ఆదిలాబాద్ టౌన్/బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ఆదిలాబాద్ నాలుగు, బెల్లంపల్లిలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 1,566, బెల్లంపల్లిలో 6,397 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆదిలాబాద్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సత్యానందం, వాణి స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది పరిశీలకులు, ఐదుగురు రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. విద్యార్థులకు పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్ పరీక్ష కేంద్రంలో అందజేస్తారు. బాల్‌పెన్, పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలి. ఈసారి ఓఎంఆర్ షీట్‌ను ఆధునీకరించారు. విద్యార్థి ఫొటో, పేరు, హాల్‌టికెట్ నంబరు పొందుపర్చారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా రూపొందించారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో సుమారు 25 నుంచి 45 మంది ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించారు. పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు పాలిసెట్
Published Wed, May 21 2014 1:16 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement