
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వైద్యురాలు
హైదరాబాద్: అతిగా మద్యం తాగి కారు నడుపుతూ ఓ మహిళా వైద్యురాలు ...డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయింది. పైగా తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై చిందులేసింది. డాక్టర్ అయిన తనకే పరీక్షలు నిర్వహిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
శనివారం రాత్రి నెక్లెస్ రోడ్డులో రాత్రి 11.30 గంటలకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో ఓ వైద్యురాలిని పోలీసులు ఆపారు. దీంతో ఆమె వారిపై వాదనకు దిగి దురుసుగా వ్యవహరించింది. చివరికి లా అండ్ ఆర్డర్ పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది. గంటసేపు వాదులాట అనంతరం ఆ వైద్యురాలికి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు పరీక్ష చేయగలిగారు. మద్యం తాగినట్లు తేలటంతో ఆమెపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.