![Udhayanidhi Stalin About Nenjukku Needhi Success - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/6/udaya.jpg.webp?itok=T04LLFFj)
Udhayanidhi Stalin About Nenjukku Needhi Success: ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం నెంజిక్కు నీతి. తాన్య నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, రోమియో పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల హక్కులను పొందింది. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలో థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ మనసులను టచ్ చేసే చిత్రాన్ని అందించామని, అందుకు అభినందించిన మీ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. హిందీ చిత్రం 'ఆర్టికల్ 15'ను తమిళ్‌కు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్‌నే ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణమన్నారు. అందరూ చాలా బాగా నటించారని, నిర్మాతలకు థాంక్స్ అని, ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్‌కు ఆయన సతీమణికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment