Vani Bhojan Missing in Vikram Mahaan Movie, Details Inside - Sakshi
Sakshi News home page

Vani Bhojan: 'మహాన్‌'లో హీరోయిన్‌ పాత్రనే తీసేశారు, ఎందుకంటే?

Published Sun, Feb 13 2022 1:34 PM | Last Updated on Sun, Feb 13 2022 2:16 PM

Vani Bhojan Missing In Vikram Mahaan Movie - Sakshi

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో, ఛాలెంజింగ్‌ రోల్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసే హీరో చియాన్‌ విక్రమ్‌. అతడు నటించిన తాజా చిత్రం 'మహాన్‌'. ఇందులో తనయుడు ధృవ్‌ విక్రమ్‌తో కలిసి నటించాడీ స్టార్‌ హీరో. ఎస్​ఎస్​ లలిత్​ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్​ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వాణి భోజన్‌ కూడా ఉందని గతంలో చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విక్రమ్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి కూడా! కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆమె ఎక్కడా కనిపించనేలేదు. ఆమె నటించిన పార్ట్‌ అంతా ఎడిటింగ్‌లో తీసేశారు. బహుశా రన్‌ టైమ్‌ వల్ల ఆమె సన్నివేశాలు తొలగించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంది. దీనికి వాణి నటించిన సన్నివేశాలు కూడా కలిపితే మూడు గంటలవుతుందని ఆలోచించి వాటిని తొలగించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మహాన్‌ లాంటి పెద్ద సినిమాలో నటిస్తున్నానని మురిసిపోయిన వాణికి ఇది నిజంగా బాధించే అంశమే. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాణికి అన్యాయం చేశారంటూ ఆమె అభిమానులు నెట్టింట ఫైర్‌ అవుతున్నారు. కాగా వాణి భోజన్‌ తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో కథానాయికగా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement