చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో చక్కర్లు
ప్రపంచంలోవున్న ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారని నానుడి. అవును కదా.. అనిపించేలా మనలో చాలామంది ఇలాంటి ఉదంతాలను చూసే వింటాం కూడా. మన బంధువులు లేదా సన్నిహితులకు కార్బన్ కాపీలా ఉండే మనుషులను చూసినపుడు ఒకింత ఆశ్చర్యపోతాం. అచ్చం..అలాగే.. జిరాక్స్.. అని అబ్బుర పడతాం..కదా! ఇపుడు నెట్ లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి వీడియో ఇలాంటి అనుభవాన్నే మిగుల్చుతోంది. దీన్ని చూస్తే ఆశ్చర్యంతో పాటు ముచ్చటపడిపోవడం మీ వంతు అవుతుంది. ఇక ‘అతిలోకి సుందరి’ వీర ఫాన్స్ కయితే మరింత కన్నుల పండుగే.
సూటిగా సుత్తి లేకుండా విషయానికి వస్తే.. బాలనటిగా సినీ జీవితంలోకి ప్రవేశించి.. తనదైన నటనతో టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అభిమానులను ఆకట్టుకున్న నటి శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెలల వయసున్న ఈ చిన్నారి అచ్చం ..అచ్చుగుద్దినట్టు.. అతిలోకసుందరి శ్రీదేవిలా వుంది.. కాదు..కాదు. అసలు శ్రీదేవి చిన్నప్పటి వీడియోనా ఇది. ఏ సినిమాలోది అబ్బా.. అని సందేహం వచ్చేలా ఉంది. కళ్ళు, ముక్కు, టోటల్‌గా శ్రీదేవి(కాస్మొటిక్ సర్జరీకి ముందు) మాదిరిగా వున్న ఈ చిన్నారి వీడియో సోషల్‌మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. పాప భయంతో బిక్క మొహం పెట్టిందిగానీ, నవ్వితే ముత్యాల వాన కురిసేదేమో....ఇంకెందుకు ఆలస్యం.. చిన్నితల్లీ.. నీకు దృష్టెంత తగిలేనురా అన్నట్టు ఉన్న ఈ బంగారాన్ని మీరూ చూసేయండి మరి.