Sandeep Shyam Vezham Movie Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Vezham Movie Release Date: రెండు షేడ్స్​ల్లో ప్రతి పాత్ర.. సస్పెన్స్ థ్రిల్లర్​గా 'వేళం'..

Published Mon, Jun 6 2022 5:44 PM | Last Updated on Mon, Jun 6 2022 6:28 PM

Sandeep Shyam Vezham Movie Release Date Announced - Sakshi

చెన్నై సినిమా: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రం 'వేళం'. అశోక్‌ సెల్వన్, ఐశ్వర్య మీనన్, జననీ అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కే 4 క్రియేషన్స్‌ అధినేత కేశవన్‌ సమర్పణలో ఎస్‌పీ సినిమాస్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ శ్యామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించారు. 

కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తాను కార్పొరేట్‌ రంగం నుంచి వచ్చానని, చిత్ర నిర్మాణం గురించి తెలియకపోయినా సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. 'వేళం' అంటే ఏనుగు అని అర్థం అని, దానికి కోపం వస్తే సింహంతో సహా ఇతర జంతువులన్నీ భయపడిపోతాయని, దాన్ని బేస్‌ చేసుకుని రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకూ రెండు షేడ్స్‌ ఉంటాయన్నారు. అలా చిత్రాన్ని కొత్తగా ట్రై చేసినట్లు తెలిపారు. 

చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్​.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement