Kamna Jethmalani
-
ఒకప్పడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
కామ్నా జెఠ్మలానీ ఒకప్పడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. పలువురు అగ్రహీరోలతోనూ నటించింది. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆ తర్వాత గోపిచంద్‌తో కలిసి రణంలో కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కామ్నాకు గుర్తింపు వచ్చింది. ఆమె మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్లో జయం రవి పక్కన నటించింది. ఆ తర్వాత సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్ఎంపీ, టాస్, అందమైన అబద్దం, కింగ్, కత్తి కాంతారావు, యాక్షన్ 3డీ, చివరిగా శ్రీ జగద్గురు ఆదిశంకరలో కనిపించింది. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు కూడా చేసింది. ముంబయిలో కామ్నా జెఠ్మలానీ పుట్టి పెరిగింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ముద్దుగుమ్మ. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన కామ్నా తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం కష్టమే. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. వారితో కలిసి కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) -
దృశ్యకావ్యం... ఆద్యంతం ఉత్కంఠభరితం
‘‘‘దృశ్యకావ్యం’లోని ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కు కూడా ఎటువంటి స్టార్ వాల్యూ లేదు. కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా ఇది’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.... పుష్యమి ఫిలిం మేకర్స్‌పై ఇది రెండో సినిమా. ఇదే బ్యానర్‌పై శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించాం. రెండో సినిమాగా కొత్త తారాగణంతో, టెక్నీషియన్లతో ‘దృశ్యకావ్యం’ రూపొందించాను. ఎంటర్టైన్ చేస్తూనే, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. వరంగల్, హైదరాబాద్, ఇంకా పలు లొకేషన్లలో 90 రోజుల్లో పూర్తి చేశాం. ‘ఎవడి గోల వాడిదే’, ‘వాన’, ‘ప్రాణం’ చిత్రాల ఫేమ్ కమలాకర్ ఈ చిత్రానికి మంచి స్వరాలు అందించారు. ఇప్పటికే మ్యూజికల్‌గా మంచి హిట్ సాధించింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చే చిత్రం ఇది. మొదటి 20 నిమిషాలు పాత్రల పరిచయం తదితర దృశ్యాలతో సాగుతూ, ఆ తర్వాత ప్రతి నిమిషం ఆసక్తికరంగా సాగుతూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ‘దృశ్యకావ్యం’ అని టైటిల్ ఎందుకు పెట్టామో క్లయిమాక్స్‌లో తెలుస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కనువిందుగా ఉంటుంది. హృదయానికి హత్తుకునే చిత్రం కూడా. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఏ కథతో సినిమా చేయబోతున్నానో త్వరలో చెబుతాను. దర్శకత్వమే కాకుండా కొత్త కథలతో దర్శకులు వస్తే వాళ్లతో కూడా సినిమా నిర్మించడానికి రెడీ. -
డిసెంబర్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: రతీ అగ్నిహోత్రి (నటి), కామ్నా జెఠ్మలానీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖం, ఆనందం, నూతన ఉత్సాహం, స్వయం వికాసంతో ఉల్లాసంగా ఉంటారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. వీరి పుట్టిన తేదీ 10. ఇది సూర్యసంఖ్య కాబట్టి వీరికి జన్మతః నాయకత్వ లక్షణాలుంటాయి. కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్, రెడ్, ఆరంజ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, గురువారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. తండ్రిని, తత్సమానులను ఆదరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
వీడికి స్పీడెక్కువ
భయం అతని డిక్షనరీలో లేదు. ఎలాంటివారినైనా ఢీ కొనడానికి వెనకాడడు. అందుకే అందరూ అతనికి దూకుడెక్కువ అంటుంటారు. అలాంటి వ్యక్తి ఓ సవాల్‌ను స్వీకరించి దూకుడుగా ఎలా ముందుకెళ్లాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారంపూడి దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. స్వర్గీయ చక్రి స్వరపరిచిన ఈ పాటలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేంద్రరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘దర్శక, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్ కెరీర్లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుంది. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని అన్నారు. ఈ వేడుకలో చక్రి సతీమణి శ్రావణి, పాటల రచయితలు భాస్కరభట్ల, కందికొండ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రముఖి ప్యాట్రన్ చంద్రిక
