Mahaan
-
ఓటీటీలో మూవీ హిట్, ఆనందానికి అవధుల్లేవంటున్న హీరో
ఇష్టపడి చేసిన సినిమా విజయవంతం అయితే ఆ ఆనందానికి ఆవధులు ఉండవని నటుడు విక్రమ్ అన్నారు. విక్రమ్ తన కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన చిత్రం మహాన్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఎస్.లలిత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా విక్రమ్ శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. మహాన్ చిత్రాన్ని ఎంతో ఇష్టంగా చేశానని తెలిపారు. ప్రతి సన్నివేశం ఇప్పటికీ తన మనసులో స్వీట్ మెమోరీగా ఉండిపోయిందన్నారు. ఈ సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ధృవ్ విక్రమ్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని కొనియాడారు. చదవండి: తెలుగులో పరిచయం కానున్న పర భాష హీరోయిన్లు -
అలరిస్తోన్న చియాన్ విక్రమ్ 'మహాన్' మేకింగ్ వీడియో..
Chiyan Vikram Mahaan Movie Making Video Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. 'మహాన్' టీజర్లో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటన అలరించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్ తదితరులు తమ పాత్రల కోసం ఏ విధంగా కష్టపడ్డారో చూపించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. -
హీరోయిన్‌కు షాకిచ్చిన మహాన్, చాలా అన్యాయం !
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, ఛాలెంజింగ్ రోల్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేసే హీరో చియాన్ విక్రమ్. అతడు నటించిన తాజా చిత్రం 'మహాన్'. ఇందులో తనయుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించాడీ స్టార్ హీరో. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వాణి భోజన్ కూడా ఉందని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విక్రమ్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా! కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆమె ఎక్కడా కనిపించనేలేదు. ఆమె నటించిన పార్ట్ అంతా ఎడిటింగ్‌లో తీసేశారు. బహుశా రన్ టైమ్ వల్ల ఆమె సన్నివేశాలు తొలగించి ఉండవచ్చని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంది. దీనికి వాణి నటించిన సన్నివేశాలు కూడా కలిపితే మూడు గంటలవుతుందని ఆలోచించి వాటిని తొలగించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మహాన్ లాంటి పెద్ద సినిమాలో నటిస్తున్నానని మురిసిపోయిన వాణికి ఇది నిజంగా బాధించే అంశమే. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాణికి అన్యాయం చేశారంటూ ఆమె అభిమానులు నెట్టింట ఫైర్ అవుతున్నారు. కాగా వాణి భోజన్ తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో కథానాయికగా నటించింది. -
ప్రైమ్ లో విక్రమ్ కొత్త సినిమా మహాన్ స్ట్రీమింగ్
-
చియాన్ విక్రమ్‌ను కలిసిన ధోని.. "మహాన్" కోసమే అంటున్న నెటిజన్లు
Dhoni Meets Chiyaan Vikram: ఐపీఎల్ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్న చెన్నైసూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని పనికట్టుకుని మరీ ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్‌ను కలిశాడు. వీరిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నప్పటికీ.. కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తుంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం "మహాన్" ట్రైలర్ విడుదల రోజే ధోని.. విక్రమ్‌ను కలవడంతో చిత్ర ప్రమోషన్స్ కోసం ప్లాన్ ప్రకారమే వీరిద్దరు కలిసి ఉంటారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. విక్రమ్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, మహాన్‌లో విక్రమ్ తన కొడుకు ధృవ్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, ధోని ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ఐపీఎల్ మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జట్టు యాజమాన్యంతో చర్చలతో బిజీగా ఉన్నాడు. వేలానికి ముందు సీఎస్కే ధోని సహా నలుగురు ఆటగాళ్లను డ్రాఫ్ట్ చేసుకుంది. సీఎస్కే యాజమాన్యం ధోనిని 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకోగా, రవీంద్ర జడేజాను అత్యధికంగా 16 కోట్లకు, మొయిన్ అలీని 8 కోట్లకు, రుతురాజ్ గైక్వాడ్‌ను 6 కోట్లకు రీటైన్ చేసుకుంది. కాగా, బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తెలుగు క్రికెటర్ -
మనం పెట్టిందే చట్టం.. ఆసక్తిగా 'మహాన్' టీజర్
Vikram Mahaan Movie Teaser Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు టీజర్‌ను సోమవారం విడుదల చేశారు మేకర్స్. విక్రమ్ గాంధీ మహాన్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం నాటు సారా నేపథ్యంలో సాగనుంది. నాటు సారాకు వ్యతిరేకంగా, గాంధీ బాటలో నడుస్తానని తన తండ్రికి మాట ఇచ్చిన మహాన్ అదే మద్యానికి బానిస అవడం వంటి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో విక్రమ్ నటన అదిరిపోయిందనే చెప్పవచ్చు. 'ఏపీలో ఎవడు బార్ని లీజుకు తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం' అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌ది మంచి ప్రభావం ఉన్న పాత్రలా ఉంది. టీజర్ చివర్లో ధృవ్ ఎంట్రీ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కానుంది. -
సూర్య, ఆర్య బాటలో విక్రమ్.. వర్కౌట్ అయ్యేనా?
సౌత్ లో అత్యధిక పాపులారిటీ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అయితే ఈ హీరో బాక్సాఫీస్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంతో ఇష్టపడి చేసిన గ్యాంగ్, ఎన్ జీ కే, బందో బస్త్ లాంటి చిత్రాలను థియేటర్లకు తీసుకొచ్చాడు. కాని ఈ సినిమాలన్ని డిజప్పాయింట్ చేసాయి. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆకాశమే నీ హద్దురా మూవీని ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్రపంచంలో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత జైభీమ్ ని కూడా ఓటీటీలోనే విడుదల చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలు సూర్యకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. సూర్యకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కొత్త చిత్రం ఎత్తారెక్కుమ్ తునిందవన్ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. పైగా ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. మరో తమిళ హీరో ఆర్య కూడా కోలీవుడ్ కు పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అయితే అది బాక్సాఫీస్ మూవీ కాదు. ఓటీటీ మూవీ సార్పట్ట. ఇలా అటు సూర్య, ఇటు ఆర్య ఈ ఇద్దరు ఓటీటీ మూవీస్ ద్వారానే హిట్ అందుకున్నారు. ఆడియెన్స్ లో మంచి ఆదరణ చూశారు. ఇప్పుడు ఇదే దారిలో మరో కోలీవుడ్ హీరో విక్రమ్ వెళ్లాలి అనుకుంటున్నాడు. కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతో శ్రమిస్తున్నాడు అపరిచితుడు. కనీసం బిలో యావరేజ్ మూవీని కూడా చూడలేకపోతున్నాడు. అందుకే ఈసారి సూర్య దారిలో తాను నటిస్తున్న కొత్త చిత్రాలు మహాన్, కోబ్రో మూవీస్ ను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నాడు. మహాన్ జనవరి 26న ప్రైమ్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. మరో మూవీ కోబ్రా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి సూర్య, ఆర్యల మాదిరే విక్రమ్ కూడా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.