాలాజి ఆసుపత్రిలో ఇద్దరు వృద్దులు చికిత్స పొందుతున్నారు. వృద్దుల చికిత్సకు సంబంధించి వారి కుటుంబసభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. రానురాను గొడవ పెద్దదై రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి సిద్దమయ్యారు. ఇంతలో ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్లిన ఒక వ్యక్తి వ్యాన్‌ తీసుకువచ్చి తన కుటుంబంపై ఉన్న కోపాన్ని అలా ఆసుపత్రిపై చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీలో మీకు గొడవలుంటే.. బయట తేల్చుకోవాలి గాని ఇలా ఆసుపత్రిని ధ్వంసం చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement