
Chiyan Vikram Mahaan Movie Making Video Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది.
'మహాన్' టీజర్లో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటన అలరించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్ తదితరులు తమ పాత్రల కోసం ఏ విధంగా కష్టపడ్డారో చూపించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment