‘చంద్రముఖి’ తరహాలో... | Chandrika Movie Audio Released | Sakshi
Sakshi News home page

‘చంద్రముఖి’ తరహాలో...

Published Tue, Jul 21 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

‘చంద్రముఖి’ తరహాలో...

‘చంద్రముఖి’ తరహాలో...

ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్, కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా తెలుగు, కన్నడ భాషల్లో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్ మునియప్ప దర్శకుడు. గుణ్వంత్ సేన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతో న్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ ‘చంద్రిక’ ఎవరనేది తెరపై చూస్తేనే ఆసక్తి గొలుపుతుంది’’ అని చెప్పారు. ‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘దిబెస్ట్’గా నిలిచే చిత్రం ఇది. నా పాత్రతో పాటు శ్రీముఖి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ‘చంద్రముఖి’ తరహాలో చిరకాలం ఈ చిత్రం గుర్తుండిపోతుంది’’ అని కథానాయిక కామ్నా జెఠ్మలానీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement