త్రీమంకీస్ - 61 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 61

Published Thu, Dec 18 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

త్రీమంకీస్ - 61

త్రీమంకీస్ - 61

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 61
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘తిన్నాకా? తినక మునుపా?’’
 ‘‘నీ పొట్ట నీ మనసుని శాసిస్తోంది. మేక్ తోట కూర పొడి కూర. నాట్ వార్. బాణలిలోని నూనెని వేడి చేయడం తిరగమాత గింజలకి ఫోర్‌ప్లే’’ చెప్పి తలుపులు మూసింది.
 ‘‘అదేమిటి? తలుపులు వేస్తున్నారు?’’ వానర్ అడిగాడు.
 ‘‘మా ఇంటి చుట్టుపక్కల మేకలు ఎక్కువ’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘వేళాకోళమా? ముందుజాగ్రత్తా?’’
 మూలిక ఆ ప్రశ్నలని విననట్లే జవాబు చెప్పలేదు.
   
 ‘‘ఆహా! ఎక్కడ చూసినా లాన్‌లా పచ్చదనం’’ భోజనానికి కూర్చున్న వానర్ కంచంలోకి చూసి చెప్పాడు.
 ‘‘పచ్చదనాన్ని చూడటం వల్ల కంటికి లాభం కూడా’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘మీ ఇంట్లో కోక్ ఉందా?’’
 ‘‘ఉంది. టాయ్‌లెట్లో.’’
 ‘‘ఫ్రిజ్‌లో కాదా?’’ తెల్లబోతూ అడిగాడు.
 ‘‘రాందేవ్ బాబా వీడియో పెట్టి చూపిస్తాను. ఏసిడ్ కన్నా అది టాయ్‌లెట్ కడగడానికి బాగా ఉపయోగిస్తుందని, దాన్ని తాగితే మన కడుపులో ఏమవుతుందో...’’
 ‘‘సీడీ చూపించక్కర్లా. నమ్ముతాను. భోజనం దగ్గర ఆ మాటలు వద్దులెండి’’ ఇబ్బందిగా చెప్పాడు.
 కొన్నిటిలో అల్లం వాసన, మరికొన్నిటిలో ఇంగువ వాసన ఘుమాయించింది.
 ‘‘నా సలహా వానర్. నీ భోజనం మందు కాకపోతే, నీ మందే తర్వాత భోజనం అవుతుంది జాగ్రత్త’’ డాక్టర్ మూలిక చెప్పింది.
 ‘‘మీరు ఎన్నైనా చెప్పండి. ఏ మూలికా నాకు మీ మీద గల ప్రేమకి చికిత్స చేయలేదు’’ వానర్ చెప్పాడు.
 ‘‘చపాతీ తోటకూర కూరకి స్లీపింగ్ బేగ్’’ చపాతిలో ఆ కూర వేసి చుట్టి వానర్ కంచంలో ఉంచి ఫోటో తీస్తూ మూలిక చెప్పింది.
 దాన్ని విప్పి మధ్యకి మడిచి చెప్పాడు.
 ‘‘ఇప్పుడిది సేండ్‌విచ్.’’
 దాన్నీ మూలిక ఫొటో తీసి తన ఫేస్‌బుక్‌లో ఉంచాక వానర్ చెప్పాడు - ‘‘ఫేస్‌బుక్‌ని సృష్టించినందుకు మనం దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. లేదా ఈ భోజనం ప్లేట్ ఫొటోని తీసి, ఫిల్మ్ కడిగించి, డెవలప్ చేసి, ప్రింట్ వేయించి ఆరు వందల అరవై రెండు మంది ఇళ్ళకి తీసుకెళ్ళి చూపించాల్సి వచ్చేది.’’
 ‘‘నీకు పేరిస్ చూపించనా?’’ ఆ రాత్రి భోజనం అయ్యాక డాక్టర్ మూలిక అడిగింది.
 ‘‘ఎప్పుడు? నాకు పాస్‌పోర్ట్ లేదు’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఎప్పుడో కాదు. ఇవాళే. ఇప్పటికి ఇప్పుడు పేరిస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లోని ఓ గది  చూపిస్తాను.’’
 ‘‘చూపించండి. పేరిస్ బై నైట్ సినిమా డివిడి ఉందా?’’ ఉత్సాహంగా అడిగాడు.
 ‘‘కాదు. కళ్ళు మూసుకో.’’
 అతను కళ్ళు మూసుకున్నాడు.
 ‘‘మనం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు పేరిస్‌లో బస చేసే గది సరిగ్గా ఇలాగే కనబడుతుంది. నాకు సిగ్గు’’ మూలిక చెప్పింది.
 ‘‘మీరూ కళ్ళు మూసుకోండి. మీకూ ఓ విచిత్రం చూపిస్తాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఇప్పుడు కళ్ళు తెరవండి’’ మూడు నిమిషాల తర్వాత చెప్పాడు.
 ‘‘ఏమిటి విచిత్రం?’’ చుట్టూ చూస్తూ అడిగింది.
 ‘‘ఏమిటి విచిత్రం?’’ ఓ వింత కంఠం చెప్పింది.
 ‘‘అదేమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది.
 ‘‘అదే విచిత్రం మరి.’’
 ‘‘అదేమిటి? అదే విచిత్రం మరి’’ ఇందాకటి కంఠం వినిపించింది.
 వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు రిపీట్ అవసాగాయి.
 ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ డాక్టర్ మూలిక అడిగింది.
 ‘‘నీకు వెంట్రిలాక్విజం తెలుసా?’’ ఆమె మాటలు మళ్ళీ రిపీట్ అయ్యాయి.
 ‘‘లేదు. ఏం?’’ వానర్ అడిగాడు.
 ‘‘లేదు. ఏం?’’ మళ్ళీ  ఆ కంఠం రిపీట్ అయింది.
 ‘‘అదుగో. విన్నావా?’’ అని మూలిక అనగానే ‘అదుగో. విన్నావా?’ అని మళ్ళీ రిపీట్ అయింది.
 ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కపీష్ ఒంగి బల్ల కింద చూస్తూ అడిగాడు.
 ‘‘మరి నా మాటలు కూడా ఎలా రిపీట్ అవుతున్నాయి?’’ కార్టూన్ కంఠం ధ్వనించింది.
 ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’ కపీష్ చుట్టూ చూస్తూ చెప్పాడు.    
 ‘‘చుట్టుపక్కల కార్టూన్ కేరక్టర్ ఏదైనా ఉందేమో?’’
 డాక్టర్ మూలిక తన స్మార్ట్ ఫోన్‌ని అందుకుని స్క్రీన్ మీద కనిపించే కార్టూన్ పిల్లిని చూసింది. అది తన కుడి చేతిని కుడి చెవి దగ్గరకి తీసుకెళ్ళింది.
 ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి అడిగింది.
 ‘‘ఓ! ఏమిటిది?’’ నవ్వి ఆ కంఠం కూడా పలికింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement