అనంతపురం : అనంతపురంలో ఈనెల 2న బీకాం ఫైనలియర్ విద్యార్థిని వాణిపై జరిగిన యాసిడ్ దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇన్నిరోజులు వాణిపై దాడి జరిగిందని అందరూ అనుకుంటుండగా, ఆమే స్వయంగా యాసిడ్ పోసుకుందని పోలీసుల విచారణలో తేలింది. పాత ప్రియుడు రాఘవేంద్రకు బుద్ధిచెప్పాలని ఆమె, అతడే యాసిడ్ పోసినట్టుగా ఈ డ్రామా ఆడిందని ఎస్పీ తెలిపారు. పోలీసులను పక్కదోవ పట్టించినందుకుగానూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ముదిగుబ్బకు చెందిన వాణి, అనంతలోని వాణి కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రియుడు రాఘవేంద్రపై పగ తీర్చుకునేందుకు, పరిచయమున్న మహేష్‌ను ఆశ్రయించింది. మహేష్, ఉద్యానశాఖలో పనిచేస్తున్న తాహీర్ ఇబ్రహీమ్ ద్వారా, సురేష్ అనే వ్యక్తి నుంచి యాసిడ్ సేకరించి, వాణికి అందించాడు. ఆమె తన ఒంటిపై యాసిడ్ పోసుకుని, ఇంతపెద్ద దుమారం రేపింది.
యాసిడ్ దాడి నాటకం జరిగిందిలా...
సెప్టెంబర్ 2వ తేదీ....సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలు.. అనంతపురం బైపాస్‌లోని పరిటాల రవీంద్ర పెట్రోల్ బంక్ ప్రాంతం.. కళాశాల బస్ దిగిన విద్యార్థిని వాణి అక్కడి నుంచి మేనమామ ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంటి సమీపంలోకి రాగానే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఇద్దరు రెండు యాసిడ్ బాటిళ్లతో బైక్‌పై వెంటబడ్డారు. ఒక యాసిడ్ బాటిల్‌ను బైక్ నడుపుతున్న తాహీర్ ఇబ్రహీమ్ ముందు పెట్టిన సురేష్ ... మరొక బాటిల్‌ను తన చేతిలో పట్టుకున్నాడు. సురేష్ హెల్మెట్ పెట్టుకోగా, తాహీర్ ఇబ్రహీమ్ మొహం కన్పించకుండా కర్చీఫ్ కట్టుకున్నాడు.
వాణి సమీపంలోకి రాగానే వాళ్లిద్దరూ యాసిడ్ బాటిల్ మూత తెరిచి చల్లేందుకు ప్రయత్నించాడు. ఆమె వెంటనే తల పక్కకు తిప్పుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాటిల్‌లోని 40 శాతం యాసిడ్ వాణి ఒంటిపై పడింది. కుడి చేయి, కుడికాలు, ఛాతి, వెనుక భాగంలో గాయాలయ్యాయి. దీంతో ఆమెపెద్ద పెట్టున అరుపులు, కేకలు వేసింది. మొదటి యాసిడ్ బాటిల్‌ను అక్కడే పడేసిన వారు ... మరో బాటిల్ తీసుకుని చల్లేందుకు ప్రయత్నించారు. అయితే.. జనాలు అక్కడికి పరుగెత్తుకు వస్తుంటం చూసి పరారయ్యారు.
ప్రియుడిపై కక్షతో విద్యార్థిని యాసిడ్ దాడి నాటకం!
Published Thu, Sep 19 2013 2:26 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement
Advertisement