Vani Bhojan: గ్లామర్‌ డోస్‌ పెంచేసిన వాణి భోజన్‌ | South Actor Vani Bhojan Glamour Dose Social Media | Sakshi
Sakshi News home page

Vani Bhojan: గ్లామర్‌ డోస్‌ పెంచేసిన వాణి భోజన్‌

Published Wed, Aug 31 2022 7:26 AM | Last Updated on Wed, Aug 31 2022 7:26 AM

South Actor Vani Bhojan Glamour Dose Social Media - Sakshi

బ్యూటీ వాణి భోజన్‌ కూడా గ్లామర్‌ బాట పట్టింది. బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఓ మై కడవులే చిత్రంలో రెండో కథానాయకి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో చక్కగా ఒంటి నిండా దుస్తులు ధరించి పక్కింటి అమ్మాయి ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచింది. అయినా స్టార్‌ హీరోల దృష్టి ఈ అమ్మడిపై పడటం లేదు.

ప్రస్తుతం శశి కుమార్, విక్రమ్‌ ప్రభు, భరత్, జై నటులతోనే జతకట్టే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా కథలు, పాత్రలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ అమ్మడు చెప్పింది. ఇటీవల అరుణ్‌ విజయ్‌ సరసన నటించిన తమిళ్‌ రాకర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో గ్లామర్‌ డోస్‌ను పెంచేసింది. అలాంటి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఆమె ధోరణి కూడా మారిపోయింది.

ఇటీవల ఒక భేటీలో తాను చీర ధరించినా శృంగారంగానే కనిపిస్తానంటూ పేర్కొని ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఒక భేటీలో హిందీలో అలియా భట్‌ నటించిన గంగుబాయి కతివాడియా చిత్రం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ చిత్రంలో అలియా భట్‌ వేశ్యగా నటించిన విషయం తెలిసిందే.

ఆ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చేస్తే అందులో గంగుబాయి పాత్రను తాను పోషించాలని కోరుకుంటున్నానంది. ఇకపోతే నటి నయనతార తన చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే విధానం తనకు నచ్చిందని చెప్పింది. తాను ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, చిత్రాలు ఎంపికలో ఆమె బాటలో పయనించాలని భావిస్తున్నట్లు నటి వాణి భోజన్‌ పేర్కొంది. 
చదవండి: (హీరోయిన్‌ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement