ప్రతీకారంతో...! | Revenge Love story! | Sakshi
Sakshi News home page

ప్రతీకారంతో...!

Published Mon, Mar 14 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ప్రతీకారంతో...!

ప్రతీకారంతో...!

కాలేజీలో ఓ ఆరుగురు యువకులు చేసిన అన్యాయానికి బదులుగా ఓ అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘అమ్మాయి...ఆరుగురు’. జి.మురళి దర్శకత్వంలో రామచంద్ర హీరోగా నటిస్తూ  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆశాలత కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హీరో మాట్లాడుతూ -‘‘బావా మరదళ్ల మధ్య సాగే ఈ  ప్రేమకథ అందరినీ అలరిస్తుంది. తలకోన, దుర్గంకొండ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుధీర్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement