
వాణీ అయితే వద్దట!
హీరోయిన్ ఎంపిక విషయంలో నిర్మాతతో ఆమిర్ ఖాన్‌కి విభేదాలు వచ్చాయట. అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ హీరోలుగా ‘ధూమ్ 3’ ఫేమ్ విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో హీరోయిన్‌గా వాణీ కపూర్‌ను తీసుకోవాలని నిర్మాత ఆదిత్యా చోప్రా, వాణీ వద్దంటూ ఆమిర్ పట్టుదలగా ఉన్నారట.
యశ్‌రాజ్ సంస్థతో వాణీకి త్రీ ఫిల్మ్స్ కాంట్రాక్ట్ ఉంది. ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బేఫికర్’లోనూ ఆమే హీరోయిన్. ‘థగ్స్ ఆఫ్...’కి హీరోయిన్‌గా వాణీ వద్దని ఆమిర్ చెప్పడంతో ఆదిత్య డైలమాలో పడ్డారట. ఇంతకీ వాణీ వద్దని ఆమిర్ ఎందుకంటున్నారో?