నాకు సున్నా మార్కులేశాడు! | A Choreographer Told Salman Khan That Katrina Kaif Can't Dance! Watch What She Did Next | Sakshi
Sakshi News home page

నాకు సున్నా మార్కులేశాడు!

Published Sat, Mar 17 2018 12:28 AM | Last Updated on Mon, May 28 2018 4:04 PM

A Choreographer Told Salman Khan That Katrina Kaif Can't Dance! Watch What She Did Next - Sakshi

కత్రినా కైఫ్‌

కమిలి కమిలి (ధూమ్‌ 3–2013), చిక్నీ చమేలి (అగ్నిపత్‌–2012), షీలాకి జవానీ (థీస్‌ మార్‌ ఖాన్‌–2010)... ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఈ సాంగ్స్‌లో హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కుర్రకారును ఏ లెవల్లో ఊర్రూతలూగించారో. ఆ పాటల్లో కత్రినా చేసిన డ్యాన్స్‌కు ఎంతోమంది ఫిదా అయ్యారు. అలాంటి కత్రినా కైఫ్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో కాస్త ఇబ్బందిపడ్డారట. ఈ విషయం గురించి కత్రినా చెబుతూ– ‘‘తెలుగులో ఓ స్టార్‌ హీరోతో సినిమా చేశాను.

అప్పట్లో నా డ్యాన్స్‌ స్కిల్స్‌ సరిగ్గా లేకపోవడం వల్ల సాంగ్స్‌ షూట్‌కు టైమ్‌ పట్టింది. అప్పుడు ఆ కొరియోగ్రాఫర్‌ నన్ను ఏమీ అనలేదు. ఆ తర్వాత అదే  కొరియోగ్రాఫర్‌ ఓ హిందీ సినిమాకు వర్క్‌ చేస్తున్న టైమ్‌లో కత్రినా కైఫ్‌కు డ్యాన్స్‌లో ‘జీరో మార్క్స్‌’ అన్నారని నా సన్నిహితులు నాతో చెప్పారు. అది విని షాక్‌ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ఇంకా చెబుతూ– ‘‘డ్యాన్స్‌లో నేను కాస్త వీక్‌ అని నాకు తెలుసు. అయితే నాతో విషయం చెప్పకుండా వేరేవాళ్ల దగ్గర నన్ను విమర్శించడం బాధ అనిపించింది.

ఆ తర్వాత కథక్‌ గురు వీరు కృష్ణణ్‌ పర్యవేక్షణలో డ్యాన్స్‌ స్కిల్స్‌ను మెరుగుపర్చుకున్నాను. ప్రతిరోజూ 12 గంటలకు పైగా సాధన చేశాను. కొరియోగ్రాఫర్‌ బాస్కో సీజర్‌ నాలో ఆత్మవిశ్వాసం నింపారు’’ అన్నారు కత్రినా. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్, కత్రినా, ఫాతిమా సనాషేక్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ సినిమాలో ఓ డ్యాన్స్‌ నంబర్‌కు ఇటీవల కాలు కదిపారామె . ఈ సాంగ్స్‌ గురించి మాట్లాడుతున్నప్పుడే ఈ విషయాలు పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement