
బాలీవుడ్ హీరో సుమీత్ వ్యాస్ కుటుంబంలో నూతన ఆనందాలు వెల్లువిరిశాయి. సుమీత్ వ్యాస్, ఎక్తా కౌల్ దంపతులు జూన్ 4(గురువారం) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమనులకు తెలియ జేశారు. ‘మాకు అబ్బాయి జన్మించాడు. తల్లిదండ్రులుగా వాడి ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేగాక బాబుకు అప్పుడే పేరు కూడా పెట్టేశారు. చిన్నోడికి ‘వేద్’ అని నామకరణం చేశారు. పుత్రోత్సాహంతో ఉన్న ఈ జంటకు ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (విరాటపర్వం: ‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి)
It’s a boy.
— Sumeet Vyas (@vyas_sumeet) June 4, 2020
Shall be called VED.
Mamma and Daddy are acting cliché ... smothering the child every few minutes...
సుమీత్, ఎక్తాలు 2018 సెప్టెంబర్‌లో కశ్మీరి సంప్రదాయం ప్రకారం జమ్మూలో వివాహం చేసుకున్నారు. కాగా ఏప్రిల్ నెలలో తండ్రి కాబోతున్నట్లు సుమీత్ వ్యాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ‘గర్వంగా మా కొత్త ప్రాజెక్టును ప్రకటిస్తున్నాము. త్వరలో జూనియర్ కౌల్, వ్యాస్ రాబోతున్నాడు. దీనికి సుమీత్, నేను దర్మకత్వం, నిర్మాతలుగా వ్యవహరించాం’. అంటూ సినిమాటిక్ భాషలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఎక్తా కౌల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. (బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment