suspense thriller
-
మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'
దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మల్లాది పుస్తకాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం తప్ప, ఆయన కనిపించింది - వినిపించింది లేదు. వేరే పుస్తకాల గురించి ఆయన చెప్పడం అరుదు. అటువంటి మల్లాది వెంకట కృష్ణమూర్తిని మెప్పించింది 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'కు ముందుమాట రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని అభినందిస్తూ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ... ''ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవి. కొన్ని మినహాయిస్తే... హిచ్‌కాక్ తీసినవి క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తన పేరును ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నారు. 'నేను సిండ్రెల్లా సినిమా తీస్తే... ప్రేక్షకులు శవం కోసం ఎదురు చూస్తారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హిచ్‌కాక్. 'సైకో' విడుదలయ్యాక ఒక భర్త నుంచి వచ్చిన ఉత్తరాన్ని హిచ్‌కాక్ కు స్టూడియో హెడ్ అందించారు. 'సైకో' సినిమాలోని బాత్ టబ్ హత్య సన్నివేశం చూశాక తన భార్య స్నానం చేయడం మానేసిందని, ఏం చేయాలో చెప్పమని సలహా కోరతాడు భర్త. అందుకు హిచ్‌కాక్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? 'మీ ఆవిడను లాండ్రీకి పంపించండి' అని. సస్పెన్స్ గురించి హిచ్‌కాక్ చెప్పింది అక్షర సత్యం. ఆతృతగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుంది. సస్పెన్స్ మహిళ వంటిదని, ఊహకు ఎంత వదిలేస్తే అంత ఉత్కంఠ పెరుగుతుందని హిచ్‌కాక్ చెప్పారు. సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది కూడా హిచ్‌కాక్. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. పులగం చిన్నారాయణ, రవి పాడి గార్లకు ఆ అభినందనలు. ఈ పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని ఆడియోలో పేర్కొన్నారు.ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు భగవద్గీత, బైబిల్ వంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని హరీష్ శంకర్ అందుకున్నారు.#MalladiVenkataKrishnaMurthy garu is well known as a Senior Novelist with 55+ years of experience in literature. His books have inspired generations yet he kept his identity very private.For the first time, he gave his words of appreciation to our one-of-its-kind book "Master… pic.twitter.com/JhoY7RHZWc— Pulagam Chinnarayana (@PulagamOfficial) December 27, 2024 (చదవండి: వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!) -
గ్రాండ్ సాంగ్.. భారీ ఫైట్
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ (పాలిక్ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్‌పై ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్‌పై భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమేష్ రావుల. -
రెండు షేడ్స్ల్లో ప్రతి పాత్ర.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'వేళం'..
చెన్నై సినిమా: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం 'వేళం'. అశోక్ సెల్వన్, ఐశ్వర్య మీనన్, జననీ అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కే 4 క్రియేషన్స్ అధినేత కేశవన్ సమర్పణలో ఎస్పీ సినిమాస్ సంస్థ నిర్మించింది. సందీప్ శ్యామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. తాను కార్పొరేట్ రంగం నుంచి వచ్చానని, చిత్ర నిర్మాణం గురించి తెలియకపోయినా సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. 'వేళం' అంటే ఏనుగు అని అర్థం అని, దానికి కోపం వస్తే సింహంతో సహా ఇతర జంతువులన్నీ భయపడిపోతాయని, దాన్ని బేస్ చేసుకుని రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకూ రెండు షేడ్స్ ఉంటాయన్నారు. అలా చిత్రాన్ని కొత్తగా ట్రై చేసినట్లు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
ఓటీటీలతో పని లేదు.. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇలా చూడండి !
కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు రెస్ట్ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతోంది మహామ్మారి. దీని ప్రభావం సినీ వర్గాలపై మళ్లీ పడింది. పండుగ వేళ సందడి చేద్దామనుకున్న పెద్ద సినిమాలకు, వాటిని వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశే కలిగింది. ఇంకా కొవిడ్ కల్లోలం ఎక్కువైతే థియేటర్లు మూసే అవకాశం లేకపోలేదు. అయితే థియేటర్లు మూత పడితే సినీ అభిమానులకు, ఆడియెన్స్‌కు ఉండే ఏకైక మార్గం ఓటీటీలు. చిన్న, పెద్ద, పర భాష అంటూ తేడా లేకుండా చూసేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఓటీటీల్లో చూడాలంటే వాటిని కచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకోని తీరాలి. లేకుంటే చూడలేం. (చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే..) ఓటీటీలకు డబ్బు చెల్లించి చూడలేని సినీ వీక్షకుల కోసం ఎలాంటి ఖర్చు లేని దారి ఒకటి ఉంది. అదేంటంటే యూట్యూబ్. హా.. యూట్యూబే. అయితే యూట్యూబ్‌లో ఏ సినిమాలు ఉన్నాయి ఏంటీ అని మీకు తెలియకపోవచ్చు. అలాంటి వారికోసమే మా ఈ స్టోరీ. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగులోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈసారికి యూట్యూబ్‌లో లభించే సౌత్ ఇండియన్ తెలుగు డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మీకోసం. ఓ లుక్కేసీ ఆనదించండి మరి ! 1. ఆక్రందన (తీవ్రం-మలయాళం) 2. రక్షకుడు (ధామ్ ధూమ్-తమిళం) 3. ఎన్‌హెచ్-4 4. పెన్సిల్ 5. సంఘర్షణ (చదవండి: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు..) -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘యం6’
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యం6’. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ - ‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగానికి వచ్చాను. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యం6’ చిత్రాన్ని నిర్మించాను. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ‘యం6’ సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకి ‘యం6’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. -
ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే!
న్యూఢిల్లీ: ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే. ఢిల్లీలో దాడి చేయడానికి వచ్చిన ఐఎస్ ఉగ్రవాదిని నిఘా వర్గాలు ఉచ్చు పన్ని మరీ పట్టుకున్నాయి. సుమారు 18 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ హాలివుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. ఆ ఉగ్రవాదిని నమ్మించడానికి మనోడిని ఉగ్రవాదిగా అతనికి పరిచయం చేయడం దగ్గర నుంచి, పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించిన సమాచారం వరకు ఇదో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గత సెప్టెంబర్‌లోనే ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా, అధికారులు ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ ఉగ్రవాదుల బృందం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. ఐఎస్ కార్యకలాపాల నిమిత్తం దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.34 లక్షలు పంపినట్లు అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసిన తరువాత అఫ్గానిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడేందుకు వస్తున్నట్టు తెలిసింది. కీలక సమాచారం లభ్యం.. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన ఉగ్రవాదితో స్నేహం పెంచుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ ఏజెంట్ అవతారంలో ఓ వ్యక్తిని పంపింది. అతని ద్వారానే ఉగ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో వసతితో పాటు, పేలుడుపదార్థాలు సమకూర్చారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది కదలికలపై నిఘా పెట్టేందుకు నెలరోజుల నిరంతరం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు సమయం చూసుకుని అతన్ని అరెస్ట్ చేసి అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అతడి వద్దే సేకరించారు. 2017 మే 22న బ్రిటన్‌లో 23 మందిని బలిగొన్న మాంచెస్టర్ దాడి అతడి సహచరుల్లోని ఒకరి పనేనని తేలింది. ఆ దాడిలో ఏయే పేలుడు పదార్థాలు వాడారో, అలాంటి వాటినే ఢిల్లీ పేలుళ్లలో వాడాలని అతడు కోరుకున్నట్లు తెలిసింది. -
పోలీస్‌గా భరత్
తమిళసినిమా: చిన్న గ్యాప్ తరువాత నటుడు భరత్ మళ్లీ వరుస చిత్రాలతో వేగాన్ని పెంచారు. ఈయన నటించిన పొట్టు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా పోలీస్ అధికారిగా దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారు. లిప్పింగ్ హార్స్, ఇంక్రెడబుల్ ప్రొడక్షన్స్, దినా స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు భరత్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈయన పోలీస్ పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. భరత్‌తో పాటు సురేశ్‌మీనన్, ఆదవ్ కన్నదాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని శ్రీ సెంథిల్ నిర్వహిస్తున్నారు. ఈయన నాళై ఇయక్కునార్ సీజన్లో రన్నరప్‌గా నిలిచారన్నది గమనార్హం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం, సురేశ్బాల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈయన ఛాయాగ్రహకుడు వేల్రాజ్, బాలసుబ్రమణియన్ల శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం విజయదశమి సందర్భంగా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హీరోయిన్గా ఒక ప్రముఖ నటిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి పండగ రోజున విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్.శివనేశన్ తెలిపారు. -
లంకలో ఏం జరిగింది?
సీతను అపహరించిన రావణుడు లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బందీగా ఉంచుతాడు. అప్పుడు రాముడు తన సతీమణి కోసం యుద్ధం చేస్తాడు. రామాయణం విన్నోళ్లకూ, చదివినోళ్లకూ ఈ కథ, ‘లంక’ అనే ఊరి పేరు బాగా తెలుసు. ఇప్పుడీ కథ ఎందుకంటే... ‘లంక’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందుతోంది. రాశి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ‘లంక’లో సీతారాములు ఎవరు? రావణుడు ఎవరు? అని దర్శకుడు శ్రీమునిని అడిగితే... ‘‘ఈ రోజే టీజర్ విడుదల చేశాం కదా. కొన్ని రోజులు వెయిట్ చేస్తే, ఆ విషయాన్నీ చెప్పేస్తాం’’ అన్నారు. నామన దినేశ్, నామన విష్ణుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పకులు: నామన శంకర్రావు–సుందరి. -
ప్రతీకారంతో...!
కాలేజీలో ఓ ఆరుగురు యువకులు చేసిన అన్యాయానికి బదులుగా ఓ అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘అమ్మాయి...ఆరుగురు’. జి.మురళి దర్శకత్వంలో రామచంద్ర హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆశాలత కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హీరో మాట్లాడుతూ -‘‘బావా మరదళ్ల మధ్య సాగే ఈ ప్రేమకథ అందరినీ అలరిస్తుంది. తలకోన, దుర్గంకొండ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుధీర్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్. -
‘చంద్రముఖి’ తరహాలో...
ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్, కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా తెలుగు, కన్నడ భాషల్లో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్ మునియప్ప దర్శకుడు. గుణ్వంత్ సేన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతో న్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ ‘చంద్రిక’ ఎవరనేది తెరపై చూస్తేనే ఆసక్తి గొలుపుతుంది’’ అని చెప్పారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘దిబెస్ట్’గా నిలిచే చిత్రం ఇది. నా పాత్రతో పాటు శ్రీముఖి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ‘చంద్రముఖి’ తరహాలో చిరకాలం ఈ చిత్రం గుర్తుండిపోతుంది’’ అని కథానాయిక కామ్నా జెఠ్మలానీ తెలిపారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
అందమైన ప్రేమకథ నేపథ్యంలో సస్సెన్ థ్రిల్లర్‌గా ఓ చిత్రం తెరకెక్కనుంది. సందీప్, మధుసూదన్, లాహిస్క ముఖ్యతారలుగా దీపక్, అమర్ నిర్మించనున్న ఈ చిత్రానికి జీవీ రంజిత్ కుమార్ దర్శకుడు. ‘’తన కుటుంబంలో జరిగిన హత్యను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడనే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఓ ప్రముఖ నటి ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఆగస్టులో చిత్రీకరణ మొదలు పెడతాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, దర్శకత్వం పర్యవేక్షణ: బి.ఎ దాస్, కెమెరా: రాము. -
సస్పెన్స్ కథ... సరికొత్త స్క్రీన్‌ప్లే...
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రుద్ర ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రుద్ర నిర్మించిన చిత్రం ‘టాకీస్’. తాన్య ప్రధాన పాత్రలో ఉదయ్‌కుమార్ సీహెచ్ దర్శకత్వం వహించారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో రాని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. ఉదయ్‌కుమార్‌కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అద్భుతంగా తీశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో పాటలు ఉండవు. సంభాషణలు కథానుసారం ఉంటాయి. ‘హృదయ కాలేయం’ సంగీత దర్శకుడు ఆర్.కె. చేసిన రీ-రికార్డింగ్ బాగుంటుంది. రవికుమార్ నీర్ల కెమెరా పనితనం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా మా ‘టాకీస్’ అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: రుద్ర భాస్కర్. -
సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో నచ్ అనే చిత్రం తెరకెక్కనుంది. మలయాళంలో 17 చిత్రాలు నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన మరికార్ ఫిలింస్ అనుబంధ సంస్థ మరికాల్ ఆర్ట్స్ తమిళంలో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ సంస్థ తొలి ప్రయత్నంగా నచ్ అనే చిత్రాన్ని నిర్మించనుంది. చిత్ర వివరాలను దర్శకుడు అహ్మద్ మరికాల్ తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించనున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. కత, కథనాలు నవ్యతతో కూడి వుంటాయన్నారు. చిత్ర కథ మొత్తం 12 పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. అంగాడితెరు ఫేమ్ మహేష్, సంజీవ్, ప్రవీణ్ ప్రేమ్, రియాజ్‌ఖాన్, కాళీ, మదుమిత బెనర్జి, పూనం జవర్, ఎదన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నార ని చెప్పారు. వీరితో పాటు ప్రముఖ నటుడు మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీం కొడుకు మక్భుల్ సల్మాన్ ఒక హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక దర్శకుడితో పాటు సీనియర్ నటీనటులున్నట్లు చెప్పారు. చిత్రానికి మన్సూర్ అహ్మద్, గౌరి లక్ష్మి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభించి చెన్నై, కేరళ, మలేషియా ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. -
త్రీమంకీస్ - 84
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 84 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఎఫ్ఈఏఆర్ ఫియర్కి రెండు ఫుల్ఫార్మ్లు ఉన్నాయి. ఒకటి ఫర్గెట్ ఎవ్విరిథింగ్ అండ్ రన్. మరోటి ఫేస్ ఎవ్విరిథింగ్ అండ్ రైజ్. మనం పోలీసులతో ఏం చెప్పాలంటే...’’ కపీష్ చెప్పేది ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. ‘‘అవును. అలా చెయ్యచ్చు’’ వానర్ సంభ్రమంగా చెప్పాడు. ‘‘నిజమే. భలే’’ మర్కట్ కూడా మెచ్చుకున్నాడు. మరోసారి ముగ్గురూ కపీష్ చెప్పిన పథకాన్ని పునరావలోకనం చేసుకున్నాక అందులో ఎలాంటి లొసుగులూ లేవని నిశ్చయించకున్నారు. ముగ్గురూ ఉత్సాహంగా ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ బూత్ వైపు నడవసాగారు. (భశుం) ముగింపుగా ఓ చిన్న మాట నేను రచనలు ఆరంభించిన నలభై ఐదేళ్ళ క్రితానికీ, నేటికీ సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రేమ విషయంలో కానివ్వండి, సంపాదన విషయంలో కానివ్వండి, మరి దేంట్లోనైనా, మనం దిగజారి ‘అధర్మంగా ఉండకూడదు’ అనే నియమం చాలా వరకూ వీగిపోయింది. ఆ ప్రభావం సమాజంలోని భాగమైన నేటి యువత మీద కూడా పడి, వారు షార్ట్‌కట్ సంపాదన మీద అధికంగా ఆశ పడుతున్నారని, జల్సాల డబ్బు కోసం తప్పులు చేయడానికి వారు వెరవడం లేదు అని దినపత్రికల్లోని అనేక వార్తలు చెప్తున్నాయి. ఎక్కువమంది యువతలో ప్రేమబంధం కూడా గతంలోలాగా బలంగా ఉండటం లేదు. ఈ సామాజిక నేపథ్యంలో అలాంటి పాత్రలతో రాసిన క్రైం, కామెడీ నవల ‘త్రీ మంకీస్’ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. కేటాయించిన తక్కువ చోటులో సస్పెన్స్‌ని సృష్టించి నిలబెట్టగలగడం కష్టం. అందువల్ల పాఠకుడి చేత నిత్యం చదివించడానికి సస్పెన్స్‌తో పాటు హాస్యం మీద కూడా ఆధారపడ్డాను. గతంలో సీరియల్స్‌లో కావాలని ఓ తప్పు రాస్తూండేవాడిని. పాఠకులు దాన్ని పట్టుకుని పాయింట్ అవుట్ చేస్తే వారు బాగా చదువుతున్నారనే అంచనా కోసం కమర్షియల్ రైటర్‌గా నేను అప్పట్లోని ప్రతీ సీరియల్లో తేలిగ్గా దొరికే ఓ తప్పు రాసేవాడిని. అలాగే దీంట్లో కూడా ఓ తప్పు రాశాను. ఓ పాఠకురాలు మాత్రమే దాన్ని వివరించమని కోరుతూ రెండు మెయిల్స్ పంపారు. ప్రియా చెన్నారెడ్డి గారూ! కోకోకోలా స్పెల్లింగ్ కరెక్ట్ మేథ్స్ ఫార్మూలా ‘హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఫుల్ సర్కిల్ (పూర్తి సున్నా=ఓ) హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఏ (కోకో) హాఫ్ సర్కిల్ (అర సున్నా= సి) ఫుల్ సర్కిల్ (పూర్తి సున్నా=ఓ) రెక్టాంగిల్ (ఎల్) ఏ (కోలా) వెరసి కోకోకోలా అవుతుంది. నేను దీన్ని తప్పుగా మార్చి రాశాను. థాంక్స్ ఫర్ పాయింటింగ్ అవుట్. ఓ పాఠకుడు పాకిస్థాన్ మీద జోక్స్ రాసి వారిని కించపరచడం నా స్థాయికి చెందింది కాదని, అలాగే ఫేస్బుక్లో కనపడే జోక్స్‌ని సీరియల్లో రాయడం దేనికని విమర్శించారు. ఏది ఏమైనా సీరియల్ మీద స్పందించి తమ అభిప్రాయాలని తెలియచేసిన వందల కొద్దీ పాఠకులకి, మంచి బొమ్మలు గీసిన శ్రీ అన్వర్‌కి, నాకీ అవకాశాన్ని ఇచ్చిన ‘సాక్షి’ సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, - మల్లాది వెంకట కృష్ణమూర్తి హైద్రాబాద్ 8 జనవరి 2015 -
త్రీమంకీస్ - 83
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 83 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘దేవుడంటే ప్రేమ. ప్రేమ గుడ్డిది. మా తాతయ్య గుడ్డివాడు. కాబట్టి ఆయనే దేవుడు. నీకో సత్యం చెప్తా. ఎవరికీ చెప్పక. దేవుడు లేకపోతే నాస్తికుడే ఉండడు.’’ ‘‘అది సరే. ఈ రోజు నా జీవితంలో చాలా చెడ్డరోజు. మీరు కొద్దిగా...’’ ‘‘పిచ్చివాడా! చెడ్డ రోజనేదే నీ జీవితంలో ఇంతదాకా రాలేదు. అది వచ్చిన రోజు నువ్వుండవు. ఎందుకంటే నువ్వుండటం ఆగిన రోజే నీకు చెడ్డ రోజు.’’ ‘‘ఇప్పుడు నాకో సమస్య ఉంది. మీరు కొద్దిగా సహాయం చేేన్త...’’ మర్కట్ అర్థించాడు. ‘‘... దేవుడితో నీకో సమస్య ఉందని చెప్పక. సమస్యకి నీకో దేవుడు ఉన్నాడని చెప్పు చాలు. నీకో ఆఖరి సందేశం. జననం - మరణం ఆనందకరమైనవి. ఆ మధ్యదే బాధాకరం. అందువల్ల హరిః ఓం’’ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ‘‘జరిగినదానికి బాధపడకుండా ఆనందంగా ఉండండి’’ వానర్ కన్నీళ్ళని చూసి చెప్పాడు కపీష్. ‘‘పోయింది. ఆరు కోట్లు. అదెలా సాధ్యం బ్రదరూ? ఎవరి దగ్గరైనా చాక్లెట్ ఉందా?’’ ‘‘ఏం?’’ ‘‘అది తింటే ఆనందంగా ఉంటారని కేడ్బనీస్ ప్రకటనలో చూశాను’’ కన్నీళ్ళని తుడుచుకుంటూ వానర్ అడిగాడు. ‘‘వెనకటికి ఒకడికి లేండ్ ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ కొంటానన్నాట్ట’’ కపీష్ విసుక్కున్నాడు. ‘‘నీకూ, నీళ్ళకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. భయం వేస్తే నీకు నీళ్ళు కింద నించి, దుఃఖం వేస్తే పైనించి వస్తాయన్నమాట’’ మర్కట్ విసుక్కున్నాడు. ‘‘నాకు అర్జెంట్‌గా ‘హాఫ్ సర్కిల్ ఒన్ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. హాఫ్ సర్కిల్ ఒన్ సర్కిల్ రెక్టాంగిల్ ఏ’ తాగాలని ఉంది. అంతే కాదు. మన ముగ్గురి జీవితాలని ఎడిట్ చేయాలనిపిస్తోంది. ఒకడి ప్రియురాలు కుక్క ప్రేమికురాలు. ఇంకొకడి ప్రియురాలు మగరాయుడు. మరో వెధవకి ఆకులు, అలాలు మాత్రమే ఒండి పెట్టే ప్రియురాలు. నాకు మన జీవితాలు నచ్చడం లేదు. వాటిని వెంటనే ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి తీరాలి. మార్ఫింగ్ చేసి తీరాలి’’ వానర్ ఆవేదనగా చెప్పాడు. ‘‘ఆనందంగా ఉండేవారు ఆనందంగా ఉండటానికి కారణం వారి జీవితంలో అంతా సరిగ్గా ఉందని కాదు. వారి దృక్పథం సరిగ్గా ఉండటమే కారణం. బానిసత్వం మానవ నిర్మితం తప్ప పేదరికం కాదు. దాన్ని ఎవరికి వారు ప్రయత్నంతో బద్దలు కొట్టాలి. మనం బాధపడటానికి కాని, ఆనందంగా ఉండటానికి కాని పట్టే సమయం, వెచ్చించే పని ఒకటే. ఇండిగో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఓచర్ని కేష్ చేస్తే ఎంత వస్తుందో చూడు. కోకోకోలాని తాగుదాం’’ కపీష్ ధైర్యం చెప్పాడు. జేబులోంచి దాన్ని తీసి చూసి ‘థూ’ అంటూ వానర్ దాన్ని చింపి డస్ట్‌బిన్‌లో పడేశాడు. ‘‘ఏ?’’ వానర్ అడిగాడు. ‘‘అది తర్వాతి ఫ్ల్లైట్కి ఓచర్ తప్ప కేష్ వాపస్ ఇచ్చే ఓచర్ కాదు. ‘‘సినిమా టిక్కెట్ ఐతే సగం రేటుకి అమ్మేవాళ్ళం. దీనికి ఐడెంటిటీ కార్డు, బొచ్చు, భోషాణం... ఎన్ని రూల్సో’’ మర్కట్ తన ఓచర్ని నలిపి చెత్త బుట్టలో పడేశాడు. తర్వాత అందులో పడ్డ ఓ బోర్డింగ్ పాస్ని, దాని మీది వేమన పేరుని చూసి తలెత్తి ఆశ్చర్యంగా వేమనని అడిగాడు. ‘‘మీ విమానానికి కూడా బాంబ్ బెదిరింపు వచ్చిందా?’’ ‘‘ఊహు. హిందూ సేవా సంఘం వారు నన్ను విమానం ఎక్కకుండా ఆపేశారు’’ ఆయన చెప్పాడు. ‘‘అదేం?’’ ‘‘క్రితంసారి నా ప్రవచనం విన్న నూట డెబ్బై ఏడు మంది వేరే మతం పుచ్చుకున్నారుట. అందుకనిట. వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూన్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్’’ చెప్తూ ఆయన వారి జీవితాల్లోంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. ‘‘మన జాతకాలు బాలేవు’’ మర్కట్ బాధగా చెప్పాడు. ‘‘జాతకాలు, శకునాల మీద నాకు నమ్మకం లేదు. అవన్నీ ఉత్తి మూఢనమ్మకాలు. మైక్రోస్కోప్, టెలిస్కోప్‌లలో పరీక్షించినా హరోస్కోప్ ఉందనే స్కోపే కనిపించదు. పైగా నాది తులా రాశి. మా రాశి రెండో పాదం వాళ్ళు జాతకాలని, జ్యోతిష్యాన్ని నమ్మరని రాశిఫలాల్లో రాశారు కూడా’’ వానర్ చెప్పాడు. రెండడుగులు వేశాక కపీష్ అకస్మాత్తుగా ఆగాడు. మిగిలిన ఇద్దరూ కూడా ఆగి అడిగారు. ‘‘ఏమైంది? నీ మొహం చూస్తూంటే రేపు ప్రపంచం అంతం కాదని అనిపిస్తోంది’’ కపీష్ చిరునవ్వుని చూసి మర్కట్ అడిగాడు. ‘‘బానిసత్వంలా మనిషి సృష్టించుకునేది కాదు. కాని పేదరికం మానవ నిర్మితం’’ కపీష్ స్థిరంగా చెప్పాడు. ‘‘మన ముగ్గురిలో ఉండుండి సీరియస్ డైలాగ్స్ వేసేది నువ్వొక్కడివే గురూ.’’ ‘‘అవును. వేమన వెళ్ళబోతూ ఏమన్నాడో గుర్తుందా? దేవుడితో నీకో సమస్య ఉందని చెప్పక. సమస్యకి నీకో దేవుడు ఉన్నాడని చెప్పు చాలు. నేను దేవుడ్ని నమ్మను కాబట్టి నా మెదడుకి ఓ సమస్య ఉందని చెప్పాను. మన సమస్యా పరిష్కారానికి నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ ‘‘మనం పట్టుబడకుండా మళ్ళీ ఆ డబ్బుని వెంటనే ఎలా స్వాధీనం చేసుకోవచ్చంటే...’’ మిగిలిన ఇద్దరూ అతను చెప్పేది శ్రద్ధగా విన్నారు. -
త్రీమంకీస్ 82
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 82 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మన పథకాన్ని నాశనం చేసేసింది. డాక్టర్ మూలిక మరణిస్తే, మా కట్టమైసమ్మకి సింహం బలి ఇస్తానని మొక్కుకున్నాను.’’ ఖరీదైన ఏసీ టేక్సీలో దర్జాగా వచ్చిన ఆ ముగ్గురూ నంబర్ పదకొండు వాహనం ఎక్కి, అంటే రెండు కాళ్ళ మీద నడవసాగారు. ‘‘ప్రేమ అనే ఖైదులోంచి ఎవరూ తప్పించుకోలేరు. వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. చూస్తూండండి’’ వైతరణి ఏక్టివాని నడుపుతూ ఇద్దరు మితృరాళ్ళతో చెప్పింది. ‘‘అవును. నేను వానర్ని అంత గాఢంగా ప్రేమించాను’’ మూలిక చెప్పింది. ‘‘కపీష్ తిరిగి రావడం డౌటే. మగాళ్ళు నిజాయితీపరులు కారు’’ రుధిర చెప్పింది. ‘‘అధైర్యపడకు. జీవితం ఎప్పుడూ రెండో అవకాశం అనేది ఇస్తుంది. దాని పేరు రేపు’’ వైతరణి ధైర్యం చెప్పింది. ‘‘నేను ఒకప్పుడు మగాణ్ణే కాబట్టి నీ కన్నా నాకు మగాళ్ళ గురించి బాగా తెలుసు.’’ ‘‘మర్కట్ కాకపోతే మరో డొర్కట్. వానర్ కాకపోతే మరో గీనర్. కపీష్ కాకపోతే ఇంకో గిపీష్. లోకం గొడ్డుపోయిందా?’’ వాళ్ళ ఏక్టివా మలుపు తిరిగే దాకా చూశాక మర్కట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు - ‘‘డబ్బు లేనప్పుడు మనతో ఉంటుంది. డబ్బు రాగానే ఉండమన్నా ఉండదు. అది ఇప్పుడు నన్ను చేరింది.’’ ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు. ‘‘ఆకలి. నాకు బాగా ఆకలిగా ఉంది.’’ ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. ‘‘అవును. మనకి ఇప్పుడు అదే కావాలి. వెళ్ళి ఆ వెండింగ్ మెషీన్‌లోంచి మూడు కోక్స్ తీసుకురా’’ కపీష్ చెప్పాడు. ‘‘సారీ! నా డబ్బంతా ఆ ఎయిర్ బేగ్లోనే ఉంది. జేబులో చిల్లిగవ్వ కూడా లేదు’’ వానర్ చెప్పాడు. ‘‘నీ సంగతేంటి?’’ కపీష్ మర్కట్‌ని అడిగాడు. ‘‘తర్వాతి నిమిషంలో కనుక నేను మరణించేట్లయితే నాకు జీవితాంతం సరిపడా డబ్బుంది.’’ ‘‘డబ్బు ఉన్నట్లా? లేనట్లా?’’ వానర్ అడిగాడు. ‘‘లేదు. అంతా పోలీసుల అధీనంలోని ఆ ఎయిర్ బేగ్లో ఉంది. ఈ దరిద్రం ఉంది చూశారూ? అది భరించలేనిదని నేను ఒకప్పుడు కోటీశ్వరుణ్ణి కాబట్టి గ్రహించాను’’ మర్కట్ చెప్పాడు. ‘‘నా పర్స్ ప్రస్తుతం ఉల్లిపాయ లాంటిది. దాన్ని తెరిస్తే ఏడుపు వస్తుంది’’ కపీష్ చెప్పాడు. ‘‘నేను ఎవర్నీ నిందించను. మంచివాళ్ళు ఆనందాన్ని ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. అతి చెడ్డవాళ్ళు నీతి పాఠాన్ని బోధిస్తారు. ఉత్తములు జ్ఞాపకాలని ఇస్తారు. మనం బెటర్. కొందరు ధనవంతులు ఎంత బీదవాళ్ళంటే పాపం వారి దగ్గర డబ్బు తప్ప ఇంకేం ఉండదు’’ కపీష్ శూన్యంలోకి చూస్తూ చెప్పాడు. ‘‘వేమనలా వేదాంతం మాట్లాడక. నీకు పిచ్చెక్కిందని భయపడతాం’’ మర్కట్ విసుక్కున్నాడు. ‘‘ఈరోజు నా జీవితం మొత్తానికి చాలా చెడ్డ రోజు’’ వానర్ చెప్పాడు. ‘‘ఎన్నడూ జీవితంలోని ఏ రోజునీ నిందించక. ప్రతీరోజు ఏదో ఒకటి ఇచ్చే వెళ్తుంది. మంచిరోజు ఆనందాన్ని ఇస్తుంది. దానికి అంతా నవ్వుతారు. చెడ్డ రోజు అనుభవాన్ని ఇస్తుంది.’’ ‘‘మళ్ళీ వేమనలా మాట్లాడద్దన్నానా?’’ మర్కట్ అరిచాడు. ‘‘నేను మాట్లాడలేదే?’’ కపీష్ ఖండించాడు. ‘‘మరి ఎవరు?’’ ‘‘అవును. ఎవరు? నువ్వు చెప్పావా అది?’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘లేదు.’’ ‘‘నువ్వు?’’ కపీష్ వానర్ని అడిగాడు. ‘‘ఊహూ.’’ ‘‘మరి ఎవరా మాటలు అన్నది?’’ కపీష్ అర్థం కాక చుట్టూ చూశాడు. ‘‘నేను. ఓసారి నేను దేవుడ్ని కలిశాను. ఆయన తుమ్మాడు. అప్పుడు నేనేం అనాలో తెలీలేదు.’’ విన్న గొంతులా ఉందనుకుని మర్కట్ తల తిప్పి చూశాడు. వేమన! ‘‘ఓ! మీరూ పారిపోయారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘లేదు. నేను మీలా పారిపోనందుకు మేజిస్ట్రేట్ యమధర్మరాజు నా నిజాయితీని మెచ్చి నన్ను నిరపరాధిగా భావించి విడుదల చేశాడు. మీరంతా సొరంగంలోంచి పారిపోయారని అరిచి అందరికీ చెప్పింది నేనే. దాంతో దుర్యోధన్ గేంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు’’ అతను చెప్పాడు. ‘‘వేదాంతి అయిన మీరు ఈ పని ఎందుకు చేశారు?’’ కపీష్ అడిగాడు. ‘‘వేదాంతం అంటే విశాఖపట్నంలో తుఫాను వస్తే వారణాసిలో బట్టలు ఎండకపోవడం నాయనా. అర్థం చేసుకో.’’ ‘‘మీరు ఎక్కడికి?’’ ఆయన జేబులోని బోర్డింగ్ కార్డ్‌ని చూసి వానర్ అడిగాడు. ‘‘ఢిల్లీకి. వేదాంత ప్రవచనం చెప్పడానికి. దేవుడు ఎవరని మొన్న అడిగావు. గుర్తుందా?’’ వేమన మర్కట్‌ని అడిగాడు. ‘‘అవును. తెలిసిందా?’’ మర్కట్ ప్రశ్నించాడు. ‘‘ఆ!’’ ‘‘ఎవరు?’’ వానర్ అడిగాడు. ‘‘మా తాతయ్యే.’’ ‘‘ఎలా తెలుసు?’’ (ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లు అలా ఉండగలగటానికి కారణం కపీష్ ఏమని చెప్పాడు?) -
కోడింగ్‌లో కిక్ లేదని
వినీత త్యాగి చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఉద్యోగం. కోడింగ్‌లో కిక్ లేదని మూడేళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి కలం పట్టింది. మర్డర్ మిస్టరీని కథాంశంగా ఎంచుకుని తొలి నవలను సక్సెస్‌ఫుల్‌గా విడుదల చేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెనకున్న మిస్టరీ ఏంటో ఆమె మాట ల్లోనే తెలుసుకుందాం. ..:: కళ చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అలవాటు. చిన్న చిన్న కథలు కూడా రాసేదాన్ని. భోపాల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. పేరెంట్స్ ఒత్తిడితో ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. ఇండియాలో కెరీర్ అంటే ఇంజనీర్, డాక్టర్.. ఇవే కదా! ఇంజనీరింగ్ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్‌లోని డెలాయిట్ ఫోరెన్సిక్లో జాబ్ వచ్చింది. తర్వాత ఒరాకిల్కి మారాను. మా పేరెంట్స్ దిల్లీలో ఉంటారు. మూడుసార్లు ప్రయత్నించా.. రాబర్ట్ లుడ్లుమ్ మిస్టరీ నవలలు బాగా చదివేదాన్ని. ఆఫ్ ట్రాక్ రాయడానికి అదీ ప్రేరణ అయి ఉండవచ్చు. చిన్నప్పుడు ఫాంటసీ, కాస్త పెద్దయ్యాక రొమాన్స్, జాబ్ చేస్తున్నప్పుడు మరో అంశం.. ఇలా మూడుసార్లు ఏదైనా నవల రాయాలని ప్రయత్నించాను. అయితే కాస్త రాశాక అవి ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. రాసేవాళ్లు ఎంజాయ్ చేయకపోతే.. చదివేవాళ్లు మాత్రం ఏం ఎంజాయ్ చేస్తారు. అందుకే రాయడం ఆపేశాను. డైరీ రాయమంటే.. అనుకోకుండా ఎదురైన ఓ చేదు సంఘటన నా జీవితాన్ని డిస్ట్రబ్ చేసింది. నాకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు. నా మనసు తేలిక చేసుకోవడానికి డైరీ రాయమని ఓ ఫ్రెండ్ సలహా ఇచ్చింది. కానీ నేను డైరీ రాయలేదు. ఫోరెన్సిక్లో చేస్తున్నప్పుడు జరిగిన విషయాల ఆధారంగా ఏదైనా రాయాలనే ఆలోచన ఉండేది. దానిని పేపర్‌పై పెట్టడం ప్రారంభించాను. ఈ నవల రాయడం అలా మొదలైంది. నా టైం లాగేసుకుంది.. ఇందులోని క్యారెక్టర్స్ కొన్ని కల్పితమైతే, రియల్ లైఫ్‌లో తారసపడ్డవీ కొన్ని ఉన్నాయి. పగలంతా క్యారెక్టర్స్, సీన్లు, స్టోరీలో చాప్టర్స్ ఇలా ఆలోచించేదాన్ని. రాత్రి అందరూ పడుకున్నాక రాసేదాన్ని. రాస్తున్నప్పుడు ఆలోచనలు మారిపోయేవి. మేల్, ఫిమేల్ క్యారెక్టర్లను వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేశాను. ఈ బుక్ నా పర్సనల్ టైం చాలా లాగేసుకుందని చెప్పాలి. ఫస్ట్‌టైం రైటర్స్ అందరికీ ఇలా జరుగుతుందనుకుంటా. చాప్టర్ వైజ్‌గా డివైడ్ చేసి ప్లాన్ ప్రకారం చేసి రాయలేదు. అనుకున్నది అనుకున్నట్టు పేపర్ మీద పెట్టాను. ఇదీ కథ.. కథ గురించి చెప్పాలంటే.. ఫోరెన్సిక్ డేటా అనలిస్ట్ నతాషా రాయ్. ఆమె ప్రేమించిన నీల్ని హత్యకు గురవుతాడు. సింపుల్‌గా కనిపిస్తున్న ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు నతాషానే ప్రయత్నించినప్పుడు ఆమె తెలుసుకునే షాకింగ్ విషయాలే అసలు కథ. అందుకే పబ్లిష్ చేశా.. పబ్లిష్ చేయాలనే ఆలోచనతో ఆఫ్ ట్రాక్ రాయలేదు. నా మనసులో మెదిలిన కథకు ఓ రూపమిచ్చానంతే. దీనిలో పబ్లిష్ చేసేంత పస ఉందా అని తెలుసుకోవడానికి రైటర్ దీపక్ రానాకు చూపించాను. ఆయన చూసి కథ, కథనంలో పొటెన్షియల్ ఉందన్నారు. ఆయన అంత మంచి రివ్యూ ఇచ్చేసరికి పబ్లిష్ చేయాలనుకున్నాను. బుక్‌లో అడల్ట్ కంటెంట్ ఉంది. దీన్ని చదివిన మా ఇంట్లోవాళ్లు కాస్త ఇబ్బందిపడ్డా, అన్ని ఎలిమెంట్స్ బాగా కుదిరాయని మెచ్చుకున్నారు. రణ్వీర్ అయితే ఓకే.. చాలామంది నా ఫ్రెండ్స్ ఈ పుస్తకం చదివి దీన్ని సినిమా తీస్తే బాగుంటుందన్నారు. హీరో ఎవరైనా, ఈ కథ ప్రకారం గుండు చేయించుకోవాలి. అయితే ఆ క్యారెక్టర్ ఎవరు వేయాలంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇందులో హీరో పేరు రణవీర్.. సో హీరోగా రణ్‌వీర్‌సింగ్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. -
త్రీమంకీస్ - 81
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 81 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అదింకా అర్థం కాలేదా అంకుల్! విమానాశ్రయ అధికారులకి ఫోన్ చేసి మీరు ముంబై వెళ్ళే విమానంలో బాంబ్ పెట్టామని చెప్పాం తప్ప పోలీసులకి ఫోన్ కొట్టి పారిపోయిన ముగ్గురు ఖైదీలు ఆ విమానంలో ఉన్నారని చెప్పలేదు అంటే ఇంకా మీమీద మాకు కొద్దిగా ప్రేమ ఉండబట్టే కదా!’’ ‘‘అసలు మీకు మా ప్లాన్ మొత్తం ఎలా తెలుసు?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘మగాడి చేతిలో మోసపోయిన ఆడది సీబీఐ కన్నా సమర్ధవంతంగా పని చేస్తుంది. ఇంక మేం మగాడ్ని నమ్మకూడదని నిశ్చయించుకున్నాం. గుర్తుంచుకోండి. ఇందిరాగాంధీ, సోనియా, మమత బెనర్జీ, జయలలిత నించి మేం ఓ పాఠం నేర్చుకున్నాం. తమని డిస్టర్బ్ చేసే భర్త లేకపోవడం వల్లే చక్కగా జీవించగలమని వాళ్ళు ఋజువు చేశారు’’ వైతరణి చెప్పింది. ‘‘నిజమే. కాని భారతీయులు కూడా ఆ నలుగురు ఆడవాళ్ళ నించి ఓ పాఠం నేర్చుకున్నారు. అది వాళ్ళు కోట్లాది మంది భారతీయులని డిస్టర్బ్ చేస్తున్నారనే పాఠం. మీరూ అ పని చేయద్దని భారతీయుల తరఫున కోరుతున్నాను’’ మర్కట్ కోరాడు. ‘‘మీ ముగ్గురికీ ఓ ఉచిత సలహా ఇచ్చి వెళ్తాం. అన్ని వ్యాధులకి మందు నవ్వు’’ వైతరణి చెప్పింది. ‘‘నవ్వని వారు ఉన్నంతకాలం లోకంలో డాక్టర్లు ఉంటూనే ఉంటారు’’ మూలిక చెప్పింది. ‘‘కారణం లేకుండా నవ్వేవారికి మాత్రం మందు అవసరం’’ రుధిర చెప్పింది. ‘‘మా ముగ్గురి మనసులోని మాటని నేను చెప్తా వినండి. ‘మీతో మాకు పెళ్ళయితే మా ఇల్లే జైలు. మా భార్యే జైల్ వార్డెన్’’ మర్కట్ కసిగా చెప్పాడు. ‘‘అవును. అది మా మనసులోని మాటే’’ కపీష్ చెప్పాడు. ‘‘నేనూ కన్ఫం బటన్ని నొక్కాను’’ వానర్ కూడా చెప్పాడు. ‘‘ఏమిటి గొణుగుతున్నావు? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావనా?’’ డాక్టర్ మూలిక అడిగింది. ‘‘లేదు. నేను నిన్ను ద్వేషించడం లేదు. నువ్వు జీవించడం నాకు నచ్చడం లేదని అంటున్నాను’’ వానర్ అరిచాడు. ‘‘కుక్కలకి కుక్కభాషలోనే చెప్తాను. వినండి. మీరు లక్ష రూపాయలు పెట్టి కొన్నా ఓ కుక్క మిమ్మల్ని చూసి తోకాడించదు. అది మీ స్వంతం కాకపోయినా మీరు దాన్ని ప్రేమతో చూస్తేనే అది మిమ్మల్ని చూసి తోకాడిస్తుంది’’ వైతరణి చెప్పింది. ‘‘ఈమె కుక్కల రాణి’’ మర్కట్ ఎకసక్కెంగా చెప్పాడు. ‘‘సగటు మనిషి కంటే సగటు కుక్క మంచిదని ఋజువు చేశావు. నువ్వు ఎందుకు నిజాయితీగా ప్రవర్తించలేదో నేను అర్థం చేసుకోగలను మర్కట్! నువ్వు మనిషివే తప్ప కుక్కవి కావు’’ వైతరణి కోపంగా అరిచింది. ‘‘నువ్వు మా మనుషుల్ని అవమానిస్తున్నావు’’ మర్కట్ ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు. ‘‘నిజం చెప్తున్నాను. ఆకలికి అన్నం పెట్టిన కుక్క ఎన్నటికీ పెట్టిన వాళ్ళని కరవదు. బహుశా మీ ముగ్గురూ పందుల్ని పెంచుతున్నారని నా అనుమానం’’ వైతరణి చెప్పింది. ‘‘ఎందుకని? మీ ఇంట్లో నేను ఎక్కువ తిన్నానా?’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. కుక్కకి రోజూ తల దాచుకోడానికి చోటిచ్చి రోజూ ఇంత అన్నం, కాసిని మంచినీళ్ళు, కాస్తంత ప్రేమ ఇస్తే మనల్ని దేవుడిగా భావిస్తుంది. అదే పంది అలాంటి వారిని తనతో సమానంగా చూస్తుంది. మీరు పందుల్లాంటి వాళ్ళు కాబట్టి పందినే పెంచారని అనుకున్నాను. మీలాంటి వారు సమాజంలో చీడపందులు.’’ ‘‘మేమేం చీడపందులం కాము. మేం ముగ్గురం మూడు మొక్కలని నాటాం.’’ ‘‘అంటే?’’ ‘‘తన గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు. సమాజం గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు’’ వానర్ అరిచాడు. ‘‘పందులతో మనకేంటే మాటలు. పోదాం పద’’ రుధిర చెప్పింది. చంద్రుని మీదికి ఆర్మ్‌స్ట్రాంగ్‌ని పంపించి ఇవాళ్టికి సరిగ్గా ఏభై మూడేళ్లయింది. దారి కనుక్కున్నాక మగాళ్ళందరినీ అక్కడికి పంపించొచ్చుగా?’’ డాక్టర్ మూలిక గొణిగింది. వాళ్ళు ముగ్గురూ వైతరణి ఏక్టివా ఎక్కి పోలీసుల పక్క నించి వెళ్ళిపోయారు. ‘‘చీర విప్పిన వీర వనిత పథకం ఇదంతా’’ వానర్ కోపంగా చెప్పాడు. ‘‘నన్నడిగితే చీర కట్టిన వీర వీరుడు అనడం సబబు.’’ ‘‘ఎవరిదైనా నష్టపోయింది మనమేగా. ఇంకా నయం. మన మీద బాంబుల్ని వేయడమో, ఏసిడ్ చల్లడమో చేయలేదు’’ కపీష్ చెప్పాడు. ‘‘అది మగాళ్ళు చేేన... నిజమే. రుధిరకి ఆ ఆలోచన వచ్చి ఉండదు.’’ ‘‘ఆఖరి క్షణంలో అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. పోన్లే. నువ్వు ఓ పాఠం నేర్చుకున్నావు’’ మర్కట్ వానర్‌తో చెప్పాడు. ‘‘మనల్ని ప్రేమించిన ఆడదాన్ని వదిలి వెళ్ళకూడదనా?’’ వానర్ ప్రశ్నించాడు. ‘‘కాదు. ఏర్పోర్ట్లో ఒంటరిగా కూర్చున్న అమ్మాయి పక్క సీట్ ఖాళీనా అని అడక్కూడదని.’’ కళ్ళు మూసుకుని చేతులు జోడించి వానర్ ఏదో ప్రార్థించడం చూసి కపీష్ అడిగాడు - ‘‘ఏమిటా ప్రార్థన?’’. (ఏమని జవాబిచ్చి ఉంటాడో ఊహించండి) -
త్రీమంకీస్ - 80
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 80 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మీకే పేరు ఇష్టమైతే అదే నా పేరు. బై.’’ ఆమె సెల్‌ఫోన్ లైన్ కట్ చేసి ఆ యువకుడికి ఇచ్చి చెప్పింది - ‘‘సమయానికి మీరు సహృదయంతో ఈ సహాయం చేయకపోతే ఓ విమానం గాల్లోకి లేచేది కాదు. థౌజండ్ అండ్ ఒన్ థాంక్స్.’’ ‘‘నో ప్రాబ్లం. థౌజండ్ సరే. ఒన్ దేనికి?’’ అతను అడిగాడు. ‘‘ఒన్ ఫోన్‌ని ఇచ్చినందుకు. థౌజండ్ మీ అమ్మకి. ఇంత అందమైన అబ్బాయిని ప్రపంచానికి ఇచ్చినందుకు. సేఫ్ లేండింగ్.’’ ‘‘మీ సెల్ నంబర్?’’ అతను మురిసిపోతూ అడిగాడు. కుడి ముంజేతి మీద రాసుకున్న ఫోన్ నంబర్ని చెప్పింది. అది ఇందాక బాంబు ఉందని చెప్పడానికి ఆమె ఓ ప్రయాణీకుడి నించి తీసుకున్న మొబైల్ నంబర్. అతను లోపలకి వెళ్ళగానే చాటునించి చూసే మరో ఇద్దరు అమ్మాయిలు ఆమె దగ్గరకి వచ్చారు. వాళ్ళవంక చూసి మినీ స్కర్ట్ అమ్మాయి థంప్స్ అప్ సైన్‌ని చూపించింది. ‘‘దుర్మార్గులు! ఎవరా ఫోన్ చేశారో?’’ కపీష్ వానర్‌తో ఆక్రోశంగా అన్నాడు. ‘‘వాళ్ళకి మూడు కానుపుల్లో ట్రిప్లెట్స్ పుట్టాలి అని నా శాపం’’ వానర్ కోపంగా చెప్పాడు. ‘‘మేమే.’’ ముగ్గురూ ఆ ఆడకంఠం వినపడ్డ వైపు వెనక్కి తిరిగి చూశారు. స్తంభం పక్కనించి మూడు తలలు ఒకదాని తర్వాత మరొకటి బయటకి వచ్చి వీరి వంక చిరునవ్వుతో తొంగి చూడసాగాయి. ‘‘అరె! మీరా?’’ మర్కట్ నివ్వెరపోయాడు. ‘‘మేమే. మాకు ఎందుకు చెప్పలేదు?’’ డాక్టర్ మూలిక ప్రశ్నించింది. ఆమె ధరించిన టి షర్ట్ మీద ఐ ఏమ్ ఏ సెక్స్ ఇన్స్ట్రక్టర్. ఫస్ట్ లెసన్ ఫ్రీ అని రాసి ఉంది. ‘‘ఓ ఆడదాని చెవిలో చెప్పింది వంద మైళ్ళ దూరంలో కూడా వినిపిస్తుందని.’’ ‘‘ముగ్గురు ట్రిప్లెట్స్ పుట్టడం ఏమిటి? నీ శాపం మాకు అర్థం కాలేదు’’ డాక్టర్ మూలిక మళ్ళీ ప్రశ్నించింది. ‘‘అదా? మూడు కానుపుల్లో ముగ్గురు చొప్పున పుడితే ప్రతీ కానుపు తర్వాత వారానికి నూట డబ్బై ఐదు నేపీలు మార్చాలి. ప్రతి రాత్రి తలకో బాటిల్ చొప్పున వారానికి ఇరవై బాటిల్స్ పాలు కలపాలి. ప్రతి కానుపు తర్వాత వాళ్ళు ఇలా కష్టపడాలి... మీరేంటి? అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారు?’’ ‘‘మాకు చెయ్యిచ్చి పారిపోతూంటే ఆపడానికి వచ్చాం’’ రుధిర కోపంగా చెప్పింది. ‘‘అసలు మేమీ విమానంలో వెళ్తున్నామని నీకు ఎవరు చెప్పారు?’’ కపీష్ నిర్ఘాంతపోయాడు. ‘‘నేనే కనుక్కున్నాను. ఆటోలోంచి దిగి ఏ బేంక్‌లోకి వెళ్ళి వచ్చారో అదే బేంక్ దోచుకోబడుతోందని టీవీలో చూడగానే మాకు మీ పథకం అర్థమైంది. రావణ్ మిమ్మల్ని చంపి పారేస్తాడు కాబట్టి మీరు పారిపోతారని ఊహించాను. డబ్బుంది కాబట్టి విమానంలోనే పారిపోతారన్న వైతరణి ఊహ కరెక్ట్ అయింది. ఇక్కడ ఉదయం నుంచి మీ కోసం మాటేశాం. ఆడది ఈ ప్రపంచంలో అత్యంత సెల్ఫ్ కంట్రోల్డ్, వెల్ మేనర్డ్, అన్డిస్టర్బ్డ్, నాన్ వయోలెంట్ హ్యూమన్ బీయింగ్- ఆమె నెయిల్ పాలిష్ ఆరే దాకా. నా నెయిల్ పాలిష్ ఆరగానే వీళ్ళకి మీరు ఎక్కిన విమానంలో బాంబుందని ఫోన్ చేసి మిమ్మల్ని ఆపేశాను’’ రుధిర చెప్పింది. ముగ్గురు మిత్రుల మొహాలు వెంటనే పాలిపోయాయి. ‘‘అంతేకాదు, ఏ డబ్బు మీద ప్రేమతో మా ప్రేమని కాదని మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నారో ఆ డబ్బుని మీకు కాకుండా చేశాం’’ వైతరణి చెప్పింది. ఆమె ధరించిన టీ షర్ట్ మీద ఓనర్స్ ప్రైడ్. నైబర్స్ ఎనిమీ అని రాసి ఉంది. ‘‘బదులుకి బదులు. ఇక మీకూ, మాకూ రాం రాం’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘ఇంక మీ జీవితం వైన్ అండ్ విమెన్ నించి వాటర్ అండ్ వైఫ్ స్థాయికి పడిపోయింది’’ వైతరణి చెప్పింది. ‘‘ఎందుకిలా చేసారు? మాతో మీ ఇమోషనల్ అటాచ్మెంట్ ఏమైంది?’’ డాక్టర్ మూలిక దుఃఖంగా ప్రశ్నించింది. ‘‘ఎటాచ్మెంటా? అదేమిటో నీకు అసలు అర్ధం తెలిేన మాట్లాడుతున్నావా? ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోకుండా ఉండలేకపోవటం అటాచ్‌మెంటా? కాదు. ఇద్దరూ ఒకరి సమీపంలో మరొకరు లేకుండా ఉంటే ఊపిరి ఆడకపోయినట్లు ఉండటం అటాచ్‌మెంటా? కాదు. ఇద్దరు పెళ్ళవకుండా సెక్స్‌లో పాల్గొనడం అటాచ్‌మెంటా? కాదు. ఎన్నటికీ కానే కాదు. ఎవరైనా నీకో ఫైల్ని ఈమెయిల్ చేస్తే ఉత్తరంతో పాటు వచ్చే ఆ ఫైల్ని అటాచ్మెంట్ అంటారు’’ వానర్ చెప్పాడు. ‘‘మీరు చేసింది అన్యాయం’’ కపీష్ ఆక్రోశించాడు. ‘‘డోంట్ బ్రేక్ మై హార్ట్ అని ఎప్పుడో నిన్ను వారించాను కప్. నా గుండెని బద్దలు కొట్టినందుకు బదులుగా నీకున్న రెండు వందల ఆరు ఎముకల్లో ఒకదాన్నైనా బ్రేక్ చేసే ఏర్పాటు చేయనందుకు సంతోషించు’’ రుధిర క్రోధంగా చెప్పింది. ‘‘రేపు దినపత్రికలో బేంక్ సొమ్ము పట్టుబడిందన్న వార్త వస్తుందని పందెం’’ వైతరణి నవ్వుతూ చెప్పింది. ‘‘అంటే మా డబ్బుని పట్టించడానికేనా బాంబ్ ఉందనే అబద్ధపు ఫోన్ కాల్ చేసింది?’’ వానర్ అడిగాడు. -
త్రీమంకీస్ - 79
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 79 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మన ఎయిర్ బేగ్స్‌ని కూడా తెరిచి చూస్తారంటావా?’’ మర్కట్ సందేహంగా అడిగాడు. ‘‘మనం విఐపీలం కాము కాబట్టి తప్పకుండా తెరిచి చూస్తారు. చూడనీ’’ బాత్ రూం నించి తిరిగి వచ్చిన వానర్ చెప్పాడు. ‘‘అప్పుడు మనం అంత డబ్బుని ఏ బేంక్ నించి డ్రా చేశామో, లేదా మనకి ఎలా వచ్చిందో ప్రూఫ్ చూపించమంటారు. మనం సరైన వివరణ ఇవ్వకపోతే అంతే సంగతులు. అరెస్ట్ చేస్తారు’’ కపీష్ చెప్పాడు. ‘‘అదే నా భయం. ఇప్పుడు మనం ఏం చేయాలి?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు. ‘‘మనం ఆ డబ్బుకి నీళ్ళు ఒదలాలా? మనం పడ్డ కష్టమంతా వృథాయేనా?’’ వానర్ ఏడుపు గొంతుతో అడిగాడు. ‘‘ఇప్పుడు ఛాయిస్ మనది. డబ్బు ఎటూ మనకి ఇవ్వరు. ఇటు స్వతంత్రం కోల్పోయి ఒన్... టు... త్రి... ఫోర్ అంటూ సెవెన్ దాకా జైలు ఊచలు లెక్కపెట్టాలి. లేదా పారిపోవాలి. నేను అసలా ఊచలనే చూడాలనుకోవడం లేదు. బయకి వెళ్తున్నాను. తర్వాత మీ ఇష్టం’’ కపీష్ చెప్పాడు. ‘‘కపీష్ చేసేది తెలివైన పని. పద’’ మర్కట్ సలహా ఇచ్చాడు. ‘‘ప్లీజ్ వెయిట్. ఐ ఏమ్ అవుటాఫ్ మైండ్. ఐ విల్ బి బేక్ ఇన్ ఫైవ్ మినిట్స్’’ వానర్ చెప్పాడు. వానర్ని రెక్క పట్టుకుని ఇద్దరూ లాక్కెళ్ళారు. ముగ్గురూ ఏర్‌లైన్స్ కౌంటర్‌కి వెళ్ళి రిఫండ్ కూపన్స్ తీసుకుని బాధగా బయటకి నడిచారు. వానర్ ఏరో బ్రిడ్జి తలుపు వైపు బాధగా చూశాడు. ‘‘ముంబై బౌండ్ పేసెంజర్స్. యువర్ అటెన్షన్ ప్లీజ్... మిస్టర్ కపీష్, మిస్టర్ మర్కట్ అండ్ మిస్టర్ వానర్. దయచేసి వచ్చి మీ తోపు రంగు ఏర్ బేగ్స్‌ని ఐడెంటిఫై చేయ ప్రార్థన’’ ప్రకటన వినిపించింది. ‘‘కనుక్కున్నారు. మనం పారిపోవాలి’’ కపీష్ ఆదుర్దాగా చెప్పాడు. విమానాశ్రయం బిల్డింగ్‌లోంచి బయటకి వచ్చే దాకా పోలీసులు తమని ఆపి ‘ఇది మీ లగేజేనా?’ అని తమ ఎయిర్ బేగ్స్‌ని చూపిస్తారని ముగ్గురి గుండెలూ దడదడలాడుతూనే ఉన్నాయి. రిఫండ్ కూపన్స్‌ని చూసి కాని సెక్యూరిటీ పోలీసులు వాళ్లని బయటికి పంపలేదు. ఆ విమానంలో బాంబ్ ఉందని ఫోన్ చేయడానికి ఉపయోగించిన సెల్ ఫోన్లో మాట్లాడే ఇరవై రెండేళ్ళ యువకుడ్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడం వాళ్ళు గమనించారు. వాళ్ళ ప్రశ్నకి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకైన అతను చెప్పిన జవాబు విన్నారు. ‘‘ఇందాక ఎవరో అమ్మాయి తన సెల్‌ఫోన్ బేటరీ అయిపోయిందని, నా సెల్ఫోన్లోంచి ఓ కాల్ చేసుకుంటానంటే ఇచ్చాను. చివరలో నా నంబర్ అడిగి ముంజేతి మీద రాసుకుంది కూడా.’’ ముగ్గురూ బయటకి వచ్చారు. వానర్ మొహం ఆముదం తాగినట్లుగా ఉంటే, మర్కట్ మొహం పది లంఖణాలు చేసిన వాడిలా ఉంది. కపీష్ మొహం ఎలా ఉందంటే... ‘‘ఎక్స్క్యూజ్ మీ! ఇంకాసేపట్లో ప్రపంచం అంతం అవుతుందని మీకు ఎవరు చెప్పారు?’’ అనేకమంది అతన్ని ఆపి అడిగారు. మూడు ఎయిర్ బేగ్స్‌తో కోటీశ్వరులుగా లోపలకి వెళ్ళిన ఆ ముగ్గురూ ఉత్త చేతులతో బికారులుగా బయటకి వచ్చారు. ‘‘ఎక్స్క్యూజ్ మీ! మీ సెల్‌ఫోన్‌ని ఓసారి ఉపయోగించుకోవచ్చా? నాది బేటరీ డౌన్ అయింది. ఐ మీన్ నాది కాదు. నా సెల్ ఫోన్‌ది. నాది బానే ఉంది’’ మినీ స్కర్ట్, టాప్‌లోని ఓ ఇరవై రెండేళ్ళ అమ్మాయి డిపార్చర్ గేట్ లోపలకి వెళ్తున్న ఓ యువకుడ్ని అడిగింది. ఒంటి మీంచి మస్క్ పెర్ఫ్యూమ్ వాసన వచ్చే అతని టీ షర్ట్ మీద ‘బ్యూటీ లైన్ ఇన్ ది హేండ్స్ ఆఫ్ బీర్ లవర్’ అనే మాటలు ముద్రించి ఉన్నాయి. ‘‘తప్పకుండా. మీకుందో లేదో కాని నాకు నోమో ఫోబియా ఉంది.’’ ‘‘అంటే?’’ ‘‘సెల్‌ఫోన్ లేకుండా ఉండటం లేదా సిగ్నల్ ఉండదనే భయం. నాకూ అప్పుడప్పుడూ అలా జరుగుతూంటుంది. అతను చిరునవ్వుతో తన స్మార్ట్ ఫోన్‌ని జేబులోంచి తీసి ఇచ్చాడు. ‘‘ఐనా డౌన్ అవడానికి మీ ఒంట్లో బేటరీ లేదుగా. మీ సెల్‌ఫోన్ గురించి కదా మీరు చెప్పింది. ఏమ్ ఐ రైట్?’’ ఆమె నవ్వుతూ అడిగింది. ‘‘ఎస్ అఫ్కోర్స్. యు హేవ్ లాట్స్ ఆఫ్ సెన్సాఫ్ హ్యూమర్.’’ ‘‘పాస్వర్డ్?’’ అతను ఇంగ్లీష్‌లో ఓ అంకె, ఓ బూతు మాట, స్టార్ సైన్‌ని చెప్పాడు. ఆమె ఎడం చేతి ముంజేతి మీద రాసుకున్న ఓ నంబర్ని డయల్ చేసింది. అది నాలుగైదుసార్లు మోగాక అవతల నించి ఓ మగ కంఠం వినిపించింది. ఆమె అతనితో ‘ఎక్స్క్యూజ్ మీ’ అని పక్కకి వెళ్ళి చెప్పింది. ‘‘హలో. ఇందాక మీకు ఫోన్ చేసి ముంబై ఫ్లైట్‌లో బాంబ్ ఉందని చెప్పింది నేనే. అందులో అస్సలు బాంబ్ లేదు. తమాషాకి అలా ఫోన్ చేశానంతే. పాపం. ఆ విమాన ప్రయాణీకులకి నేను సారీ చెప్పానని చెప్పండి. విమానానికి రైట్ చెప్పండి. మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే ఫోన్ చేస్తూంటాలెండి.’’ ‘‘మీ పేరు?’’ (ఏమని చెప్పి ఉంటుంది?) -
త్రీమంకీస్ -78
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 78 - మల్లాది వెంకటకృష్ణమూర్తి విమానం బయల్దేరబోతున్నట్లుగా ఎయిర్‌హోస్టెస్ ప్రకటన వినిపించింది. కొద్ది నిమిషాలకి తర్వాత విమానం స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ‘‘నలభై వేల అడుగుల ఎత్తున, గంటకి ఏడు వందల మైళ్ళ వేగంతో దూసుకుపోయే కోటి అరవై లక్షల డాలర్లు ఖరీదు చేసే ఈ విమానంలోని ప్రయాణీకులు ఏం తాగాలి? షాంపేన్. ఏం తినాలి? జీడిపప్పు పకోడీలు. కాని మనం ఏం సర్వ్ చేస్తాం? డైట్ పెప్సీ, సాల్టెడ్ పీనట్స్.’’ ప్రకటన ముగించాక ఓ ఏర్ హోస్టెస్ మరో ఏర్ హోస్టెస్‌కి చెప్తూండగా ఇంటర్ కం మోగింది. అవతల నించి పైలట్ కంఠం ఆదుర్దాగా వినిపించింది. ‘‘మనం కొద్దిసేపట్లో వైర్లెస్ అవబోతున్నాం’’ కపీష్ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘నేను విమానం దిగాక ఇక ఆకాశంలో ఎగిరే పక్షుల వంక అసూయగా చూడను’’ వానర్ ఆనందంగా కిటికీలోంచి చూస్తూ చెప్పాడు. కాని అది ముందుకి కదలకుండానే ఇంజన్లు ఆగిపోయాయి. మళ్ళీ ఎయిర్ హోస్టెస్ కంఠం ఇంగ్లీష్‌లో వినిపించింది - ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్. వి ఆర్ సారీ. యాంత్రిక లోపం వల్ల షెడ్యూల్ ప్రకారం ఈ విమానం టేకాఫ్ కావడం లేదు.’’ ‘‘ఛ! మొదటిసారి విమానం ఎక్కితే నాకు ఇలా అవాలా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘... దయచేసి ప్రయాణీకులంతా బయటకి వచ్చి డిపార్చర్ గేట్లో కూర్చుని మా తర్వాతి ప్రకటన కోసం ఎదురుచూడండి. మీ కేరీ ఆన్ లగేజ్‌ని విమానంలోనే వదిలి వెళ్ళండి.’’ ‘‘ఇప్పుడేం చేద్దాం?’’ వానర్ అడిగాడు. ‘‘ఇదే’’ కపీష్ లేచి చెప్పాడు. అందరూ లేచి ఓవర్‌హెడ్ లాకర్లోని తమ లగేజ్‌ని తీసుకోబోతే ఎయిర్ హోస్టెస్‌లు వారిని వద్దని వారించారు. కపీష్ ఎయిర్ హోస్టెస్‌ని తమ ఎయిర్ బేగ్స్ ఇవ్వమని అడిగితే ఆమె చెప్పింది. ‘‘కొద్ది నిమిషాలే ఆలస్యం. మళ్ళీ ఇదే విమానంలో మీరు ముంబై వెళ్తారు. సామాను తీసుకోవడం, పెట్టడం వల్ల ఆలస్యం పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో హేండ్ లగేజ్‌ని ఉంచే వెళ్ళాలి’’ ఆమె చెప్పింది. ‘‘దీసీజ్ టెరిబుల్.’’ ‘‘ఐ కాంట్ బిలీవ్ ఇట్.’’ ‘‘దిస్ ఆల్వేస్ హేపెన్స్ వెన్ ఐ యాం ఎబోర్డ్.’’ ‘‘వై డోంట్ దే చెక్ ఎహెడ్?’’ ప్రయాణీకుల రకరకాల కామెంట్స్ మధ్య ముగ్గురు మిత్రులూ ఏరోబ్రిడ్జ్ మీదుగా మళ్ళీ డిపార్చర్ గేట్‌కి చేరుకున్నారు. ‘‘ఒకందుకు నాకు సంతోషంగా ఉంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఇంత జరిగితే సంతోషమా? దేనికి?’’ మర్కట్ అడిగాడు. ‘‘నా కాళ్ళు భూమిని తాకుతున్నందుకు’’ వానర్ జవాబు చెప్పాడు. ఆలస్యానికి కొందరు రిఫండ్ అడిగితే వారికి అక్కడి ఉద్యోగిని ఓచర్స్ ప్రింటౌట్లని ఇవ్వసాగింది. పావు గంటైంది. అరగంటైంది. ఐనా మళ్ళీ ప్రకటన లేదు. ‘‘ఇంకెంతసేపు?’’ ఒకరు గేట్ ఏజెంట్‌ని కోపంగా అడిగాడు. ‘‘మాకూ తెలీదు. చెప్పడం కష్టం.’’ ‘‘ఎందుకు చెప్పలేరు? ముప్పావు గంట దాటింది. నేను బరోడాకి కనెక్టింగ్ ఫ్ల్లైట్ పట్టుకోవాలి. అసలు సమస్య ఏమిటి?’’ అతను నిగ్గదీశాడు. ‘‘ఆలస్యం అని మీరు ఫిర్యాదు చేస్తున్నారు. ఒకప్పుడు హైద్రాబాద్ నించి బాంబేకి వెళ్ళడానికి తొంభై రోజులు పట్టేది. దారిలో ఒకరిద్దరికి కానుపులు అయ్యేవి. ఒకరిద్దరు గర్భవతులే అయ్యేవారు. అక్కడికి చేరుకునేసరికి ఒకరిద్దరు మరణించేవారు. ఇప్పుడో? ఓ సినిమాని సగం చూసే టైంలోనే విమానం దిగిపోయి ఇంటికి చేరుకుంటున్నారు. నలభై నిమిషాలు ఆలస్యం అయితే భరించలేరా?’’ ‘‘ప్లీజ్. కారణం నాకు చెవిలో చెప్పండి’’ వానర్ ఆమెని అడిగాడు. ‘‘జస్ట్ మెకానికల్ ప్రాబ్లం’’ ఆమె బయటకే చెప్పింది. పోలీస్ కుక్కతో ఇద్దరు పోలీసులు విమానంలోంచి బయటకి రావడం గమనించిన వానర్ అకస్మాత్తుగా బాత్రూంలోకి పరిగెత్తాడు. ‘‘అసలు సమస్య ఏమిటి? పోలీసులు ఎందుకు వచ్చారు?’’ కపీష్ ఆమెని అడిగాడు. ఆమె ఇటు చూసి గొంతు తగ్గించి అతని చెవిలో చెప్పింది. ‘‘విమానంలో బాంబ్ ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. హేండ్ లగేజ్‌లో ఉందేమోనని పోలీస్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వేడ్ వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. అది పూర్తవగానే విమానం బయలు దేరుతుంది. సాధారణంగా ఫోన్ కాల్ బెదిరింపుల్లో ఇంత దాకా ఎలాంటి బాంబ్లూ దొరకలేదు. ఎవరో పోకిరీ వాళ్ళు ఇలాంటి కాల్స్ చేస్తూంటారు.’’ ‘‘పోకిరీ వాళ్లైతే మరి వెళ్ళచ్చుగా? దింపేశారే?’’ ‘‘ఫోన్ కాల్ వచ్చినప్పుడు మేం తప్పనిసరిగా చెక్ చేయాలి. అది రికార్డ్ అవుతుంది. లగేజ్‌ని కూడా చెక్ చేస్తారు. అది సాధారణ జాగ్రత్త. చెకింగ్ పూర్తవగానే విమానం బయలు దేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే హేండ్ లగేజ్ అంతా తెరిచి చూడటానికి టైం పడుతుంది. అందుకే ఎక్కువమంది ఆ పని చేస్తున్నారు’’ ఆమె చెప్పింది. కపీష్, మర్కట్లు వెంటనే పక్కకి వెళ్ళి చెవులు కొరుక్కున్నారు. మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ లెటర్స్ The story is awesome. The characters are awesome. Excellent selection by the editor. Thanks to MALLADI garu and SAKSHI. - vijay bhaskar (vijay.bhaskar161995@gmail.com) పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -77
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 77 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఇక నుంచి నేను రోజుకో టూత్ బ్రష్‌ని వాడదలచుకున్నాను. డ్రాయర్, బనీన్లని కూడా. మిగిలిన డబ్బుతో మినరల్ వాటర్ బాటిల్స్‌ని కొని ఇక ఆ నీళ్ళతోనే స్నానం, తాగడం అన్నీనూ. ఇంట్లోని లైట్లని మాటిమాటికీ వేసి ఆర్పను. వాటన్నిటినీ ఎప్పుడూ వేేన ఉంచుతాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇది వింటే స్వచ్ఛ వీడిని ప్రేమించేది. నువ్వు?’’ కపీష్ ప్రశ్నించాడు. ‘‘ఇక నేను దేనికీ బేరం ఆడను. ఏపిల్స్ కొన్నా, ఇల్లు కొన్నా సరే. సగం జీవిత కాలం బేరాలకే సరిపోయింది. చెప్పిన ధరకి కొనేస్తాను. నీ సంగతేమిటి?’’ మర్కట్ అడిగాడు. ‘‘నేను మీలా కాదు. గోల్డ్ కంచంలో తిని, గోల్డ్ గ్లాసుతో తాగి, అన్నంలో గోల్డ్ రేకులని వేసుకుని తిని, ఆఖరికి టాయిలెట్ పేపర్ని కూడా గోల్డ్‌తో తయారు చేయించి దాన్నే వాడతాను’’ కపీష్ చెప్పాడు. వానర్ తనతో తెచ్చుకున్న దినపత్రికలోని ఓ వార్తని చదివి తర్వాత మిత్రులు ఇద్దరికీ ఆశ్చర్యంగా చెప్పాడు. ‘‘బేంక్‌కి సొరంగం తవ్వింది దుర్యోధన్. ఆ సంగతి తెలీక వాడి అన్న రావణ్ అదే బేంక్‌లోకి సమయానికి ఆయుధాలతో, తన అనుచరులతో ప్రవేశించాడట.’’ ‘‘అంటే మనం బేంక్‌లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నది రావణ్ అన్న మాట!’’ ‘‘అవును. సిసి కెమేరా ఫుటేజ్‌ని చూసి అతని నడకని బట్టి, ఒడ్డూ పొడుగుని బట్టి పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారట’’ వానర్ చెప్పాడు. ‘‘అంటే దుర్యోధన్‌ని పోలీసులు పట్టుకోకపోతే వాడు ఆ సొరంగంలోంచి మన బదులు తన అనుచరులతో వెళ్ళి ఉండేవాడు. వాడు వెళ్తే మనం వెళ్ళలేంగా. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ బేంక్ సొత్తుని పంచుకునే వారు. అవునా?’’ కపీష్ అడిగాడు. ‘‘కాదు. వాళ్ళ మధ్య రక్తపాతం జరిగేదిట. వాళ్ళు ఆజన్మ శత్రువులట’’ వానర్ చెప్పాడు. ‘‘దేనికి?’’ ‘‘వాళ్ళ తండ్రి ఒకరే కాని తల్లులు వేరట. దాయాదులన్నమాట. అందుకని.’’ ‘‘అంటే పోలీసులు దుర్యోధనుడ్ని పట్టుకుని అన్నదమ్ముల ఇద్దరి ప్రాణాలని కాపాడారన్నమాట!’’ మర్కట్ చెప్పాడు. ‘‘అనే ఇందులో రాశారు. అంతేకాదు. బేంక్ సొమ్ము మోసం చేసి దోచుకుపోయిన మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. సాక్షులతో మన ఊహాచిత్రాలని గీయించి తెలుసుకుంటారుట’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు. ‘‘తెలుసుకోమను. ఆ సరికి మనం ఇక్కడ ఉండం.’’ మర్కట్ ఆ పేపర్ అందుకుని ఆ వార్తని చదివి చెప్పాడు. ‘‘పోలీసులు ఆ అన్నదమ్ములు ఇద్దర్నీ చెరో జైల్లో పెట్టారుట.’’ పైలట్ గ్రైప్ షీట్‌ని అందుకుని చదివాడు. అంతకు మునుపు ఆ విమానాన్ని నడిపిన పెలైట్ తను అందులో గమనించిన లోపాలని రాసే షీటే గ్రైప్ షీట్. గ్రౌండ్ స్టాఫ్ దాన్ని చదివి ఆ లోపాలని సవరించాలి. తర్వాత తను హాజరైన లోపాల సర్దుబాటు మీద కామెంట్స్ రాయాలి. పైలట్ అలా రాసిన వాటిని చదివాడు. పైలట్: ఆటో లేండింగ్ గేర్ సరిగ్గా పడటం లేదు. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: ఈ విమానంలో ఆటో లేండింగ్ గేర్ లేదు. పైలట్: కాక్‌పిట్‌లో ఎలుక ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో పిల్లిని ఇన్స్టాల్ చేశాం. పైలట్: విండ్ స్క్రీన్‌లో పగులు ఉన్నట్లు అనుమానంగా ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: మీ అనుమానం నిజమే. పైలట్: కాక్‌పిట్‌లో ఏదో లూజ్‌గా ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో ఏదో బిగించాం. పైలట్: విండ్‌షీల్డ్ మీద చచ్చిన పురుగులు ఉన్నాయి. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: విండ్‌షీల్డ్ మీదకి బతికున్న పురుగులని ఆర్డర్ చేశాం. పైలట్: రేడియో స్విచ్‌లు అంటుకుంటున్నాయి. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: కాక్‌పిట్‌లో ఇక మీదట జామ్ సర్వ్ చేయబడదు. పైలట్: కాక్‌పిట్‌లో వింత వాసన. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: మీ పెర్ఫ్యూమ్ని మార్చండి. పైలట్: ఏర్ కండిషన్డ్ మెషీన్ నా భార్యలా అరుస్తోంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: విడాకులు రికమెండ్ చేస్తున్నాం. పైలట్: ఫ్రిక్షన్ బ్రేక్స్‌ని త్రాటిల్ లివర్ పట్టుకుంటోంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: త్రాటిల్ లివర్ చేసే పని అదే. పైలట్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం ఉంది. గ్రౌండ్ మెయిన్టెనెన్స్: రైట్ మెయిన్ లేండింగ్ గేర్‌లో ఏదో కారే సాక్ష్యం తొలగించబడింది. పైలట్ దాని మీద తన ఇనీషియల్ వేసి సంతకం చేసి విమానం ఇంజన్లని స్టార్ట్ చేయసాగాడు. అకస్మాత్తుగా అతనికి కంట్రోల్ టవర్ నించి వైర్లెస్లో ఓ ముఖ్యమైన సమాచారం అందింది. (దాని పర్యవసానంగా ఏం జరిగింది?) -
త్రీమంకీస్ -76
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 76 మల్లాది వెంకటకృష్ణమూర్తి వానర్ తిరిగి వచ్చి తన మిత్రుల పక్కనే కూర్చున్నాడు. కాలికి ఏదో తగిలితే తీసి చూశాడు. కట్టుడు పళ్ళు. ‘‘దాన్ని ఎవరు మర్చిపోయారో?’’ మర్కట్ ఆశ్చర్యపోయాడు. ‘‘అల్జిమెర్స్ రోగి అయి ఉంటారు’’ కపీష్ చెప్పాడు. ‘‘విమాన ప్రయాణాల్లో సెక్యూరిటీ పెద్ద న్యూసెన్స్’’ వెనక వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ‘‘సెక్యూరిటీ వాడి వల్ల క్రితంసారి నా ప్రాణాలు నిలిచాయి.’’ ‘‘ఎలా?’’ పక్కన కూర్చున్నతను అడిగాడు. ‘‘వాడు నన్ను థరోగా తనిఖీ చేసేసరికి నా విమానం వెళ్ళిపోయింది. అది కాస్తా కూలి చచ్చింది.’’ ‘‘విమాన ప్రయాణం అంటే నాకు భయం. ఐనా తప్పదు కాబట్టి వచ్చాను’’ కాసేపాగి వానర్ చెప్పాడు. ‘‘దాన్ని ఫియర్ ఆఫ్ ఫ్ల్లైయింగ్ అంటారు’’ మర్కట్ చెప్పాడు. ‘‘నాకు ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్ లేదు. ఫియర్ ఆఫ్ క్రాషింగ్ ఉంది. ఇంకా చాలా భయాలు ఉన్నాయి. విమానాశ్రయానికి టైంకి చేరుకోలేననే భయం. ఫ్లైట్ హైజాక్ అవచ్చని భయం. విమానంలో భోజనం బావుండదని భయం. విమానం పైకి లేచాక వాంతి రావచ్చని భయం. విమానంలో ఏడ్చే పిల్లలు ఉంటారని భయం. దాంతో ప్రశాంతత కోసం బయటకి వెళ్ళి నడుస్తానేమోనని భయం.’’ ‘‘నాకు కోర్టు కేసులన్నా, ఆపరేషన్ టేబిల్ అన్నా, విమానం లేండింగ్ అన్నా భయం. ఒద్దనుకుంటే అక్కడ నించి లేచి వెళ్ళలేం కదా’’ మర్కట్ చెప్పాడు. ‘‘డైటింగ్, ఎక్సర్సైజ్, విమాన ప్రయాణాలు మంచివే. కాని అవి నాకు జరగాలని అనుకోను. దేవతల్లా మనమూ ఎగరగలిగితే బావుండేది’’ కపీష్ చెప్పాడు. ‘‘వారిలా మనకి పాపభారం లేకపోతే మనమూ ఎగరగలిగే వాళ్ళం. వేమన నాకోసారి చెప్పాడు. అంతేకాదు... విమాన ప్రయాణాల్లోనే మనుషులు దేవుడికి దగ్గరవుతూంటారు. విమానంలోంచి భద్రంగా దిగాక దూరం అవుతూంటారు అని కూడా వేమన చెప్పాడు’’ ‘‘బటర్ఫ్లైకి ఫ్లైయింగ్ ఫ్లవర్ అనే పేరు పెట్టాను...’’ ఆ మాటలు వినిపించిన వైపు చూసి వానర్ వెంటనే చెప్పాడు... ‘‘కప్. అటు చూడు.’’ కపీష్ తల తిప్పి చూస్తే స్వచ్ఛ కనిపించింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళే ఆమె ఒంటి మీద నలిగిన చీర. అలసిన మొహం. చేతిలో తడిసిన నేప్కిన్. చంకలో చీమిడి ముక్కుతో తొమ్మిది నెలల బిడ్డ. ‘‘పెళ్ళయ్యాక ఎంతటి వారైనా ఎలా మారతారో?’’ మర్కట్ జాలిగా చెప్పాడు. ‘‘ఇంకా నయం. మనల్ని చూసి అంతా జాలిపడేలా మనకి పెళ్ళిళ్ళు కాలేదు’’ వానర్ చెప్పాడు. బోర్డింగ్ కాల్ విని ముగ్గురూ లేచారు. వానర్ ఎవరో వదిలేసినఓ దినపత్రికని తీసుకున్నాడు. ముగ్గురూ ఏరో బ్రిడ్జ్ మీంచి లోపలకి వెళ్ళారు. గుమ్మం దగ్గర నిలబడ్డ ఎయిర్‌హోస్టెస్ వానర్ చేతిలోని ఎరికా జోంగ్ నవల ‘ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్’ని చూసి నవ్వింది. వారి బోర్డింగ్ కార్డులని చూసి చెప్పింది. ‘‘వెల్కం టు ది నాన్-స్టాప్ ఫ్లైట్ సర్.’’ ‘‘ఇది నాన్ స్టాప్ ఫ్లైటా? ఐతే బాంబేలో ఆగదా?’’ వానర్ అడిగాడు. ‘‘గుడ్ జోక్. ప్లీజ్ గో స్ట్రెయిట్ ఎహెడ్ అండ్ టర్న్ రైట్ సర్.’’ మరో ఎయిర్‌హోస్టెస్ వాళ్ళకి సీట్లని చూపించింది. ముగ్గురివీ పక్కపక్క సీట్లే. ‘‘విమానం ఏది? కనపడలేదు’’ వానర్ కపీష్‌ని అడిగాడు. ‘‘మనం విమానంలోనే ఉన్నాం.’’ ‘‘ఇది నిజంగా విమానమే అంటావా? సినిమాల్లో నాగార్జున మెట్లెక్కి వెళ్ళడం చూశానే?’’ అటుగా వెళ్ళే ఎయిర్ హోస్టెస్ ముగ్గురి ఒళ్ళల్లో భద్రంగా ఉన్న ఎయిర్ బేగ్స్‌ని చూసి చిరునవ్వుతో చెప్పింది - ‘‘లెట్ మీ కీప్ దెమ్ ఇన్ ది ఓవర్‌హెడ్ లాకర్ ఫర్ యు ప్లీజ్’’ ‘‘నో. నో. ఐ కీప్. ఐ కీప్’’ వానర్ చెప్పాడు. ‘‘నో సర్. యు కాంట్ కీప్ ది కేరీఆన్ లగేజ్ విత్ యు. ఇట్ షడ్ గోటు ఓవర్‌హెడ్ లాకర్.’’ ఆమె మూడిటిని అందుకుని ఓవర్‌హెడ్ లాకర్లో ఉంచి తలుపు మూసింది. ఆమె మర్కట్ టి షర్ట్ మీది కొటేషన్‌ని చదివింది - ‘ఇన్ లైఫ్ యు ఆర్ ఏ వైఫ్ ఆర్ ఏన్ ఎయిర్ హోస్టెస్ ది ఛాయిస్ ఈజ్ యువర్స్’. ‘‘ఎక్స్క్యూజ్ మీ. విమానంలో టీవీ ఏది?’’ వానర్ ఎయిర్ హోస్టెస్‌ని అడిగాడు. ‘‘సారీ సర్. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ఉండవు’’ ఆమె జవాబు చెప్పింది. ‘‘మొత్తానికి సాధించాం’’ కపీష్ రిలాక్స్డ్గా కూర్చుని ఆనందంగా చెప్పాడు. ‘‘గంటన్నరలో మనం దుర్యోధన్కి దూరం అయిపోతాం’’ మర్కట్ చెప్పాడు. ‘‘తెలంగాణా పోలీస్లకి కూడా! మనం ఈ డబ్బు మీద ఇన్కంటేక్స్ కట్టాలా?’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు. ‘‘వాళ్ళ జోలికి పోకూడదు. ఇన్కంటేక్స్ వారు టైస్ట్‌ల లాంటివారు. మనింటికి వచ్చి వారికేం కావాలంటే అది తీసుకెళ్తారు’’ మర్కట్ చెప్పాడు. ‘‘నీ భాగంతో ఏం చేయదలచుకున్నావు?’’ కపీష్ మర్కట్‌ని అడిగాడు. -
త్రీమంకీస్ - 75
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 75 మల్లాది వెంకటకృష్ణమూర్తి 22 శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ డిపార్చర్ లాంజ్ ముందు ఆగిన ఇన్నోవా కారులోంచి ముగ్గురు దిగారు. వారి చేతుల్లో మూడు ఎయిర్బేగ్లు ఉన్నాయి. ఒంటి మీద ఖరీదైన టీ షర్ట్లు, బూట్లు. వానర్ ఆ కొత్త వాతావరణాన్ని కొద్దిగా బెరుకుగా చూస్తూంటే కపీష్, మర్కట్లు బింకంగా ఉన్నారు. ‘‘పోర్టర్ కావాలా?’’ ఒకతను వచ్చి ఇంగ్లీష్‌లో అడిగాడు. ‘‘పెట్టెకి ఎంత?’’ వానర్ అడిగాడు. ‘‘మన దగ్గర పెట్టెల్లేనప్పుడు ఎందుకా ప్రశ్న?’’ మర్కట్ కసిరాడు. ‘‘తెలుసుకుందామని.’’ ‘‘ముంబైకి వెళ్ళే విమానం ఎక్కడ ఎక్కాలి?’’ కపీష్ అతన్ని అడిగాడు. ‘‘రండి చూపిస్తాను. మీ ఎయిర్ బేగ్స్ ఇవ్వండి’’ అతను వాటిని తీసుకోబోయాడు. ‘‘పోర్టర్ అవసరం లేదు.’’ ‘‘ఆ డోర్లోంచి లోపలకి వెళ్ళండి’’ నిర్లక్ష్యంగా చేతినెత్తి చూపించి వెళ్ళిపోయాడు. ముగ్గురూ ఓ కాలి వంతెనని దాటి ఎదురుగా ఉన్న అద్దాల తలుపు వైపు నడిచారు. యూనిఫాంలోని పోలీస్ ఆపి అడిగాడు - ‘‘టిక్కెట్, ఐడెంటిటీ ప్లీజ్.’’ వాళ్ళు టిక్కెట్ ప్రింటవుట్‌ని, ఆధార్ కార్డ్‌ని చూపించారు. అతను కపీష్ది మాత్రమే చూసి ముగ్గుర్నీ లోపలకి వదిలాడు. ‘‘పబ్లిక్ టాయ్‌లెట్‌ని ఉపయోగించడానికి ఆధార్ కార్డ్‌ని తప్పనిసరి చేసి తెలంగాణా ప్రభుత్వం మంచి పని చేసింది. లేదా ఆధార్ కార్డులని మనం తీసుకునే వాళ్ళమే కాదు’’ మర్కట్ చెప్పాడు. ‘‘భలే గుర్తు చేశావ్. ఎందుకైనా మంచిది. వానర్! నువ్వు ఓసారి బాత్రూంకి వెళ్ళి బ్లాడర్‌ని ఖాళీ చేసి రా’’ కపీష్ హెచ్చరించాడు. ‘‘అవును. లేదా వాళ్ళు విమానంలోంచి మనల్ని దింపేస్తారు’’ మర్కట్ కూడా దానికి మద్దతుని తెలిపాడు. ‘జెంట్స్ రూం’లో వానర్‌కి తన ప్రిన్సిపాల్ తారసపడ్డాడు. ‘‘ఏం ఉద్యోగం చేస్తున్నావు? అమెరికాలోనా?’’ ఆయన అడిగాడు. ‘‘లేదు సార్. ఇంకా నాకు ఉద్యోగం దొరకలేదు’’ వానర్ జవాబు చెప్పాడు. పని కానిచ్చాక వానర్ బయటికి వచ్చాడు. ప్రిన్సిపాల్ కొద్ది క్షణాల తర్వాత బయటికి వచ్చి వ్యంగ్యంగా చెప్పాడు - ‘‘నువ్వు వాష్ బేసిన్లో చేతులు కడుక్కోలేదు. కాబట్టి నిరుద్యోగిగానే ఉండిపోయావు. నేను ప్రిన్సిపాల్‌ని కాబట్టి చేతులు కడుక్కుని వచ్చాను.’’ వానర్ ఏమాత్రం తొట్రుపడకుండా జవాబు చెప్పాడు. ‘‘నిరుద్యోగి చేతులు తడవకుండా ఆ పని చేస్తాడు ప్రిన్సిపాల్ గారు.’’ వాళ్ళు ఓ క్యూలో నిలబడి కౌంటర్ దగ్గరకి వెళ్ళాక టిక్కెట్‌ని చూసి కౌంటర్లోని వ్యక్తి చెప్పాడు - ‘‘ఇది స్పైస్‌జెట్ కౌంటర్. మీరు వెళ్ళాల్సింది ఇండిగో. అటు వెళ్ళండి.’’ ముగ్గురూ మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడ్డారు. తమ వంతు వచ్చాక తమ టికెట్స్‌ని, తన ఐడెంటిటీ కార్డ్‌ని కపీష్ చూపించాడు. అతని టి షర్ట్ మీది ఇంగ్లీష్ మాటలని అతను చదివాడు. ష్! ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్లీపింగ్. ‘‘చెకిన్ బేగేజ్ ఉందా?’’ కౌంటర్లోని వ్యక్తి అడిగాడు. ‘‘సారీ?’’ అర్థంకాక కపీష్ అడిగాడు. అతను ఫస్ట్ ఫ్లయర్ అని గ్రహించిన కౌంటర్లోని వ్యక్తి ముగ్గురి దగ్గరా ఎయిర్ బేగ్స్ మాత్రమే ఉండటం చూసి అడిగాడు. ‘‘అవికాక ఇంకేమైనా సామాను ఉందా?’’ ‘‘లేదు.’’ మూడు టేగ్స్ ఇచ్చి చెప్పాడు. ‘‘వీటిని ఎయిర్ బేగ్స్కి కట్టండి. విమానంలోకి ఎక్కే దాకా ఇవి పడిపోకుండా చూసుకోండి... మీ ఐడెంటిటీ కార్డ్స్ చూపిస్తారా?’’ మిగిలిన ఇద్దర్నీ అడిగాడు. ‘‘గేట్ దగ్గర ఒక్కరిదే చూశారు?’’ ‘‘అతను తప్పు చేశాడు. నేనా తప్పు చేయకూడదు.’’ ఇద్దరూ తమ ఆధార్ కార్డ్‌లని చూపించారు. ముగ్గురి బోర్డింగ్ పాస్‌లని కపీష్‌కి ఇచ్చి, ఓ దాన్లోని బోర్డింగ్ టైం గేట్ నంబర్లని రౌండ్ చేసి చెప్పాడు - ‘‘మీ గేట్ నంబర్ ఇరవై ఒకటి. అటు వెళ్ళాలి. ఎంజాయ్ యువర్ ట్రిప్.’’ ‘‘థాంక్యూ.’’ ‘‘యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇండిగో ఫ్ల్లైట్ నంబర్ 000 డిపార్టింగ్ టు ముంబై ఈజ్ రెడీ ఫర్ ఇమీడియెట్ డిపార్చర్.’’ ముగ్గురూ సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళారు. ‘‘బూట్లు విప్పాలి’’ సెక్యూరిటీ అతను చెప్పాడు. ‘‘దేనికి? లోపల దేవుడి విగ్రహం ఉందా?’’ వానర్ అడిగాడు. ‘‘కాదు. రిచర్డ్ రెయిడ్ అనే అతను బూటులో పేలుడు పదార్థాన్ని పెట్టుకుని వెళ్ళాడు. అప్పటినించి అన్ని బూట్లని స్కానింగ్ చేస్తున్నాం’’ అతను ఓపికగా జవాబు చెప్పాడు. ‘‘ఇంకా నయం. రిచర్డ్ రెయిడ్ అండర్వేర్లో దాన్ని దాచి పెట్టుకుని వెళ్ళలేదు’’ వానర్ వెంటనే చెప్పాడు చెకింగ్ అయాక వెళ్ళి తమ గేట్‌లోని కుర్చీల్లో కూర్చున్నారు. ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా కూర్చుని సెల్ఫోన్లో ఎవరితోనో ఛాటింగ్ చేస్తోంది. ఆమె దగ్గరకి వెళ్ళి వానర్ అడిగాడు - ‘‘ఎక్స్‌క్యూజ్‌మి. మీ పక్క సీట్ ఖాళీయేనా?’’ ‘‘ఖాళీయే. మీరు కూర్చుంటే నా సీట్ కూడా ఖాళీ అవుతుంది’’ చెప్పి ఆమె మళ్ళీ ఛాటింగ్‌లో మునిగిపోయింది. -
త్రీమంకీస్ -73
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 73 - మల్లాది వెంకటకృష్ణమూర్తి 21 మర్కట్ బాబాయ్ ఇంటి ముందు ఆటో దిగిన వానర్ తలుపు మీద తట్టాడు. మర్కట్ కంఠం వినిపించింది. ‘‘ఎవరది? పోలీసా? .. ఇంత త్వరగా ఎలా కనుక్కున్నారు?’’ మర్కట్ గొంతు తగ్గించి భయంగా కపీష్‌ని అడిగాడు. ‘‘వానర్ని. తలుపు తెరవండి.’’ తలుపు తెరవగానే వానర్ లోపలకి వెళ్ళాడు. టివిలో ఆ ఉదంతమే వార్తగా ప్రసారం అవుతోంది. ముఖాన సాక్స్‌తో పరిగెత్తే వానర్ టివిలో కనపడ్డాడు. ‘‘నాకోసం ఆగకుండా కారులో ఎందుకు వచ్చేశారు?’’ వానర్ చిరుకోపంగా అడిగాడు. ‘‘నువ్వు తిరిగి ప్రాణాలతో వస్తావనుకోలేదు. ఏం జరిగింది?’’ ‘‘కొద్దిసేపు ఆగితే టివినే చెప్తుంది. నాకో కోక్ కేన్ ఇవ్వు.’’ అది ఓపెన్ చేసి ఓ గుక్క తాగి సోఫాలో పడుకుని నిస్సహాయంగా చెప్పాడు - ‘‘నా గుండె ఎన్నిసార్లు ఆగి, మళ్ళీ ఎన్నిసార్లు తిరిగి పని చేసిందో? ఈసారి కూడా ముగ్గురం విఫలం అయ్యాం. మనకి దొంగతనం చేతకాదు.’’ కపీష్ నవ్వుతూ లేచి వెళ్ళి కిచెన్‌లోని బియ్యం బస్తాలని అందుకుని నేల మీద కుమ్మరించాడు. అందులోంచి బయటకి వచ్చిన నోట్ల కట్టలని చూసి వానర్ నిర్ఘాంతపోయి, లేచి కూర్చుని, మళ్ళీ లేచి నమ్మలేనట్లుగా అడిగాడు. ‘‘ఇంత డబ్బు ఎక్కడిది?’’ ‘‘బేంక్ నించి దోచి తెచ్చిన సొమ్ము’’ మర్కట్ నవ్వుతూ చెప్పాడు. ‘‘ఇదెలా సాధ్యం?’’ ‘‘మనిద్దరిలోకీ కపీష్ తెలివిగలవాడు’’ మర్కట్ కపీష్ భుజాన్ని ఆప్యాయంగా తడుతూ చెప్పాడు. ‘‘ఇది నిజం డబ్బేనా?’’ ‘‘అవును.’’ ‘‘ఇది ఎలా దొంగిలించారు?’’ ‘‘నిన్ను ఆ దొంగలు తీసుకెళ్ళాక కపీష్ అక్కడి ఉద్యోగస్థులందరితో, బేంక్ సొమ్ము దొంగలు దోచుకోకుండా కాపాడాలని, దాన్ని సొరంగంలోంచి బయటకి తీసుకెళ్దామని చెప్పాడు. తను బేంక్ డబ్బుని కాపాడాడనే పేరు తెచ్చుకోవాలని మేనేజర్ ఆశపడ్డాడు. ఓ తాళం చెవి బేంక్ ఆఫీసర్ దగ్గర, మరొకటి హెడ్ కేషియర్ దగ్గర ఉన్నాయి. బేంక్ మేనేజర్ సూచన మేరకు వాళ్ళిద్దరూ తాళం చెవులని ఉపయోగించి బేంక్ డబ్బు దాచిన సేఫ్ లాకర్ని తెరిచారు. ఆ డబ్బుని బేంకు సిబ్బందే ఈ గోనె సంచుల్లో నీట్‌గా సర్దారు. వాటితో అంతా సొరంగంలోంచి బయటపడ్డాం. కారు దగ్గరకి తీసుకెళ్ళి అది సిఐడి కారు కాబట్టి దాని మీద పోలీస్ కారు అనే గుర్తులు ఏమీ ఉండవని చెప్తే, ఆ డబ్బుని బేంక్ ఉద్యోగస్థులే డిక్కీలో ఉంచారు. దాన్ని సమీప పోలీస్ స్ట్టేషన్కి తీసుకెళ్ళి భద్రపరుస్తామని, వారు ఇంటికి వెళ్ళి తమ వారికి కనపడి, సాయంత్రం ఐదున్నరకి పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ని ఇవ్వమని, టివి వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకుని రమ్మని చెప్తే నమ్మి వెళ్ళిపోయారు. అప్పటికే వారు మానసికంగా అలసిపోవడంతో సరిగ్గా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు తమ ఇళ్ళల్లోని తమ వాళ్ళ ముందు హీరోలుగా ఫీలవుతూ సాయంత్రం వేసుకురావాల్సిన బట్టలని ఇస్త్రీ చేయించుకుంటూండి ఉంటారు’’ ‘‘దట్స్ గుడ్’’వానర్ పకపక నవ్వాడు. తర్వాత ఒంగి ఓ కట్టని అందుకుని దాని వంక చూశాడు. వెంటనే అతని మొహం పాలిపోయింది. ‘‘గురూ! ఇవన్నీ దొంగ నోట్లు. వందకి ఒకటి పక్కన రెండు సున్నాలు ఉండాలిగా? వీటికి మూడు సున్నాలు ఉన్నాయి.’’ ‘‘నువ్వు ఇంతదాకా వెయ్యి రూపాయల నోట్‌ని చూడలేదా?’’ మర్కట్ నవ్వుతూ అడిగాడు. ‘‘లేదు. వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయా?.’’ ‘‘వెయ్యి నోట్‌నే ఇంతదాకా నువ్వు చూడలేదంటే తెలంగాణా ఆహార భద్రతా పథకానికి కార్డు ఉన్నా, లేకపోయినా నువ్వు అర్హుడివి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. అంత డబ్బుని ఎన్నడూ చూడని ఆ ముగ్గురూ ఆనందాన్ని పట్టలేక గట్టిగా అరుస్తూ ఆ నోట్ల కట్టలని ఒకరి మీదకి మరొకరు వేసి కొట్టుకుంటూ, గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పగలబడి నవ్వసాగారు. ఆనందం తీరాక ఆ కట్టలన్నిటినీ మూడు భాగాలుగా విభజించారు. ముగ్గురూ విడివిడిగా లెక్క పెట్టుకున్నాక మర్కట్ ఆనందంగా చెప్పాడు. ‘‘వావ్! మనం కోటీశ్వరులం అయ్యాం.’’ డబ్బు కట్టల పక్కన నిలబడి ఒకొక్కరూ ఫొటోలు తీసుకున్నారు. ‘‘రండి. ముగ్గురం కలిని తీసుకుందాం’’ వానర్ మిత్రులు ఇద్దర్నీ ఉత్సాహంగా పిలిచాడు. ‘‘దీన్ని నీ ఎఫ్‌బిలో పోస్ట్ చేయక’’ మర్కట్ వానర్‌కి హెచ్చరికగా చెప్పాడు. ‘‘రేపు మన ఫొటోలు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తాయి’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్:sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -72
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 72 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సరే. కాల్చక... వాళ్ళు నన్ను లోపలకి రమ్మంటున్నారు. నైస్ మీటింగ్ యు ఆల్ పోలీస్ అండ్ సిటిజన్స్ అండ్ టివి ఆడియెన్స్. మళ్ళీ కలుద్దాం’’ చెప్పి వానర్ అటూ ఇటూ చూశాడు. ‘‘నీ బస్ ఆలోచన మాకు అవసరం లేద వార్. త్వరగా రా’’ నాయకుడు కోరాడు. ‘‘ఎందుకని? మీకు ఇంకో దారి లేదుగా?’’ ‘‘ఎందుకంటే బందీలుగా తీసుకుందామనుకున్న ఉద్యోగస్థులంతా పారిపోయారు.’’ ‘‘ఓ! సొరంగం లోంచా?’’ వానర్ అనాలోచితంగా చెప్పాడు. ఆ మాటని వినగానే ఆ ఆరుగురు దొంగలు ముందు ఒకరి మొహాల వంక మరొకరు చూసుకున్నారు. తర్వాత వానర్ వంక లేడిని చూసే సింహాల్లా చూశారు. ‘‘సొరంగం? దాని గురించి నీకు ముందే తెలుసా?’’ ‘‘కొద్దిగా. దాన్ని తవ్విన వాళ్ళు నాకు తెలుసు. దాంట్లో వచ్చిన వారికన్నా కొద్దిగా ముందుగా మీరు వచ్చారు’’ వానర్ చెప్పాడు. ‘‘కాని దాని గురించి నువ్వు మాట మాత్రంగానైనా చెప్పలేదే?’’ ‘‘నేను అడక్కుండా ఎవరికీ ఏదీ చెప్పను. మీరు అడగాల్సింది.’’ ‘‘ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని తవ్వింది నువ్వే. నువ్వు దాంట్లోంచే లోపలకి వచ్చావు. అవునా?’’ ‘‘అవును.’’ ‘‘సరే.’’ దొంగల నాయకుడు తన రెండు తుపాకులని వానర్‌కి గురి పెట్టాడు. ‘‘కాల్చకు. ఇతనొక్కడే మన బందీ. అతన్నీ లేకుండా చేయకు. తర్వాత చంపుదాం’’ ఓ దొంగ అరిచాడు. ‘‘సరే. ఇతను మనకి చేసింది నేను మర్చిపోను. ఇతనితో పనయ్యాక మీరూ మర్చిపోకూడదు.’’ దొంగలు తమలో తాము మాట్లాడుకుంటూంటే వానర్‌కి తను వారికి మామూలు బందీ కాదని, బేంక్‌లోంచి తప్పించుకున్నాక వారి గుళ్ళకి తను బలవుతానని అనిపించింది. తనని వాళ్ళు లోపలకి పిలిచాక ఆ సొరంగంలోంచి బయటకి వెళ్ళబోయే ముందు కాల్చి చంపి వెళ్తారు. పోలీసులు తనూ బందీ అనుకుని వెంటనే బేంక్‌లోకి రారు. ఈ దొంగలు కాపలా లేని జైలు గేటులోంచి కూడా బయటకి వెళ్ళలేని మూర్ఖులు, తను వీళ్ళతో ఉంటే అన్ని విధాల ప్రమాదం అనుకున్నాడు. ‘‘ముందుగా మనం చేయాల్సింది...’’ వానర్ ఆగాడు. ‘‘మనం? ఎప్పట్నించి నువ్వు మాలో ఒకడివి అయ్యావు?’’ నాయకుడు ప్రశ్నించాడు. ‘‘మీరు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పటి నించి. ముందుగా మనం చేయాల్సింది...’’ ‘‘ఆగు. మేమేం చేయాలో నువ్వు మాకు చెప్పకు. అది మాకు తెలుసు’’ నాయకుడు అది అవమానంగా భావించి అరిచాడు. ‘‘నేను ఒక్కడ్నే మీ బందీని. నేనూ లేకుండా చేసుకోకండి. ఇంతదాకా మిమ్మల్ని గమనించాను కాబట్టి మీరు తప్పించుకోడానికి నేనొక్కడ్నే మీ ఆశ. ముందుగా స్ట్రాంగ్ రూం తలుపుని మూసేయండి.’’ ‘‘అందులోని వారంతా తప్పించుకున్నాకా?’’ ‘‘అది టు వే టన్నెల్ అని మర్చిపోకండి.’’ ‘‘టు వే టన్నెల్?’’ ‘‘అవును. లోపల నించి బయటకి వెళ్ళచ్చు బయటి నించి లోపలకి రావచ్చు కూడా. దాని గురించి పోలీసులకి ఇంకా తెలీదు. తలుపు మూసేస్తే స్ట్రాంగ్ రూంలోకి వచ్చినా అందులోంచి మీ దగ్గరకి రాలేరు. ఈలోగా మీరు తప్పించుకోవచ్చు.’’ వారంతా అతను చెప్పేది ఆలోచనగా విన్నారు. అర్థం కాగానే అకస్మాత్తుగా అంతా లాకర్ రూం వైపు పరిగెత్తారు. అంతా. నాయకుడు మాత్రం వానర్ వైపు తుపాకీని కాల్చసాగాడు. చేతులు దింపి వానర్ రోడ్డు మధ్యకి ఒంగొని పరిగెత్తాడు. అతని చుట్టుపక్కల నేల మీద గుళ్ళు తాకిన గుర్తుగా దుమ్ము లేస్తోంది. ‘‘నువ్వు మా వైపు రా’’ స్పీకర్లోంచి వినిపించింది. సగం దూరం వెళ్ళాక వీధి చివరికి పరిగెత్తుతూ అరిచాడు - ‘‘బేంక్‌లోని బాధితులు సొరంగంలోంచి తప్పించుకున్నారు. రైట్ టైం వాచీల షాపులోంచి వాళ్ళు బయటకి వస్తారు. బేంక్‌లో కేవలం దొంగలే మిగిలారు. వెళ్ళండి. ఉస్కో.’’ పోలీసులకి అతని మాటలు కొద్ది క్షణాలు అర్థం కాకపోయినా కొందరు తుపాకులతో బేంక్‌లోకి, మరికొందరు ఆ వాచీ షాపు వైపు పరిగెత్తారు. లోపల నించి కాల్పులు లేవు. తెల్ల కోటులోని ఓ డాక్టర్ అంబులెన్స్ పక్క నించి వెళ్ళే వానర్‌తో చెప్పాడు - ‘‘అంబులెన్స్ లోకి రా. నీ బీపీని చెక్ చేస్తాను.’’ వానర్ ఆగలేదు. ముఖానికి ఉన్న సాక్స్‌ని తొలగించి గుంపులుగా చేరి చూస్తున్న మనుషుల్లో కలిసిపోయాడు. మూసేసిన రైట్ టైం గడియారాల షాపు పక్క నించి కారు పార్క్ చేసిన చోటికి బాణం నించి వదిలిన విల్లులా పరిగెత్తాడు. అక్కడ అది లేదు. కొద్ది దూరం వెళ్ళాక ఓ బోర్డ్, ఓ ఆటో కనిపించాయి. బోర్డ్ మీద ఇలా రాసి ఉంది - ‘రెస్ట్రిక్టెడ్ ఏరియా డెడ్ బాడీస్ నాట్ టు బి టేకెన్ ఆన్ దిస్ రోడ్ ఎయిదర్ ఆన్ ఫుట్ ఆర్ ఇన్ అంబులెన్స్’ ‘‘పోనీ’’ ఆటోలోకి ఎక్కి వానర్ చెప్పాడు. ‘‘అరవై రూపాయలు అవుద్ది’’ వాడు ఎక్కడికో తెలుసుకోకుండానే అలవాటుగా చెప్పాడు. ‘‘అలాగే పోనీ’’ చెప్పి వానర్ సీట్లో వెనక్కి వాలి తన అరచేతిని గుండెకి ఆనించి అది కొట్టుకుంటోందో లేదో చెక్ చేసుకున్నాడు. - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ డిసెంబర్ 26 సీరియల్‌కి వేసిన బొమ్మ బాపు బొమ్మని గుర్తుకు తెచ్చింది. సీత, రమ్య, స్వచ్ఛ, రుధిర, వైతరణి, మూలిక విలక్షణమైన ఈతరం పాత్రలు. త్రీ మంకీస్ నేటి తరానికి నచ్చే విలక్షణమైన హాస్య సీరియల్ అనడంలో సందేహం లేదు. - రాధేశ్యాం, చినగంజాం పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్ననైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాల్పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -71
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 71 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘కాదు. ఇప్పుడు నీకు కుడి వైపు’’ లోపల నించి నాయకుడి కంఠం అసహనంగా వినిపించింది. ‘‘నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇటు వైపేగా?’’ వానర్ వెనక్కి తిరిగి కుడి చేతిని చూపిస్తూ అడిగాడు. ‘‘కాదు. వెనక్కి తిరిగితే చంపేస్తాం. నీ ఎడమ చేతి వైపు’’ నాయకుడు గొంతు చించుకుని అరిచాడు. ‘‘ఎటు వైపు? మేం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కుడి వైపా? ఎడమ వైపా?’’ స్పీకర్లోంచి వినిపించింది. వెంటనే నాయకుడు వానర్ని కాల్చడానికి తుపాకీని గురి పెట్టాడు. ఇంకో దొంగ అతన్ని వారిస్తూ చెప్పాడు - ‘‘వాడు మూర్ఖుడు. వాడ్నేం చేయకు. రెండువైపులా అని చెప్పు. వీధికి రెండువైపులా ఉన్న పోలీస్ వేన్‌లని తీయమని చెప్పు.’’ ‘‘రెండు వైపులా అని చెప్పు’’ రెండో దొంగ సూచించాడు. అది విన్నాక పోలీస్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇంకేమిటి?’’ ‘‘ఇంకేమిటి?’’ వానర్ వెనక్కి తిరగకుండా అడిగాడు. ‘‘నాకు స్పీకర్లోంచి అన్ని మాటలు వినిపిస్తున్నాయి వార్. నువ్వు నాకు మళ్ళీ చెప్పక్కర్లేదు.’’ ‘‘అర్థమైంది. నేను రిపీట్ చేయకూడదు. నేను ఇంక లోపలకి రావచ్చా?’’ వానర్ అడిగాడు. ‘‘అప్పుడే కాదు. మాకో వేన్ కావాలి. లెవెన్ సీటర్. మా వెంట ముగ్గురు ఉద్యోగస్థుల్ని బందీలుగా తీసుకెళ్తాం. మా బండిని ఎవరూ అనుసరించకూడదని చెప్పు.’’ ‘‘లెవెన్ సీటరా? ష్యూరా?’’ వానర్ అడిగాడు. ‘‘ష్యూరా ఏమిటి?’’ వానర్ గొంతు తగ్గించి చెప్పాడు - ‘‘వాళ్ళేం చేస్తారో తెలుసా? ఇలాంటి సందర్భాల్లో వాహనం కింద ఓ చిన్న రేడియో ట్రాన్స్మిటర్ని అమరుస్తారు. అందువల్ల వారు భౌతికంగా మిమ్మల్ని అనుసరించకపోయినా మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది.’’ ‘‘ఐతే వాళ్ళకి నువ్వు అదే చెప్పు. ట్రాన్స్మిటర్స్ని అమర్చకూడదు. లేదా బందీలని చంపేస్తాం.’’ ‘‘ఐనా...’’ వానర్ అనుమానంగా ఆగాడు. ‘‘ఏమిటి నీ అనుమానం? నువ్వు వార్తాహరుడివి మాత్రమే. నా పని నాకన్నా నీకు బాగా తెలుసని అనుకుంటున్నావా?’’ నాయకుడు కోపంగా అడిగాడు. ‘మీకన్నా నాకు బాగా తెలుసు’ వానర్ వాళ్ళకి వినపడకుండా గొణిగాడు. ‘‘ఎలాంటి హింసా లేకుండా అంతా మృదువుగా సాగాలన్నదే నా కోరిక. రక్తపాతం కూడదనుకుంటే ఇంకో ఆలోచన చెప్పనా?’’ వానర్ అడిగాడు. ‘‘సరే వార్. నువ్వే తెలివి గలవాడివి. అదేమిటో ఏడు’’ నాయకుడు అసహనంగా చెప్పాడు. ‘‘మీరు ఎలా పారిపోవాలో నిజంగా చెప్పమంటారా?’’ వానర్ అడిగాడు. ‘‘చెప్పు.’’ ‘‘నన్ను మీ స్థానంలో ఊహించుకుని ఆలోచిస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అనిపిస్తోంది.’’ ‘‘అది మాకూ తెలుసు.’’ ‘‘మీరేం చేయాలో చెప్తాను. అక్కడ ఆగి ఉన్న బస్ని ఇవ్వమని కోరండి. దాన్ని వాళ్ళు మీకు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల దాంట్లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని కాని, టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్ కాని...’’ ‘‘ఆగాగు. ఏమిటది?’’ ‘‘టైం రిలీజ్ టియర్ గేస్ గ్రనేడ్. మీరు బయల్దేరిన కొద్దిసేపటికి ఆ గ్రనేడ్ పేలి లెవెన్ సీటర్ నిండా టియర్ గేస్ అలుముకుంటుంది. మీరు తప్పక దిగాలి. దిగిన మిమ్మల్ని కాల్చి చంపుతారు. లేదా పట్టుకుంటారు.’’ ‘‘ఓ మై గాడ్! నీకు ఇదంతా ఎలా తెలుసు?’’ నాయకుడు నివ్వెరపోయాడు. ‘‘దొంగతనం చేయబోయే ముందు మీరు గూగుల్‌లో ప్రికాషన్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకూ తెలుస్తుంది. ఆ బస్‌లోకి బందీలని ఎక్కించుకున్నాక మీలోని ఒకరు దాన్ని డ్రైవ్ చేస్తూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతానికి చేరుకోండి. ఏ ఆధార్ కార్డ్ జారీ కేంద్రానికి కాని, ఎరువులు అమ్మే దుకాణం ముందుకి కాని వెళ్తే చాలు. అక్కడ బస్ని ఆపి దిగి అంతా తలో దిక్కూ పారిపోండి.’’ ‘‘అందువల్ల ఏమిటి లాభం?’’ నాయకుడు అడిగాడు. ‘‘మీరు మొహం మీది తొడుగుల్ని తొలగించి ఆయుధాలని బస్‌లోనే వదిలి పారిపోతే, మీరూ బందీలని అంతా అనుకుంటారు. ఆ రద్దీలో కలిసిపోతే ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు.’’ ‘‘ఇది బావుంది. నువ్వు మూర్ఖుడివి కావు. తెలివి గలవాడివే. తర్వాత?’’ ‘‘తర్వాత?’’ ‘‘ఆ తర్వాత ఏమిటి?’’ ‘‘ఓ! ఆ తర్వాత స్వేచ్ఛ. మరో దొంగతనం. ఈసారి మరింత పటిష్టంగా పథకం వేసుకోవాలి. నా మిత్రుడు కష్ కొంత రుసుముకి మీకు సహాయం చేస్తాడు.’’ ‘‘నీతో పనైంది. ఇంక లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘కాని నేను లోపలకి వస్తే మీరు నన్ను...’’ ‘‘... ముందు వెంటనే లోపలకి రా’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘నేను లోపలకి రావడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలి అనుకుంటా. దాన్ని మీరు అడిగినట్లుగా అడగనా? లేక నా అంతట నేనే అడిగినట్లు అడగనా?’’ ‘‘ఈ క్షణమే రా. నా మూడ్ సరిగ్గా లేదు. కాల్చేస్తాను’’ నాయకుడు కఠినంగా చెప్పాడు. ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com పాఠకులకు ఆహ్వానం! ‘ఈ కాలమ్ మీదే’ అనే కొత్త చర్చావేదికను సాక్షి ‘ఫ్యామిలీ’ త్వరలో ప్రారంభించబోతోంది. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నైనా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిని ఫ్యామిలీ ప్రచురిస్తుంది. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది. వెంటనే రాసి పంపండి. చర్చలో పాలు పంచుకోండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
త్రీమంకీస్ -70
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 70 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘సెలైన్స్. నాకున్నది ఒకే చెవి. నేను దొంగలు మాట్లాడేది విననా? పోలీసులు మాట్లాడేది విననా? లేక మీ కంఠాలు విననా? పోనీ మీలో ఒకరు ఇక్కడికి రండి. నేను మీ బదులు అక్కడ నించుని అరుస్తాను’’ వానర్ కోపంగా అరిచాడు. తర్వాత దొంగల వైపు తిరిగి అడిగాడు - ‘‘నేను లోపలకి రావచ్చా?’’ ‘‘మా డిమాండ్స్‌ని నీ ద్వారా పోలీసులకి చెప్పాక.’’ ‘‘సంతోషం. కాని నా ముందు, వెనకా కూడా తుపాకులు నాకు గురిపెట్టబడి ఉన్నాయి. నేను అర్జెంట్‌గా బాత్రూంకి వెళ్ళాలి. దీర్ఘశంక... టాయ్‌లెట్.’’ ‘‘ఖాళీ లేదు. మా వాడూ అదే పనిలో ఉన్నాడు. ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాం. అసలు పని పూర్తయ్యేదాకా కదలక’’ నాయకుడు అరిచాడు. ‘‘కాని సినిమాల్లో ఇలాంటివి ఫోన్ ద్వారా చర్చించడం చూశాను.’’ ‘‘మాకే పాఠాలు చెప్తున్నావా? మేమో పొరపాటు చేశాం. ఇందాక మేం భయంతో తుపాకీని కాల్చినప్పుడు గుళ్ళు తగిలి లేండ్ లైన్ ఫోన్ పాడైంది. సెల్ నించి కుదరదు. బేంక్‌కి సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఆ ఫోన్ మా నించే అనే గేరంటీ వాళ్ళకి ఉండదుగా.’’ ‘‘మీ నంబర్ చెప్తే దానికి చేయమని వాళ్ళకి చెప్తాను.’’ ‘‘మమ్మల్ని ఇంకా ఇరికించడానికా? ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘మర్చిపోయాను. సారీ. కాని రోడ్డుకి అవతల రెండు వందల మందికి పైనే గుమిగూడి ఉన్నారు. వాళ్ళందరి ముందూ అపరాధిలా చేతులు ఎత్తడం నాకు సిగ్గుగా ఉంది. దింపుతాను.’’ దొంగలు మళ్ళీ కొద్దిసేపు చర్చించుకున్నాక అడిగారు - ‘‘టివి వాళ్ళు వచ్చారా?’’ ‘‘తెలుగు, ఇంగ్లీష్, హిందీ... అన్ని ఛానల్స్ వాళ్ళూ వచ్చారు.’’ ‘‘సరే. మేం చెప్పిన మాట వినకపోతే నీ పేంట్, షర్ట్, ఉంటే అండర్‌వేర్‌ని నువ్వు విప్పాల్సి ఉంటుంది జాగ్రత్త.’’ ‘‘ఒద్దొద్దు. దాని బదులు కాల్చండి.’’ ‘‘వార్! నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అని తెలీక ఆటలాడుతున్నావు. వాళ్ళకి మా డిమాండ్స్ చెప్పు.’’ ‘‘సరే.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి గట్టిగా చెప్పాడు - ‘‘వాళ్ళు తమ డిమాండ్స్‌ని చెప్పమంటున్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్‌ని నేను చెప్తున్నాను. అంటే నా ద్వారా చెప్తున్నారు తప్ప నా డిమాండ్స్ కావు.’’ ‘‘మేము వినడానికి సిద్ధం వార్. కాని లోపల ఎవరికీ హాని జరక్కపోతేనే ఆలోచిస్తాం అని చెప్పు’’ లౌడ్ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘గుడ్. అది సమంజసం. తెలివైన నిర్ణయం. మీరు చెప్పేది నాకు నచ్చింది’’ వానర్ బదులు చెప్పాడు. ‘‘షటప్! షటప్!’’ లోపల నించి నాయకుడి కంఠం వినిపించింది. ‘‘కాల్చక! నా అభిప్రాయం చెప్పానంతే.’’ ‘‘మా డిమాండ్స్ తప్ప నీ అభిప్రాయాల్ని చెప్పక. ముందు చుట్టుపక్కల మేడల మీది షార్ప్ షూటర్స్‌ని తొలగించాలని కోరుతున్నాం అని చెప్పు’’ నాయకుడు ఆజ్ఞాపించాడు. ‘‘తప్పకుండా. మంచి ఆలోచన... మేడల మీది గన్‌మెన్‌ని వెంటనే తొలగించాలన్నది మొదటి డిమాండ్. ఇది చెప్పేది నేను కాదు... నేనే కాని నేను కాదు... అంటే నా ద్వారా అని! అర్థమైందా?’’ ‘‘అయింది. ఇంకా?’’ వానర్ బేంక్ తలుపు వైపు చూస్తూ అడిగాడు. ‘‘ఇంకా?’’ ‘‘వెంటనే వాళ్ళు బేంక్‌కి కుడివైపు వీధి చివర ఆపిన పోలీస్ వేన్‌లని తొలగించాలి.’’ వానర్ ఆలోచించి అడిగాడు - ‘‘నా కుడివైపా?’’ ‘‘కాదు. మా కుడి వైపు.’’ ‘‘సరే.’’ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘దొంగలు తమ కుడివైపు వీధి చివర ఆగి ఉన్న పోలీస్ వేన్‌లని వెంటనే తొలగించమని డిమాండ్ చేస్తున్నారు.’’ ‘‘వాళ్ళు మాకు కనపడటం లేదు. వారి కుడి చేతిని చూపించమనండి.’’ ‘‘వాళ్ళని బయటకి రమ్మననా?’’ కపీష్ అడిగాడు. ‘‘రమ్మను.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరగ్గానే లోపల నించి నాయకుడి కంఠం కోపంగా ఉపయోగించింది - ‘‘మేము రాం. మేం అడిగింది తప్ప ఇంకోసారి ఎక్స్ట్రా మాట్లాడితే కాల్చేస్తాం. నీ కుడి వైపు అని చెప్పు.’’ ‘‘ఇటు వైపా?’’ కుడి చేతిని చాపి అడిగాడు. ‘‘అవును.’’ వానర్ మళ్ళీ వెనక్కి తిరిగి చెప్పాడు. ‘‘క్షమించాలి. వాళ్ళు బయటకి రారట. ఇటువైపు వాహనాలని వెంటనే తొలగించమని డిమాండ్’’ తన కుడి చేతిని చాపి చూపిస్తూ చెప్పాడు. నాయకుడు తల పట్టుకుని చెప్పాడు. ‘‘ఇప్పుడు నీకు ఎడం వైపు అని చెప్పు.’’ ‘‘నా ఎడం వైపు’’ వానర్ తన ఎడమ చేతిని కూడా చాపి చెప్పాడు. ‘‘అంటే రెండు వైపులానా?’’ స్పీకర్లోంచి వినిపించింది. ‘‘కాదు. ఒక వైపు. ఇప్పుడు నాకు ఎడం వైపు. కదా?’’ వెనక్కి తిరిగి అడిగాడు. -
త్రీమకీస్ -69
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 69 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అర్థమైందా?’’ నాయకుడు అడిగాడు. ‘‘అయింది.’’ వానర్ ఓసారి కాలర్ సర్దుకుని తలుపు వైపు నడిచాడు. ‘‘మేము గమనిస్తూనే ఉంటాం. జాగ్రత్త’’ నాయకుడు హెచ్చరించాడు. వానర్ బయటకి నడిచి చేతులు పెకైత్తి గట్టిగా అరిచాడు - ‘‘కాల్చకండి. నేను దొంగల్లో ఒకర్ని కాదు.’’ చుట్టూ చూశాడు. ఆ వీధిలో కొన్ని పోలీస్వేన్లు, ఓ బస్ అటు, ఇటు నిలబడి ఆ రోడ్ని రెండుపక్కలా మూసేశాయి. నాలుగైదు పోలీస్కార్లు ఎదురుగా ఆగి ఉన్నాయి. వాటి వెనక దాక్కున్న పోలీసుల చేతుల్లోని తుపాకీ గొట్టాలు వానర్ వైపు గురిపెట్టి ఉన్నాయి. అంతా తన వంకే చూస్తున్నారని వానర్ గ్రహించాడు. చుట్టుపక్కల మేడల మీద టెలిస్కోప్స్ అమర్చిన గన్స్‌తో పోలీసులు ఉన్నారని కూడా గ్రహించాడు. రెండు అంబులెన్స్‌లు, పక్కనే తెల్ల కోట్లు ధరించిన వైద్యులు కనిపించారు. ఓ పోలీస్ అధికారి అతన్నే జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వానర్ బేంక్‌లోని దొంగలతో చెప్పాడు - ‘‘మీరూ కాల్చకండి. మీ డిమాండ్స్ గురించి మాట్లాడాలిగా!’’ ‘‘నువ్వెవరు?’’ లౌడ్ స్పీకర్లోంచి పోలీస్ అధికారి కంఠం వినిపించింది. ‘‘నేను మనిషిని.’’ ‘‘కన్ఫ్యూజ్ అవక. భయపడక. నేనడిగింది నువ్వు బేంక్ కస్టమర్‌వా లేక ఉద్యోగివా అని’’ మళ్ళీ వినపడింది. ‘‘ఆ రెండూ కాదనుకుంటా.’’ ‘‘సరే. నీ పేరు?’’ ‘‘వార్. ఆంగ్లో ఇండియన్ని.’’ కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అదే కంఠం స్పీకర్లోంచి వినిపించింది - ‘‘లోపల ఎలా ఉంది?’’ ‘‘అంతా బావుంది. తుపాకీ గుళ్ళతో లోపల రంధ్రాలు పడి కొన్ని పెచ్చులు నేల మీద పడ్డాయి. తర్వాత స్వచ్ఛభారత్ వాలంటీర్లని పిలిపించండి.’’ ‘‘ఎవరికైనా హాని జరిగిందా?’’ ‘‘లేదు. వీళ్ళు అహింసా సిద్ధాంతం గల దొంగలు.’’ ‘‘కాదని చెప్పు’’ లోపల నించి అతనికి వినిపించింది. ‘‘ముందు అందరి మానసిక వత్తిడిని తగ్గించాలని, అది ముఖ్యం అని అలా చెప్పాను. ఇంత దాకా మీరు ఎవరికీ హాని చేయలేదని వాళ్ళకి తెలిస్తే మీ మీద గౌరవం కలుగుతుంది’’ వానర్ చెప్పాడు. దొంగలు ఒకరితో మరొకరు చర్చించుకున్నాక నాయకుడు కసిరాడు - ‘‘పెరగాల్సింది గౌరవం కాదు. భయం’’ అని! ‘‘లోపల అసలేం జరిగింది?’’ పోలీస్ ఆఫీసర్ అడిగాడు. ‘‘నేను ఇప్పుడే లోపలకి వచ్చాను. కాబట్టి నాకు తెలీదు.’’ ‘‘ఇప్పుడే వచ్చావా వార్? బేంకులోకి దొంగలు ప్రవేశించిన రెండున్నర గంటల నించి నువ్వు అక్కడ ఉన్నావు.’’ ‘‘అవునవును. రెండున్నర గంటలూ రెండున్నర నిమిషాల్లా గడిచిపోయాయని చెప్పదలచుకున్నాను’’ వానర్ చెప్పాడు. ‘‘చేతులు దించి మా వైపు రా. మేం కాల్చం.’’ వానర్ చేతులు దింపి చెప్పాడు. ‘‘నొప్పిగా ఉంటే దింపా తప్ప మీరు దింపమన్నందుకు కాదు. నేను పేవ్మెంట్ దిగితే దొంగలు నన్ను కాల్చేస్తారు. వీరు అహింసావాదులు కారు. హింసావాదులు అని చెప్పమన్నారు.’’ ‘‘ఇక్కడ బేంక్ ఉద్యోగస్థులు, కస్టమర్ల బంధుమిత్రులు ఆదుర్దాగా ఉన్నారు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి వారి అనుమతి తీసుకుని ఇక్కడికి రా. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు.’’ దొంగలు మళ్ళీ ఒకళ్ళని మరొకరు సంప్రదించుకున్నారు ‘‘వార్! వార్!’’ లోపల నించి వినిపించింది. ‘‘ఏమిటి?’’ వెనక్కి తిరిగి అడిగాడు. ‘‘వాళ్ళెవరు - చేతులు దింపమనడానికి? చేతులు పెకైత్తే ఉంచు. లేదా...’’ వెంటనే వానర్ చేతులు పెకైత్తి చెప్పాడు - ‘‘ఎత్తకపోతే దొంగలు కాల్చేస్తామంటున్నారు. వాళ్ళు హింసావాదులు.’’ ‘‘నీకు చెవుడా, ఇందాకటి నించి పిలుస్తూంటే? ఇంకోసారి మేం చెప్పింది నీకు వినపడకపోతే నీ కాళ్ళ మీద కాలుస్తాం. నువ్వు రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతూ మా డిమాండ్స్ చెప్తావో లేక నించుని చెప్తావో నీ ఇష్టం’’ లోపల నించి నాయకుడు అరిచాడు. వెంటనే వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులు వేసి చెప్పాడు. ‘‘సారీ! వినపడలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే నా పరిస్థితి అర్థం అవుతుంది. వాళ్ళలా లౌడ్ స్పీకర్లో చెప్తారా? అది మీ డిమాండ్ అని అడగనా?’’ ‘‘ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘ఓ! సారీ. మరిచాను.’’ వెంటనే రోడ్డు అవతల గుమిగూడిన వారి నించి ప్రశ్నలు గట్టిగా వినపడ్డాయి - ‘‘మా వారెలా ఉన్నారు?... మా కూతురు ఎలా ఉంది?... ఎర్ర షర్ట్‌లోని బట్టతలాయనకి ఇంకా ఏం కాలేదుగా?’’ (దొంగలు పెట్టిన డిమాండ్స్...?) -
త్రీమంకీస్ - 68
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 68 - మల్లాది వెంకటకృష్ణమూర్తి కదిలితే వాళ్ళు తమని కాల్చచ్చనే భయంతో గదిలోని ప్రతి ఒక్కరూ నిశ్చలంగా నిలబడ్డారు. ఎవరూ మాట్లాడకపోయినా వారి నాయకుడు గట్టిగా అరిచాడు. ‘‘షటప్! మాట్లాడితే కాల్చేస్తాను.’’ వెంటనే బేంక్ మేనేజర్ ముక్కు మీద వేలు వేసుకున్నాడు. ‘‘బయట పోలీసులు ఉన్నారు. మేం బేంక్ దోపిడీకి వచ్చినట్లు ఎలా తెలిసింది?’’ ఎవరూ మాట్లాడక పోవడంతో టీ అమ్మే కుర్రాడు చెప్పాడు - ‘‘ఆలస్యం చేస్తే మా టీ షాప్ ఓనర్ నన్ను ఉద్యోగం లోంచి తీసేస్తాడు. నన్ను వెళ్ళనీండి.’’ ‘‘అర్థమైంది. మీ ఓనరే పోలీసులకి కబురు చేసి ఉంటాడు. పోలీసులతో ఎవరైనా మాట్లాడాలి.’’ నాయకుడు అందర్నీ పరీక్షించి చూశాడు. అతని దృష్టి వానర్ మీద నిలిచింది. ‘‘ఏమిటి మొహం నిండా ఆ దుమ్ము?’’ అడిగాడు. ‘‘భయంతో నాకు చెమటలు పడుతూంటే ఈమె హేండ్ బేగ్‌లోని పౌడర్ తీసి రాసుకున్నాను’’ వానర్ నిర్భయంగా చెప్పాడు. మానసిక ఒత్తిడిలో ఉన్న ఆ నాయకుడు దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు. ‘‘నీ పేరేమిటి?’’ అడిగాడు. ‘‘వార్.’’ ‘‘అదేం పేరు?’’ ‘‘మేము ఆంగ్లో ఇండియన్స్..’’ ‘‘సరే. నాతో రా.’’ వానర్ తలుపువైపు నడుస్తూ మిగిలిన వారి వంక చూశాడు. అసిస్టెంట్ మేనేజర్ పొడవు అకస్మాత్తుగా నాలుగు అడుగులు తగ్గడం గమనించాడు. అతను అందరి వెనకా దాక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. చిన్నగా లేడీ క్లర్క్‌కి కన్ను కొట్టాడు. ఓ దొంగ స్ట్రాంగ్ రూమ్ తలుపుని బయటి నించి మూసి గడియపెట్టాడు. ముందు వానర్, వెనక అతన్ని అనుసరించే ముగ్గురూ బేంక్ హాల్లోకి నడిచారు. అక్కడ మొహాలకి తొడుగులు ఉన్న ఇంకో ముగ్గురు సబ్‌మెషీన్ గన్స్‌తో కనిపించారు. నేల మీదంతా కాగితాలు చెల్లాచెదురుగా, చెత్త బుట్టలు, ఫ్లవర్ వేజ్‌లు తలకిందులుగా పడి ఉన్నాయి. గోడ మీద తుపాకీ గుళ్ళు దిగిన రంధ్రాలు ఐదారు కనిపించాయి. వాటి పెచ్చులు కింద రాలిపడ్డాయి. అదృష్టవశాత్తు నేల మీద ఎక్కడా శవాలు కనపడలేదు. గోడ గడియారం ఐదుంపావు చూపిస్తోంది. వానర్ లెక్క ప్రకారం ఆ సరికి బేంక్ మూసేసి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. కాని బేంక్ దొంగలు బేంక్‌ని దోచుకోడానికి తమ ముహూర్తాన్నే ఎన్నుకుని వాళ్ళని ఆపేయడంతో తమ పథకం దెబ్బతినడం వానర్ని బాధించింది. అతని వీపుకి వెనక నించి తుపాకీ గొట్టం బలంగా గుచ్చుకుంది. ‘అవర్ స్పెషల్ గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్’ అనే పోస్టర్‌కి ఆనుకుని నిలబడ్డ ఓ వ్యక్తి చెప్పాడు. ‘‘నువ్వు ఇప్పుడు బయటకి వెళ్ళాలి. పోలీసులు నిన్ను దొంగగా భావించి కాలుస్తారో లేదో చూడాలి.’’ ‘‘కాని నేను దొంగని కానుగా’’ వానర్ భయంగా చెప్పాడు. ‘‘ఆ విచక్షణ నీకుంది. వాళ్ళకి ఉందా, లేదా అని తెలుసుకోడానికే. నిన్ను కాల్చకపోతే మా తరఫున మా డిమాండ్స్‌ని నువ్వు వినిపించాలి.’’ ‘‘అప్పుడు నేను మీలో ఒకణ్ణని భావించి కాల్చచ్చుగా?’’ వానర్ రెట్టింపు భయంతో అడిగాడు. ‘‘నీ పేరేమిటి?’’ ‘‘వార్. ఆంగ్లోఇండియన్ని.’’ ‘‘మేం లోపల. పోలీసులు బయట. ఇలా ఎంతకాలం ఉండగలం? కాబట్టి మేము పారిపోయే ఏర్పాట్లు చేయడం మొదలెట్టాలి. బయటకి నడు.’’ కాళ్ళు ఒణికి పడిపోబోతున్న వానర్ని వెనక నించి ఓ దొంగ పడిపోకుండా పట్టుకున్నాడు. ‘‘మూర్ఛని ఆపుకో. లేదా నిన్ను కాల్చేస్తాం. నువ్వు స్పృహలో ఉండాల్సిన సమయం ఇది. నిజానికి నువ్వు చేయాల్సింది చాలా తేలిక. ఊ.’’ నాయకుడు తన అనుచరుడికి సౌంజ్ఞ చేశాడు. వెనక నించి అతను వానర్ ముఖానికి నల్లటి సాక్స్‌ని తొడిగాడు. ‘‘ఇప్పుడు బయటకి నడు’’ నాయకుడు చెప్పాడు. ‘‘కాని ఇలా చూస్తే వాళ్ళు నన్ను మీలో ఒకరు అనుకుంటారు కదా?’’ వానర్ సందేహంగా చెప్పాడు. ‘‘అదే మాక్కావాల్సింది. పోలీసులు నిన్ను షూట్ చేయకపోవడం కూడా మాక్కావాలి. వారు ఎలా స్పందిస్తారో తెలుసుకోడానికే నీకు ముఖానికి అలంకారం తొడిగింది.’’ ‘‘కాని గుళ్ళు దిగితే నొప్పి పుడుతుంది. కనీసం క్షమాపణ కోరి పంపచ్చుగా?’’ ‘‘ఇంకేం మాట్లాడక బయటకి నడు’’ నాయకుడు కోపంగా అరిచాడు. వానర్ కదల్లేదు. ‘‘ముందు నీ పాదాల మీద కాల్చనా? తర్వాత పాక్కుంటూ వెళ్తావా?’’ నాయకుడు తన సబ్‌మెషీన్ గన్ని వానర్ కాళ్ళకి గురి పెట్టాడు. ‘‘ఆగాగు. కాల్చకు. ఒన్, టు, త్రీ చెప్పి కాల్చు. ఇదిగో వెళ్తున్నాను. నాకు ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను. నాకేమైనా అయితే బాధ్యత మీది.’’ వానర్ తలుపు వైపు నడిచాడు. ‘‘పేవ్మెంట్ దాకానే. అది దిగి రోడ్డెక్కావంటే నీ వీపులో గుళ్ళు దిగుతాయి. నడిచినా, పరిగెత్తినా సరే. అక్కడే కదలకుండా నిలబడు’’ ఓ దొంగ హెచ్చరించాడు. -
త్రీమంకీస్ - 67
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 67 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మేము సిఐడి సీరియల్ చూస్తున్నాం. సిఐడిలకి యూనిఫారాలు ఉండవని మాకు తెలుసు. నేనీ బేంక్ మేనేజర్ని. నా పేరు హేమాంబరధరరావు’’ టై కట్టుకున్నతను చెప్పాడు. ‘‘సిఐడిలు ఎవరూ తాము సిఐడిలమని చెప్పరు. మీరు దొంగలని చెప్పడం మంచి జోక్. నేను అసిస్టెంట్ మేనేజర్ పుండరీకాక్షయ్యని. మీకు ఆహ్వానం పలకడం మాకు ఆనందంగా ఉంది.’’ ‘‘అవును. నిజానికి దొంగలు పక్క గదిలో ఉన్నారు’’ ఓ లేడీ క్లర్క్ చెప్పింది. ‘‘ఎంతమంది?’’ కపీష్ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు. ‘‘ఆరుగురు. మమ్మల్ని ఈ గదిలో బంధించారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి’’ పుండరీకాక్షయ్య చెప్పాడు. ‘‘తుపాకులే?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఐతే పెద్ద దొంగలే అయి ఉంటారు.’’ చేతిలో కెటిల్, డిస్పోజబుల్ గ్లాసులు ఉన్న ఓ కుర్రాడు ముగ్గురికీ టీని వంచి ఇచ్చాడు. ‘‘నువ్వెక్కడి నించి వచ్చావు?’’ వానర్ అడిగాడు. ‘‘స్టాఫ్‌కి టీ ఇవ్వడానికి వచ్చాను. దొంగలు నన్ను మళ్ళీ బయటకి వెళ్ళనివ్వలేదు. చల్లారకుండా టీని అమ్ముదామని.’’ ‘‘కోక్ లేదా?’’ వానర్ అడిగాడు. ‘‘షాపులో ఛిల్లర్లో ఉంది. నన్ను బయటకి వెళ్ళనిస్తే తెస్తాను’’ వాడు చెప్పాడు. ‘‘అది కుదిరే పని కాదు. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు?’’ మేనేజర్ టీ తాగే కపీష్‌ని అడిగాడు. ‘‘ముగ్గురమే’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇక్కడ కాదు. సొరంగంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది నా ప్రశ్న.’’ ‘‘సొరంగం ఖాళీ.’’ ‘‘మీ వెంట తుపాకులు తీసుకురాలేదే?’’ అసిస్టెంట్ మేనేజర్ ప్రశ్నించాడు. ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు. ‘‘మా బేంక్ మీద దొంగలు దాడి చేశారనేగా మీరు మమ్మల్ని రక్షించి వారిని పట్టుకోడానికి రహస్యంగా సొరంగం తవ్వి వచ్చింది?’’ ‘‘అవును’’ కపీష్ తన మిత్రులు ఇద్దరి వంకా అర్థవంతంగా చూస్తూ చెప్పాడు. ‘‘అవునవును’’ ఇద్దరూ వత్తాసు పలికారు. ‘‘మరి వారిని పట్టుకోడానికి తుపాకులు అవసరం కదా? అసలు మీరు నిజంగా పోలీసులేనా?’’ అసిస్టెంట్ మేనేజర్ అడిగాడు. ‘‘పూర్తిగా. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని. వీరిద్దరూ సబ్ ఇన్స్పెక్టర్లు’’ వెంటనే కపీష్ చెప్పాడు. ‘‘మీ పేరు?’’ ‘‘క... కష్. ఇతను ఎస్సై మట్. ఇతను ఎస్సై వార్.’’ ‘‘అలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా?’’ ‘‘మేము ఆంగ్లోఇండియన్ సంతతికి చెందిన నాలుగో జెనరేషన్ వాళ్ళం.’’ ‘‘నేను కలకత్తా బ్రాంచ్‌లో పని చేశాను. కాని ఆంగ్లోఇండియన్స్కి ఇలాంటి పేర్లు ఉంటాయని తెలీదు’’ అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు. ‘‘ఇప్పుడు మీకు తెలిసింది’’ వానర్ చెప్పాడు. ‘‘మీ దగ్గర కనీసం కత్తులైనా ఉన్నాయా?’’ ‘‘లేవు. మేము హోస్టేజ్ రెస్క్యూ టీంకి చెందినవాళ్ళం. అంటే బాధితుల్ని రక్షించే బృందమని అర్థం. తుపాకులు పేలడం మాకు ఇష్టం ఉండదు. అందువల్ల బాధితులకి ప్రమాదం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐతే మీది సూక్ష్మబుద్ధి కావచ్చు. కాని అవి ఉంటే రక్షించడం ఎక్కువ తేలిక అయ్యేదేమో?’’ పుండరీకాక్షయ్య అసంతృప్తిగా చెప్పాడు. ‘‘మనం ఇప్పుడు ఓ లైన్లో సొరంగం ముందు క్యూలో నిలబడి అందులోకి దిగుదాం’’ మేనేజర్ చెప్పాడు. ‘‘అవును. ముందు మిమ్మల్ని రక్షించి తీసుకెళ్తాం. తర్వాత వాళ్ళ సంగతి చూడటానికి తుపాకులతో మామూలు పోలీసులు వస్తారు. పదండి’’ కపీష్ చెప్పాడు. లేడీ క్లర్క్ కపీష్ మొహాన్ని తన చున్నీతో సిమెంట్ పోయేలా శుభ్రంగా తుడిచింది. తర్వాత అడిగింది. ‘‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది?’’ ‘‘ఇంజనీరింగ్ కాలేజీలో చూసి ఉంటారు.’’ ‘‘అక్కడ కాదు.’’ ‘‘ఐతే జైల్లో చూసి ఉంటారు’’ వానర్ చెప్పాడు. ‘‘మేం ఖైదీలని అప్పగించడానికి నిన్న జైలుకి వెళ్ళాం’’ కపీష్ వెంటనే వానర్ కాలు తొక్కుతూ చెప్పాడు. ‘‘కాదు. ఫొటో చూశాను’’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘‘ఫేస్బుక్లో చూసి ఉంటారు.’’ ‘‘నాకు ఎఫ్బి లేదు. ఇంకెక్కడో చూశాను.’’ ‘‘గుర్తు తెచ్చుకోండి’’ మేనేజర్ చెప్పాడు. ‘టీవీలో’ అని అంటుందని ముగ్గురు మిత్రులూ భయపడ్డారు. కాని ఆమె ఇలా చెప్పింది. ‘‘గుర్తు రావడం లేదు. బహుశ ఇంజనీరింగ్ కాలేజీలోనే చూశానేమో?’’ ‘‘వాళ్ళొస్తున్నారు’’ అంతదాకా వారికి దూరంగా లాకర్ రూం తలుపు దగ్గర నిలబడ్డ ప్యూన్ గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు. వెంటనే అక్కడి నలుగురు భయంగా కదిలారు. వారు సొరంగం రంధ్రం కనపడకుండా దాన్ని కాళ్ళతో కవర్ చేస్తూ నిలబడ్డారు. ముగ్గురు బలిష్టమైన వ్యక్తులు లాకర్ గదిలోకి వచ్చారు. వారందరి మొహాలకి నల్లటి సాక్స్ తొడిగి ఉన్నాయి. ఖాకీ షర్ట్లు, పేంట్లు, కేన్వాస్ బూట్లు. ప్రతి వారి చేతిలో సబ్‌మెషీన్ గన్స్ ఉన్నాయి. (ముగ్గురు మిత్రులు బేంక్ నుంచి ఎలా తప్పించుకున్నారు?) -
త్రీమంకీస్ - 66
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 66 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘పని మీద వెళ్ళేప్పుడు శవం ఎదురు రావడం మంచి శకునం అని మా నానమ్మ చెప్పేది’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముందుగా ముగ్గురూ మేక్డోనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్ళారు. ‘‘మేక్వెజీ ట్విస్ట్ తొంభై నాలుగు రూపాయలా? కాస్ట్లీ. దీంతో చక్కటి ఉల్లి రవ్వ దోసె, ఇంకా చిల్లర వచ్చేవి’’ బిల్ చూసి వానర్ అసంతృప్తిగా చెప్పాడు. ‘‘ఇప్పుడు కాస్ట్లీ అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మనం ధనవంతులయ్యాక తొంభై నాలుగేనా అనిపిస్తుంది. అప్పుడు కూడా డబ్బుండీ లేని వాళ్ళల్లా పిసినారిగా ఉంటే అది నీ ఖర్మ’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమాటకామాట చెప్పాలి. తొంభై నాలుగైనా రుచి బావుంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఇక్కడ విందు ముగిశాక కారుని దొంగిలించాలి.’’ ‘‘చదువుకునే రోజుల్లో మనకి గది అద్దెకి ఇచ్చినాయన కారుందిగా? ఆయన దాన్ని షో కోసం కొన్నాడు. ఇంట్లోనే వదిలి ఆఫీసుకి మోటార్ సైకిల్ మీద వెళ్తూంటాడు కదా?’’ మర్కట్ గుర్తు చేశాడు. ‘‘అవును. నేనూ అదే అనుకున్నాను’’ కపీష్ చెప్పాడు. ‘‘నేను కూడా. మేథావులు ఒకేలా ఆలోచిస్తారంటే ఇదే’’ వానర్ కూడా చెప్పాడు. ‘‘ఇప్పుడు మనం ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. కోక్ గ్లాసులని తాకించి ముగ్గురూ ఛీర్స్ చెప్పుకున్నారు. ముగ్గురూ అనుకున్నట్లుగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ పాత ఇంటి యజమాని కారుని దొంగిలించాక దాంట్లో రాణిగంజ్కి వెళ్ళి నాలుగైదు దుకాణాలు తిరిగి వర్కింగ్ కండిషన్లో ఉన్న ఎలక్ట్రిక్ డ్రిల్‌ని, ఇతర పరికరాలని కొన్నారు. వారు సంపాదించిన డబ్బు బొటాబొటీగా సరిపోయింది. బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు. ‘‘ఇప్పుడు మనకి కావలసింది కారులో పది లీటర్ల డీజిల్‌ని నింపడం.’’ ‘‘దానికన్నా ముందు మనకి బియ్యం సంచీలు కావాలి’’ వానర్ చెప్పాడు. ‘‘దేనికి?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘వాటిలో డబ్బు నింపుకోడానికి.’’ ‘‘ఖాళీ సంచీలని చెప్పవే?’’ మర్కట్ విసుక్కున్నాడు. ఇంకో అరగంటలోనే వారు ఆ సొరంగంలోకి ప్రవేశించేది. 20 కారుని మర్కట్ డ్రైవ్ చేశాడు. దాన్ని ఓ చోట పార్క్ చేశాక ముగ్గురూ ఖాళీ బియ్యం సంచులతో, అందులో కావాల్సిన పరికరాలతో రైట్ టైం వాచీల దుకాణం దగ్గరకి వెళ్ళి అటు, ఇటూ చూసి కిటికీ తలుపుని తెరిచి అందులోకి దూకారు. మళ్ళీ కిటికీని మూసేశారు. లోపల ఖాళీ కౌంటర్లు బోసిపోతున్నాయి. సరాసరి కిటీకి పక్కన నేల మీద ఉన్న సొరంగం ఉందని కపీష్ నమ్మిన చోట కాలితో కింద పరచిన కార్పెట్‌ని కొద్దిగా పక్కకి తొలగించి, బూటు కాలితో కొట్టాడు. శబ్దం బోలుగా వినిపించింది. ‘‘డెప్త్ టెస్టర్ అబద్ధం ఆడలేదు’’ కపీష్ తృప్తిగా చెప్పాడు. దాని మీద ఉన్న వెట్రిఫైడ్ రాతిని తొలగించాడు. కింద కంత కనిపించింది. చీకటి. బియ్యం బస్తాలోంచి టార్చ్ లైట్‌ని తీసి లోపలకి ప్రసరింప చేసి చెప్పాడు. ‘‘ముందు నేను వెళ్తాను. వెనక మీరు రండి. ఆఖరుగా వచ్చే నువ్వు రాతిని మళ్ళీ యథాస్థానంలో ఉంచు’’ వానర్‌కి సూచించాడు. ‘‘సరే.’’ ‘‘గుడ్ లక్ టు అజ్’’ చెప్పి కపీష్ సొరంగంలోకి దిగాడు. టార్చి వెలుగులో ముందుకి పాకసాగాడు. అది జైల్లోని సొరంగం కన్నా కొద్దిగా విశాలంగా ఉంది. జైల్లో లభించిన తక్కువ పరికరాలతోనే వాళ్ళు తవ్వడం వల్ల ఆ తేడా అనుకున్నాడు. వెనకాల నించి మర్కట్, వానర్ల మాటలు అతనికి వినిపించాయి. సొరంగం చివర కపీష్ తల పెకైత్తి పరిశీలించి అప్పటికే బేంక్ స్ట్రాంగ్ రూమ్ నేల మీది కాంక్రీట్ చాలా భాగం చెక్కేసి ఉండటం గమనించాడు. కపీష్ వెనకాల సొరంగంలో బోర్లా పడుకున్న మర్కట్, వానర్లకి బేటరీతో ఆపరేట్ చేసే ఎలక్ట్రానిక్ డ్రిల్ శబ్దం వినపడసాగింది. ఆ శబ్దాన్ని వినలేక ఇద్దరూ చెవులు మూసుకున్నారు. ఆ పరికరంతో సొరంగం మీది మిగిలిన కాంక్రీట్‌ని గుండ్రంగా మనిషి పట్టేంత మేరకి చెక్కసాగాడు. అరగంటలో పైనించి సన్నటి వెలుగు రేఖ సొరంగంలోకి పడింది. దాదాపు గంట తర్వాత సిమెంట్‌తో మట్టి కొట్టుకుపోయిన కపీష్ తను చేసిన రంధ్రంలోంచి తలని పైకి తీసుకెళ్ళి చూశాడు. అనేక కాళ్ళు కనపడ్డాయి. చాలామంది దాని చుట్టూ నిలబడి ఒంగొని తన వంకే చూడటం గమనించాడు. వారిలోని ఒకరు కపీష్‌కి చేతిని అందించి పైకి లాగాడు. తర్వాత మిగిలిన ఇద్దర్నీ కూడా. కపీష్ ఎడం చేతిలోని సుత్తి, టార్చ్ లైట్‌ని ఇంకొకరు అందుకున్నారు. కపీష్ చుట్టూ చూశాడు. అది బేంక్ స్ట్రాంగ్ రూమే. ఇన్‌షర్ట్ వేసుకుని టై ధరించిన ఓ ఏభై ఏళ్ళ వ్యక్తి కపీష్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు. ‘‘ప్రుడెన్షియల్ బేంక్ మేనేజర్ వెల్కమ్స్ సిఐడి పోలీస్’’ ‘‘మేము పోలీసులం కాము’’ మర్కట్ చెప్పాడు. ‘‘నిజానికి దొంగతనానికి వచ్చిన వాళ్ళం’’ వానర్ చెప్పాడు. (ముగ్గురు మిత్రులు వచ్చిన బేంక్‌లో అప్పటికే దొంగలు ఉన్నారా?) -
త్రీమంకీస్ - 65
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 65 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఒబామా, బిన్ లాడెన్లు నా కోసం నక్కబొక్కలపాడులో ఎదురు చూస్తూంటారు. నేను గాడిదని ఎక్కి విమానాశ్రయానికి వెళ్ళాలి. అక్కడ విమానాన్ని లాగడానికి రోడ్డింజను సిద్ధంగా ఉందా?...’’ ‘‘మా వాడ్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇన్ని రోజులు మీరు ఏమయ్యారు?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాస్త్తిక మహాసభలకి వెళ్ళి ఇవ్వాళే వచ్చాను.’’ ‘‘మీ పేరు?’’ ‘‘రామదాసు’’ ఆయన చెప్పాడు. ‘‘మనం వెంటనే కవాడీగూడా స్మశానానికి వెళ్ళాలి’’ రుధిర ఇంట్లోంచి బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు. ‘‘అరె పాపం? వానర్‌కి ఏమైంది? ఇంకా సర్దుకోలేదా?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు. ‘‘ఏమీ కాలేదు. పోలీసులు మన కోసం వెదకని చోటు అదే. మనం అక్కడ ఉన్నామని తెలిసినా కొద్దిసేపట్లో కాల్చేస్తారనుకుని రారు. ఎక్కడో ఓ చోట దాక్కోవాలిగా’’ కపీష్ సూచించాడు. ‘‘మనం మా బాబాయ్ ఇంటికి వెళ్ళచ్చు. ఆయన శబరిమలైకి వెళ్ళాడు. మరో పది రోజుల దాకా రాడు. ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీ పిన్నమ్మ వంట బావుండదా?’’ ‘‘పిన్నమ్మ ఏనాడో టపా కట్టింది. ఇంటి తాళం చెవి నా దగ్గర లేదు.’’ ‘‘పిల్లల్ని అడిగి తీసుకో.’’ ‘‘ఒకరు విజయవాడ గాంధీనగర్‌లోని మేకా వారి వీధిలో, ఇంకొకరు సత్యనారాయణపురం లోని సింహాల మేడలో ఉంటున్నారు. ఇద్దరికీ ఉప్పూ నిప్పూ. ఒకరు ఉండగా ఇంకొకరు రారు.’’ ‘‘తాళం చెవి సంగతి నాకు వదులు. రేపు రైట్ టైం షాప్ తలుపు తాళాన్ని కూడా తెరవాల్సింది నేనేగా. ఆయనుండేది ఎక్కడ?’’ కపీష్ అడిగాడు. ‘‘కొంతకాలం సైనికుడిగా పనిచేసి సైనిక్‌పురిలో ఉన్నాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వస్తే అక్కడ చేరి వాయుపురిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ నేవీలో ఉద్యోగం వస్తే అందులో చేరి రిటైరవబోయే ముందు పానీపురిలో ఇల్లు కొనుక్కున్నాడు.’’ మర్కట్ బాబాయ్ ఇంటి తలుపుని కపీష్ ఆట్టే శ్రమపడకుండానే తెరవగలిగాడు. ముందుగా ముగ్గురూ ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి చూస్తే అందులో వారు ఆశించిన కోక్ బాటిల్ లేదు. వెతికితే డబ్బు ఎక్కడా కనపడలేదు కాని అదృష్టవశాత్తు ఓ కార్టన్‌లో ఆరు కోక్ జీరో ఫోర్ హండ్రెడ్ మిల్లీలీటర్ల పెట్ బాటిల్స్ కనిపించాయి. వాటిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాడు కపీష్. ‘‘ఇవాళ మనకి చాలా బిజీ డే. డబ్బు కోసం ఏం అమ్ముదాం?’’ వానర్ ఇంట్లోని వస్తువులని చూస్తూ మిత్రులని సలహా అడిగాడు. ‘‘అన్నీ అమ్మినా రెండు వేలు కూడా రావు.’’ మర్కట్ విచారంగా చెప్పాడు. ‘‘ఐడియా.’’ ‘‘ఏమిటి?’’ ‘‘మేమోసారి ఏభై రూపాయలు మోసపోయాం. అదే ఇప్పుడు మనకి శ్రీరామరక్ష. మనకి కొన్ని ప్రింటవుట్స్ కావాలి’’ కపీష్ డిక్టేట్ చేస్తూంటే వానర్ దాన్ని వర్డ్‌లో టైప్ చేశాడు. గంటన్నర తర్వాత ముగ్గురూ మూడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల్లోకి వెళ్ళి డోర్ బెల్స్ నొక్కారు. తలుపు తెరిచిన మహిళల వంక చూసి నవ్వి చెప్పారు. ‘‘గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రీ హోమ్ లైబ్రరీ నించి వస్తున్నాం. నెలకి అరవై రూపాయలు ఇస్తే మీకీ పుస్తకాలన్నీ ఇంటికే తెచ్చిచ్చి, మళ్ళీ తీసుకెళ్తాం.’’ వాళ్ళు ఆ కాగితం చదివారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరవం పత్రికల లిస్ట్, ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల నవలల లిస్ట్ అందులో ఉన్నాయి. ‘‘ఉదయం మీకు సౌకర్యమా మేడం? లేక సాయంత్రమా? ఏ మేగజైన్ ఏరోజు కావాలో టిక్ చేయండి. ఇవాళ ఏం కావాలి?’’ ‘‘గృహశోభ ఉందా?’’ ‘‘ఉంది. మీరు ఏ రోజైనా బుక్ తీసుకోకపోతే రెండు ఛాయిస్‌లు. మర్నాడు రెండు తీసుకోవచ్చు. లేదా ఆ రోజు ఎమౌంట్ తర్వాతి నెల దాంట్లో కట్ చేసుకుని మిగిలింది ఇవ్వచ్చు.’’ చాలామంది మహిళలు పుస్తకాలు చదవకపోవడానికి కారణం అవి అందుబాటులో లేకనే. ఒకప్పడు రెంట్ కార్నర్స్ నించి వాటిని తీసుకుని చదివేవారు. ఇప్పుడవి నాస్తి. నలభై పైబడ్డ మహిళల్లో ప్రతీ నలుగురిలో ఒకరే రిజెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురూ అరవై చొప్పున డిపాజిట్ చెల్లించారు. ‘‘పుస్తకాల బేగ్ కింద బండిలో ఉంది. మీకు గృహశోభ కావాలన్నారా? తెచ్చిస్తాను’’ చెప్పి డబ్బు తీసుకుని వాళ్ళు ఉడాయించసాగారు. ‘‘నే చెప్పలా? నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఒక్కరూ మనల్ని గుర్తు పట్టలా. ఓసారి టీవీలో ఫొటోని అలా చూపించినంత మాత్రాన గుర్తుంచుకుని పోలీసులకి మన గురించి ఇన్ఫాం చేసే మహిళలు మన తెలుగు గడ్డ మీద ఎవరున్నారు?’’ కపీష్ చెప్పాడు. ముగ్గురూ ఆ మోసంతో సంపాదించిన డబ్బుని లెక్క పెట్టారు. ఎనిమిది వేల ఆరు వందల చిల్లర. ‘‘గుడ్. మనకి అవసరమైనవి ఇక కొనచ్చు’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ మర్కట్ బాబాయ్ ఇంట్లోంచి బయటకి నడుస్తూంటే ఓ శవం ఎదురొచ్చింది. -
త్రీమంకీస్ - 64
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 64 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘రేపు ఆదివారం సాయంత్రం నాలుగుకి బేంక్ మూసేస్తారు. సోమవారం శెలవు. అది ఆదివారం సగం పూట పనిచేసే బేంక్. కాబట్టి మనం నాలుగుకల్లా లోపలకి వెళ్తే మంగళవారం ఉదయం తొమ్మిదికి బేంక్ తెరిచే దాకా టైం ఉంటుంది. రేపు మనకి కొంత సామాను అవసరం ఉంటుంది. బేంక్‌లోని ఫ్లోర్‌ని సొరంగంలోంచి కట్ చేయడానికి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి.’’ ‘‘ఐతే ఇంక ఇక్కడ మనకేం పని? కిందకి పదండి. వాటి సంగతి గూగుల్‌లో చూద్దాం’’ వానర్ చెప్పాడు. ‘‘సరే. నేను ఆమెని బెడ్రూంలోకి తీసుకెళ్తాను. మేం బయటకి వచ్చే లోగా నువ్వు మనకి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి కొనడానికి ఎంత అవసరమో చూడు’’ కపీష్ సూచించాడు. ముగ్గురూ రుధిర అపార్ట్మెంట్కి చేరుకున్నారు. ‘‘టీ చేస్తున్నాను’’ ఆమె చెప్పింది. ‘‘ఎనీ కోక్ ఇన్ ఫ్రిజ్ బై ఎనీ ఛాన్స్?’’ వానర్ అడిగాడు. ‘‘సారీ. నో.’’ ‘‘కోక్2హోమ్డాట్కామ్లో అకౌంట్ పెట్టుకోండి. ఫ్రీ డెలివరీ ప్లస్ కనీసం పది శాతం డిస్కౌంట్.’’ వానర్ వాళ్ళ పథకం ప్రకారం లేప్‌టాప్‌లో గూగుల్ చేసి చూసి చెప్పాడు. ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్ కొనడానికి సుమారు ఎనిమిది వేలు కావాలి.’’ ‘‘గూగుల్ చేసి ఆ డబ్బు కూడా ఎలా దొరుకుతుందో చూడు’’ మర్కట్ సూచించాడు. వానర్ ఆ ప్రకారం సెర్చ్ చేసి చెప్పాడు. ‘‘అన్ని ఆర్థిక అవసరాలకి తమ దగ్గరకే రమ్మనే ప్రుడెన్షియల్ బేంక్ ప్రకటనకి తీసుకెళ్ళింది గూగుల్.’’ వానర్ సెకండ్ హేండ్ ఎలక్ట్రిక్ డ్రిల్స్ అమ్మే షాపుల వివరాల ప్రింటవుట్‌ని తీశాడు. డోర్ బెల్ వినపడగానే వానర్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గళ్ళ లుంగీకి బెల్ట్ పెట్టుకున్న ఓ శాల్తీ. రుధిర పోలికలతో ఉన్న ఆయన ఎర్రగా కాలిపోతున్న కళ్ళతో లోపలకి వచ్చాడు. ‘‘మీరెవరు? రుధిర ఏది?’’ ఉగ్రంగా చూస్తూ అడిగాడు. రుధిరతో ఆమె బెడ్రూం లోంచి బయటకి వచ్చిన కపీష్‌ని ఎగాదిగా చూసి రుధిరని నిలదీశాడు. ‘‘ఐతే నేను విన్నది నిజమేనన్న మాట. నువ్వు మళ్ళీ ఎవర్నో చేరదీసావన్నమాట.’’ ‘‘మళ్ళీనా?’’ కపీష్ అదిరిపడ్డాడు. ‘‘మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ. నువు నాలుగో మళ్ళీవి.’’ ‘‘రుర్! ఇది నిజమా?’’ కపీష్ అడిగాడు. ‘‘మీ కబుర్లు తర్వాత. ముందు నేనేం మాట్లాడదలచుకొని వచ్చానో అది మాట్లాడనీండి. చూడు. చూడు. నిన్ను ఎంత కష్టపడి పెంచానో ఓసారి చూడు.’’ ఓ ఆల్బం అందించాడు. రుధిర ఒకో ఫొటోని చూడసాగింది. అన్నీ ఆమెకి నవ్వు తెప్పించాయి. ఆమె తండ్రి మెడ మీద కూర్చుని కాళ్ళని భుజాల మీంచి ముందు ఛాతీ మీదకి వేసింది. వీపు వైపు నుంచి తీసిన ఫొటోలో ఆయన టీ షర్ట్ ధారగా కిందకి తడిసి ఉంది. రెండో ఫొటోలో సోఫాలో కూర్చుని దినపత్రిక చదువుకునే తండ్రి జుట్టుని వెనక నించి పీకుతోంది. మూడో ఫొటోలో రెండేళ్ళ రుధిరని తండ్రి ఎత్తుకున్నాడు. అతని కుడి అరచేతిలో పసుపు పచ్చ రంగులో ఆమె వాంతి ఉంది. నాలుగో ఫొటోలో నాలుగేళ్ళ రుధిర బూజు కర్రతో కొడుతూంటే తండ్రి మంచం మీంచి నేల మీదకి దొర్లిపోయాడు. ఐదేళ్ళ రుధిర ఒంటి మీది బట్టల నిండా బురద. హాల్లో ఆమె నడిచిన మేర నేల మీద బురద పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ రుధిర నిద్రపోతున్న తండ్రి వీపు మీద స్కెచ్‌పెన్‌తో పిచ్చిపిచ్చి గీతలు గీసింది. ఏడేళ్ళ రుధిర చక్కటి పెయింట్ వేసిన గోడంతా క్రేయాన్స్‌తో ఆల్ఫాబెట్‌ని, అంకెలని రాసి పాడుచేసింది. ‘‘ఇంత కష్టపడి నిన్ను పెంచాం. నా మాట ఏదీ నువ్వు వినలేదు. హాస్టల్లో చేరి చదవమంటే చేరకుండా ఇంట్లో చదివి డిమ్కీలు కొట్టావు. కుంగ్ఫు నేర్చుకోమంటే కరాటే నేర్చుకున్నావు. దొంగతనాలకి మర్డర్స్ కలపమంటే కలపనన్నావు. ఓ చిన్న మార్పు నీ జీవితాన్నే సుఖమయం చేసేస్తుందని సెక్స్ మార్పిడి ఒద్దంటే వినకుండా చేసుకున్నావు’’ ‘‘వాట్! నిజమా?’’ కపీష్ అరిచాడు. ‘‘అవును. చూడు. సెక్స్ మార్పిడికి హాస్పిటల్లోకి వెళ్ళే ముందు తీసిన ఈ ఫొటో రుధిర్ది. నా బంగారు కొండా!’’ ఓ పంతొమ్మిదేళ్ళ యువకుడి ఫొటోని ముద్దు పెట్టుకుని చూపించి చెప్పాడా గళ్ళ లుంగీ. ‘‘కూతుర్ని అయినంత మాత్రాన కొడుకుగా విన్న మాటలు మర్చిపోయాననుకున్నావా? నువ్వేగా పదేపదే పెళ్ళయ్యే దాకానే కొడుకు కొడుకు. పెళ్ళయ్యాక కూడా కూతురు కూతురే అని అంటూండేవాడివి’’ రుధిర చెప్పింది. కపీష్ తన తలని గోడకేసి బాదుకోసాగాడు. సిమెంట్ పెచ్చులు రాలి పడటంతో రుధిర తండ్రి అతన్ని ఆపబోయాడు. (ముగ్గురు మిత్రులు ఏ మోసంతో డబ్బు సంపాదించారు?) -
త్రీమంకీస్ - 63
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 63 - మల్లాది వెంకటకృష్ణమూర్తి తర్వాత రైట్ టైం షాపుకి సమాంతరంగా ఉన్న ఆ బేంక్ బిల్డింగ్ దగ్గరకి వెళ్ళాడు. ఆ బేంక్ కూడా మరో రెండు రోజుల్లో ఇంకో చిరునామాకి మారుతోందనే పెద్ద బోర్డ్ గుమ్మం పక్కనే కనిపించింది. బహుశ అందుకే దుర్యోధన్ ముఠా వాళ్ళు జైల్లోంచి సొరంగాన్ని తవ్వి బయటకి వచ్చే ప్రయత్నం చేశారని కపీష్ అర్థం చేసుకున్నాడు. బేంక్‌లోకి నడిచి చూశాడు. బేంక్ బిల్డింగ్‌లో రైట్ టైం షాపు గల బిల్డింగ్ కిటికీ వైపు బలమైన ఓ ఉక్కు తలుపు కనిపించింది. ఆ తలుపు వెనక బేంక్ స్ట్రాంగ్ రూం ఉందని ఇట్టే గ్రహించాడు. రైట్ టైం షాపులోంచి సొరంగం ఆ స్ట్రాంగ్ రూంలోకి తవ్వబడిందని కూడా ఊహించాడు. లోపలకి వెళ్ళాలనుకున్నాడు. కాని ఎలా? ఓ పాతికేళ్ళామె చేతిలో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఓ బేంక్ ఆఫీసర్ వెనకే ఆ స్ట్రాంగ్ రూం వైపు వెళ్తోంది. కపీష్ సందేహించకుండా ఆమె పక్కనే నడిచాడు. ఆ ఆఫీసర్ తన తాళంతో ఆమె లాకర్ నంబర్ 220ని తాళం తీసి బయటకి వెళ్ళిపోయాడు. ఆమె తన తాళం చెవితో దాన్ని తెరిచి అందులోంచి నగలన్నీ తీసి తన హేండ్‌బేగ్‌లో వేసుకుంటూ, ఆ గదిలో పరాయి వ్యక్తి ఉన్నాడన్న స్పృహ లేకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. కపీష్ సొరంగం కిటికీకి ఎదురుగా ఆ సొరంగం చివర రమారమి ఎక్కడ ఉండచ్చో అంచనా వేసి, అక్కడ నేల మీద నిలబడి జేబులోంచి ఇందాకటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తీసి, గోడకి గురిపెట్టి దాని మీటని నొక్కాడు. అది గోడని తాకి వెనక్కి వచ్చి దూరం చూపించింది. ఆరడుగులు. తర్వాత దాని ఇంకో మీట నొక్కి ఈసారి తను నించున్న చోట నేల మీద గురి చూసి మళ్ళీ మీటని నొక్కాడు. లోపల రెండడుగుల కింద గుంట ఉందని దాని డిస్ప్లేలో రీడింగ్ కనిపించింది. తన ఊహ నిజమైంది అనుకున్నాడు. ఆమె నగల సంచీతో బయటకి నడిచింది. కపీష్ ఆమెతో చెప్పాడు - ‘‘లాకర్ తలుపు తాళం వేశారు కాని తాళం చెవి మర్చిపోయారు.’’ ఆమె ‘థాంక్స్’ అని గొణిగి ఆ పని చేసి సెల్లో మాట్లాడుతూనే బయటకి నడిచింది. కపీష్ ఆ పరికరాన్ని ఉపయోగించి ఆ బేంక్‌కి, ఆ షాప్‌కి మధ్య గల దూరాన్ని కొలిచాడు. పది అడుగుల ఐదు అంగుళాలు. తనకి దొరికిన మేప్‌లో రాసిన దానికి సరిపోవడంతో ఆ మేప్‌లో సూచించిన ప్రదేశం అదే అని గ్రహించాడు. ఆగి ఉన్న ఆటో దగ్గరకి వెళ్ళి అందులో కూర్చుని డ్రైవర్‌తో చెప్పాడు - ‘‘వెళ్దాం పద.’’ ఆటో రుధిర అపార్ట్మెంట్కి చేరుకునే దాకా వాళ్ళు ఆ విషయం తప్ప ఇతర విషయాలు మాట్లాడారు. ఆటో అతనికి థాంక్స్ చెప్పి దిగాక, లిఫ్ట్‌లో సరాసరి పై అంతస్తుకి వెళ్ళి, అక్కడ నించి మెట్లెక్కి టైపైకి వెళ్ళారు. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఎప్పటిలానే తూర్పు, పడమర పిట్టగోడలకి ఆనుకుని సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ‘‘మొన్నటినించి అలానే మాట్లాడుతున్నారా?’’ వానర్ ఆశ్చర్యపోయాడు. ‘‘కావచ్చు. బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూంటే ఆ వయసు వారికి కాలమే తెలీదు’’ మర్కట్ చెప్పాడు. ‘‘అదేం కాదు. వాళ్ళు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నారు’’ కపీష్ కోప్పడ్డాడు. ఉత్తరం వైపు గోడ దగ్గరకి వెళ్ళాక మర్కట్ ఉత్సాహంగా అడిగాడు. ‘‘వానర్! నీ ప్రియురాలితో ఎలా గడిచింది? డబ్బేమైనా తీసుకున్నావా?’’ వానర్ తన అనుభవాలన్నిటినీ ఏకరువు పెట్టి చెప్పాడు. ‘‘నేను డాక్టర్ మూలికకి మేక్డోనాల్డ్స్కి పిలిచి బ్రేకప్ చెప్పేస్తాను.’’ ‘‘అక్కడకి దేనికి?’’ ‘‘అక్కడ బరువైన ప్లేట్స్ కాని, పదునైన కత్తులు, లేదా ఫోర్క్‌లు కాని ఉండవు. పైగా వెనక దాక్కోడానికి లావుపాటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక ఆమెకీ, నాకు కటీఫ్.’’ ‘‘వెరీ సారీ. కాని నేనూ అంతే’’ మర్కట్ కూడా చెప్పాడు. ‘‘అదేం?’’ మర్కట్ కూడా తన అనుభవాలని వివరించి చెప్పాడు. ‘‘కుక్కల్ని ప్రేమించే ఆమెకీ, కుక్కలంటే భయం గల నాకూ రాంరాం.’’ ‘‘రుధిర కొద్దిగా ఇదిగా ఉంది. నేనూ ఆమెతో ఎడ్జస్ట్ కాలేను అనిపిస్తోంది’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏం?’’ ‘‘ఇది అని వివరించలేను. కాని ఆమె పెక్యూలియర్ కేస్ కాబట్టి మనకి ఉండటానికి ఇంకేదైనా ప్లేస్ కావాలి. ఈలోగా రుధిర ఇంటికి వెళ్ళి ఆమె సెల్‌ఫోన్‌ని కొట్టేయాలి. దాన్ని వెంటనే అమ్మితే కొంత డబ్బు సంపాదించగలం. పైగా ఆమె లేప్టాప్ అవసరం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఇంతకీ ఆ బేంక్‌లోకి సొరంగం ఉందా?’’ మర్కట్ అడిగాడు. ‘మేప్ నిజందే. మన పంట పండింది. రైట్ టైంలోంచి ప్రుడెన్షియల్ బేంక్‌లోకి నేలలో సొరంగం తవ్వారు. బేంక్‌లో స్ట్రాంగ్ రూంలో రెండు అడుగుల కాంక్రీట్ ఉంది. సొరంగం చివరకి వెళ్ళి పైన ఉన్న దాన్ని తవ్వితే మనం బేంక్‌లో ఉంటాం.’’ ‘‘వావ్! మన ప్లానేమిటి?’’ మర్కట్ ఉత్సాహంగా అడిగాడు. -
త్రీమంకీస్ - 62
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 62 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఇది మై టాకింగ్ టామ్ అనే ఫ్రీ ఆప్. గూగుల్ స్టోర్స్లోంచి లేదా ప్లే స్టోర్స్లోంచి దీన్ని స్మార్ట్ ఫోన్స్‌లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏం మాట్లాడితే అది రిపీట్ చేస్తుంది. ఏ భాషైనా సరే. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అన్ని ఏప్స్లా వైఫై కనెక్షన్ ఉన్నప్పుడే దీన్ని మనం ఉపయోగించుకోగలం.’’ ‘‘ఓ! ఫ్రెండ్స్‌తో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మై టామ్ మంచి టైం పాన్. క్విజ్ అప్ ఏప్ గురించి నీకు తెలుసా?’’ అడిగింది. ‘‘ఊహు. తెలీదు.’’ ‘‘దీన్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్, హిస్టరీ, లిటరేచర్, బిజినెస్, ఆర్ట్, ఎడ్యుకేషనల్, జాగ్రఫీ, లైఫ్‌స్టైల్, మూవీస్ మొదలైన విషయాలలోంచి మనం ఆసక్తి గల టాపిక్‌ని ఎంచుకోవచ్చు. నీకు ఏ టాపిక్ ఫేవరేట్?’’ ‘‘హిస్టరీ.’’ ఆమె హిస్టరీ మీద టచ్ చేశాక చెప్పింది. ‘‘చూశావా? ఇందులో మళ్ళీ అనేక డివిజన్స్ ఉంటాయి. 16-17 సెంచురీ, 18-19 సెంచురీ, 20-21 సెంచురీ, 2013, ఏసియన్ హిస్టరీ, బ్రిటీష్ హిస్టరీ, గ్రీన్ హిస్టరీ, ఆస్ట్రేలియన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, బ్రిటీష్ మోనార్కీ, ఇండియన్ హిస్టరీ... మనకి తెలిసింది కాబట్టి దీని మీద టచ్ చేస్తాను. పది ప్రశ్నలు వచ్చాయి. ఇండియాలో మొదటి రైల్వే బాంబే నించి ఏ నగరానికి వేయబడింది? ఆప్షన్స్ ఢిల్లీ, ఆగ్రా, థానే, అహమ్మదాబాద్...’’ ‘‘థానే’’ వానర్ చెప్పాడు. దాన్ని టచ్ చేశాక చెప్పింది. ‘‘కరెక్ట్. నీకు పద్దెనిమిది మార్కులు వచ్చాయి. దీన్ని మనం ఎఫ్బి ద్వారా లేదా జిమెయిల్ ద్వారా సైన్అప్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో సైన్అప్ అయిన వాటిలోని మన కాంటాక్ట్స్ పేర్లు, వాళ్ళ స్కోర్లు కనిపిస్తాయి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేసి ఆడచ్చు. వాళ్ళు ఆఫ్ లైన్ ఉన్నా తర్వాత చూసి ఆడతారు. పది క్షణాల టైంలోనే మనం ఆన్సర్ని టచ్ చేయాలి. ఇలా అనేక టాపిక్స్ మీద మనం ప్రశ్నలకి జవాబు చెప్పే గేమ్‌ని ఆడచ్చు. మన ఫ్రెండ్స్‌తో కూడా ఆడచ్చు. వాళ్ళు ఆఫ్‌లైన్‌లో ఉంటే లైన్లోకి వచ్చాక వాళ్ళకి మనం ఛాలెంజ్ చేశామని తెలుస్తుంది. ప్రతీ గేమ్ పూర్తయ్యాక స్కోర్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ గేమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మన రేంక్, మనం ఏ దేశంలో సైనప్ అయితే ఆ దేశంలోని మన రేంక్, దేశంలోని మన రాష్ర్టంలోని మన రేంక్, ఇంకా మన మిత్రుల్లో ఆ ఆట అప్పటికే ఎవరైనా ఆడిన వారితో మన రేంక్ కనిపిస్తాయి.’’ ‘‘దీనివల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతుంది’’ వానర్ చెప్పాడు. ‘‘నేను ఇప్పుడు ఫుడ్ గేమ్‌లు ఆడుతున్నాను’’ మూలిక చెప్పింది. ‘‘మీ ఇంట్లో స్వీట్ కాని, పళ్ళు కాని ఉన్నాయా?’’ అడిగాడు. ‘‘లేవు. ఏం?’’ ‘‘అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినడం నాకు అలవాటు.’’ ‘‘ఐతే వెళ్ళి కొనుక్కురా. సందు చివరే స్వగృహ స్వీట్ షాప్ ఉంది. బందరు వాళ్ళు. బందరు మిఠాయి బావుంటుంది.’’ ‘‘అలాగే. ఓ ఫిఫ్టీ ఉంటే ఇస్తారా? వంద గ్రాములు చాలుగా?’’ ‘‘సారీ! మనీ ఫ్రీ వీక్ కాబట్టి నేను బిల్ చెల్లించడం లేదు’’ మూలిక చెప్పింది. ‘‘అదేమిటి? డబ్బు ఖర్చు చేయకుండా ఈ వారం అవసరాలు ఎలా గడుస్తాయి?’’ వానర్ అడిగాడు. ‘‘అందుకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారుగా.’’ ‘‘ఇక నిన్ను నేను అప్పు ఏం అడుగుతాను?’’ గొణిగాడు. ‘‘సారీ?’’ ఆమె అడిగింది. ‘‘ఏం లేదు. మంచి పాలసీ అంటున్నాను. ఆ పాలసీ ఎందుకు పెట్టుకున్నారు? ఏ టీవీ సీరియల్లో చూశారు?’’ ‘‘నా జీవితంలోని అవసరమే నాకా పాలసీని నేర్పింది’’ ఆమె చెప్పింది. మర్నాడు ఉదయం మాట ఇచ్చినట్లుగానే వైతరణి మర్కట్‌ని, మూలిక వానర్ని రుధిర ఇంటికి తీసుకువచ్చి దింపారు. గత రాత్రే కపీష్ కోరిక ప్రకారం రుధిర ఏర్పాటు చేసిన ఆటోలో ముగ్గురూ రైట్ టైం చిరునామాకి చేరుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ రుధిర బాబాయే. తెల్లారుఝామున రైల్వే స్ట్టేషన్లోంచి వచ్చే ఒంటరి ఆడవాళ్ళని ఎక్కించుకుని మధ్యలో ఆపి వారిని దింపి సామానుతో, వారి హేండ్ బేగ్, నగలతో ఉడాయించే డిపార్ట్మెంట్లో అతను నిష్ణాతుడు. ఆటోలోంచి దిగకుండానే పరిశీలించి చూసి కపీష్ చెప్పాడు. ‘‘సందేహం లేదు. అదే బేంక్. ఇప్పుడే వస్తాను. ఉండండి.’’ దిగి రైట్ టైం అనే నియోన్ బోర్డున్న వాచీ షాప్‌లోకి వెళ్ళాడు. రైట్ టైం వాచ్ షాప్ ఇప్పుడు అక్కడ లేదు. ‘వి మూవ్డ్’ అన్న బోర్డు మీద కొత్త చిరునామా కనిపించింది. కిటికీలోంచి చూస్తే షాపంతా ఖాళీ. కపీష్ మూసి ఉన్న కిటికీ రెక్కని నెట్టి చూశాడు. ఒకటి తెరచుకుంది. దాన్ని మళ్ళీ మూసేశాడు. బేంక్ వైపున్న కిటికీ దగ్గరకి వెళ్ళాడు. ఆ కిటికీ వెనకనించే సొరంగం మొదలై ఉంటుందని కపీష్ అంచనా వేశాడు. అక్కడి వెట్రిఫైడ్ టైల్‌ని తొలగించి అక్కడనుంచి సొరంగాన్ని తవ్వారని అనుకున్నాడు. ఆ షాపు యజమానికి కూడా దీంట్లో భాగం ఉండచ్చని భావించాడు. కన్ఫం చేసుకోడానికి రుధిర ఇంట్లో వెదికితే దొరికిన డెప్త్ గేజర్ అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని జేబులోంచి బయటకి తీసి దాన్ని ఆ టైల్‌కి గురి చేసి మీటని నొక్కాడు. సెల్ఫోన్లా ఉన్న ఆ పరికరం కింద మూడున్నర అడుగుల గుంత ఉందని స్క్రీన్ మీద చూపించింది. (బ్యాంక్ స్ట్రాంగ్ రూం నుంచి ఉన్న సొరంగాన్ని కపీష్ ఎలా కనిపెట్టాడు) -
త్రీమంకీస్ - 61
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 61 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘తిన్నాకా? తినక మునుపా?’’ ‘‘నీ పొట్ట నీ మనసుని శాసిస్తోంది. మేక్ తోట కూర పొడి కూర. నాట్ వార్. బాణలిలోని నూనెని వేడి చేయడం తిరగమాత గింజలకి ఫోర్‌ప్లే’’ చెప్పి తలుపులు మూసింది. ‘‘అదేమిటి? తలుపులు వేస్తున్నారు?’’ వానర్ అడిగాడు. ‘‘మా ఇంటి చుట్టుపక్కల మేకలు ఎక్కువ’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘వేళాకోళమా? ముందుజాగ్రత్తా?’’ మూలిక ఆ ప్రశ్నలని విననట్లే జవాబు చెప్పలేదు. ‘‘ఆహా! ఎక్కడ చూసినా లాన్‌లా పచ్చదనం’’ భోజనానికి కూర్చున్న వానర్ కంచంలోకి చూసి చెప్పాడు. ‘‘పచ్చదనాన్ని చూడటం వల్ల కంటికి లాభం కూడా’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘మీ ఇంట్లో కోక్ ఉందా?’’ ‘‘ఉంది. టాయ్లెట్లో.’’ ‘‘ఫ్రిజ్‌లో కాదా?’’ తెల్లబోతూ అడిగాడు. ‘‘రాందేవ్ బాబా వీడియో పెట్టి చూపిస్తాను. ఏసిడ్ కన్నా అది టాయ్‌లెట్ కడగడానికి బాగా ఉపయోగిస్తుందని, దాన్ని తాగితే మన కడుపులో ఏమవుతుందో...’’ ‘‘సీడీ చూపించక్కర్లా. నమ్ముతాను. భోజనం దగ్గర ఆ మాటలు వద్దులెండి’’ ఇబ్బందిగా చెప్పాడు. కొన్నిటిలో అల్లం వాసన, మరికొన్నిటిలో ఇంగువ వాసన ఘుమాయించింది. ‘‘నా సలహా వానర్. నీ భోజనం మందు కాకపోతే, నీ మందే తర్వాత భోజనం అవుతుంది జాగ్రత్త’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి. ఏ మూలికా నాకు మీ మీద గల ప్రేమకి చికిత్స చేయలేదు’’ వానర్ చెప్పాడు. ‘‘చపాతీ తోటకూర కూరకి స్లీపింగ్ బేగ్’’ చపాతిలో ఆ కూర వేసి చుట్టి వానర్ కంచంలో ఉంచి ఫోటో తీస్తూ మూలిక చెప్పింది. దాన్ని విప్పి మధ్యకి మడిచి చెప్పాడు. ‘‘ఇప్పుడిది సేండ్విచ్.’’ దాన్నీ మూలిక ఫొటో తీసి తన ఫేస్బుక్లో ఉంచాక వానర్ చెప్పాడు - ‘‘ఫేస్‌బుక్‌ని సృష్టించినందుకు మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. లేదా ఈ భోజనం ప్లేట్ ఫొటోని తీసి, ఫిల్మ్ కడిగించి, డెవలప్ చేసి, ప్రింట్ వేయించి ఆరు వందల అరవై రెండు మంది ఇళ్ళకి తీసుకెళ్ళి చూపించాల్సి వచ్చేది.’’ ‘‘నీకు పేరిస్ చూపించనా?’’ ఆ రాత్రి భోజనం అయ్యాక డాక్టర్ మూలిక అడిగింది. ‘‘ఎప్పుడు? నాకు పాస్‌పోర్ట్ లేదు’’ వానర్ చెప్పాడు. ‘‘ఎప్పుడో కాదు. ఇవాళే. ఇప్పటికి ఇప్పుడు పేరిస్లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లోని ఓ గది చూపిస్తాను.’’ ‘‘చూపించండి. పేరిస్ బై నైట్ సినిమా డివిడి ఉందా?’’ ఉత్సాహంగా అడిగాడు. ‘‘కాదు. కళ్ళు మూసుకో.’’ అతను కళ్ళు మూసుకున్నాడు. ‘‘మనం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు పేరిస్‌లో బస చేసే గది సరిగ్గా ఇలాగే కనబడుతుంది. నాకు సిగ్గు’’ మూలిక చెప్పింది. ‘‘మీరూ కళ్ళు మూసుకోండి. మీకూ ఓ విచిత్రం చూపిస్తాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇప్పుడు కళ్ళు తెరవండి’’ మూడు నిమిషాల తర్వాత చెప్పాడు. ‘‘ఏమిటి విచిత్రం?’’ చుట్టూ చూస్తూ అడిగింది. ‘‘ఏమిటి విచిత్రం?’’ ఓ వింత కంఠం చెప్పింది. ‘‘అదేమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘అదే విచిత్రం మరి.’’ ‘‘అదేమిటి? అదే విచిత్రం మరి’’ ఇందాకటి కంఠం వినిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు రిపీట్ అవసాగాయి. ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ డాక్టర్ మూలిక అడిగింది. ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ ఆమె మాటలు మళ్ళీ రిపీట్ అయ్యాయి. ‘‘లేదు. ఏం?’’ వానర్ అడిగాడు. ‘‘లేదు. ఏం?’’ మళ్ళీ ఆ కంఠం రిపీట్ అయింది. ‘‘అదుగో. విన్నావా?’’ అని మూలిక అనగానే ‘అదుగో. విన్నావా?’ అని మళ్ళీ రిపీట్ అయింది. ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కపీష్ ఒంగి బల్ల కింద చూస్తూ అడిగాడు. ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కార్టూన్ కంఠం ధ్వనించింది. ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’ కపీష్ చుట్టూ చూస్తూ చెప్పాడు. ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’ డాక్టర్ మూలిక తన స్మార్ట్ ఫోన్‌ని అందుకుని స్క్రీన్ మీద కనిపించే కార్టూన్ పిల్లిని చూసింది. అది తన కుడి చేతిని కుడి చెవి దగ్గరకి తీసుకెళ్ళింది. ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి అడిగింది. ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి ఆ కంఠం కూడా పలికింది. -
త్రీమంకీస్ - 60
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 60 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఏమిటా విండోస్?’’ గోడకి ఆనించి ఉన్న కిటికీలని చూసి మర్కట్ అడిగాడు. ‘‘అప్పుడప్పుడూ విండో షాపింగ్‌కి వెళ్ళొస్తూంటాను. కుక్క తోకని కూడా కాలు అనుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?’’ ‘‘ఐదు’’ బుష్‌ని చూస్తూ వేళ్ళతో లెక్కపెట్టుకుని మర్కట్ జవాబు చెప్పాడు. ‘‘తప్పు. నాలుగే. తోకని కాలని అనుకున్నంత మాత్రాన అది కాలు కాదు. ఇంకోటి అడగనా?’’ వైతరణి నవ్వుతూ అడిగింది. ‘‘ఒద్దు. ఒకే కుక్క చేత రెండుసార్లు కరిపించుకునేవాడు మూర్ఖుడు అవుతాడు.’’ వాళ్ళిద్దరూ దుప్పటి కిందకి చేరాక వైతరణి తన గౌన్ని విప్పి మంచం కింద పడేస్తూ అడిగింది. ‘‘లైట్లోనే ఇష్టం అన్నాగా? చెప్పండి. మనకి పుట్టే పిల్లల బంగారు భవిష్యత్‌కోసం ఏం చేద్దాం?’’ ‘‘టీ అమ్మే వాడిలా పెంచి మోడీని చేయచ్చు. లేదా ఐఐటిలో చదివించి కేజ్రీవాల్‌ని చేయచ్చు’’ మర్కట్ చెప్పాడు. ‘‘విదేశాల్లో మాత్రం చదివించద్దండి’’ ఆలోచించి చెప్పింది. ‘‘ఏం?’’ ‘‘రాహుల్ గాంధీలా తయారవుతాడు.’’ 19 ‘‘మీరు అసలు ఇంగ్లీష్ మందులే వాడరా?’’ వానర్ అడిగాడు. ‘‘ఊహూ. ఇంగ్లీష్ మందు తీసుకుంటే రెండుసార్లు రికవర్ అవాలి. ఓసారి జబ్బు నించి. ఇంకోసారి ఆ మందు నించి.’’ ‘‘మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు లేదా? అది మంచిదని డాక్టర్లు చెప్తారే?’’ వానర్ అడిగాడు. ‘‘ఏది తిని ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తామో టెక్నికల్‌గా అదే బ్రేక్‌ఫాస్ట్. అందువల్ల ప్రపంచంలో బ్రేక్‌ఫాస్ట్ తినని వారే ఉండరు’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘ఈ రాత్రి వంట నేను చేయనా? లేక మీరు చేస్తారా?’’ వానర్ మళ్ళీ అడిగాడు. ‘‘ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడే మర్చిపోయావా? నాన్ సెక్స్‌వల్ ప్రేమలో నంబర్ నైన్, కుక్ ఏ మీల్ టుగెదర్. కలిసి వంట చేయడం కూడా ప్రేమని వ్యక్తం చేసే ఓ పద్ధతి’’ డాక్టర్ మూలిక చెప్పింది. వానర్ ఫ్రిజ్ తెరిచి కూరలు ఉంచే క్రిస్పర్ బాక్స్‌ని తెరిచి చూశాడు. ‘‘అందులో అనేక రకాల ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, భస్మాలు కనిపించాయి. వాటిని చూసి చెప్పాడు. ‘‘లేవు. నేను వెళ్ళి తెస్తాను.’’ ‘‘ఏం లేవు?’’ మూలిక అడిగింది. ‘‘వంకాయలు. ఉల్లిపాయలు. ఉల్లి కారం పెట్టిన వంకాయ కూర తినాలని ఉంది.’’ ‘‘ఉల్లిపాయా! వంకాయా!’’ మూలిక పక్కలో బాంబ్ పడ్డట్లుగా అరిచింది. ‘‘ఏం?’’ ‘‘వంకాయ సర్వరోగప్రదాయిని అని వినలేదా? దాన్ని చస్తే తినకూడదు. తింటే త్వరగా చస్తాం అని ధన్వంతరి రాశాడు. ఉల్లిపాయ గాలే అసలు మనకి తగలకూడదు అని చరకుడు రాశాడు. ఈ రెండూ ఆయుర్వేదంలో నిషిద్ధం.’’ ‘‘పోనీ దొండకాయ, ఉల్లి కారం కూర?’’ ‘‘దొండ పరమ నిషిద్ధం. వెనకటికి ఒకడికి దొండ పాదు కింద స్నానం చేస్తే బుద్ధి మాంద్యం పట్టుకుందని చరకసంహితలో రాసుంది. అది మనిషిని నిస్తేజంగా మారుస్తుంది.’’ ‘‘వంకాయ, దొండకాయలకే ఉల్లి కారం వేసి వండితే బావుంటుంది. ఒక్కసారికేం కాదు.’’ ‘‘ఊహూ. అవి రెండూ వాతపిత్త దోషాలని కలిగిస్తాయి.’’ ‘‘పోనీ చామదుంపలు తెస్తాను. వేయించి ఇంత ధనియాల పొడి, ఉప్పూ, కారం చల్లి...’’ ‘‘నో. నో. నో. నో... దుంపకూరలు కూడా నిషిద్ధం. నేల అడుగున పండే వాటిలో ఒక్క వేరుశెనగ మాత్రమే శ్రేష్టం. మిగిలినవన్నీ వర్జింప తగ్గవి. అవన్నీ వాతాన్ని కలిగించేవి.’’ ‘‘కాని రాముడు అరణ్యవాసంలో కందమూలాలనే తిని జీవించాడు కదా?’’ ‘‘రాముడు దేవుడు. నువ్వు మనిషి.’’ వానర్ కొద్దిసేపు ఆలోచించి తనకి ఇష్టమైన కూరలని, వాటిని వండే విధానాలని చెప్పాడు. ఆమె వేటికి వాతపిత్తకఫ దోషాలో చెప్పి ఖండించేసింది. ‘‘బెండకాయ?’’ ‘‘అది కొంత దాకా ఓకే.’’ ‘‘సరే. బెండకాయ, వేరుశెనగపప్పు కలిపి వేపుడు చేస్తే?’’ ‘‘ఈరోజు చతుర్దశి. చతుర్దశి నాడు బెండకాయ తింటే ఆవు మాంసం తిన్నంత పాపం వస్తుంది అని ఆయుర్వేద రత్నావళిలో రాశారు.’’ ‘‘పోనీ సొరకాయలో పాలు పోసి వండుదామా?’’ వానర్ ఆశగా అడిగాడు. ‘‘రాత్రి పూట సొరకాయ నిషిద్ధం. జలుబు చేస్తుంది.’’ ‘‘సరే. ఈరోజు తిథికి, ఈ వారానికి ఏవి సూటబుల్?’’ బలహీనంగా అడిగాడు. ‘‘తోటకూర పొడికూర, బచ్చలి పులుసు, గంగబాయిల కూర పచ్చడి.’’ ‘‘అదేమిటి? ఆక్కూరతో పచ్చడా? ఎక్కడా వినలేదే?’’ ‘‘చేస్తాగా. తిని చూసి మాట్లాడు. ముందుగా ఆకుకూరలని ఇసక పోయేలా బాగా కడిగి కాడల నించి ఆకులని వేరు చేయి... నా వంటంటే అంతా పడి చస్తారు.’’ (కోక్ ఫ్రిజ్‌లో కాకుండా టాయ్లెట్లో ఎందుకు ఉంది?) -
త్రీమంకీస్ - 59
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 59 - మల్లాది వెంకటకృష్ణమూర్తి టీ పాయ్ మీద ఎక్కిన మర్కట్ వాటి వంక భయంగా చూస్తూ అడిగాడు - ‘‘డేడ్? నేనా? వాటికా?’’ ‘‘అవును. నేను వాటికి మమ్ అయినప్పుడు నువ్వు డేడ్ అవుతావు కదా?’’ వైతరణి వాటిని ప్రేమగా మందలించి, అతని భయాన్ని చూసి నవ్వి చెప్పింది. ‘‘అవి డేడీని ఏం చేయవు.’’ కాసేపటికి అవి సర్దుకున్నాయి. సోఫా మీద కూర్చుని ఆమె వాటిని కాసేపు ముద్దు చేస్తూంటే ఎదురుగా ఉన్న సోఫా మీద కాళ్ళు ముడుచుకుని కూర్చున్న మర్కట్, అవి తమ జీవితాల్లో లేకపోతే వాటి స్థానంలో తను ఉండి ఉండేవాడని అనుకున్నాడు. ‘‘క్లింటన్ తల్లికి ఆడీ కారు అలవాటు. ఇండికా లాంటివి ఎక్కదు. దీన్ని నాకు అమ్మినవాడు పవన్ కళ్యాణ్‌కి, మహేష్ బాబుకి, అనుష్కకి కూడా కుక్కల్ని అమ్మాడు. నాగార్జున పెంచే కుక్కే దీని తల్లిని క్రాస్ చేసింది. అది తమన్నా కుక్క. అంటే దీని తల్లి తమన్నా ఇంట్లో, తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాయి. వీడి పిన్ని బాలకృష్ణతో ఏక్ట్ చేసింది. అసలు దీని ముత్తాతని ఎస్వి రంగారావు ఐర్లండ్ నించి తెప్పించాడు. కుక్కల్ని ప్రేమించే వారు చరిత్రలో ఎందరో. హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామఫోన్ రికార్డ్ కంపెనీకి ఆ పేరు, ఆ లోగో ఎందుకు వచ్చాయో తెలుసా? దాని యజమాని పాడుతూంటే ఆ కుక్క చెవులు రిక్కించుకుని వినేది. అందుకని అలా వినే కుక్కనే లోగోగా చేశారు’’ వైతరణి వాటిని ముద్దాడుతూ చెప్పింది. ఓ కుక్క బొమ్మ, కింద ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ డాగ్స్’ అనే పోస్టర్ కనిపించింది. ‘‘ఈ ఫొటోలోని కుక్క మీ కుక్క కాదనుకుంటా?’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. తోడికోడళ్ళు చూశారా?’’ ‘‘సినిమానా? లేదు.’’ ‘‘నాగచైతన్య నానమ్మ ఆ సినిమాని తీసింది. అందులో అది నటించింది. నేను దాని ఫేన్‌ని. ఈ రెండో ఫొటో టిన్ టిన్ అని హాలీవుడ్లో ముప్ఫై రెండు సినిమాల్లో నటించింది. ఇది పోయినప్పుడు అమెరికన్స్ అంతా కంటతడిపెట్టారు’’ వైతరణి చెప్పింది. ‘‘ఇది?’’ ‘‘తెలీదా? లైకా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి. కుక్కనే ఎందుకు పంపారంటే అది మనిషి కన్నా తెలివి గలది కాబట్టి.’’ ‘‘ఇది ఎక్స్ట్రా చేసి చెప్పడం’’ మనిషి కాబట్టి మర్కట్ అభ్యంతరం చెప్పాడు. ‘‘లేకపోతే డిటెక్టివ్లు, పోలీసులు దొంగల్ని పట్టుకోడానికి కుక్కల సహాయమే దేనికి తీసుకుంటారు? హైద్రాబాద్ డాగ్స్ క్లబ్‌కి బుష్ ప్రెసిడెంట్. దానికి హిందీ పాటలంటే ఇష్టం. ‘బెనారసివాలా’ పాటకి డేన్స్ చేస్తుంది. ఈ మధ్య రెహమాన్ వచ్చాక తెలుగు పాటలని లైక్ చేస్తోంది. ఓసారి నా ఉంగరం ఎక్కడో పడిపోతే ఇల్లంతా వెతుకుతున్నాను. క్లింటన్ కిందకి పరిగెత్తి అక్కడ నించి మొరగసాగాడు. వెళ్ళి చూద్దును కదా, వాడు నిలబడ్డ క్రోటన్ మొక్క కింద ఉంగరం కనిపించింది. వాడు మనుషుల భావాల్ని ఇట్టే పట్టేస్తాడు. కాబట్టి వాడిని కుక్క అంటే చిన్న బుచ్చుకుంటాడు.’’ ‘‘దానికి మన తెలుగు అర్థం అవుతుందన్నమాట.’’ ‘‘అది కాదు. వాడు. అవును. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రతీది అర్థం అవుతుంది. కుక్కల వల్ల మనుషుల మధ్య స్నేహం ఏర్పడుతుందని తెలుసా? బుష్ వల్ల నాకో ఐపిఎస్ ఆఫీసర్ భార్య, సినిమాల్లో ఫైట్ మాస్టర్ సన్నిహితులైపోయారు.’’ ‘‘కుక్క ఫ్రెండ్స్ అన్నమాట.’’ ‘‘అవును. వాళ్ళు రోజూ కుక్కల్ని వాకింగ్‌కి తీసుకువచ్చే టైంలోనే నేనూ వెళ్తూంటాను. అలా పరిచయం.’’ గొప్ప వారి కుక్క ఏనుగు కన్నా బలమైంది అనే సామెత ఎలా వచ్చిందో మర్కట్కి బోధ పడింది. బుష్ మర్కట్‌ని చూసినప్పుడల్లా మొరుగుతూనే ఉంది. ‘‘అసలు మీకు కుక్కని పెంచుకోవాలనే ఆలోచన ఎలా కలిగింది?’’ మర్కట్ అడిగాడు. ‘‘గుర్రం, కుక్క ఉన్న సినిమాలకే నా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని. గుర్రాన్ని పెంచుకోవడం కష్టం అని కుక్కని కొన్నాను. కాని కుక్కని సరైన ఎంపిక చేశానని ఇప్పుడు అర్థమైంది. ఓసారి మా బుష్ ఏం చేసిందో తెలుసా?..’’ ఆ సంభాషణ తర్వాత మర్కట్ ఆమెకి మనసులోనే గుడ్ బై చెప్పేశాడు. ఆమె క్లింటన్, బుష్లకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందని తెలిశాక మర్కట్ తనని తప్ప కుక్కలని ప్రేమించే భార్య లేదా ప్రియురాలు వద్దనే నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ఇది ఐ ఫోన్ 9’’ బెడ్ రూంలో వైతరణి చెప్పింది. ‘‘అదేమిటి? ఐ ఫోన్ 6 మాత్రమేగా వచ్చిందిగా?’’ ‘‘దీన్ని తలకిందులుగా పట్టుకున్నానని నువ్వు గమనించలేదు. నా మొత్తం సేవింగ్స్ అంతా ఈ ఫోన్‌కి ఖర్చవగా ఇంకా క్రెడిట్ కార్డ్ కంపెనీకి నేను రేపటిలోగా పాతిక వేలు కట్టాలి.’’ ‘నా బొంద. ఇంక నిన్ను అప్పేం అడుగుతాను? ఇక మిగిలింది వానర్. వాడు సాధించచ్చు’ మర్కట్ మనసులో అనుకున్నాడు. వానర్‌కు డాక్టర్ మూలిక చెప్పిన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి ఏది? -
త్రీమంకీస్ - 58
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 58 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నువ్వే.’’ ‘‘నా పేరు మర్కట్ అని చెప్పానే?’’ ‘‘నా ఫ్రెండ్ ‘ర్క’ని కొట్టేసింది’’ ఆమెతో వచ్చిన మూలిక నవ్వుతూ చెప్పింది. ‘ఎవరది’ అంటూ లోపల నించి అక్కడికి వచ్చిన కపీష్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోలేదు. భయపడ్డాడు. లోపల నించి తన వెనకే వచ్చిన రుధిరని అడిగాడు - ‘‘వీళ్ళు మమ్మల్ని పోలీసులకి పట్టిస్తారేమో?’’ ‘‘ఆ పని ఎప్పటికీ చేయరు. నేను నిన్ను పట్టించానా?’’ ‘‘మన సంగతి వేరు. మనం మనం ప్రేమించుకుంటున్నాం.’’ ‘‘అలాగే వీళ్ళూ వీళ్ళూ ప్రేమించుకుంటున్నారు’’ రుధిర చెప్పింది. ‘‘కాబట్టి పట్టించం’’ డాక్టర్ మూలిక చెప్పింది. ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావని మాటమాత్రంగానైనా చెప్పలేదే? మనింటికి పద’’ డాక్టర్ మూలిక వానర్ చేతిని పట్టుకుని లాగింది. వైతరణి కూడా మర్కట్ చేతిని పట్టుకుని లాగి చెప్పింది - ‘‘నువ్వు కూడా. నన్ను స్కర్ట్, టాప్లలో చూడాలని ఉందన్నావు కదా. చూద్దువు గాని.’’ ‘‘కాని మేం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం ఉంది’’ వానర్ ఇబ్బందిగా కపీష్ వంక చూస్తూ చెప్పాడు. ‘‘చూడు మరి’’ డాక్టర్ మూలిక రుధిరతో ఫిర్యాదుగా చెప్పింది. ‘‘వెళ్ళండి. ఇది సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ అని మీకూ తెలుసుగా? రాత్రి ఏం ఇబ్బంది పడ్డారో, ఏమిటో?’’ రుధిర చెప్పింది. ‘‘నువ్వేం మాట్లాడవే?’’ మర్కట్ కపీష్‌ని నిలదీశాడు. ‘‘మనం ముగ్గురం ఒకేచోట ఉండాల్సిన అవసరం నాకు పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళని మీరు డిజప్పాయింట్ చేయడం మర్యాద కాదు’’ అతను చెప్పాడు. ‘‘ఓరి మిత్రద్రోహి!’’ వానర్ అరిచాడు. ‘‘ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. సెల్ఫోన్లో ఒకరితో మరొకరు మాట్లాడుకోవచ్చు’’ రుధిర చెప్పింది. ‘‘రేపు సాయంత్రం మా ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది. పిలవడానికి వచ్చాను’’ మూలిక చెప్పింది. ‘‘అలాగే వస్తాను’’ రుధిర ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ రుధిరని పక్కకి తీసుకెళ్ళి ‘‘రాత్రి అతనితో అనుభవం ఎలా ఉంది?’’ అనడిగారు. ‘‘తేనె కలిపిన లోషన్‌తో అతను నాకు ఎంబామింగ్ చేసినట్లుగా అనిపించింది.’’ అంతా అక్కడే భోజనాలు చేశాక వెళ్ళబోయే ముందు మూలిక చెప్పింది - ‘‘కమాన్ వార్.’’ ‘‘నేనా?’’ వానర్ అడిగాడు. ‘‘అవును. ఇంక వీళ్ళింట్లో ఎందుకు? మనింటికి వెళ్దాం పద.’’ ‘‘కాని...’’ మర్కట్ ఏదో చెప్పబోయాడు. ‘‘నో కానీలు. నథింగ్. నువ్వు రావాల్సిందే. ఇంక తప్పించుకోలేవు’’ వైతరణి అతని చేతిని పట్టుకుని చెప్పింది. ‘‘రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి మేం ఓ చోటికి వెళ్ళే అవసరం ఉంది’’ కపీష్ చెప్పాడు. ‘‘అలాగే. భోజనం పెట్టి ఆ టైంకి పంపిస్తాం’’ మూలిక చెప్పింది. వాళ్ళిద్దరూ తాము ప్రేమించే ఇద్దరు మగాళ్ళ చేతులు పట్టుకుని లాక్కెళ్ళారు. వాళ్ళు చూడకుండా కపీష్ బొటన వేలుని, చూపుడు వేలిని ఒక దాంతో మరొకటి ముట్టుకుంటూ వాళ్ళని అప్పు అడగమని సైగ చేశాడు. 18 వైతరణి నడిపే స్కూటర్ ఆమె ఇంటి అపార్ట్మెంట్ పార్కింగ్‌లో ఆగాక వెనక కూర్చున్న మర్కట్ దిగాడు. ఇద్దరూ మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆమె అపార్ట్మెంట్లోకి చేరుకున్నారు. ‘‘ఇదేమిటి? ‘బివేర్ ఆఫ్ మేన్’ అనే బోర్డు పెట్టారు. అంతా బివేర్ ఆఫ్ డాగ్ అనే బోర్డు పెడుతూంటారుగా?’’ దాన్ని చూసి మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘కుక్క కన్నా మనిషి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఈ బోర్డు పెట్టాను. సాక్షిలో ఇది న్యూస్ ఐటెంగా కూడా వచ్చింది. చూళ్ళేదా?’’ ‘‘చూశాను. గుర్తుంది. మోడీ ఎన్నికల ప్రచా రం హెడ్డింగ్ పక్కన వేశారు’’ ఆమెని సంతోషపెట్టడానికి అబద్ధం ఆడాడు. ‘‘ఈ రాత్రి వాతావరణ హెచ్చరిక విన్నావా?’’ ‘‘లేదే? చలిగా ఉంటుందా?’’ ‘‘చీకటిగా ఉంటుందిట. కాని నాకు లైట్లోనే ఇష్టం.’’ లోపల నించి కుక్క మొరుగు వినిపించి అడిగాడు - ‘‘మీ ఇంట్లోకి పొరపాటున కుక్క వెళ్ళినట్లుంది.’’ ‘‘ఫన్నీ! లేదు. అది మన కుక్కే.’’ ‘‘ఏమిటి? మీరు కుక్కని పెంచుతున్నారా?’’ ‘‘కుక్కల్ని. రెండు. ఓ ఆడ కుక్క, ఓ మగ కుక్క. తెల్లటి బొచ్చు కుక్కలు.’’ ‘‘నాకు కుక్కలంటే భయం.’’ ‘‘క్లింటన్, బుష్‌లు నిన్నేం చేయవు.’’ ‘‘అవి కుక్కల పేర్లా?’’ ‘‘అవును. ఇక నించి వాటిని కుక్కలు అనకు. నిన్ను మనిషి అంటే నీకు కోపం రాదూ? పేర్లతో పిలు. లేదా హి, షి అను. నాకు క్లింటన్ విమనైజింగ్ నచ్చక వాడి పేరు, బుష్ ఇరాక్ మీద దాడి చేయడం నచ్చక వాడి పేరు పెట్టాను. అఫ్కోర్స్. నేను దానికి బుష్ అనే మగ పేరు పెట్టానని, తను ఆడ కుక్కని ఆమెకి తెలీదు కదా? అందుకని అది ఏం అనుకోదు’’ వైతరణి చెప్పింది. తలుపు తీసి లోపలకి వెళ్ళగానే రెండు పమేరియన్ కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త వ్యక్తిని చూసి మొరగసాగాయి. ‘‘డోంట్. హి ఈజ్ యువర్ డేడ్. నో క్లింటన్ స్వీటీ. నో బుష్ డార్లింగ్...’’ -
త్రీమంకీస్ - 57
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 57 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నాకు నిద్ర వస్తోంది’’ రాత్రి ఎనిమిదిన్నరకి వానర్ టీ తాగి ఆవులించినట్లు నటించి చెప్పాడు. ‘‘నాక్కూడా’’ మర్కట్ కూడా అదే పని చేసి చెప్పాడు. ‘‘ఉన్నది ఒకటే బెడ్రూం. కాబట్టి మర్కట్, ఇక్కడ సోఫాలో నువ్వు పడుకో. వానర్, నువ్వు పొట్టి కాబట్టి డైనింగ్ కుర్చీలని పక్కపక్కన ఉంచి వాటి మీద పడుకో. నేను, కపీష్ లోపల మంచం మీద పడుకుంటాం’’ రుధిర చెప్పింది. ‘‘అలాగే.’’ ఆ ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే వానర్ రుధిర లేప్టేప్ని తెరిచాడు. అది పాస్‌వర్డ్‌ని అడిగింది. ఇద్దరూ అది ఏమై ఉండచ్చా అని ఆలోచించారు. ‘‘నైఫ్ అని టైప్ చేసి చూడు’’ మర్కట్ సూచించాడు. ‘‘ఊహూ. అది కాదు.’’ రివాల్వర్, పిస్టల్, స్వోర్డ్ల తర్వాత బ్లడ్ అని టైప్ చేస్తే తెరచుకుంది. గూగుల్లోకి వెళ్ళి రైట్ టైం కోసం వెదికితే చాలా కనిపించాయి. టొరంటోలోని ఓ ట్రావెల్ ఏజన్సీ పేరది. టోక్యోలోని ఓ షేర్ బ్రోకర్ సంస్థ పేరది. టెహ్రాన్‌లోని ఓ పెళ్ళిళ్ళని కుదిర్చే సంస్థ పేరది. టెల్ అవివ్‌లోని కండోమ్స్ బ్రాండ్ పేరది. హైద్రాబాద్‌లో ఓ వాచీ షాప్ పేరది. రైట్ టైం అనే వాచీ షాప్ బంజారాహిల్స్‌లో ఉంది. ఆ అడ్రస్ని రాసుకుని గూగుల్ మేప్స్కి వెళ్ళి దాన్ని టైప్ చేశాడు. ఆ గూగుల్ మేప్‌ని చూసి వానర్ ఆనందంగా చెప్పాడు. ‘‘ఇదిగో. ఈ వాచ్ షాప్ పక్కనే ప్రుడెన్షియల్ బేంక్ ఉంది.’’ ‘‘ఎస్ అదే అయి ఉంటుంది’’ చెప్పి లేచి వానర్ బెడ్రూం తలుపు తట్టాడు. చెదిరిన జుట్టుతో, నడుం నించి చుట్టుకున్న దుప్పటిలో ఉన్న కపీష్ తల మాత్రం బయటకి పెట్టి అడిగాడు. ‘‘ఏమిటి?’’ ‘‘ఆ అడ్రస్ కనుక్కున్నాం’’ వానర్ ఆనందంగా చెప్పాడు. ‘‘రేపటి మాటలు ఇవ్వాళ దేనికి? ఇవాల్టి పని ఇవాళ చేయనీ’’ కోపంగా చెప్పి కపీష్ తలుపు మూశాడు. 17 ‘‘రాత్రెలా గడిచిందేంటి?’’ మర్కట్ మర్నాడు ఉదయం ప్రశ్నించాడు. ‘‘అమ్మాయిలు బట్టల్లేకుండా కన్నా బట్టలతోనే అందంగా కనిపిస్తారని అర్థమయ్యేలా గడిచింది. పైగా నా పేరు కప్‌గా, ఆమె పేరు రుర్గా మారింది’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏం మాట్లాడుకున్నారు?’’ వానర్ ఉత్సాహంగా అడిగాడు. ‘‘ఒక్క మాట కూడా మాట్లాడలేదురా మూర్ఖా. బెడ్ రూం మాటల కోసం కాదురా. అది వేరే పనికి ఉద్దేశించబడిందని తెలుసుకో’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు. రుధిర స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ గుసగుసలాడారు. ‘‘మనకి సొరంగంలో ఎలక్ట్రిక్ డ్రిల్ అవసరం. అది ఎంతవుతుందో?’’ కపీష్ గుసగుసలాడాడు. ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్ కొనడానికి మనకి నాలుగున్నర వేలు అవసరం’’ వానర్ గూగుల్ చేసి చూసి చెప్పాడు. ‘‘అంత డబ్బు మన దగ్గర లేదు. రుధిరని అప్పడుగు’’ మర్కట్ సూచించాడు. ‘‘అలాగే.’’ రుధిర డ్రెస్ చేసుకుని వచ్చాక మర్కట్ చెప్పాడు. ‘‘మా వాడు మీతో ఓ విషయం మాట్లాడటానికి మొహమాట పడుతున్నాడు. వాడి తరఫున నేను మాట్లాడనా?’’ ‘‘అలాగే. పెళ్ళి గురించేగా అంకుల్?’’ ‘‘అవును. అలా పక్కకి వెళ్దాం పద.’’ ఇద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చాక ఆమె కపీష్ చేతిని పట్టుకుని చెప్పింది. ‘‘గుళ్ళో పెళ్ళి వద్దు కప్.’’ ‘‘ఏం? చీప్‌గా ఉంటుందనా?’’ మర్కట్ అడిగాడు. ‘‘కాదు. అతిథులంతా కానుకలని హుండీలో వేసి వెళ్తారు.’’ ‘‘అది సరే. నా మిత్రుడికి ఇప్పుడో ఆరు వేల రూపాయలు అవసరం అయ్యాయి. అప్పుగానే’’ వానర్ చెప్పాడు. థంప్స్ డౌన్ సైన్‌ని చూపించి చెప్పింది - ‘‘ఇప్పుడు నా సమస్యా అదే. సారీ కప్. నా డబ్బంతా ప్రస్తుతం లాయర్ దగ్గర ఫీజ్ రూపంలో ఉంది. ఐ కాన్ట్ హెల్ప్ యు.’’ ‘‘ఇట్సాల్ రైట్. నాకు అప్పు అడగడంలో మొహమాటం లేదు. కాని నిన్ను అడగడంలో ఇబ్బంది పడ్డాను’’ కపీష్ చెప్పాడు. డోర్ బెల్ విని మర్కట్ తలుపు తెరిచాడు. అతన్ని చూడగానే ఎదురుగా నిలబడ్డ యువతి మొహం విప్పారింది. ‘‘వాటే సర్ప్రైజ్! నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను ఎంత తపించిపోతున్నానో తెలుసా?’’ ఆమె చెప్పింది. ‘‘మీరెవరు?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘గుర్తు పట్టలా? నేను వైని.’’ ‘‘వైయా? ఎక్స్ కాదా?’’ ‘‘గుడ్ జోక్. వైతరణిని.’’ ‘‘ఓ!’’ తెల్లబోతూ చూస్తూండిపోయాడు. ‘‘నేను యూనిఫాంలో లేకపోవడంతో గుర్తు పట్టలేకపోయావా మట్?’’ ‘‘మట్ ఎవరు?’’ (మూలిక, వైతరిణిలను చూసి కపీష్ ఎందుకు భయపడ్డాడు?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ ఎంత బిజీగా ఉన్నా త్రీ మంకీస్ చదవడం నా నిత్య చర్య అయింది. సీరియల్ పట్టులో ఉంది. - షాహీర్, తాడిపత్రి The episode published on 12-12-14 is very funny...this type of comic serials coming from authors r very rare...thanx to Malladi garu & sakshi... - pradeep kumar pedada,srikakulam -
త్రీమంకీస్ - 56
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 56 - మల్లాది వెంకటకృష్ణమూర్తి రుధిర టై మీదకి రావడం చూసి ముగ్గురూ మాట మార్చారు. ‘‘... ఎన్నైనా చెప్పు. పాత పాటలు చెత్త’’ మర్కట్ చెప్పాడు. ‘‘కాని స్లో అయినా కొన్ని అతను పాడినవి వినసొంపుగా ఉన్నాయి’’ వానర్ చెప్పాడు. ‘‘పీల్చుకోవడం అయిందా?’’ రుధిర అడిగింది. ‘‘ఆ. సరిపడా’’ కపీష్ చెప్పాడు. ‘‘ఐతే పదండి. పీజా వచ్చింది.’’ ‘‘అవును. వేడిగా తింటేనే బావుంటుంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘పదండి. నేనందుకు ఎప్పుడూ సిద్ధమే’’ వానర్ చెప్పాడు. ముగ్గురూ కిందకి వెళ్తూ చూస్తే మొత్తం ఆరుగురు అమ్మాయిలు సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించడంతో మర్కట్ చెప్పాడు. ‘‘మన రాష్ర్టంలో ప్రేమ అభివృద్ధి చెందుతోంది.’’ ‘‘ప్రేమ కన్నా సెల్‌ఫోన్ బిల్స్ అభివృద్ధి చెందుతున్నాయి’’ కపీష్ చెప్పాడు. ముందు జింజర్ బ్రడ్ని తిన్నాక కోక్ తాగుతూ వానర్ చెప్పాడు - ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు. ‘‘కోక్ రుచి కోక్దే. పెప్సీకి ఎక్కడ వస్తుంది?’’ మర్కట్ కూడా చెప్పాడు. ‘‘మీరు ఇప్పుడు ఏదో రైమ్‌ని పాడారు? ఏమిటది?’’ రుధిర అడిగింది. ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ అంటే కోక్ అని అర్థం. కోక్ స్పెల్లింగ్‌ని మేథ్స్ సింబల్స్‌తో చెప్పాడు’’ మర్కట్ వివరించాడు. రుధిర, ఆ ముగ్గురూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఓ అత్తకి, అల్లుడికి ఆస్తి పంపకాల్లో తగాదా వస్తే తన అన్నయ్య ఆ వివాదం తీర్చి, ఇద్దర్నించీ చెరో ఐదు లక్షలు, ఎవరికి వాళ్ళకే న్యాయం చేస్తున్నట్లుగా నటిస్తూ ఎలా గుంజాడో లాంటి విషయాలు చెప్పింది రుధిర. ‘‘ఇది వినండి. దీన్ని నాకు నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ వాట్సాప్‌లో పంపాడు. కొన్ని సంవత్సరాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్‌కి ఓ గాడిద వెళ్లి ఇంకా స్టుపిడ్‌గా తన పేరు ఉందా లేదా అని చెక్ చేస్తోంది. ఈ ఏడు అది లేకపోవడంతో కోపంగా అడిగింది. ‘ఈ ఏడు నా స్థానాన్ని ఎవరు అలంకరించారు?’ మీరు చెప్పండి. ఎవరు?’’ ‘‘రాహుల్ గాంధీ?’’ కపీష్ అడిగాడు. ‘‘కరెక్ట్. ఇది వినండి...’’ జోక్స్‌తో వాళ్ళకి టైమే తెలీకుండా పోయింది. ఆమెకి తెలీకుండా లేప్టాప్ని తెరవాలనుకుంటే రుధిర బాత్రూంకి కూడా వెళ్ళలేదు. ఎప్పట్లా తులసీరాం జైలుకి వచ్చి ములాఖత్ రిజిస్టర్లో సంతకం చేసి లోపలకి రాగానే అతని కోసం ఎదురు చూసే ఇద్దరు కానిస్టేబుల్స్ అతన్ని ప్రశ్నించారు. ‘‘కపీష్‌కి, నీకు మధ్య ఏమిటి సంబంధం? ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు? అసలు రోజూ అతని దగ్గరకి ఎందుకు వస్తున్నావు?’’ ‘‘నేను అప్పు ఇచ్చేవాడు. అతను తీసుకునే వాడు. అదీ సంబంధం. నా దగ్గర పది వేలు అప్పు తీసుకున్నాడు. దాని వడ్డీ కోసం వస్తున్నాను. అతని డబ్బు మీ దగ్గర ఉందట. నాకు డబ్బిమ్మని మీకు చెప్పాడా? అతనేడి?’’ ‘‘అబద్ధం. అతను పారిపోవడానికి సహాయం చేయడానికి వచ్చావు.’’ ‘‘లేదే? అతను పారిపోయాడా?’’ ‘‘అవును. ఇవాళ తెల్లవారుఝామున పారిపోయాడు.’’ ‘‘ఐతే ఇక ఫర్వాలేదు. అతన్ని బయటే కలుసుకుని వడ్డీ వసూలు చేసుకుంటాను.’’ వెనక్కి తిరిగిన తులసీరాంని పట్టుకుని ఆపి ఓ కానిస్టేబుల్ చెప్పాడు - ‘‘నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’’ ‘‘దేనికి? అప్పు ఇవ్వడం నేరం కాదే?’’ ‘‘ఓ నేరస్థుడు జైలు నించి పారిపోవడానికి కుట్ర పన్నినందుకు.’’ ‘‘రామ రామ. ఎంత మాట? నాకేం తెలీదు.’’ ‘‘అది కోర్ట్ తేల్చాలి.’’ అతను ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఇంటికి లాక్కెళ్ళారు. యమధర్మరాజు కేసు విని అడిగాడు - ‘‘నువ్వు నేరం చేశావా?’’ ‘‘లేదు మహాప్రభో. నేనే నేరం చేయలేదు. నా అప్పు తాలూకు వడ్డీ వసూలు చేసే ప్రయత్నం నేరమే అయితే అది నేను ఎప్పట్నించో చేస్తున్నాను.’’ ‘‘పధ్నాలుగు రోజులు’’ ఆయన చెప్పాడు. ‘‘ఇదన్యాయం సామే.’’ ‘‘ఈ దేశంలో న్యాయమే. ఇంగ్లీష్ కోర్ట్‌లో ఓ మనిషి అతను ఐరిష్ మేన్ అని ఋజువు కానంతవరకూ అమాయకుడిగా పరిగణించబడతాడు. అదే ఇండియన్ కోర్ట్‌లో ఓ మనిషి ఫలానా రాజకీయ నాయకుడి బావమరిది అని ఋజువు కానంతవరకూ అపరాధిగా పరిగణింపబడతాడు.’’ తులసీరాంని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. యమధర్మరాజు సెల్‌ఫోన్ మోగింది. కొత్తగా ఆయన పెట్టుకున్న ‘ఏమి చెప్పుదును ఒరే. ఒరే. మనకు ఎదురే లేదిక హరే హరే. ఇంటి పోరు వదిలించుకుంటిరా...’ అనే పాట రింగ్ టోన్గా వినిపించింది. -
త్రీమంకీస్ - 52
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 52 - మల్లాది వెంకటకృష్ణమూర్తి 15 వానర్‌కి టెన్షన్‌గా ఉంది. తెల్లవారు ఝామున తన చేతి గడియారం వంక మరోసారి చూసుకున్నాడు. మూడు నించి అలా దాని వంక చూస్తూనే ఉన్నాడు. మూడుంపావుకి తన బెర్త్‌లో లేచి కూర్చున్నాడు. ‘మన్నించండి. నిద్రపోయేవాడిని, భోజనం చేసేవాడిని, మైధునంలో పాల్గొనే వాడిని, పెళ్ళి పీటల మీద కూర్చున్నవాడిని రాజైనా లేపడం పాపమేనని మీకు తెలిసే ఉంటుంది. అందుకని మిమ్మల్ని లేపి వెంట తీసుకెళ్ళడం లేదు’ ముందే రాసిన ఆ కాగితాన్ని వానర్ గాఢనిద్రలో ఉన్న పట్టయ్యకి కనపడేలా ఉంచాడు. ఆయన గురక వినిపిస్తోంది. మూడున్నర దాటుతున్నా ఎక్కడా అలికిడి లేదు. బయట ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. దుర్యోధన్ ముఠా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారా? తను అరవాలా? ఆ మీమాంసలో ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేకపోయాడు. దుర్యోధన్ తమని మోసం చేశాడు అనుకుంటూండగా అకస్మాత్తుగా అతనికి అలికిడి వినిపించింది. చెవులు రిక్కించి విన్నాడు. ఓ సెల్ తలుపు తాళం తీస్తున్న చప్పుడు లీలగా వినిపించింది. గుసగుసలు. మళ్ళీ ఇంకో సెల్ తలుపు తాళం తీస్తున్న చప్పుడు. మళ్ళీ గుసగుసలు. వానర్లో ఉత్కంఠ అధికం అయింది. ‘‘దుర్యోధన్! మా సంగతేమిటి? అరవనా?’’ గొంతు తగ్గించి అడిగాడు. ‘‘అరవక. పనవుతోంది’’ కపీష్ కంఠం వినిపించింది. ‘‘అంతా సవ్యంగా జరుగుతోంది’’ మర్కట్ మాటలు కూడా వినిపించాయి. ఓ నిమిషం తర్వాత గార్డ్ వచ్చి వానర్ సెల్ తలుపు తాళం తీశాడు. అప్పుడే తన సెల్లోంచి బయటకి వచ్చే మర్కట్ నిద్రలో ఉన్న వేమనని చూసి, ‘గుడ్ బై మిత్రమా! మే గాడ్ బ్లెస్ యు - ఆయన అంటూ ఉంటే’ నెమ్మదిగా చెప్పాడు. మర్నాడు ఈ విషయం తెలిశాక ఆయన ‘ఏం పారిపోవడమో? ఏం జైలో?’ అంటాడని అనుకున్నాడు. కాని ఆయన ‘ఎక్కడికి పారిపోగలరు? ఈ ప్రపంచమే ఓ జైలైతే’ అంటాడని ఊహించలేకపోయాడు. ముగ్గురూ టు ఒన్ టు సెల్‌లోకి వెళ్ళారు. అది ఖాళీగా ఉంది. గబగబా సొరంగం కోసం వెదికారు. గోడ రంగులోని ఓ సిమెంట్ అచ్చు సొరంగం ముఖద్వారం పక్కన నిలబెట్టి ఉంది. గోడలోంచి కిందకి సొరంగం చేయబడింది. అది కనపడకుండా అక్కడ అచ్చుతో మూసి ఉంచుతున్నారని ముగ్గురూ గ్రహించారు. ‘‘వాళ్ళేరి?’’ మర్కట్ ప్రశ్నించాడు. ‘‘వాళ్ళు ఆరుగురూ ముందే దిగి వెళ్ళిపోయారు. రెండు నిమిషాలాగి మనల్ని రమ్మన్నారు. పదండి.’’ కపీష్ టార్చ్ లైట్‌ని వెలిగించి, లోపలకి ప్రసరింపచేసి చూసి చెప్పాడు. ‘‘ముందుగా నేను వెళ్తాను. ఓ నిమిషం గేప్ ఇచ్చి మర్కట్, మళ్ళీ ఓ నిమిషం తర్వాత వానర్ రండి. బయట కలుద్దాం.’’ కపీష్ లోపలకి దిగాడు. అది చాలా సన్నటి సొరంగం. మనిషి పడుకుని పాకేంత మేరకే ఉందా సొరంగం. అతను మట్టి నేల మీద ముందుకి పాకాడు. ‘‘నా నెత్తి మీద ఈ తుపాకీ బానెట్‌తో, పుర్రె పగలకుండా నెమ్మదిగా కొట్టి వెళ్ళు’’ మర్కట్ కూడా వెళ్ళాక గార్డ్ వానర్ని కోరాడు. ‘‘కాని అది నేరం కదండి’’ వానర్ సందేహించాడు. ‘‘లేకపోతే నేను చిక్కుల్లో పడతాను.’’ వానర్ అతను అందించిన తుపాకీని తీసుకుని నెమ్మదిగా కొట్టాడు. ‘‘అంత నెమ్మదిగానా? నాకు స్పృహ తప్పాలిగా.’’ ‘‘ఐతే బొప్పి కనపడేలా కొడతాను. మీకు మీరే స్పృహ తప్పించుకోండి.’’ వానర్ అతని నెత్తి మీది టోపీని తీసి తుపాకీ మడమతో నెత్తి మీద గట్టిగా కొట్టాడు. ‘‘ఎంత దెబ్బ కొట్టావురా’’ చెప్పి అతను స్పృహ తప్పిపోయి కిందపడ్డాడు. ఆ సమయంలో సొరంగం మధ్యలో ఉన్న దుర్యోధన్ తన అనుచరులతో చెప్పాడు. ‘‘సొరంగం లోంచి బయటకి రాగానే ఆ ముగ్గుర్నీ చంపి వెళ్దాం.’’ ‘‘తప్పకుండా. నువ్వా మాట అంటావని తెలిేన చెంచా కత్తులు తెస్తున్నాను’’ ఓ అనుచరుడు చెప్పాడు. దాదాపు నాలుగైదు నిమిషాల సేపు అలా పాకాక కపీష్‌కి దూరంగా వెలుగు కనిపించింది. టార్చ్ లైట్ వెలుగులో అతనికి సొరంగంలో మడిచిన ఓ కాగితం కనిపించింది. దాన్ని అందుకుని మడతలు విప్పి చూశాడు. అది మేప్. ఓ బిల్డింగ్ ముందు బేంక్ అని రాసి ఉంది. పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్‌లోని ఓ కిటికీ దగ్గర ‘రైట్ టైం’ అని రాసి ఉంది. అదేమిటో అర్థం కాకపోయినా, అది ఎవరి జేబులోంచో బయటకి పడిపోయి ఉంటుందని ఊహించాడు. అతను దాన్ని జేబులో ఉంచుకుని ముందుకి పాకాడు. ముందు నించి నూతిలోంచి వినిపించినట్లుగా మాటలు వినిపించాయి. ‘‘బేంక్‌లోకి కూడా ఇలాగే పాక్కుంటూ వెళ్ళాలి.’’ ‘‘అవును. అందుకు ఇది ప్రాక్టీస్ అనుకో.’’ ఆ తర్వాత నిశ్శబ్దం. కొద్దిసేపటికి మళ్ళీ వినిపించింది. ‘‘రేపేగా?’’ ‘‘అవును. ఈసారి టార్చ్‌లైట్ తీసుకెళ్ళాలి.’’ (సొరంగం నుంచి బయటకు రాగానే ముగ్గురు మిత్రుల కంటపడిన దృశ్యం ఏమిటి?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ తరానికి కావలసినట్లు ‘వాటర్ విత్ ఎండ్స్’ లాగా చల్లగా అక్షర ప్రవాహం చేయడం, అప్పటికీ ఇప్పటికీ బియాండ్ ఎండ్స్‌కి వెళ్లకుండా బ్యాలెన్స్డ్గా రాయడం మల్లాది సొంతం. అంతర్లీన సూత్రం. - శశికళ వి, నాయుడుపేట 3 మంకీస్ థ్రిల్లింగ్‌గా, కామెడీగా, సస్పెన్స్‌తో సాగుతోంది. థ్యాంక్స్ టు సాక్షి. అరవింద్‌రెడ్డి (naniaravind101@hotmail.com) -
త్రీమంకీస్ - 51
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 51 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘కాదు. రేపే పంపుతాను.’’ ‘‘రేపటికల్లా బెయిల్ రాదే?’’ ‘‘అవును. రాదు. మనిషి ఆశాజీవి కదా? రేపు కూడా ఇదే డైలాగ్ చెప్తాను. జైల్లో ఉన్నన్ని రోజులూ మర్నాడే విడుదల అని నమ్ముతూంటే జైలు జీవితం చులాగ్గా సాగిపోతుందని ఎవరో ఫేస్బుక్లో పెడితే చదివాను.’’ ‘‘మంచి ఫిలాసఫీ.’’ ‘‘నీ మెళ్ళోని అదేమిటి? తాయెత్తా?’’ వానర్ అడిగాడు. ‘‘కాదు. జెహర్ మోడీ అనే చెట్టు బెరడు. దీన్ని సర్పగంధి అని కూడా అంటారు.’’ ‘‘దేనికది?’’ ‘‘పాము కాని, తేలు కాని కరిచిన చోట దీన్ని నీళ్ళల్లో అరగదీసి రాస్తే చాలు. విషం దిగుతుంది. ఓసారి శ్రీశైలం అడవులకి వెళ్ళినప్పుడు తెచ్చాను. అక్కడ చాలా ఔషధ చెట్లుంటాయి. ఆర్నెల్లకోసారి వెళ్ళి కావలసినవి తెచ్చుకుంటూంటాను.’’ ‘‘ఈసారి మనిద్దరం కలిసి వెళ్దాం.’’ ‘‘మన హనీమూన్ అక్కడే చెంచుల గూడెంలో. అది మిగిలిన అన్ని ప్రదేశాలకన్నా గొప్పగా ఉంటుందని గేరంటీ.’’ ‘‘ఎలా చెప్పగలవు?’’ ‘‘వీర్యవృద్ధికి, స్తంభనా శక్తికి అక్కడ మంచి ఔషధ చెట్లు ఉన్నాయి.’’ ‘‘గ్రేట్.’’ ‘‘మీకు ఆస్తమా లేదుగా?’’ ‘‘ఊహూ. ఏం అలా అడిగారు?’’ ‘‘ఫాంస్ఫాసిస్ అనే ఆయుర్వేదం మందు దానికి నా దగ్గర సిద్ధంగా ఉంది. ఇంకా అల్సర్, కుష్ఠు, సోరియాసిస్, డయాబెటిస్, తామర లాంటివి ఉంటే చెప్పండి. ఔషధ మొక్కలతో నేనే స్వయంగా మందులు చేశాను.’’ ‘‘దైవవశాత్తు అలాంటివేం ఇంకా లేవు.’’ ‘‘ధన్వంతరీ పూజ చేసి హనీమూన్‌కి వెళ్దాం.’’ ‘‘ధన్వంతరిలా ప్రేమ కూడా మనుషులకి చికిత్స చేస్తుంది.’’ ‘‘అవును. దాన్ని తీసుకునే వారికే కాదు, ఇచ్చే వారికి కూడా ప్రేమ చికిత్స చేస్తుంది వార్’’ మూలిక చెప్పింది. ‘‘ఇక్కడ వాచీ దొరుకుతుందా?’’ తిరిగి వస్తూ వానర్ గార్డ్ని అడిగాడు. ‘‘దేనికి? ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? దాన్ని మిస్ అవుతావనా?’’ గార్డ్ వెటకారంగా అడిగాడు. ‘‘అవును. భలే కనిపెట్టావే. ఎంత?’’ ‘‘స్వంతానికా? అద్దెకా?’’ ‘‘అద్దెకి కూడా దొరుకుతాయా?’’ ‘‘సరైన అద్దె చెల్లిస్తే ఇక్కడ అద్దెకి అమ్మాయి కూడా దొరుకుతుంది. సెల్‌ఫోన్ అద్దె రోజుకి ఐదు వందలు. అందులోనే టైం కూడా ఉంటుంది’’ గార్డ్ చెప్పాడు. ‘‘సెల్ఫోన్లో నేను మాట్లాడటానికి బయట నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. అంతా లోపలే ఉన్నారు. వాచీ చాలు. రోజుకి ఎంత అద్దె?’’ ‘‘వంద. నిజంగా నీ దగ్గర డబ్బుందా?’’ గార్డ్ ఆశగా అడిగాడు. ‘‘నిజంగా వాచీ ఉందా?’’ జేబులోంచి వానర్ వంద రూపాయల నోటుని తీసి చూపించి అడిగాడు. ‘‘ఉంది. సరే. అరగంటలో తెస్తాను.’’ ‘‘ఇదిగో సామీ వాచీ’’ ఇరవై నిమిషాల్లో గార్డ్ వానర్‌కి కటకటాల్లోంచి ఓ వాచీని అందించాడు. ‘‘ఇది కరెక్ట్ టైమేనా?’’ అది నడుస్తోందో లేదో పరీక్షించాక వానర్ అడిగాడు. ‘‘అవును. డబ్బివ్వండి.’’ ‘‘మళ్ళీ రేపు వచ్చి వంద తీసుకో. ఉంటే’’ వంద నోటు ఇచ్చి చెప్పాడు. ‘‘ఏం? రేపటికి వాచీ ఉండకుండా ఏమవుతుంది?’’ ‘‘వాచీ కాదు. నువ్వుండకపోవచ్చు. లేదా నేను ఉండకపోవచ్చు.’’ ‘‘నువ్వెక్కడికి వెళ్తావు? నేనెక్కడికి వెళ్తాను?’’ అతను పెదవి విరిచి చెప్పాడు. ‘‘ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలుసు?’’ వానర్ నవ్వాడు. ఎప్పటిలానే సాయంత్రం జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక మర్కట్ వైతరణి దగ్గరకి వెళ్ళాడు. ‘‘హలో’’ ఆమె పలకరించింది. ‘‘హలో. నువ్వు ఈ డ్రెస్లోకన్నా టి షర్ట్, జీన్స్లలో బావుంటావు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మళ్ళీ ఊహల్లో విప్పి కట్టావా?’’ ‘‘ఎప్.’’ ‘‘నేను చీరలు కట్టను. ఇంటి దగ్గర అవే వేసుకుంటూంటాను.’’ ‘‘మినీ స్కర్ట్, టాప్లలో కూడా నువ్వు అదరహో.’’ ‘‘పిచ్చివాడా! అసలవేం లేకపోతే ఇంకా టాప్‌గా ఉంటాను.’’ జైలర్ గట్టిగా ఈల వేసి చెప్పాడు. ‘‘టైమప్. అంతా మీమీ సెల్స్‌కి వెళ్ళండి.’’ ‘‘రేపు మళ్ళీ కలుద్దాం’’ వైతరణి చెప్పింది. తను ఆ రాత్రే సొరంగంలోంచి జారుకుంటున్నాడని, మర్నాడు కలవడని మర్కట్ వైతరణికి చెప్పలేదు. ‘‘అలాగే. రేపు కలుద్దాం’’ చెప్పాడు. ఈలోగా కపీష్ దుర్యోధన్ దగ్గరకి వెళ్ళి చెప్పాడు - ‘‘తాబేలు, కుందేలు గుర్తున్నాయిగా? మమ్మల్ని కూడా కలుపుకుని తీసుకెళ్ళారా సరే. లేదా మీరూ వెళ్ళలేరు. పైగా అంత పెద్ద సొరంగం తవ్వినందుకు మీ ముఠాని తీహార్ జైలుకి తరలిస్తారు. జాగ్రత్త.’’ (తప్పించుకునేటప్పుడు సొరంగంలో వారికి ఏమి కనిపించింది?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ ఆసక్తిగా, ఆహ్లాదంగా సాగే కథ రాస్తున్న మల్లాది గారికి కృతజ్ఞతలు. - గౌస్ మీరావలి (gmgousemeeravali@gmail.com) l All thanks to Malladi venkatakrishna Murthy garu. Amazing series novel which is very entertaining and can read it daily with smile on our faces. - priya thakur -
త్రీమంకీస్ - 50
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 50. - మల్లాది వెంకటకృష్ణమూర్తి 14 ఉదయం పదకొండున్నరకి గార్డ్ వానర్ సెల్ తలుపు తాళం తీసి తలుపు తెరచి అతనితో చెప్పాడు. ‘‘డాక్టరమ్మ నిన్ను తీసుకురమ్మంది.’’ ‘‘రోజూ వెళ్తున్నావు. నీకేమైనా దీర్ఘరోగం కాని, ప్రాణాంతక రోగం కానీ ఉందా?’’ పట్టయ్య అడిగాడు. ‘‘అది ఇవాళ తెలుస్తుంది.’’ వానర్ గార్డ్ వెంట నడిచాడు. ఆమె గదిలోకి వెళ్ళాక వానర్ని చూసి ఆమె అడిగింది. ‘‘హలో. ఎలా ఉన్నావు?’’ ‘‘రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు.’’ ‘‘వేడి చేసి ఉంటుంది.’’ ‘‘మీరు పదేపదే గుర్తుకు వస్తూంటే నాకు నిద్రెలా పడుతుంది?’’ ‘‘నిజంగానా అంతగా గుర్తొచ్చానా?’’ డాక్టర్ మూలిక పమిట సర్దుకుంటూ అడిగింది. ‘‘యప్. చాలా.’’ ‘‘నా గురించి ఆలోచిస్తూంటే నిద్ర పట్టలేదన్నమాట.’’ ‘‘అవును.’’ ‘‘ఏం ఆలోచించావు?’’ ‘‘షేక్స్పియర్ కన్నా అతని భార్య పెద్దదైనప్పుడు నా భార్య నాకన్నా పెద్దదైతే ఏం? అని ఆలోచించాను. మీ జుట్టు అక్కడక్కడ నెరిసినట్లుంది.’’ ‘‘బాల నెరుపు మా వంశంలో ఉంది. అందుకే మందార ఆకులతో కాచిన నూనెని రాసుకుంటున్నా. సగం పైనే నల్లబడ్డాయి. నిజంగా కాంప్రమైజ్ అయ్యావా?’’ ‘‘బాగా.’’ ‘‘అమ్మయ్య.’’ ‘‘మూలీ’’ ప్రేమగా పిలిచాడు. ‘‘ఏమిటి?’’ ‘‘నాకో ప్రేమ కానుక ఇవ్వవా?’’ ‘‘ఏమిటది?’’ ‘‘నీ టార్చ్ లైట్.’’ ‘‘అది దేనికి?’’ ‘‘దాన్ని ఆర్పి వెలిగించి చూస్తూంటే నువ్వే నా జీవనజ్యోతి అని గుర్తుకు వస్తూంటుంది.’’ ‘‘అవును. నన్ను తేలిగ్గా గుర్తు తెచ్చుకునే మార్గం అది. కాని నేను ఖైదీలకి ఏమీ ఇవ్వకూడదు అనే నియమం ఒకటి ఉంది.’’ ‘‘ఓసారి నియమం తప్పాక ఎన్నిసార్లయినా తప్పచ్చుగా?’’ ‘‘నియమం తప్పి ఇంతదాకా నేనేం ఇవ్వలేదే నీకు?’’ ‘‘నీ మనసు ఇచ్చావుగా?’’ ‘‘అది నువ్వు దోచుకున్నావు తప్ప నేను ఇవ్వలేదు.’’ ‘‘ఐతే కళ్ళు మూసుకో.’’ ‘‘దేనికి?’’ ‘‘టార్చి లైట్‌ని కూడా దోచుకుంటాను.’’ డ్రాయర్ సొరుగులోంచి దాన్ని తీసి బల్ల మీద ఉంచి కళ్ళు మూసుకుని ఒకటి నించి ఐదు లెక్క పెట్టసాగింది. వానర్ దాన్ని అందుకుని జేబులో ఉంచుకున్నాడు. కళ్ళు తెరచి చూసి చెప్పింది. ‘‘అరె! ఇక్కడ టార్చి లైట్ ఉండాలే? నువ్వు కాని చూశావా?’’ ‘‘చూళ్ళేదు.’’ ‘‘తీసుకున్నావా?’’ ‘‘లేదు.’’ ‘‘దాంతో ఎందరో చెవులని, నోళ్ళని, గొంతుకలని, కళ్ళని పరిశీలించాను. ఇప్పుడు అది ఎవరి దగ్గరకి వెళ్ళిందో వారి మనసుని పరిశోధిస్తుందన్నమాట.’’ ‘‘అవును. నాకు నీ వాచీ కూడా ఇవ్వవా?’’ వానర్ అర్థించాడు. ‘‘వాచీనా?’’ ‘‘అవును.’’ ‘‘దేనికి?’’ ‘‘నీ గుర్తుగా నీ శరీరాన్ని తాకిన వాచీ నా చేతిని తాకుతూంటే నాకు హాయిగా నిద్ర పడుతుంది.’’ ‘‘సారీ వార్. ఇవ్వలేను.’’ ‘‘ఏం?’’ ‘‘టార్చ్ లైట్ జైలుది. వాచీ నా స్వంతం కాబట్టి. అదీకాక టార్చ్ లైట్ సెర్చ్‌లో పట్టుపడ్డా నువ్వు దొంగిలించావని చెప్తే నమ్ముతారు. నా వాచీని నువ్వు దొంగిలించావంటే, నాకు తెలీకుండా అది ఎలా జరిగిందన్న ప్రశ్న వస్తుంది. నువ్వు నాకు తెలీకుండా నా చేతిలోంచి కొట్టేసావంటే నమ్మరు. ఐనా నీ కోరికని కాదనలేను.’’ ‘‘థాంక్స్’’ వానర్ చేతిని చాపాడు. అతని చేతిలో తన చేతి నించి తీసిన గాజుని ఉంచింది. ‘‘బంగారం గాజా?’’ ‘‘కాదు. బంగారం రంగు గాజు గాజు.’’ ‘‘ఐతే ఒద్దులే. ఇంకొన్ని రోజులేగా. బెయిల్ మీద బయటకి రాగానే మనం కలిసే ఉంటాంగా’’ వానర్ నిరాకరించాడు. ‘‘పోనీ నా బొట్టు బిళ్ళ ఇవ్వనా?’’ ‘‘ఒద్దు. నాకు జ్వరం ఉందా?’’ అతని నాడిని పట్టుకుని చూసి చెప్పింది. ‘‘లేదు.’’ ‘‘ఫేస్బుక్ అకౌంట్ ఉందా మీకు?’’ వానర్ అడిగాడు. ‘‘ఉంది.’’ ‘‘మీ పేరుతోనేనా?’’ ‘‘అవును.’’ ‘‘మీకు రేపు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే నన్ను ఏడ్ చేసుకుంటారా?’’ ‘‘అలాగే. అది బెయిల్ వచ్చాక కదా?’’ (జైల్లో అద్దెకు ఏమేం దొరుకుతాయి?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది సీరియల్ చాలా బాగుంది. ముఖ్యంగా సమకాలీన సంఘటనలు జోడించి రచయిత రాసిన తీరు చాలా నచ్చింది. అన్వర్ గీత, మల్లాది రాత మన పాఠకులకు పండుగే పండుగ. - ఎం. అజయ్, రామచంద్రాపురం, గుంటూరు జిల్లా l "Three Monkeys" so far is a fun ride. I laughed out loud when one character says that a pregnant woman should be nicely referred as "Body Builder". There are many other hilarious jokes too in this serial. - Giridhar G Saint Louis (USA) -
త్రీమంకీస్ - 49
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 49 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘రేపు రాత్రి లోగా మళ్ళీ అనేకసార్లు కలుసుకుందాం’’ చెప్పి మళ్ళీ వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. మర్కట్ లడ్డూని మూడు ముక్కలు చేసి పంచాడు. ‘‘ఇక మనం రేపు రాత్రి పారిపోయే విషయం చర్చించుకుందాం. మనకో టార్చ్‌లైట్ కావాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘దేనికి?’’ వానర్ అడిగాడు. ‘‘సొరంగంలో చీకటిగా ఉంటుంది కాబట్టి.’’ ‘‘నీ ప్రియురాలు డాక్టర్ మూలిక దగ్గర అది తప్పకుండా ఉంటుంది. అడిగి తీసుకో’’ మర్కట్ సూచించాడు. ‘‘అలాగే. కాని అది ఒన్-వే-ట్రాఫిక్ మాత్రమే.’’ ‘‘సరైన టైంకి బయలుదేరాలంటే మనకి వాచీ కూడా అవసరం. జెంట్స్ వాచీ ఆమె దగ్గర ఉండదు. తనది ఇస్తుందని నేను అనుకోను. నీకు మూలిక ఐదు వందలు ఇచ్చిందన్నావుగా? బయట నించి వాచీని తెచ్చిస్తాడేమో గార్డ్ని అడిగి చూడు. సెకండ్ హేండ్ వాచీ సరిపోతుంది’’ కపీష్ సూచించాడు. ‘‘అలాగే.’’ ‘‘అవును. మన ముగ్గురిలో ఒకరికి టైం తెలిేన్త చాలు. మిగతా ఇద్దర్నీ అలర్ట్ చేసి తీసుకెళ్ళచ్చు’’ మర్కట్ చెప్పాడు. పారిపోయే అంశం మీద కపీష్ వారికి మరి కొన్ని సూచనలు చేసాడు. భోజనం అయ్యాక అంతా మళ్ళీ గంట విని తమ తమ సెల్స్‌కి చేరుకున్నారు. కాేనపు మర్కట్ ఆ చిన్న సెలో అటూ ఇటూ నడిచాడు. అతనికి విసుగ్గా ఉంది. వేమనని అడిగాడు. ‘‘దేవుడికి కూడా మనలా సమస్యలు ఉంటాయా వేమన గారు?’’ ‘‘దేవుడి సమస్య ఒక్కటే. అదృశ్యంగా మాత్రమే ఉండగలగడం. కనపడటం ఆయనకి చేత కాదు. మనకి ఉన్న సమస్య ఒక్కటే. అదృశ్యంగా ఉండలేకపోవడం. కనపడకుండా ఉండగలిగితే మన చాలా సమస్యలు మాయం అవుతాయి.’’ ‘‘దేవుడు మనకి ఎందుకు కనపడడు?’’ కాసేపాగి మర్కట్ ప్రశ్నించాడు. ‘‘నువ్వు కనపడు. నేను నిన్ను నమ్ముతా’ అంటాడు మనిషి. ‘కాదు. ముందు నువ్వు నమ్ము. తర్వాత నేను కనపడతా’ అంటాడు దేవుడు.’’ ‘‘చైనా మొహాలన్నిటినీ దేవుడు ఒకేలా ఎందుకు చేసాడు?’’ కొద్దిసేపు ఆలోచించి అడిగాడు. ‘‘దేవుడు ప్రతీ దేశానికి వెళ్ళి మనుషుల్ని వేరువేరుగా తయారు చేశాక చైనాకి వెళ్ళేసరికి విసిగిపోయాడు కాబట్టి.’’ ‘‘స్వామీ! దేవుడికి మన మీద ప్రీతి కలగాలంటే ఏం చేయాలి?’’ మర్కట్ అడిగాడు. ‘‘పెంగ్విన్ పక్షులకి ఆహారం వేయాలి.’’ ‘‘అదేమిటి?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘దేవుడు భూమిని మనుషుల కోసం నిర్మించాడు. ఒక్క అంటార్కిటికా ఖండాన్ని మాత్రం పెంగ్విన్ పక్షుల కోసం నిర్మించాడు. ఎందుకంటే ఆయనకి ఆ పక్షులంటే ప్రేమ. కాబట్టి వాటికి ఆహారం పెడితే దేవుడికి ప్రీతి కలుగుతుంది’’ వేమన చెప్పాడు. ‘‘దేవుడ్ని నవ్వించడం ఎలా?’’ ‘‘నీ భవిష్యత్ ప్రణాళికలని ఆయనకి చెప్పి.’’ ఇంకేం అడగాలా అని మర్కట్ ఆలోచిస్తూంటే వేమన శూన్యంలోకి చూస్తూ అకస్మాత్తుగా అడిగాడు. ‘‘నీ ఆత్మోన్నతికి నువ్వేం చేస్తున్నావు?’’ ‘‘నన్నా?’’ మర్కట్ అడిగాడు. ‘‘ఇక్కడ ఆత్మధారులు మరెవరైనా ఉన్నారా?’’ ‘‘చపాతీలో బగారా బైంగన్ నంచుకుని తినాలని అనుకుంటున్నాను.’’ వేమన అతని వంక జాలిగా చూసి, మళ్ళీ శూన్యంలోకి చూసి నిట్టూర్చి చెప్పాడు. ‘‘నీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నావు.’’ ‘‘ఇది ఆఖరి ప్రశ్న. మీరు బయట ఉన్నప్పుడు నిత్యం ఆలయానికి వెళ్తూండేవారా?’’ ‘‘లేదు. ఆలయానికి దగ్గరయ్యే వారంతా దేవుడికి దూరం అవుతారు. మనం దేవుడితో మాట్లాడితే భక్తులం. దేవుడు మనతో మాట్లాడితే పిచ్చివాళ్ళం..’’ ఆయన తన బెర్త్ మీద పడుకుని చెప్పాడు. ‘‘వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూస్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్.’’ ‘నేను నేను కాకుండా మరొకరైతే బావుండేది. నన్ను మరొకర్నిగా చెయ్యి’ అని మర్కట్ దేవుడ్ని ప్రార్థించాడా రాత్రి. (వానర్‌కి డాక్టర్ మూలిక ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి?) -
త్రీమంకీస్ - 48
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 48 - మల్లాది వెంకటకృష్ణమూర్తి తాబేలు ఓటమిని అంగీకరించలేదు. ఆలోచించి కుందేలుని మళ్ళీ పోటీకి పిలిచింది. ఈసారి కుందేలు వేగంగా పరిగెత్తి ఫినిష్ లైన్‌కి ముందున్న ఓ చెరువు దగ్గర ఆగిపోయింది. దానికి ఈత రాదు. తాబేలు నింపాదిగా వచ్చి, చెరువులోకి దూకి, ఈది అవతల ఒడ్డున ఉన్న ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. ఈసారి నీతి ఏమిటి? గెలుపు కోసం నీ మార్గాన్ని మార్చుకో. ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు బ్రదర్. ఇది ముఖ్యమైన కథ. సరే. కుందేలు తాబేలుని మళ్ళీ పరుగు పోటీకి పిలిచి, తాబేలుతో - ‘చెరువు గట్టు దాకా నువ్వు నా భుజాన కూర్చో. చెరువుని దాటేప్పుడు నీ భుజం మీద నేను కూర్చుంటాను’ అని చెప్పింది. అందుకు తాబేలు ఒప్పుకుంది. ఆ ప్రకారం కుందేలు, దాని భుజం మీది తాబేలు చెరువు దాకా చేరుకున్నాయి. చెరువులోని నీళ్ళల్లో ఈదే తాబేలు వీపు మీద కుందేలు కూర్చుని చెరువుని దాటింది. ఆ రెండూ సమానంగా ఒకేసారి ఫినిషింగ్ లైన్‌ని చేరి రెండూ గెలిచాయి. నీతి ఏమిటి? ఎవరినైనా ఓడగొట్ట లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి నెగ్గు. నన్ను నువ్వు నెగ్గలేవు. సఖ్యత వల్ల ఇద్దరికీ మంచిదే. శతృత్వం వల్ల నీకు మాత్రమే నష్టం. ఏమంటావు?’’ మర్కట్, వానర్లు ఆ మాటల్ని మెచ్చుకుంటూ వెంటనే చప్పట్లు కొట్టారు. ‘‘సరే’’ కోపాన్ని దిగమింగుకుని దుర్యోధన్ చెప్పాడు. ‘‘జాగ్రత్త. మాట తప్పితే జైల్లోంచి ఒక్కరూ బయటకి వెళ్ళలేరు. జైల్లోంచి అంతా గమనిస్తూంటాం. రేపు రాత్రి పథకం ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘రేపు రాత్రి గార్డ్ మా అందరి సెల్స్ తాళాలు తెరుస్తాడు. పోలీసులు మర్నాడు కట్టి పడేసిన అతన్ని చూస్తారు. తేలు తేలు అని అరిచినందుకు తెరిచానని చెప్తాడు’’ దుర్యోధన్ చెప్పాడు. ‘‘ఇందాక నువ్వు ఫోన్ చేసింది అతనికే నన్నమాట.’’ ‘‘అదీ తెలుసా?’’ దుర్యోధన్ ఉలిక్కి పడ్డాడు. ‘‘మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ని మిల్లీ లీటర్ల మూత్రం పోసావో కూడా మాకు తెలుసు. ఏ సెల్ లోంచి సొరంగం తవ్వారు?’’ వానర్ అడిగాడు. ‘‘టు నాట్ టు సెల్ లోంచి’’ దుర్యోధన్ ఓడిపోయిన వాడి మొహం పెట్టి చెప్పాడు. ‘‘సొరంగం ఏ మేరకి తీశారేమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘దేనికి?’’ దుర్యోధన్ కోపంగా ప్రశ్నించాడు. ‘‘నేను చదివింది ఇంజనీరింగ్ కోర్స్. సొరంగం చుట్టు కొలత మూడు అడుగులు ఉంటే అంతకు రెట్టింపు సీలింగ్ పైన ఉండాలి. అంటే మూడడుగుల సొరంగానికి కనీసం ఆరు అడుగుల మట్టిపైన ఉండాలి. లేదా అది కూలే ప్రమాదం ఉంది. అదీ లెక్క.’’ ‘‘నాకా లెక్కలు తెలీవు కాని నా చిన్నప్పుడు నేను మా నాన్నతో దొంగతనాలకి వెళ్ళేవాడిని. ఆయన కన్నపు దొంగ. ఇలాంటి వాటిలో నాకు అనుభవం ఎక్కువ. నేను తీసిన ఏ సొరంగం ఇంత దాకా కూల్లేదు.’’ ‘‘ఇంకేం?’’ అతను దూరంగా వెళ్ళాక మిత్రులు ముగ్గురూ తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. ‘‘డాక్టర్ మూలిక ప్రవర్తన మీతో ఎలా ఉంది?’’ వానర్ అడిగాడు. ‘‘మామూలుగానే ఉంది. ఏం?’’ మర్కట్ అడిగాడు. ‘‘నాతో మాత్రం పేషెంట్ - డాక్టర్ల మధ్య సంబంధంలా లేదు...’’ తన అనుభవాన్ని వివరించాడు. వెంటనే మర్కట్ సన్నగా ఈల వేసి చెప్పాడు. ‘‘నిన్ను రోజూ పిలుస్తోందా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి మూలిక నీతో ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఏమంటావ్?’’ ‘‘అవును. నాతో కూడా ఒకరు ప్రేమలో పడ్డారు. పేరు రుధిర’’ కపీష్ రుధిర గురించిన విషయాలు చెప్పాడు. ‘‘నా జోడీ గురించి మీ ఇద్దరికీ తెలుసు. ఆమె పేరు వైతరణి అని కూడా మీకు తెలుసు’’ మర్కట్ చెప్పాడు. ‘‘మనం పారిపోయేందుకు వాళ్ళేమైనా ఉపయోగిస్తారేమో చూద్దాం. లేదా కనీసం మనకి బెయిల్ అయినా ఇప్పించవచ్చు. కాబట్టి వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచుదాం’’ కపీష్ చెప్పాడు. జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక విజిల్ ఊది చెప్పాడు. ‘‘అంతా మీ మీ సెల్స్‌కి వెళ్ళండి.’’ 13 ఆ రాత్రి మెస్‌లో గార్డ్లు ఎప్పటిలా ఖైదీల మీద ఓ కన్నేసి ఉంచారు. భోజనాల దగ్గర ఎప్పటిలా మిత్రులు ముగ్గురూ ఒకేచోట కూర్చుని గొంతు తగ్గించి మాట్లాడుకోసాగారు. ‘‘అడుగో దుర్యోధనుడు. నేను వెళ్ళి మేజిక్ నేర్పి వస్తాను’’ చెప్పి కపీష్ లేచాడు. దుర్యోధన్ ముందు కూర్చుని చెప్పాడు. ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని నువ్వు స్పెషల్ ఖైదీ అని పెట్టి ఉంటారు. దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిని పైకి విసిరేసి పైకి చూడసాగాడు. అంతా కూడా పైకి చూస్తూండగా ఆ లడ్డూని విసిరేస్తే మర్కట్ దాన్ని పట్టుకున్నాడు. ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు. వాళ్ళల్లో కదలిక లేదు. అంతా కపీష్ ధైర్యానికి, దుర్యోధన్ స్పందించకపోవడానికి ఆశ్చర్యపోయారు. గుసగుసలు మొదలయ్యాయి. (దేవుడ్ని నవ్వించడం ఎలా?) -
త్రీమంకీస్ - 47
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 47 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘వాళ్ళతో పాటా? అది ఏ సెల్నించో కూడా మనకి తెలీదుగా?’’ మర్కట్ ప్రశ్నించాడు. ‘‘దుర్యోధన్ దగ్గరకి పదండి.’’ ‘‘అమ్మో!’’ వానర్ చెప్పాడు. ‘‘ఆ భయం వాడికే ఉండాలి కాని పదండి.’’ ఓ చోట కూర్చుని ఉన్న దుర్యోధన్ దగ్గరకి ఆ ముగ్గురు మిత్రులు వెళ్ళారు. ‘‘నువ్వు మాత్రం మడుగు చేయక’’ మర్కట్ వానర్ని హెచ్చరించాడు. ‘‘సారీ! పరిస్థితిని బట్టి నా ప్రమేయం లేకుండా జరిగిపోయే దాని మీద మాట ఇవ్వలేను.’’ ‘‘ఏమిటి?’’ అతను వీళ్ళని చూసి అడిగాడు. ‘‘నీతో ఒంటరిగా మాట్లాడాలి’’ కపీష్ కోరాడు. ‘‘ఒంటరిగానా? నాతోనా? ఏం పని?’’ ‘‘అవును. నేను మాట్లాడేది వీళ్ళంతా వింటే నీకే నష్టం.’’ ‘‘దేని గురించి?’’ దుర్యోధన్ అనుమానంగా చూస్తూ అడిగాడు. ‘‘రేపు రాత్రి గురించి.’’ దుర్యోధన్ వాళ్ళ వంక సీరియస్‌గా చూసి ఎవరూ లేని వైపు నడిచాడు. ‘‘ఏమిటి రేపు రాత్రి?’’ గద్దించాడు. ‘‘నీ రహస్యం మొత్తం మాకు తెలుసు. మాకూ ఆ సొరంగం లోంచి పారిపోయే అవకాశం ఇేన్త సరే. లేదా మీరు బయటకి పోలేరు.’’ ‘‘కుదరదు’’ దుర్యోధన్ వెంటనే చెప్పాడు. ‘‘ఐతే గట్టిగా అరిచి ఆ సంగతి ఇప్పుడే అందరికీ చెప్తాం.’’ వెంటనే దుర్యోధన్ మొహం పాలిపోయింది. క్రోధంగా అడిగాడు - ‘‘అసలు నీకు ఏం తెలుసు?’’ ‘‘సరే. మాకు ఏం తెలుసో వానర్ చెప్తాడు. వానర్! నువ్వు మన ముగ్గురిలో బాగా బిగ్గరగా మాట్లాడగలవు కదా? ఇదిగో అంతా వినండి. దుర్యోధన్ అండ్ గేంగ్ రేపు రాత్రి సెల్‌లోని సొరంగంలోంచి తప్పించుకుంటున్నారు కాబట్టి వచ్చి వాళ్ళకి వీడ్కోలు చెప్పండి’ అని అరు.’’ ‘‘ఇదిగో వినండి...’’ వానర్ అరవగానే దుర్యోధన్ అతని నోటిని మూసి చెప్పాడు. ‘‘సరే. సరే. ఇప్పుడు అది బయట పడితే మేం నాలుగు నెలల నించి పడ్డ కష్టం వృథా అవుతుంది. నేను శనివారానికల్లా బయట ఉండాల్సిన అవసరం ఉంది.’’ ‘‘నువ్వు డబ్బు చెల్లించే జైల్ గార్డ్ మా సెల్ తలుపు తాళాలు కూడా తీేన ఏర్పాటు చెయ్యి. రాత్రంతా మేలుకుని చూస్తూంటాం. మాకు చెయ్యిస్తే సరిగ్గా మూడూ ముప్ఫై ఒకటి కల్లా సెల్ లోంచి అరిచి అందర్నీ లేపి చెప్తాం. మన బ్లాక్‌లోని ఏభై రెండు మంది ఖైదీలు వింటారు. పెద్ద గోల మొదలవుతుంది. మీరు సొరంగంలో ఉండగానే పట్టుకుంటారు. ఆ సమయంలో రోడ్ మీద రద్దీ ఉండదు. కాబట్టి బయటైనా మీరు దొరుకుతారు’’ కపీష్ చెప్పాడు. ‘‘దీనివల్ల మీకు కలిగే నష్టం ఏం లేదు కదా? లేదా మొదటికే మోసం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇది బ్లాక్మెయిల్’’ దుర్యోధన్ ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు. ‘‘అవును. మేం మంచివాళ్ళయితే అసలు జైల్లోకే వచ్చి ఉండేవాళ్ళ కాము’’ వానర్ చెప్పాడు. ‘‘సరేనా?’’ కపీష్ అడిగాడు. ‘‘సరే. కాని గుట్టుచప్పుడు కాకుండా రావాలి.’’ ‘‘అలాగే. లేదా తేలు తేలు అని అరుస్తాను. అందర్నీ లేపాక మీరు తప్పించుకున్నారని చెప్తాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఒక వేళ అరిస్తే నేను జైల్లోనే ఉంటే నీ ప్రాణాలు పోతాయని తెలుసా?’’ ‘‘పోవు. నువ్వు మమ్మలేం చేయలేవు. నిన్ను హై సెక్యూరిటీ సెల్‌లోకి తరలిస్తారు. కాని జైల్లోని ఆ సెల్లో నీ ప్రాణాలే పోతాయని తెలుసా?’’ కపీష్ అడిగాడు. ‘‘ఎలా?’’ ‘‘నువ్వు తాగే కాఫీలో గాజు పొడి కలవచ్చు. నువ్వు తినే గారెలో బ్లేడు ముక్క కలవచ్చు. కిచెన్ మా చేతిలో ఉంది. చంపడానికి కేవలం ఒక్క దేహబలమే అవసరం లేదు. దుర్యోధన్. పశుబలం కన్నా బుద్ధిబలం గొప్పది. నల్లిలా నలిపేస్తా జాగ్రత్త’’ కపీష్ హూంకరించాడు. ‘‘సరే అన్నాగా? ఇది మీకెలా తెలిసింది?’’ ‘‘అనవసరంగా బాత్రూంలో, మెస్‌లో మాతో పెట్టుకున్నావు. అప్పటి నించి నిన్ను ఓ కంట కనిపెడుతున్నాం’’ వానర్ ధైర్యంగా చెప్పాడు. ‘‘నీ అనుచరులు మట్టి పోయడం చూశాం’’ మర్కట్ చెప్పాడు. అతను ఏం మాట్లాడకపోవడంతో కపీష్ చెప్పాడు - ‘‘ఐతే ఈ కథ విను. నువ్వు స్కూల్‌కి వెళ్ళి ఉంటే, దీన్ని చిన్నప్పుడు క్లాసులో విని ఉంటావు. ఓ కుందేలు, తాబేలు పరుగు పందెంలో పోటీ వేసుకున్నాయి. కుందేలు తాబేలు కన్నా ముందు పరిగెత్తింది. ఫినిష్ లైన్‌కి చేరే ముందు తాబేలు చాలా వెనకపడటంతో కుందేలు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకుని ఓ చెట్టు కింద కూర్చుంది. అది మాగన్నుగా కునుకుతీసింది. మెళకువ వచ్చాక చూస్తే ఏముంది? తాబేలు ఫినిష్ లైన్‌ని దాటుతోంది. నీతి ఏమిటి? చేపట్టిన పనయ్యే దాకా విశ్రాంతి తీసుకోకూడదు. మీరు అలా సొరంగాన్ని తవ్వారు. కాని కథ పూర్తవలేదు బ్రదర్. విను. సరే. కుందేలు ఆలోచించి మళ్ళీ తాబేలుని పరుగు పందేనికి రమ్మంది. ఈసారి కుందేలు విశ్రాంతి తీసుకోకుండా ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. నీతి ఏమిటి? మళ్ళీ అదే. గమ్యం చేరేదాకా విశ్రమించకూడదు. ఇంకా కథ పూర్తి కాలేదు బ్రదర్. విను... (తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి మిత్రులు ముగ్గురూ ఏం చెప్పుకున్నారు?) -
త్రీమంకీస్ - 46
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 46 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అవును. బెయిల్ టైం అయ్యాక తిరిగి లొంగిపోకపోవడం.’’ ‘‘అయ్యో!’’ ‘‘మీరెప్పుడు బయటకి వస్తారు?’’ ‘‘ఏదీ? లోపలకి వచ్చి ఇవాళ్టికి నాలుగు రోజులేగా?’’ ‘‘అలాగా? ఐతే రెండు, మూడేళ్ళు కేసు, ఒకటిన్నర ఏళ్ళ జైలు శిక్ష. మొదటి నేరమా?’’ ‘‘అవును. మొదటి రెండు నేరాలు. బేంక్ దొంగతనం. బైక్ దొంగతనం.’’ ‘‘మీతో మాట్లాడాలనిపించి వచ్చాను. మీకు బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరా?’’ ‘‘లేరు.’’ ‘‘బెస్ట్‌ఫ్రెండ్ ఒక్కడూ లేడా?’’ ‘‘వాళ్ళంతా లోపలే ఉన్నారు.’’ ‘‘అరె! నేనా ప్రయత్నం చేస్తాను. మా ఆస్థాన లాయర్ ఎటూ ఉన్నారు.’’ కపీష్ మొహం వికసించింది. ‘‘నా ఫ్రెండ్స్ ఇద్దరి సంగతి కూడా దయచేసి చూడండి. పాపం వాళ్ళిద్దరి బెస్ట్‌ఫ్రెండ్ జైల్లోనే ఉన్నాడు. వాడు వీడే’’ తన వంక వేలితో చూపించుకున్నాడు. ‘‘అలాగే. కేసు వివరాలు కోర్ట్‌లో తీసుకుంటాను.’’ ‘‘ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.’’ ‘‘అక్కడి సిబ్బందంతా నాకు బాగా పరిచయం. మా అన్నయ్య మీద అక్కడ పదిహేడు కేసులు నడుస్తున్నాయి. మీకు పెళ్ళైందా?’’ ‘‘మీరింత దాకా నాకు తారసపడకుండానే? ఇంకా లేదు.’’ ‘‘ప్రామిస్?’’ ‘‘ప్రామిస్ లేదా మీ అన్న... మీకూ కాలేదుగా?’’ నవ్వాడు. ‘‘ప్రామిస్ పెళ్ళైతే కాలేదు’’ అని చెప్పి వారిద్దరికీ మధ్య అడ్డుగా ఉన్న అద్దం మీద రుధిర తన అరచేతిని ఉంచింది. కపీష్ కూడా ఇవతల నించి అద్దం మీద ఆమె అరచేతి మీద తన అరచేతిని ఉంచాడు. ‘‘బై’’ చెప్పి లేచింది. ‘‘బై... అప్పుడప్పుడు వస్తూండండి.’’ రుధిర వెళ్తూంటే అనుకున్నాడు, ఈమె సినిమాల్లో ట్రై చేస్తే హీరోయిన్ పక్కన గ్రూప్ డేన్సర్ వేషం దొరికేదని! తిరిగి వెళ్తూ గార్డ్ని అడిగాడు. ‘‘ఇక్కడ సెల్‌ఫోన్ ఎంతేంటి?’’ ‘‘కావాలా? ఏభై వేలు. విత్ అన్లిమిటెడ్ ఫ్రీ టాక్ టైం. ఫ్రం బిఎస్సెన్నెల్ టు బిఎస్సెన్నెల్.’’ ‘‘చవకే. ఆలోచిస్తాను.’’ ‘‘హాఫ్ బాటిల్ రమ్ వెయ్యి. కిన్లే సోడా బాటిల్ నూట ఏభై. అదీ ఆలోచించు. సిగరెట్ కూడా కావాలా?’’ ‘‘అబ్బే! సెల్‌ఫోన్ అలవాటైనట్లుగా ఆ రెండూ ఇంకా అలవాటు కాలేదు’’ కపీష్ చెప్పాడు. ‘‘బయట బిజీగా ఉంటారుగా. ఏదైనా అలవాటు చేసుకోడానికి ఇది మంచి చోటు. ఓ రోజు ముందు అడిగితే చాలు.’’ గార్డ్ సూచించాడు. 12 ఉదయం నిద్ర లేచాక రోల్ కాల్కి వెళ్ళబోయే ముందు వానర్ బాత్రూంలోకి వెళ్ళాడు. అతనికి బాత్రూంలోని ఓ కేబిన్లోంచి దుర్యోధన్ మాటలు గుసగుసగా వినిపించడంతో ఆ తలుపు పక్కన ఆగి చెవి ఆనించి విన్నాడు. ‘‘రేపు రాత్రికే.’’ ‘‘...’’ ‘‘మూడున్నరకి.’’ ‘‘...’’ ‘‘అవును. ఆ సెల్లోంచే. బయటకి వెళ్ళాక మిగిలిన సగం నీకు ముడుతుంది.’’ ఫ్లష్ చేసిన నీళ్ళ శబ్దం వినపడగానే వానర్ పక్క కేబిన్‌లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. దుర్యోధన్ బయటికి వెళ్ళాక ఆ కేబిన్ తలుపుని తెరిచి లోపలకి వెళ్ళి వెదికాడు. అతను ఊహించినట్లుగానే ఫ్లష్ టేంక్‌లో వాటర్‌ప్రూఫ్ కవర్లోని సెల్‌ఫోన్ కనపడింది. జైల్లో ఆకస్మిక దాడులు జరిపినప్పుడు మొబైళ్ళ కోసం వెతుకుతారని దుర్యోధన్ దాన్ని అక్కడ దాచాడని వానర్‌కి అర్థమైంది. ఆఖరిసారి డయల్ చేసిన నంబర్ జైల్లో అతనికి సహకరించే సిబ్బందికి చెందిందని వానర్ ఊహించాడు. బయటికి వచ్చి ఆరుబయట రోల్ కాల్ కోసం వదిలిన రిమాండ్ ఖైదీల్లోని తన మిత్రులిద్దరి కోసం వెదికాడు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘‘నువ్వే బెటర్ బ్రదర్. నీకు బెయిల్ ఇప్పించే గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. మేం ఇద్దరం ఉట్టి ఆవారాగాళ్ళం. మాకు బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు’’ మర్కట్ చెప్పాడు. ‘‘నిజమే. డబ్బు లేకపోతే డుబ్బుకి కొరగాడు అనేది మా నాయనమ్మ.’’ ‘‘డుబ్బు అంటే?’’ ‘‘అడగలేదు. పారిపోవడానికి ఇంకేదైనా ప్రయత్నం చేయాలి’’ కపీష్ చెప్పాడు. వానర్ వాళ్ళ దగ్గరకి ఉత్కంఠగా వచ్చాడు. అతని మొహంలోని భావాలని గ్రహించిన కపీష్ అడిగాడు. ‘‘ఏమిటి?’’ వానర్ వారి దగ్గరకి వెళ్ళి తను విన్న విషయాన్ని వివరించాడు. ‘‘అదా సంగతి’’ వెంటనే కపీష్ చెప్పాడు. ‘‘ఓ! నీకు అర్థమైందా?’’ ‘‘అయింది. సొరంగం తవ్వకం పూర్తయింది. రేపు రాత్రే వాళ్ళు పారిపోతున్నారు. సరే. మనం కూడా వాళ్ళతోపాటు ఆ సొరంగం లోంచి బయట పడదాం.’’ (జైల్లోంచి తప్పించుకునేందుకు కపీష్ చెప్పిన ప్లానేంటి?) -
త్రీమంకీస్ - 45
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 45 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘లేదు. దుర్యోధన్ నోటి మాట తప్ప అందుకు అతన్ని గోలచందర్ నియమించినట్లు ఋజువులు, సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని అరెస్ట్ చేయలేదు. నిజానికి ఆ సమయంలో అతను ఇన్‌కం టేక్స్ ఆఫీస్‌లో కూడా లేడు. తనకి ఎలిబీ కోసం బేంక్ మేనేజర్‌తో మీటింగ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన సమయంలో ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఆ బేంక్ లాకర్ని ఆపరేట్ చేశాడనే సాక్ష్యం ఉంది. దుర్యోధన్ ఎవరో తనకి తెలీదని, ఆ కవర్లోని డబ్బు గురించి కూడా తనకి తెలీదని అంతా తన భార్య మీదకి తోసేశాడు. ఆమె మాంచాలని చంపడానికి దుర్యోధన్‌ని నియమించిందనే అనుమానం కూడా పోలీసులకి ఉంది.’’ ‘‘పాపం అసూయే లల్లేశ్వరి చేసిన నేరం’’ వానర్ చెప్పాడు. ‘‘లోకంలో చాలామంది చేసే నేరం ఏదో జరుగుతుందని ఆశించి ఏదో చేయడం. చివరికి వారికి పడే శిక్ష నిరాశ’’ ఇదంతా విన్న కొద్ది దూరంలోని వేమన చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. 11 ‘‘మీ కోసం ములాఖాత్‌కి ఎవరో వచ్చారు. ఇక మీ కోటా అయిపోయింది. ఇంక వచ్చినా వచ్చేనెల దాకా ఎవరొచ్చినా రావద్దని చెప్పి పంపించేస్తాం’’ సెల్‌కి వెళ్ళబోయే ముందు గార్డ్ కపీష్‌తో చెప్పాడు. ‘‘లాభం లేదు. వాడు నన్ను వదలడు. నేను రానని చెప్పు’’ కపీష్ నిరాకరించాడు. ‘‘వాడు కాదు. అది.’’ ‘‘అది?’’ కపీష్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘అవును’’ ములాఖాత్‌కి వెళ్ళి వచ్చిన ఓ ఖైదీ చెప్పాడు. ‘‘మగాళ్ళకి వాడు, ఆడవాళ్ళకి ఆమె వాడాలి తప్ప అది అనడం తప్పు. నా కోసం ఏ ఆడది వస్తుంది చెప్మా? సరే. పద.’’ కపీష్ కొద్దిగా ఆసక్తిగా వెళ్ళి గార్డ్ చూపించిన విండో ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ‘‘హలో’’ ఆమె చిరునవ్వుతో పలకరించింది. ‘‘హలో’’ కపీష్ కొద్దిగా తబ్బిబ్బయ్యాడు. గత రెండు రోజులుగా తన వంక చూస్తున్న ఆమె తనని చూడటానికి వస్తుందని అతను ఎదురుచూడలేదు. ‘‘మీరు వచ్చింది నా కోసమా? లేక... ఆయన ఎవరు?’’ ‘‘అతను మా అన్నయ్య. ఇవాళ నేను వచ్చింది మాత్రం నీ కోసమే.’’ ‘‘నా కోసం వచ్చేది మాత్రం మా అన్న గారు కారు. ఆ మార్వాడీ మా అన్న అనుకోకండి.’’ ‘‘తెలుసు. మీ సంభాషణ విన్నాగా’’ నవ్వింది. ‘‘నా పేరు కపీష్.’’ ‘‘నా పేరు రుధిర. ఎందుకో మిమ్మల్ని చూడాలని అనిపించింది. వచ్చాను.’’ ‘‘ఎందుకో?’’ జవాబుగా మధురంగా నవ్వింది. ‘‘మీ పేరేం అన్నారు?’’ అడిగాడు. ‘‘రుధిర.’’ ‘‘కలం పేరా?’’ ‘‘కాదు. మా నాన్న పెట్టిన పేరు.’’ ‘‘రుధిర అంటే రక్తం అని మీ నాన్నకి తెలుసా?’’ ‘‘తెలిసే ఆ పేరు పెట్టారు. డాక్టర్లు తమ కూతుళ్ళకి శుశ్రుత అని, నటీనటులు తమ కూతుళ్ళకి అభినయ, సితార అని, రచయితలు లిపి లేదా కావ్య అని పేర్లు పెడుతూంటారు చూశారా? అలా మా నాన్న గూండా కాబట్టి కావాలనే రుధిర అనే పేరు పెట్టారు.’’ ‘‘ఓ! ఐతే సరే.’’ ‘‘మీరేం చేస్తూంటారు?’’ ‘‘ఇంజనీరింగ్ చదివాను.’’ ‘‘అది కాదు. ఏం డిపార్ట్మెంట్?’’ ‘‘ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్.’’ ‘‘అది కాదు. మర్డర్లా? జేబు దొంగతనాలా? చీటింగ్ కేసులా? చెయిన్ స్నాచింగ్లా?’’ నవ్వింది. ‘‘బేంక్ దొంగతనం.’’ ‘‘ఐతే మా అన్న అభ్యంతరం చెప్పరు.’’ ‘‘మీ అన్న కూడా గూండాయేనా?’’ ‘‘అవును.’’ ‘‘ఏ డిపార్ట్మెంట్?’’ ‘‘అన్నీ. లేండ్ సెటిల్మెంట్లు, బెదిరించడాలు, కాలో, చెయ్యో తీసేయడాలు... అలాంటివన్నీ. మీరు ఇంజనీర్ అన్నారు. నేను టెన్త్ ఫెయిల్డ్.’’ ‘‘మీరేం చేస్తూంటారు?’’ ‘‘ఎంబామింగ్.’’ ‘‘సారీ?’’ ‘‘మనుషులు చచ్చిపోతారు కదా?’’ ‘‘అవును.’’ ‘‘వాళ్ళ దూరపు బంధువులు వచ్చే దాకా శవం పాడవకుండా ఎంబామింగ్ చేస్తూంటాను.’’ ‘‘భయం వేయదా?’’ ‘‘వాటికే నేనంటే భయం. ‘మెల్లిగా... మెల్లిగా’ అంటూంటాయి’’ నవ్వింది. ‘‘ఓ! మీ అన్న గారికి బెయిల్ ప్రయత్నం చేస్తున్నారా?’’ ‘‘లేదు. అతను ఇప్పటికే బెయిల్ జంపింగ్ చేయడంతో బెయిల్ ఇవ్వరు.’’ ‘‘బెయిల్ జంపింగ్ అంటే బెయిల్ మీద బయటకి వెళ్ళి...’’ (డుబ్బు అంటే?) -
త్రీమంకీస్ - 44
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 44 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నే చెప్పలా? ఏవేవో ఊహించుకున్నావు. పాలు, చక్కెర కావాలా?’’ మాంచాల అడిగింది. ‘‘వద్దు. రోజ్ టీ ఇలాగే తాగాలి.’’ టీ కప్పుని నోటి ముందు ఉంచుకుని తాగబోతూ ఆగి లల్లేశ్వరి మళ్ళీ చెప్పింది. ‘‘పెళ్ళి జైల్లాంటిదే. కాని సెక్స్ ఉంటుంది.’’ టీ కప్పుని నోటి ముందు ఉంచుకుని తాగడం మళ్ళీ ఆపి లల్లేశ్వరి చెప్పింది. ‘‘మా వారు వెల్లుల్లి మానేసినా లేక నాకు వెల్లుల్లి పడినా నా జీవితం మరోలా ఉండేది.’’ టీని కొద్దిగా తాగి మొహం చిరాగ్గా పెట్టి చెప్పింది. ‘‘ఇది ఇంత చేదుగా ఉండడం నాకు గుర్తు లేదు.’’ ‘‘అవును. నాకూ చేదుగానే ఉంది. నేను ఎక్కువసేపు కాచానేమో?’’ మాంచాల చెప్పింది. ‘‘అందువల్ల ఇంత తేడా ఉండదు. బాగా చేదుగా ఉంది’’ చెప్తూ దాన్ని సైడ్ టేబుల్ మీద పెట్టబోతే మాంచాల లేచి నవ్వుతూ వారిస్తూ చెప్పింది. ‘‘బాగా వేడిగా ఉంది. పూర్తిగా తాగు. సర్దుకుంటుంది.’’ లల్లేశ్వరి టీని అతి కష్టం మీద పూర్తి చేసింది. కొద్ది క్షణాల్లో కడుపు పట్టుకుని మూలుగుతూ అరిచింది. ‘‘నాకు టీ పడినట్లు లేదు.’’ ‘‘కొద్దిసేపట్లో అదే సర్దుకుంటుంది.’’ కొద్దిసేపు బాధ పడ్డాక కోరింది. ‘‘నువ్వు డాక్టర్ మోహన్‌కి వెంటనే ఫోన్ చెయ్యి.’’ మాంచాల ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్‌ని అందుకుని కొన్నిసార్లు నొక్కి డాక్టర్ మోహన్ నంబర్ చూసింది. తర్వాత ఆ నంబర్ డయల్ చేసి వెంటనే కట్ చేసేసి మాట్లాడింది. ‘‘హలో డాక్టర్ మోహన్ గారి హాస్పిటలా? మిసెస్ గోలచందర్ ఇంటికి మీరు వెంటనే రావాలి...’’ లల్లేశ్వరి కొద్దిసేపు కడుపు పట్టుకుని ఉండలు చుట్టుకునిపోయింది. తర్వాత మంచం మీద వెనక్కి వాలిపోయి కళ్ళు మూసేసింది. ‘‘లల్లీ’’ మాంచాల పిలిచింది. కానీ సమాధానం లేదు. నాడిని చూస్తే కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే తను తాగిన టీ కప్పుని తీసుకెళ్ళి సింక్‌లో కడిగి యథాస్థానంలో ఉంచింది. విషం సీసాని తీసుకుని తన వేలిముద్రలు పోయేలా నేప్కిన్తో తుడిచి లల్లేశ్వరి వేలిముద్రలు పడేలా ఆమె అరచేతిలో ఉంచి దాన్ని టీపాట్ పక్కన ఉంచింది. తన హేండ్ బేగ్ అందుకుని తలుపువైపు నడుస్తూంటే అకస్మాత్తుగా డోర్ బెల్ మోగింది. ఆమె భయంతో ఆగిపోయింది. మరోసారి డోర్ బెల్ మోగింది. ‘‘మిసెస్ గోలచందర్!’’ బయటి నించి పిలిచే అతన్ని కిటికీలోంచి చూసింది. అతను వెయ్యి రూపాయల నోట్లా కనిపిస్తున్నాడు అనుకుంది- నకిలీ నోట్లా. ‘‘జస్ట్ ఎ మినిట్’’ చెప్పి శవం ఉన్న బెడ్ రూం తలుపు మూసివెళ్ళి భయంగా మెయిన్ డోర్ తెరిచింది. ‘‘మీ భర్త కవర్ని తీసుకురమ్మని నన్ను పంపారు. అది ఆఫీస్ టేబిల్ డ్రాయర్లో ఉందని చెప్పారు.’’ అర్థం కానట్లుగా చూస్తున్న మాంచాలతో చెప్పాడు - ‘‘ఇన్కంటేక్స్ ఆఫీస్‌నించి ఫోన్ చేసి ఇప్పుడే విషయం నా ముందే మాట్లాడారు.’’ ‘‘అవును. రండి’’ ఇందాక ఫోన్లో విన్నది గుర్తొచ్చి మాంచాల చెప్పింది. ఆమె డ్రాయర్ తెరుస్తూంటే చెప్పాడు. ‘‘నేను మీ భర్త దగ్గర చాలాకాలంగా పని చేస్తున్నాను.’’ డ్రాయర్లోని కవర్ తీసి అతనికి అందించింది. అతను అందులోని డబ్బు లెక్క పెట్టి చెప్పాడు. ‘‘ఏభైవేల రూపాయలు. సరిపోయాయి. ఆయన నిక్కచ్చి మనిషి.’’ ‘‘ఎవరు?’’ మాంచాల అడిగింది. ‘‘మీ భర్త. కాని మీలాంటి అందమైన భార్యని అతను ఎందుకు చంపాలనుకుంటున్నాడో నాకు బోధపడడం లేదు.’’ ‘‘ఏమిటి?’’ నివ్వెరపోతూ అడిగింది. దుర్యోధన్ తనతో తెచ్చిన కత్తిని ఎత్తి బలంగా మాంచాల ఎడమ ఛాతీలో కుడివైపు పొడిచాడు. అది గుండెలోకి దూసుకెళ్ళడంతో తక్షణం ఆ గుండె ఆగిపోయింది. ‘‘ఛ!’’ మర్కట్ చెప్పాడు. ‘‘అరె పాపం!’’ వానర్ చెప్పాడు. ‘‘తర్వాత?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు. ‘‘తన భార్యని చంపమంటే, ఆమెకి బదులు తన ప్రియురాలు మాంచాలని చంపినందుకు గోలచందర్కి దుర్యోధన్ మీద బాగా కోపం వచ్చింది. ఇది అతని పనై ఉండచ్చని పోలీసులకి చెప్పాడు. అతన్ని పార్క్‌లో అరెస్ట్ చేశారు. నేను చెప్పిందంతా దుర్యోధన్ పోలీసులకి చెప్పాడు. మాంచాలని తనే చంపానని ఒప్పుకున్నాడు. గోలచందర్ భార్యని, ప్రియురాలినీ అతనే చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నడుస్తోంది.’’ ‘‘గోలచందర్ ఖర్చు చేసిన లక్ష, భార్య, ప్రియురాలు... అంతా నష్టమేనన్నమాట.’’ ‘‘అవును.’’ ‘‘మరి కిరాయి హంతకుడ్ని నియమించిన నేరం మీద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారా?’’ కపీష్ అడిగాడు. (కపీష్‌తో ములాఖత్‌కి ఎవరొచ్చారు?) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ l An utterly new concept.hilarious.enjoyable.Hats off to ring master Malladi. - Drggreddy Reddy (drggreddy44@gmail.com) మల్లాది గారి 3 మంకీస్ కొత్తగా ఉంది. ఈ ట్రెండ్‌కి, మా జనరేషన్‌కి తగ్గ కథను అందించిన సాక్షికి, మల్లాది గారికి నా హృదయపూర్వక అభినందనలు. - డి. రాజు (ds.raju009@gmail.com) -
త్రీమంకీస్ - 43
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 43 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఆ రాత్రి అతను తన భార్య పడక గదిలోకి వెళ్ళాడు కానీ ఆమె మొహాన్ని దిండుతో అణచి గాలాడకుండా చేసి చంపే ధైర్యం చేయలేక బయటికి వచ్చేశాడు. ‘‘అది నా వల్ల కాదు. అందుకు ఎవర్నయినా నియమిస్తాను’’ మర్నాడు ఉదయం గోలచందర్ చెప్పాడు. ‘‘బహుశా నేనా పని చేయగలనేమో?’’ మాంచాల చెప్పింది. ‘‘వద్దు. నువ్వు దీంట్లో జోక్యం చేసుకోకు. ఎవరినైనా ఏర్పాటు చేస్తాను’’ గోలచందర్ తిరస్కరించాడు. ‘‘సరే. అది మీకే వదిలేస్తాను. కానీ దయాహృదయులైన మీరు ఎప్పటికీ చేయలేరని నా నమ్మకం’’ మాంచాల నవ్వుతూ చెప్పింది. ‘‘కొందరు ఎంత బీదవాళ్ళంటే వారి దగ్గర డబ్బు తప్ప ఇంకేం ఉండదు. మా ఆవిడ అలాంటిది. దేనికీ డబ్బు ఖర్చు చేయనీదు’’ గోలచందర్ కోపంగా చెప్పాడు. ‘‘ఐతే మీరీ ధైర్యం చేయక తప్పదు. రేపు మన ఇంటి అవసరాలని, వెల్లుల్లి కొన్న బిల్లుని ప్రేమతో చెల్లించగలరా?’’ మాంచాల అడిగింది. అతను వెళ్ళాక మాంచాల కొద్ది క్షణాలు ఆలోచించి తన స్నేహితురాలి ఇంటి నంబర్ తిప్పింది. బెడ్రూంలోని లల్లేశ్వరి రిసీవర్ ఎత్తి చెప్పింది. ‘‘హలో?’’ ‘‘లల్లీ! మాంచాలని. నిన్ను నిద్రలేపానా?’’ అడిగింది. ‘‘లేదు. ఏమిటి విశేషం?’’ ‘‘నువ్వు, గోలచందర్ హనీమూన్‌లో తాగిన గులాబీ రేకుల టీ గురించి ఓసారి చెప్పావు గుర్తుందా?’’ ‘‘అవును?’’ ‘‘అది ఓరియంటల్ రోజ్ పెటల్ టీ యేనా?’’ ‘‘అవును.’’ ‘‘ఐతే వస్తున్నాను. నీకో సర్ప్రయిజ్’’ అని చెప్పి మాంచాల రిసీవర్ పెట్టేసి అలమార దగ్గరకి వెళ్ళింది. తలుపు తెరిచి ఆ టీ పెట్టెని, ఓ విషం సీసాని తీసుకుని లల్లేశ్వరి ఇంటికి వెళ్ళింది. బెడ్ రూంలో మంచం మీద దిగులుగా పడుకున్న లల్లేశ్వరికి ఆ పెట్టెని చూపించింది. ‘‘ఇదెక్కడిది?’’ ఆమె ఆనందంగా అడిగింది. ‘‘ఓ షాపులో దొరికింది. ఇది తాగితే నీకు హనీమూన్లోని బంగారు జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి అనిపించి నీ కోసం కొన్నాను.’’ ‘‘మాంచాలా! నా మనసు బాగా లేదు. నిన్న రాత్రి మళ్ళీ మా వారి నించి వెల్లుల్లి వాసన వేసింది’’ బాధగా చెప్పింది. ‘‘అదంతా నీ ఊహ మాత్రమే’’ మాంచాల చెప్పింది. ‘‘ఇవాళ ఉదయం పదికి గోలచందర్ ఆఫీస్‌లోంచి బయటికి వెళ్ళాడు. ఇంతదాకా నా దగ్గరికి రాలేదు. అది ఊహా?’’ ‘‘బహుశా అతను వ్యాపార పనుల మీద తిరుగుతూండి ఉండచ్చు.’’ ‘‘అలాంటప్పుడు అతని సెక్రటరీకి ఆ విషయాలు ఎందుకు తెలియవు?’’ ‘‘అతని క్లబ్‌కి ఫోన్ చేశావా?’’ మాంచాల అడిగింది. ‘‘చేశాను. ఈ రోజంతా రాలేదు.’’ ‘‘అతను ఆఫీస్‌లో లేకపోవడానికి ఓ డజను వివరణలు ఉండచ్చు. ఊరికే ఇదవక’’ మాంచాల ఓదార్చింది. ‘‘నిజమైన వివరణ నన్ను భయపెడుతోంది.’’ ‘‘ఏమిటది?’’ ‘‘బహుశా అతను ప్రేమించే అమ్మాయి అతనికి నేతిలో వేయించిన వెల్లుల్లి రేకలని తినిపిస్తూంటుంది.’’ ‘‘భార్యకి ఓ భర్త మీద అనుమానం కలిగితే భయపెట్టే లక్షల కొద్దీ కారణాలు తడుతూంటాయి.’’ ‘‘మాంచాలా! ఏం జరుగుతోందో నాకు ఖచ్చితంగా తెలుసు’’ లల్లేశ్వరి స్థ్థిరంగా చెప్పింది. ‘‘ఏం జరుగుతోంది?’’ ‘‘ఏం జరుగుతోందో తెలుసు కానీ ఆ వంటగత్తె, పడకగత్తె ఎవరో తెలియడం లేదు.’’ ‘‘నీకిప్పుడు కావలసింది వేడి టీ’’ చెప్పి మాంచాల లేచి టీ డబ్బాతో వంట గదిలోకి వెళ్ళింది. స్టవ్ మీద నీళ్ళ కెటిల్‌ని ఉంచి, అలమరలోంచి టీ పాట్, కప్పులని తీసి కౌంటర్ మీద పెట్టింది. జాకెట్లోంచి విషం సీసా తీసి దాని మూత తీసి ఓ కప్పులోకి కొంత పోసింది. ఆలోచించి మొత్తం అందులోకి కుమ్మరించేసి అందులో టీ బేగ్‌ని వేసి కెటిల్‌లోని వేడి నీళ్ళని పోసింది. సెల్‌ఫోన్ మోగడం, తర్వాత బెడ్ రూంలోంచి లల్లేశ్వరి మాటలు వినపడ్డాయి. ‘‘ఏమండీ! మీ కోసం చాలాచోట్లకి ఫోన్ చేశాను... ఏమిటి? ఇన్కంటేక్స్ ఆఫీస్‌లో ఉన్నారా? అలాగే. మీరు పంపే అతనికి టేబుల్ డ్రాయర్లోని కవరిచ్చి పంపుతాను. రాత్రి డిన్నర్‌కి వస్తున్నారుగా? వెల్లుల్లి వాసన వేస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను. అదంటే నాకు అలర్జీ. గుడ్ బై’’ మాంచాల ట్రేతో అక్కడికి వచ్చి టీ కప్పుని ఇస్తూంటే లల్లేశ్వరి చెప్పింది - ‘‘చందూ ఇన్కంటేక్స్ ఆఫీస్‌కి వెళ్ళారుట.’’ (మాంచాలని చంపిందెవరు?) -
త్రీమంకీస్ - 41
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 41 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఓ జంట. ప్రేమ జంట.’’ ‘‘ప్రేమ జంట అంటే భార్యాభర్తలు కాదన్నమాట’’ వానర్ చెప్పాడు. ‘‘అవును. గోలచందర్ భార్య పేరు లల్లేశ్వరి. అతని ప్రియురాలు మాంచాల. అతని భార్యకి బెస్ట్‌ఫ్రెండ్ కూడా. మాంచాల డైవోర్సీ. వాళ్ళిద్దరికీ జత కలిసింది. అందుకు కొంత కారణం లల్లేశ్వరికి వెల్లుల్లి వాసన పడకపోవడం. కాని గోలచందర్ మాత్రం రోజూ పాతిక వెల్లుల్లి రేకలని నేతిలో వేయించుకుని అన్నంలో కలుపుకుని ఓ ఆధరువుగా తింటాడు. బాల్యం నించి వచ్చిన ఆ అలవాటు పెళ్ళయ్యాక బంద్ అవడంతో భార్యకి మానసికంగా దూరం అయ్యాడు. మాంచాలకి శారీరకంగా దగ్గిరయ్యాడు. గోలచందర్కి మన దుర్యోధన్ గురించి ఓ మిత్రుడి ద్వారా తెలిసింది.’’ ఆ రోజు దినపత్రికలోని పర్సనల్ కాలంలో ఓ ప్రకటనని దుర్యోధన్ చదివాడు. ‘ఎలమంద! అంతా క్షమించబడింది. ఎక్కడున్నా సరే. ఇంటికి రా. దస్తగిరి.’ వెంటనే అతను ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి చెప్పాడు. ‘‘ఎలమందని. సాయంత్రం కలుద్దాం. ఎక్కడో తెలుసుగా?’’ ‘‘తెలుసు. నా పేరు గోలచందర్. అలాగే.’’ దుర్యోధన్ సాయంత్రం మూడున్నరకి ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని ఓ బెంచీ మీద పేషన్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఓ ముప్ఫై రెండేళ్ళతను అతని దగ్గరకి వచ్చి అడిగాడు. ‘‘దగ్గరలో మినపరొట్టె ఎక్కడ దొరుకుతుంది?’’ ‘‘నీ పేరు?’’ దుర్యోధన్ అడిగాడు. ‘‘గోలచందర్.’’ ‘‘కూర్చో. నా గురించి నీకు ఎవరు చెప్పారు?’’ దుర్యోధన్ అడిగాడు. ‘‘కల్లయ్య చెప్పాడు.’’ అతను ఇటీవల దుర్యోధన్ సేవని ఉపయోగించుకున్నాడు. ‘‘ఎవర్ని?’’ దుర్యోధన్ అడిగాడు. ‘‘నా భార్యని’’ అతను చెప్పాడు. ‘దేనికి?’’ ‘‘నన్ను వెల్లుల్లి తిననివ్వదు. బయట తింటే పడకటింట్లోకి రానివ్వదు.’’ ‘‘కష్టమే. సరే. మీ ఆవిడకి ఏం ఇష్టమో చెప్పు’’ దుర్యోధన్ అడిగాడు. అతని భార్య అభిరుచుల గురించి అడిగి తెలుసుకుని ఇంటి చిరునామా తీసుకున్నాడు. ‘‘పథకం రాత్రికల్లా చెప్తాను. డబ్బు తెచ్చావా?’’ అతను దినపత్రిక చుట్టి, రబ్బర్ బేండ్ పెట్టిన ఓ చెప్పుల పెట్టెని ఇచ్చి చెప్పాడు. ‘‘సగం ఇప్పుడు, సగం పనయ్యాక అని కల్లయ్య చెప్పాడు.’’ ‘‘అవును. ఏభై తెచ్చావా?’’ ‘‘మరీ ఏభై అని చెప్పలేదే? ఏభై వేలని చెప్పాడు.’’ ‘‘అర్థం చేసుకుంటారని వేలు చెప్పలేదు. పనైపోయిందనే అనుకోండి.’’ ‘‘ముందే అనుకోను. అయ్యాక అనుకుంటాను’’ గోలచందర్ చెప్పాడు. ఆ రాత్రి దుర్యోధన్ చక్కటి పథకం ఆలోచించాడు. గోలచందర్కి ఫోన్ చేసి అది చెప్పాడు. ‘‘ఎల్లుండి ఆ సమయంలో నీకు మంచి ఎలిబీ ఉండేలా చూసుకో’’ సలహా ఇచ్చాడు. మాంచాల ఆఫీస్‌నించి వచ్చిన గోలచందర్ టైని లూజ్ చేస్తూ అడిగింది. ‘‘మీరు నిన్న తెచ్చిన హెర్బల్ రోజ్ టీ చేసివ్వనా?’’ ‘‘ఒద్దు. అది మన హానీమూన్కే పరిమితం.’’ ‘‘అలసిపోయినట్లు ఉన్నారు. స్నానం చేస్తారా?’’ ‘‘తర్వాతా? ముందా?’’ స్నానం తర్వాత వారి మధ్య సెక్స్ తర్వాత అడిగాడు. ‘‘కాఫీ ఇవ్వు.’’ ‘‘రాత్రి భోజనానికి బయటకి వెళ్దామా?’’ మాంచాల కాఫీ కప్పు అందిస్తూ అడిగింది. ‘‘నాకూ వెళ్ళాలనే ఉంది. కాని...’’ ‘‘కాని?’’ ‘‘నా భార్యకి మన వ్యవహారం మీద అనుమానంగా ఉంది’’ గోలచందర్ చెప్పాడు. ‘‘అసలు ఆమెకి ఎలా తెలుసు?’’ ‘‘ఎయిర్టెల్ నించి రహస్యంగా నా సెల్‌ఫోన్ కాల్స్ లిస్ట్ట్ని తెప్పించింది. నా క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ కూడా.’’ ‘‘ఐతే నా క్రెడిట్ కార్డ్ వాడి మనం జాగ్రత్తపడటం మంచిదైంది’’ మాంచాల చెప్పింది. ‘‘అంతేకాదు. ఎయిర్టెల్ నించి వచ్చిన కాల్స్ లిస్ట్‌లో కూడా నీకు ఫోన్ చేసిన వివరాలు లేవు. అందుకే ఇంకో ఫోన్ తీసుకున్నాను.’’ ‘‘ఆమెకి నిజం తెలుస్తే ఏమవుతుంది?’’ మాంచాల అడిగింది. ‘‘ముందుగా నేను కంపెనీ ఛైర్మన్ కుర్చీలోంచి దిగాలి. ఆ కంపెనీ ఆమె తండ్రిది. ఏభై ఐదు శాతం షేర్లు వారివే కాబట్టి నన్ను దింపేసి విడాకులకి అప్లై చేస్తుంది. అప్పుడు మన పెళ్ళయ్యాక మనకి డబ్బుండదు. డబ్బు లేకపోతే ఆనందం ఉండదు’’ గోలచందర్ చెప్పాడు. ‘‘డబ్బులో ఆనందం లేదు. షాపింగ్‌లో ఉంది’’ మాంచాల నవ్వుతూ చెప్పింది. (వెల్లుల్లికి విడాకులకి ఏమిటి సంబంధం?) -
త్రీమంకీస్ - 40
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 40 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘నేనూ మీలా దురదృష్టవంతుడ్నే’’ పట్టయ్య చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘ఎలా పట్టుపడ్డారేమిటి?’’ మర్కట్ అడిగాడు. ‘‘చెప్తా. కూర్చోండి’’ పట్టయ్య ఓ మెట్టు మీద కూర్చుంటూ చెప్పాడు - ‘‘నేను కొన్ని ముఖ్యమైన రైళ్ళల్లో టికెట్లని మారు పేర్లతో బుక్ చేసి వాటిని ప్రీమియం ధరలకి స్టేషన్లో ప్రయాణీకులకి విక్రయిస్తూంటాను.’’ ‘‘ఏదీ? సినిమా హాళ్ళల్లో బ్లాక్ టికెట్లలానా?’’ ‘‘అవును. ఆ మధ్య ఓరోజు దీంట్లో భాగం ఉన్న రైల్వే క్లర్క్ పేర్లేం తట్టక ఏ నాగార్జున, అమలల పేర్లతో బుక్ చేసిన రెండు టికెట్లని నాకు ఇచ్చాడు. వాటిని ఓ జంటకి విక్రయించాను. రైలు కదులుతూండగా ఒకడు ఆ పెట్టె బయట అతికించిన లిస్ట్‌లోని ఆ పేర్లని చూశాడు. వెంటనే కాజీపేటలోని తన బంధుమిత్రులకి ఫలానా రైల్లో, ఫలానా బోగీలో, ఫలానా బెర్త్‌లో అక్కినేని నాగార్జున, అమలలు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాడు. ఒకరి నించి సమాచారం ఇంకొకరికి ఎలా పాకుతుందో అర్థం చేసుకోండి. ఆ బంధువులు ఇంకెవరో బంధుమిత్రులకి చెప్పారు. వాళ్ళు తమ బంధుమిత్రులకి చెప్పారు. ఇలా ఆ రైలు కాజీపేటకి చేరుకునే నాలుగున్నర గంటల్లోగా ఈ సమాచారం వరంగల్ అంతా పాకిపోయింది. సుమంత్, నాగచైతన్య, అఖిల్ పేర్లు కలపబడ్డాయి. చేతిలో దండలు, భోజనం, టిఫిన్ కేరియర్లతో తండోపతండాలుగా ప్రజలు వచ్చి తమ అభిమాన నటీనటుల్ని కలుసుకోడానికి రైల్వేప్లాట్‌ఫాం మీద గుమిగూడారు. అన్నిటికీ తగుదునమ్మా అంటూ వస్తారుగా. ఆయన గారు కూడా అక్కడికి చేరుకున్నారు.’’ ‘‘ఎవరాయన?’’ వానర్ అడిగాడు. ‘‘ఇంకెవరు? స్థానిక ఎం ఎల్ ఏ అయుంటాడు’’ కపీష్ చెప్పాడు. ‘‘కరెక్ట్. రైలాగాక ఎంఎల్ఏ ఆ డబ్బాలోకి ఎక్కి అంతా వెతికినా వాళ్ళు కనపడితేనా? ఆ బెర్త్‌ల్లో, ఆ పేర్లతో ప్రయాణించే ఆ జంటని ప్రశ్నిస్తే అసలు రహస్యం బయటపడింది. తప్పు పేర్లతో ప్రయాణిస్తున్నందుకు వాళ్ళని దింపేశారు. కొందరు జాలిపడి వారికి భోజనం పెట్టారనుకోండి. దినపత్రికల్లో ఇది వార్తగా వచ్చింది. దాన్ని రైల్వే శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చదివాడు. విజిలెన్స్ వారికి చెప్తే వారు వెంటనే మొత్తం కూపీ లాగారు. రెండు రోజుల తర్వాత నేను సికింద్రాబాద్ ఒన్ నంబర్ ప్లాట్‌ఫాం మీద, మళ్ళీ అదే రైలుకి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూంటే విజిలెన్స్ వారు అరెస్ట్ చేసి ఇక్కడికి పంపారు. వాళ్ళు మారువేషాల్లో ప్రయాణీకుల్లా నటించి నన్ను రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. ఉన్నది కాస్తా ఊడింది... సర్వ మంగళం పాడింది... దాంతో అయ్యయ్యో అయింది నా పని’’ ఆ పాటని పాడి పట్టయ్య చెప్పాడు. ‘‘అయ్యో!’’ మర్కట్ చెప్పాడు. ‘‘అయ్యో దేనికి? ఎంచక్కా పాత పాటలు పాడుకుంటూ గడుపుతున్నాను’’ పట్టయ్య చెప్పాడు. మిత్రులు ముగ్గురూ జాలిపడ్డారు. ‘‘ఈ రోజుల్లో మాకు ఆడుకోడానికి ఐ పేడ్, లేప్టేప్, బ్లూబెర్రీ, ఫేస్‌బుక్‌లు లాంటివి ఎన్నో ఉన్నాయి. మీ చిన్నప్పుడు ఏం ఉండేవి?’’ మర్కట్ అతని వయసుని గమనించి అడిగాడు. ‘‘మగవాళ్ళకి వీధి అరుగులు, ఆడవారికి వీధి పంపులు’’ పట్టయ్య నవ్వుతూ చెప్పాడు. ‘‘అతనెవరు?’’ దుర్యోధన్ వైపు చూపించి కపీష్ అడిగాడు. ఒకో ఖైదీని పరిచయం చేస్తూ పట్టయ్య చెప్పసాగాడు. ‘‘ఓ మనిషికి తుపాకీ ఇస్తే అతను ఓ బేంక్‌ని దోచుకోగలడు. అతనికి ఓ బేంక్‌ని ఇస్తే దేశాన్నే దోచుకోగలడు. ఆ సన్నపాటి ఖైదీ అలాంటి పని చేశాడు. ఆ పక్కతను చెక్ రాసి జైలుకి వచ్చాడు - బేంక్‌లో డబ్బున్నా తన అకౌంట్లో డబ్బు లేకుండా. ఇటువైపు అతనికి డబ్బంటే బాగా ఇష్టం. కాని డబ్బుకే అతనంటే ఇష్టం లేదు. దాంతో అది యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళ దగ్గరకి వెళ్ళి పోయి అతను జైలుకి వచ్చాడు. ఆ లావుపాటి వాడు చెయ్యనిదానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాల్చాక రివాల్వర్ మీద తన వేలిముద్రలని తుడవలేదు. ఈ పక్కన వాడు చేసిందానికి శిక్షని అనుభవిస్తున్నాడు. కాలే ఇంట్లోంచి ముగ్గుర్ని బయటకి లాక్కొచ్చినందుకు.’’ ‘‘ఎవర్ని లాక్కొచ్చాడు?’’ ‘‘అగ్నిమాపక సిబ్బందిని. అతని పక్కతనికి డబ్బాఖరులో అధిక నెల ఉండటంతో డబ్బు కోసం ఫోర్జరీ చేసి పట్టుబడ్డాడు.’’ ‘‘దుర్యోధన్ గురించి కూడా చెప్పు.’’ ‘‘వస్తున్నా. అతనో హంతకుడు.’’ ‘‘ఎవర్ని చంపాడు?’’ ‘‘ఇద్దరు ఆడవాళ్ళని అని అభియోగం. కాని తను చంపింది మాత్రం ఒకరినే అంటాడతను...’’ పట్టయ్య చెప్పేది ముగ్గురూ ఆసక్తిగా వినసాగారు. ‘‘దుర్యోధన్ ఎందుకు జైల్లో ఉన్నాడంటే ముందుగా గోలచందర్, మాంచాలల గురించి చెప్పాలి.’’ ‘‘గోలచందర్ అనే పేరు ఎవరైనా తమ పిల్లలకి పెడతారా?’’ కపీష్ అడ్డుపడ్డాడు. ‘‘పెట్టరు. పెట్టలేదు కూడా. కాని బాలచందర్ని స్కూల్లో చేర్పించినప్పుడు రిజిస్టర్లో అతని పేరుని రాసిన ఉద్యోగి తప్పుగా విని బాల బదులు గోలగా రాశాడు. అదే స్థిరపడిపోయింది. పైగా క్లాసులో బాగా అల్లరి చేసేవాడు. దాంతో గోలచందర్ పేరుని హెడ్మాస్టారు మార్చలేదు.’’ ‘‘ఈ గోలచందర్, మాంచాలలు ఎవరు?’’ మర్కట్ అడిగాడు. గోలచందర్ దేనికి తన భార్యని చంపాలనుకున్నాడు? మళ్లీ రేపు -
త్రీమంకీస్ - 39
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 39 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘లేడీ గార్డ్.’’ ‘‘పేరు వైతరణి.’’ ‘‘యాక్! అదేం పేరు?’’ ‘‘ఏం?’’ ‘‘వైతరణి అంటే తెలీదా? నరకంలో చీము, నెత్తురు ప్రవహించే నది. దాన్ని ఆవు తోక పట్టుకుని మాత్రమే దాటగలరు కాబట్టి పదో రోజో, పదకొండో రోజో ఆవుని దానం చేస్తారని వినలేదా?’’ ‘‘ఐతే మా పెళ్ళయ్యాక కృష్ణవేణి అని మార్చుకుంటాను’’ మర్కట్ చెప్పాడు. ‘‘అసలీ దుర్యోధన్ ఎవరు? ఎందుకు వచ్చాడో మనం ముందుగా తెలుసుకోవాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘నా సెల్ మేట్ అంత్యాక్షరి పట్టయ్యని అడిగితే తెలుస్తుంది. ఆయన ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నాడు’’ వానర్ సూచించాడు. ‘‘సరే. సాయంత్రం ఎక్సర్సైజ్ సమయంలో మనం కలిసినప్పుడు అడుగుదాం.’’ గార్డులు ఈలలు ఊదుతూ అందర్నీ సెల్స్‌కి వెళ్ళమని హెచ్చరించసాగారు. అంతా అక్కడ్నించి కదిలారు. మర్కట్ వైతరణిని చూసి చేతిని ఊపి కదిలాడు. 11 సాయంత్రం ఆరు. వేమన కళ్ళు మూసుకుని రెండు చేతులు కలిపి రకరకాల భంగిమలని ప్రదర్శించి కళ్ళు తెరిచాక మర్కట్ ఆయన్ని ప్రశ్నించాడు. ‘‘ఇంతసేపు కళ్ళు మూసుకుని మీరు ఏం చేశారు?’’ ‘‘దేవుడికి థాంక్స్ చెప్పాను.’’ ‘‘దేనికి?’’ ‘‘మర్చిపోకుండా నన్నీ ఉదయం నిద్ర లేపినందుకు. బ్రహ్మం ఎవరో నువ్వు చెప్పనే లేదు?’’ ‘‘ఇంతకీ మీరు ఎవరు?’’ ‘‘నేనెవరా? అది తెలుసుకుంటే నేనీ జైల్లో ఎందుకుంటాను? బ్రహ్మం ఏనుగా? లేక మావటివాడా? బ్రహ్మం నాగలా? లేక ఎద్దా? బ్రహ్మం సాకారమా? లేక నిరాకారమా? ఈ నిరంతర అన్వేషణలో ఉన్న వాడిని.’’ ‘‘మా వానర్ సెల్‌మేట్ పట్టయ్యలా మీరూ నాతో అంత్యాక్షరి ఆడచ్చుగా? ఈ పిచ్చి ప్రశ్నలేమిటి?’’ ‘‘వేదాంతం మీద అభిరుచి లేని వాళ్ళకి ఇది పిచ్చిలానే కనిపిస్తుంది. సోక్రటీస్కే విషం ఇచ్చి చంపిన ప్రపంచం ఇది. సక్కుబాయిని హింసలకి గురి చేసిన ప్రపంచం ఇది. ఏసుక్రీస్తునే శిలువ వేసిన ప్రపంచం ఇది.’’ ‘‘ఆపండి. అసలే జైలు పాలయ్యానని నేను కుమిలిపోతూంటే’’ మర్కట్ అసహనంగా చెప్పాడు. ‘‘నువ్వు భయం అనే జైల్లోంచి ముందు బయటకి రా. ఇతరులు నీ గురించి ఏం అనుకుంటున్నారో అని నువ్వు భయపడేంత కాలం నువ్వు వారి ఖైదీవే. మనం మన జైలుని మనతోనే తీసుకు వెళ్తూంటాం.’’ ‘‘నాకు వేదాంతం పడదు’’ మర్కట్ అరిచాడు. ‘‘అందుకే వేదాంతం మీద ఆసక్తి లేని వాడికి అది చెప్పకూడదని నియమం’’ మర్కట్ వంక సానుభూతిగా చూస్తూ చెప్పాడు. గార్డ్ వచ్చి సెల్ తాళం తెరుస్తూ చెప్పాడు. ‘‘బయటకి రండి. ఎక్సర్సైజ్ టైం.’’ ‘‘వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూన్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్’’ వేమన లేస్తూ చెప్పాడు. ‘‘ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు. నాలుగు. ఐదు. ఆరు. ఏడు... ఒకటి. రెండు. మూడు...’’ వానర్ లెక్క పెడుతున్నాడు. ‘‘ఏమిటి లెక్క పెడుతున్నావు?’’ అంత్యాక్షరి పట్టయ్య అడిగాడు. ‘‘జైలు ఊచలని’’ వానర్ చెప్పాడు. గార్డ్ వచ్చి తలుపులు తెరుస్తూ చెప్పాడు. ‘‘జైల్లో కటకటాలకి ఆనుకుని కూర్చోకూడదని చెప్పానా? ఎక్సర్సైజ్ టైం. బయటకి రండి.’’ అంతా అతన్ని అనుసరించారు. ‘‘జైల్లో చాలా ఇదిగా ఉంది నాకు’’ మర్కట్ తన మిత్రులతో బాధగా చెప్పాడు. ‘‘పాజిటివ్ సైడ్ చూడు బ్రదరూ! కార్ ఇన్స్టాల్మెంట్, రెంట్, భార్య, గర్ల్ ఫ్రెండ్ పీరియడ్. వీటిలో ఏది ఓ నెల లేట్ అయినా ఇబ్బందుల్లో పడ్డట్లే. జైల్లో మనకలాంటి ఇబ్బందులేం లేవు. కాకపోతే ఇతరులు మన గురించి ఏం అనుకుంటున్నారో అన్నది ఒక్కటే సమస్య’’ కపీష్ చెప్పాడు. ఆరు బయట అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వానర్ తన సెల్‌మేట్ పట్టయ్యని తన ఇద్దరు మిత్రులకి పరిచయం చేస్తూ చెప్పాడు. ‘‘ఈయనే నేను చెప్పిన బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ సింగర్. వీళ్ళు నా బెస్ట్‌ఫ్రెండ్స్. ఇతను కపీష్. వీడు మర్కట్.’’ ‘‘పాపం. పోలీసులకి పట్టుబడటంలో మీ ముగ్గురూ దురదృష్టవంతులన్న మాట’’ ఆయన చెప్పాడు. ‘‘జైలుకి వచ్చిన ఎవరైనా దురదృష్టవంతుడే. అదృష్టవంతుడు జైలు గోడల బయటే ఉంటాడు’’ కపీష్ విసుగ్గా చెప్పాడు. (ఈరోజుల్లో కాలక్షేపానికి ఐపాడ్స్, లేప్‌టాప్‌లు, బ్లాక్బెర్రీస్, ఫేస్‌బుక్‌లు. మరి 50 ఏళ్ల క్రితం ఏంఉండేవి?) మళ్లీ రేపు -
త్రీమంకీస్ - 38
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 38 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘డిజిపి భార్యని ‘జీవితాంతం దేవుడు లేడని నమ్మి చివరకి ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మంచిదా? లేక జీవితాంతం ఆయన ఉన్నాడని నమ్మి చివరికి లేడని తెలుసుకోవడం మంచిదా? ఏది ఉత్తమ మార్గం?’అని ప్రశ్నిస్తే పబ్లిక్ న్యూసెన్స్ కేస్ కింద పట్టుకురాలేదా?’’ ‘‘లేదే?’’ ఆ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్పారా అని మర్కట్ అనుకుంటూంటే వేమన అన్న మాటలతో ఆ ప్రశ్నకి జవాబు దొరికింది. ‘‘అందుకేనేమో నా స్క్రూ లూజ్ అని అంటూంటారు. ఐనా నాకు దేవుళ్ళతో పేచీ లేదు. అతని ఫేన్ క్లబ్ సభ్యులతోనే పేచీ’’ వేమన మెల్లిగా చెప్పి ఓ పాట అందుకున్నాడు. ‘మాయజాలమున మునిగేవు నరుడా! దారీ తెలియక తడబాటులేలా? జ్ఞాననేత్రమున వెదకీ చూడుమా! శాశ్వత జ్యోతీ కనుగొనుమా.’ 10 రోల్ కాల్లో మర్కట్ చూపులు మళ్ళీ మహిళా రిమాండ్ ఖైదీల బృందం వైపు వెళ్ళాయి. నిన్నటి మహిళా గార్డ్ కనిపించింది. అతను ఆమెని చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. చేతిని ఊపాడు. ఈసారి ఆమె కూడా చేతిని ఊపింది. రోల్‌కాల్ అయ్యాక మర్కట్ ఆమె దగ్గరకి వెళ్ళాడు. ‘‘హలో! నా పేరు మర్కట్’’ పలకరించాడు. ‘‘నా పేరు వైతరణి’’ చెప్పింది. ‘‘ఈవాల్టికి నాలుగు రోజులైంది వచ్చి.’’ ‘‘తెలుసు.’’ ‘‘దేనికో తెలుసా?’’ ‘‘ఇంకా తెలుసుకోలేదు. ఏం చదివావ్?’’ ‘‘ఇంజనీరింగ్.’’ ‘‘ఈ రోజుల్లో ఇక్కడికి ఇంజనీర్లు చాలామందే వస్తున్నారు.’’ ‘‘చాలామంది ఇంజనీర్లకి ఉద్యోగాలు దొరకడం లేదు. డాక్టర్లైతే ఇంజక్షన్ చేసినా ఏభై రూపాయలు వస్తుంది. రోజుకో ఐదారు ఇంజక్షన్లతో హాయిగా బతికేయచ్చు. నీకీ ఉద్యోగం బావుందా?’’ ‘‘జీతం రాళ్ళ కోసం ఏదో పని చెయ్యాలిగా?’’ ‘‘నువ్వు ఎయిర్ హోస్టెస్ జాబ్‌కి సరిగ్గా సూట్ అవుతావు.’’ ‘‘ఎలా తెలుసు?’’ ‘‘ఊహల్లో ఈ యూనిఫాం విప్పి, చీర కట్టి చెప్తున్నాను.’’ ‘‘ఏ చీర? కంచి, గద్వాల్, ఆరణి, ఉప్పాడ... ఏ పట్టు చీర?’’ ఉత్సాహంగా అడిగింది. ‘‘కాశ్మీర్ సిల్క్.’’ ‘‘రిచ్‌గా ఊహించినందుకు థాంక్స్. నీకు ఇక్కడ బావుందా?’’ వైతరణి అడిగింది. ‘‘ఏదో తెచ్చి పడేశారు కాబట్టి గడపాలిగా. నా సెల్ నంబర్ రెండు వందల పదహారు. సెల్‌ఫోన్ నంబర్ కాదు. ఉంచే సెల్.’’ ‘‘మమ్మల్ని మగాళ్ళ సెల్స్‌లోకి వెళ్ళనివ్వరు. మేం ఆడవాళ్ళ సెల్స్లోకే వెళ్ళాలి.’’ ‘‘నేను ఆడదాన్ని అయి ఉంటే బావుండేదని అనిపిస్తోంది.’’ ‘‘ఛ! నేను అలాంటి దాన్ని కాను. ఎప్పటికైనా విడుదల అవుతావుగా. అప్పుడు కలుద్దాం.’’ ‘‘అలాగే. అంతదాకా రోజు నిన్నిక్కడ చూడచ్చుగా?’’ ‘‘చూడచ్చు.’’ ‘‘ప్లీజ్. నువ్వు ఎటూ జైల్లో గార్డ్వి కాబట్టి నీ హృదయం అనే జైల్లో నాకు యావజ్జీవ కారాగార శిక్షని విధించు.’’ ‘‘బెయిల్‌కి అవకాశం లేని శిక్షని విధించాను‘‘వైతరణి సీరియస్‌గా చెప్పింది. ‘‘అమ్మయ్య! ఇంత కాలానికి శాంతిగా ఉంది. నీకోటి తెలుసా? పారిపోవడానికి అతి కష్టమైన జైలు నీ మనసే’’ ‘‘నిన్ను చూడకమునుపు ఎవర్నైనా చూసినప్పుడు కారణం లేకుండా నవ్వడం అనేది ఎలాంటిదో నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది.’’ వాళ్ళు అలా మాట్లాడుకుంటూండగా ఓ దృశ్యం కపీష్ కంట పడింది. వెంటనే అతను వానర్‌కి దాన్ని చూపించాడు. మర్కట్ కోసం చూశారు. అతను మహిళా గార్డ్‌తో మాట్లాడుతూండటం గమనించి కపీష్ అతన్ని పక్కకి తీసుకెళ్ళి అడిగాడు. ‘‘చూశావా?’’ ‘‘ఏమిటి?’’ ‘‘మట్టి పోయడం. ఆ నలుగురిలో ఇద్దరు మళ్ళీ అక్కడ మట్టి పోశారు.’’ ‘‘అలాగా? నేను చూళ్ళేదు.’’ ‘‘నువ్వు ఇవన్నీ చూసే పరిస్థితిలో లేవని నిన్ను చూస్తూంటే తెలిసిపోతోంది. ఖచ్చితంగా వాళ్ళు సొరంగం తవ్వుతున్నారని నా నమ్మకం. దీనికి నాయకుడు దుర్యోధన్.’’ ‘‘ఎలా తెలుసు?’’ ‘‘వాళ్ళు వాడి మనుషులు.’’ ‘‘ఐతే వాళ్ళల్లో ఒకడ్ని బాత్రూంలో ఒంటరిగా పట్టుకుని నాలుగు పీకి ఆచూకీ తీద్దామా?’’ మర్కట్ అడిగాడు. ‘‘ఒద్దు. ఈ రహస్యం మనకి తెలుసని వాళ్ళకి ఇప్పుడే తెలీకూడదు. లేదా మన మీద వాళ్ళు దాడి చేయచ్చు. పైగా దుర్యోధన్కి ఇక్కడ జైలర్, గార్డ్ల సపోర్ట్ ఉంది’’ కపీష్ చెప్పాడు. ‘‘మరి ఎలా తెలుసుకోవడం?’’ ‘‘కొంత ఊహించగలను. ఆ నలుగురిలో ఇద్దరే మట్టి పోశారు. మిగిలిన ఇద్దరూ దాన్ని కాళ్ళతో చదును చేశారు. అంటే ఆ మట్టి పోసిన వారి సెల్లోనే సొరంగం తవ్వుతూండి ఉండచ్చు. పారిపోయేప్పుడు ఈ ఇద్దరూ కూడా వాళ్ళతో కలిసిపారిపోతారు అని ఊహించవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి.’’ ‘‘అలాగే.’’ ‘‘నువ్వు నీ ప్రియురాలికి ఈ విషయం చెప్పక.’’ ‘‘ప్రియురాలా?’’ (జైల్లో ఉంటే ఏం సమస్యలు ఉండవు?) -
త్రీమంకీస్ - 34
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 34 - మల్లాది వెంకటకృష్ణమూర్తి బయటకి వచ్చాక ఓ బేంక్‌కి వెళ్ళి జైలర్ ఇచ్చిన లెటర్ని చూపించాడు. ‘‘ఓ! నువ్వు జైల్లో ఉన్నావని దాచకుండా చెప్పావంటే నువ్వు నమ్మదగ్గ వాడివే. వాడ్డుయూ వాంట్?’’ బ్రాంచ్ మేనేజర్ అదరంగా చూస్తూ అడిగాడు. ‘‘ఐ వాంట్ టు స్టార్ట్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. గివ్ మి ఏ లోన్. దెన్ లీవ్ మి ఎలోన్’’ వానర్ ఘనంగా ఉంటుందని ఇంగ్లీష్‌లో అభ్యర్థించాడు. వాళ్ళిచ్చిన లోన్‌తో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్ళి గది తీసుకుని తినడానికి, తాగడానికి ఆర్డర్ ఇచ్చాడు. అవి వచ్చాక ట్రే మీది తెల్లటి శుభ్రమైన బట్టని తొలగిస్తే చికెన్ ఫ్రై కనిపించింది. ఓ కోడి పిల్ల చికెన్ ఫ్రై వంక చూస్తూ బాధగా అడుగుతోంది. ‘‘మమ్మీ! మాట్లాడు మమ్మీ. నాతో మాట్లాడు మమ్మీ! ఇలా అయిపోయావేమిటి?’’ గ్లాసులోని ఆరెంజ్ జూస్ని చూసి పక్కనే ఉన్న ఆరెంజి పండు అరుస్తోంది. ‘‘అమ్మా! నాన్నా! నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారా?’’ వాటి మీది దయతో వానర్ కళ్ళల్లోంచి నీళ్ళు జలజలా కారాయి. ఆ దయతోనే గుండె ఆగింది. ‘‘చూడండి. వీడి గుండె కొట్టుకుంటోంది. కొద్దిసేపు గుండె ఆగినట్లయింది. అంతే. మరణించిన వాళ్ళనే ఇక్కడికి తీసుకురావాలని తెలీదా?’’ ఆ మాటలకి కళ్ళు తెరిచి చూస్తే యమధర్మరాజు తన భటుల వంక కోపంగా చూస్తున్నాడు. ‘‘వాళ్ళ తప్పేంలేదు సార్. నా గుండెలో నా ప్రియురాలు నివశిస్తోంది. అందుకని అది కొట్టుకుంటోంది’’ వానర్ చెప్పాడు. ‘‘మీరంతా ఎవరు?’’ తన చుట్టూ మూగిన కొత్తవాళ్ళని చూసి అడిగాడు. ‘‘గుర్తు పట్టలేదా? మేమంతా నీ ఎఫ్‌బిలో మిత్రులం. నువ్వూ చచ్చాక, ఇక్కడికి వచ్చాక ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. అదృష్టం. నరకానికి వచ్చావు. స్వర్గానికి వెళ్తే నీకు ఇంతమంది కంపెనీ దొరికేది కాదు’’ వాళ్ళు చెప్పారు. ‘‘ఈ తెల్లవాళ్ళంతా ఎవరు?’’ ‘‘జీవించి ఉండగా గో టు హెల్ అని తిట్టించుకోబడ్డవారు.’’ ‘‘బాబోయ్! ఇది హెల్లా?’’ ‘‘అవును. అల్లాటప్పా హెల్ కాదు. రియల్ హెల్. హెల్ మీద మనం విన్నవి ఉత్తి జోక్స్ కాదు. నిజాలు. ఉదాహరణకి ఇక్కడి బీర్ ఉంటుంది కాని బీర్ మగ్గులకి రంధ్రాలు కూడా ఉంటాయి. అందమైన ఆడవాళ్ళుంటారు కాని ఆడవాళ్ళకి... అర్థం చేసుకో.’’ అంతా గందరగోళంగా మాట్లాడుకుంటూంటే యమధర్మరాజు సుత్తితో కొడుతూ అరిచాడు. ‘‘ఆర్డర్! ఆర్డర్!’’ ‘‘ఓ పీజా, రెండు బర్గర్లు, ఓ కోక్ జీరో’’ వానర్ వెంటనే చెప్పాడు. ‘‘షటప్’’ ఆయన అరిచాడు. ‘‘కొత్త బ్రాండా? సరే. షటప్ టేస్ట్ చేస్తాను. సెవెన్ అప్ లేదా థంప్స్ అప్లా ఉంటుందా?’’ అడిగాడు. ‘‘వీడి వల్ల ఇక్కడ డిసిప్లిన్ దెబ్బతింటోంది. ముందు వీడ్ని తీసుకెళ్ళి కాగే నూనెలో వేయండి’’ ఆయన ఆసహనంగా అరిచాడు. ‘‘ఒద్దు. ఒద్దు. నా వంటి నిండా దద్దుర్లు వస్తాయి...’’ అరుస్తున్న వానర్‌కి ఠక్కున మెలకువ వచ్చేసింది. పెబైర్త్ నించి వచ్చే గురక విని అది కలని తెలుసుకున్నాక స్థిమిత పడ్డాడు. దుప్పటిని తీసుకెళ్ళి టాయ్లెట్లో పిండి మళ్ళీ పరచుకుని పడుకున్నాడు. 9 మర్నాడు ఉదయం గార్డ్ కపీష్‌తో చెప్పాడు - ‘‘నీకోసం ములాఖత్‌కి ఎవరో వచ్చారు.’’ కపీష్‌కి వెంటనే అనుమానం కలిగింది. కొంపతీసి తను జైలు పాలైన సంగతి తన తల్లితండ్రులకి తెలిసిందా? పేపర్లో తన గురించి వచ్చిందా? ‘‘ఎవరు?’’ అడిగాడు. ‘‘నేను నీ ఇన్ఫార్మర్ని కాదు. పద. నువ్వే చూడు’’ గార్డ్ కోపంగా చెప్పాడు. కపీష్ అతన్ని అనుసరించాడు. ఎదురుగా గంధం బొట్టు మీద కుంకం బొట్టు కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాడు. తల తిప్పి చూేన్త నిన్న కనిపించిన అమ్మాయి కనిపించింది. కపీష్ వెంటనే నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. ‘‘జైల్లో ఉండగా ఏం చేయలేనన్నాను కదా? మళ్ళీ ఎందుకు వచ్చారు?’’ కపీష్ ఆమె వంక చూస్తూ ఆయన్ని ప్రశ్నించాడు. ‘‘నీ డబ్బు జైలర్ దగ్గర ఉందని కదా నిన్న చెప్పావు?’’ సేఠ్ అడిగాడు. ‘‘అవును?’’ ‘‘నువ్వు నాకు డబ్బు ఇవ్వాలని ఆయనకి చెప్పి ఇప్పించచ్చుగా?’’ ‘‘ఎవరికి చెప్పి?’’ కపీష్ ఆమెనే చూస్తూ అడిగాడు. ‘‘జైలర్‌కి. లేకపోతే నీకు అనవసరంగా వడ్డీ పెరిగిపోతుంది.’’ ‘‘ఏం పెరుగుతుంది?’’ కపీష్ దృష్టంతా ఆమె మీదే ఉండటంతో సేఠ్ చెప్పేది అర్థం చేసుకోలేకపోయాడు. ‘‘వడ్డీ.’’ ‘‘పెరగనీండి’’ ఆమె వంకే చూస్తూ నవ్వుతూ చెప్పాడు. -
త్రీమంకీస్ - 25
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 25 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘తేలిక. ఎఫ్బీలో నీకన్నా అతను నాకు ఎక్కువ లైకులు పెట్టాడు.’’ ప్రశ్నార్థక మొహం పెట్టిన వానర్ కాసేపు మాట్లాడలేకపోయాడు. ‘‘నేను అన్నిటికీ లైక్స్ పెట్టానే. అసలు అందుకే అరగంటకోసారి అందులోకి వెళ్ళే వాడిని.’’ ‘‘కాని అన్నిసార్లు కాదు. క్రితం అగస్టు మూడున నేను పెట్టిన మా అక్క ఆఖరి కూతురు డైపర్ ఫొటోకి నువ్వు లైక్ పెట్టలేదు.’’ ‘‘ఛ! తాగేప్పుడు అది గుర్తు చేయక. అలాంటి వాటికి ఎవరైనా లైక్స్ పెడతారా?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘మిస్టర్ రెయిన్ పెట్టాడు. ఇంకా...’’ ‘‘ఆ తర్వాతది చెప్పక. నిజమే. అలాంటి వాటికి నేను లైక్స్ పెట్టలేను.’’ ‘‘నాకు సంబంధించిన అన్నిటినీ నువ్వు లైక్ చేస్తేనే నీకు నా మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉన్నట్లు. నీది తొంభై ఎనిమిది శాతం. అతనిది నూటొక్క శాతం.’’ ‘‘ఒక్క శాతం ఎలా పెరిగింది?’’ ‘‘అతను నా పోస్ట్ట్లని అన్నిటినీ షేర్ చేసేవాడు. నువ్వు చేయలేదు.’’ ‘‘షేర్ చేయడం అంటే?’’ ఆమె వివరించాక ఫిర్యాదుగా చెప్పాడు - ‘‘మొదటి రోజు నువ్వు దాని గురించి నాకు చెప్పలేదు.’’ ‘‘నీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఏం చెప్పానో గుర్తుందా? పెళ్ళి చూపులు అంటూ ప్రత్యేకంగా ఉండవు. ఫేస్‌బుక్‌లోనే ఇప్పుడు అన్నీ అయిపోతున్నాయి. ఐ డోంట్ లైక్ యు. బై.’’ ‘‘మరేం ఫర్వాలేదు. నేను నేనే కాని నా ఎఫ్బి స్టేటస్‌ని కానుగా’’ అవమానాన్ని దిగమింగుకుంటూ వానర్ చెప్పాడు. ‘‘గతం గతః. స్వస్థి’’ లేచి వెళ్ళిపోయింది. ఆమె తన ఎకౌంట్లోని ఫ్రెండ్స్ లిస్ట్‌లోంచి, అంటే తన జీవితంలోంచి వానర్ని తొలగించేసింది. మిత్రులు ఇద్దరూ బాధతో కూడిన మౌనంతో నవ్వుతున్న వానర్ వంక చూశారు. ‘‘దేనికి నవ్వుతున్నావు? తేరుకున్నావా?’’ మర్కట్ అడిగాడు. ‘‘ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వర్షిష్కి కూడా ఆమె స్వస్థి చెప్పేసింది.’’ ఆనందంగా చెప్పాడు. ‘‘ఏదీ? మిస్టర్ రెయిన్‌కి?’’ మర్కట్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎందుకు?’’ ‘‘మళ్ళీ ఫేస్బుక్కే కారణం.’’ ‘‘ఏం జరిగిందేమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘అతను లూప్ లైన్లో ఓ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆమె వర్షిష్తో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఫేస్బుక్లో పెట్టి వర్షిష్కి షేర్ చేసింది. అది చూసిన సీతా హరిహరన్ భగ్గుమంది.’’ ‘‘నేనే వర్షిష్ గాడ్నయితే, ‘అపార్థం, ఆమె నా కజిన్’ అనేవాడ్ని’’ మర్కట్ చెప్పాడు. ‘‘వర్షిష్ గాడు కూడా సరిగ్గా అదే అన్నాడు. కాని సీత నమ్మలేదు.’’ ‘‘ఏం?’’ ‘‘ఆ అమ్మాయి ఎవరో కాదు...’’ ‘‘అర్థమైంది. సీత కజిన్.’’ ‘‘కాదు. స్వంత చెల్లెలు. దాంతో మొత్తం సత్యనాష్ అయిపోయింది.’’ ‘‘నీకెలా తెలిసింది? వర్షిష్ నీ ఫ్రెండా?’’ కపీష్ అడిగాడు. ‘‘కాదు. సీత మళ్ళీ నా దగ్గరకి వచ్చి జరిగింది చెప్పి, నేను సెకండ్ బెస్ట్ కాబట్టి పూర్వంలా కాఫీడేకి వెళ్దాం అని పిలిచింది. బ్రదర్స్. ప్రేమ ఓ ఉన్మాదం. అందులో పడితే ఇంక మనం ప్రేమించిన అమ్మాయి తప్ప ఇంకేదీ కనపడదు. ప్రపంచం, తల్లితండ్రులు. ఏదీ. ఆ ఉన్మాదంలోనే కిరోసిన్ పోసికాల్చుకుంటారు. ఏసిడ్‌ని చల్లుతారు. నేనా ఉన్మాదంలోంచి బయట పడ్డాను కాబట్టి కాఫీడే షాప్‌లో ఆమె కోసం నేను పూర్వం ఖర్చు చేసిందంతా ఇస్తే సరే అన్నాను. కాని తను దుబారా ఖర్చులు చేయనంది. నేను రెట్టిస్తే ఊహు. సీతా హరిహరన్ చర్మం మన చర్మం కన్నా బాగా దళసరి. పెళ్ళయ్యాక జీతంలోంచి ఇస్తానంది. కటీఫ్ చెప్పేశాను.’’ ‘‘మంచి పని చేశావు’’ కపీష్ మెచ్చుకున్నాడు. ‘‘ఫేస్బుక్, జైలు ఒకటే. వాటికి గల తేడా అల్లా, రెండింటికీ చుట్టూ మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఫేస్బుక్లో మాత్రం గోడల మీద ఏది తోస్తే అది రాసేస్తూండచ్చు.’’ ‘‘నీ మాటేంటి?’’ మర్కట్ కపీష్‌ని అడిగాడు. కపీష్ చిన్నగా నిట్టూర్చాడు. ‘‘అదో విషాదగాథ’’ చెప్పాడు. ‘‘ఏం విషాదగాథ గురూ?’’ మర్కట్ ఆసక్తిగా అడిగాడు. ‘‘నీదీ మా ప్రేమలా ఎలా విషాదాంతం అయిందో చెప్పు గురూ?’’ వానర్ కూడా అడిగాడు. ‘‘నాకు స్వచ్ఛతో పరిచయం అయింది సూపర్ బజార్‌లోని బాత్రూం క్లీనింగ్ వస్తువుల షెల్ఫ్ దగ్గర.’’ అతను చెప్పేది మిత్రులు ఇద్దరూ వినసాగారు. (మోమోస్ అంటే ఏమిటి?) -
మరో సస్పెన్స్ థ్రిల్లర్
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఏమైంది’. విసుశ్రీ, ఈశ్వాశెట్టి జంటగా నటించారు. చలపతి మల్లాది దర్శకుడు. కేఎం నాయుడు, అల్లు రవి నిర్మాతలు. విశాల్‌సాయి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని నిర్మాత ప్రసన్నకుమార్ ఆవిష్కరించి, దర్శకుడు సాగర్‌కి అందించారు. అన్ని వర్గాలవారికీ నచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు చెప్పారు. సాంకేతికంగా ఈ చిత్రం వండర్ అనిపిస్తుందని నిర్మాతలు వ్యాఖ్యానించారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఒక్క రోజులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం కడవుల్ పాది మిరుగం పాది అని దర్శకుడు రాజ్ తెలిపారు. ఇంతకు ముందు అన్వర్, పైసా పైసా తదితర మలయాళ చిత్రాలను నిర్మించి ఈయన తొలిసారిగా తన సినిప్స్ అండ్ రెడ్ కార్పెట్, బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం కడవుల్ పాది మిరుగం పాది. ఈ చిత్రం వివరాలను ఆయన వెల్లడిస్తూ, ఇది ఒక రోడ్డులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చెన్నై-హైదరాబాద్ ఓల్డ్ హైవేలో ఒక రోజు రాత్రి ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి ముగిసే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని తెలిపారు. ఒక ప్రేమ జంట, పోలీసులు, ఒక విచిత్ర వ్యక్తి మధ్య నడిచే కథే కడవుల్ పాది మిరుగంపాది చిత్రం అని వివరించారు. చిత్రంలో ఆ విచిత్ర వ్యక్తి పాత్రను తానే పోషిస్తున్నానని, ప్రేమ జంటగా అభిషేక్, మిస్ ఇండియా శ్వేతా విజయ్ నటిస్తున్నారని తెలిపారు. రాహుల్ రాజ్ సంగీ తాన్ని కిషోర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత రాజ్ వెల్లడించారు.