కొత్త సినిమా గురూ!చంద్రిక బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బాగా పారుతున్న పాచిక - భయపెట్టడం! ఈ లేటెస్ట్ బాక్సాఫీస్ హార్రర్ సక్సెస్ ట్రెండ్‌లో ‘చంద్రకళ’, ‘పిశాచి’, గత వారం రిలీజ్ ‘మయూరి’ (తమిళంలో ‘మాయ’) తర్వాత వచ్చిన చిత్రం ‘చంద్రిక’. బంగళాలో భూతం! అర్జున్ (జయరామ్ కార్తీక్) అనే ప్రముఖ చిత్రకారుడు పెద్ద హవేలీని కొంటాడు. అతని గురువైన ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్) ఆ బంగళాలో ఒకప్పుడు నివసించేవాడు. ఈ ఏకలవ్య శిష్యుడు ఆ భవనం కొనడానికి కారణం అదే. అలా ఆ భవంతిలోకి అతను, అతని భార్య శిల్ప (టీవీ యాంకర్, నటి శ్రీముఖి) అడుగుపెడతారు. అయితే, ఆ బంగళాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి శిల్ప ప్రవర్తనలో చిత్రమైన మార్పులు మొదలవుతాయి. చివరకు ఆ బిల్డింగ్‌లో ఒకప్పుడు తాను గీసిన పెద్ద స్త్రీమూర్తి చిత్తరువులోని చంద్రికనే తానంటూ భార్యను పూనిన దయ్యం చెబుతుంది. అక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది. భార్యను పట్టిన ఆ బంగళాలోని దయ్యాన్ని వదిలించడానికి అర్జున్ ఒక మంత్రోపాసకుణ్ణి ఆశ్రయిస్తాడు. చంద్రికకూ, నీకూ సంబంధం ఏమిటన్న ఆ ఉపాసకుడి దగ్గర అర్జున్ తన ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేస్తాడు. చంద్రిక, తాను ఒకప్పటి ప్రేమికులమనీ, పీటల దాకా వచ్చి తమ పెళ్ళి ఆగిపోయిందనీ చెబుతాడు. అయితే, ఆ ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కూడా చంద్రిక మరణం మిస్టరీ వీడదు. ఆ పజిల్‌ను సాల్వ్ చేయడానికి అర్జున్ అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ అన్వేషణలో అతనికి తెలిసిందేమిటి? ఏమైందన్నది మిగతా సినిమా. కీలకంగా.. సౌండ్ ఎఫెక్ట్స్ తెలుగు కన్నా ఒక రోజు ముందే కన్నడ వెర్షన్ రిలీజైన ‘చంద్రిక’ ప్రాథ మికంగా కన్నడ సినిమా. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వాళ్ళతో షూట్ చేసిన సీన్లు దీన్ని కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం చేశాయి. కానీ, కన్నడ తరహా టేకింగ్, ఆ నిర్మాణ విలువలు తెలిసిపోతుంటాయి. అర్జున్ పాత్రధారి మనకు కొత్త. కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపు. వారిద్దరి మధ్య ప్రణయగీతం మాత్రం ఇవాళ్టి సినిమాల్లోని ఐటమ్ సాంగ్లా మాస్‌ను ఆకట్టుకుంటుంది. ‘జులాయి’లో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషించిన టీవీ యాంకర్ శ్రీముఖిది సినిమాలో ప్రధానపాత్ర. గృహిణిగా, దయ్యంగా వేరియేషన్ బాగా చూపారు. ఇంటర్వెల్ ముందు ముగ్గులో విచిత్ర విన్యాసాలతో ఆమె నటన బాగుంది. మిగతా పాత్రలన్నీ కాసేపు కనిపించి పోయేవి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత ప్లస్. కెమేరా వర్క్ ఫరవాలేదు. సినిమా మొదలైన కాసేపటికే క్యారెక్టర్లు, దయ్యం విషయం పరిచయం అయిపోతుంది. కానీ, ముందే ఊహించగల సీన్లతోనే ఫస్టాఫంతా సాగు తుంది. ఇంటర్వెల్‌కి కానీ బండి పట్టాలెక్కదు. ఫ్లాష్‌బ్యాక్ నుంచి సెకండాఫ్ ఆసక్తిగా సాగాలి. అక్కడకొచ్చేసరికి, ప్రేమ సీన్ల లాగుడు. చివరకు ప్రాబ్లమ్ సాల్వ్ కావడాన్ని కూడా తేలిగ్గా తేల్చేశారు. భవంతిలోని దయ్యం హీరో మీద పగబట్టి ఉంటే, అతనక్కడికి వచ్చేదాకా ఏమీ చెయ్యదెందుకని? జరిగిన సంగతేదీ తెలియకుండా హీరో బతికేస్తున్నాడా? లాంటి ప్రశ్నలకు జవాబులు ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే! కథలోని సమస్యను పరిష్కరించడానికి సోకాల్డ్ హీరో చేసిందేమిటంటే జవాబు దొరకదు. కథలో బలమైన విలన్లు, ఆ విలన్లు చేసిన దుర్మార్గాలు, దుష్కృత్యాలూ లేవు. అందుకే, వ్యవహారమంతా ఉపరితల స్పర్శే. బలమైన హార్రర్ కథ కానీ, ఇటీవలి హార్రర్ కామెడీ కానీ కనిపించవు. రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా సినిమా చేయాలన్న బలమైన కోరిక మాత్రం అడుగడుగునా అర్థమవుతుంటుంది. అదే ఈ కథకు మైనస్సూ, ప్లస్సూ కూడా! చిత్రం - ‘చంద్రిక’, తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ, గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, మాటలు - నాగేశ్వరరావు, పాటలు - వనమాలి, సంగీతం - గుణ్వంత్, కెమెరా - కె. రాజేందర్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే - సాజిద్ ఖురేషీ, నిర్మాత - వి. ఆశ, దర్శకత్వం - యోగేశ్, నిడివి - దాదాపు 2 గంటలు, రిలీజ్ - 25 సెప్టెంబర్ -
భయపెట్టే చంద్రిక
కొత్తగా పెళ్లయిన జంట వారిది. వాళ్ళ మధ్య అనుకో కుండా కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చంద్రిక’. యోగేశ్ దర్శకత్వంలో కార్తీక్ జయరామ్, కామ్నా జెత్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా వి.ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ 25న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సాజిద్ ఖురేషీ అందించిన స్క్రీన్‌ప్లే హైలైట్. హారర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్ సేన్, ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు. -
‘చంద్రముఖి’ తరహాలో...
ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్, కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా తెలుగు, కన్నడ భాషల్లో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్ మునియప్ప దర్శకుడు. గుణ్వంత్ సేన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతో న్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ ‘చంద్రిక’ ఎవరనేది తెరపై చూస్తేనే ఆసక్తి గొలుపుతుంది’’ అని చెప్పారు. ‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘దిబెస్ట్’గా నిలిచే చిత్రం ఇది. నా పాత్రతో పాటు శ్రీముఖి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ‘చంద్రముఖి’ తరహాలో చిరకాలం ఈ చిత్రం గుర్తుండిపోతుంది’’ అని కథానాయిక కామ్నా జెఠ్మలానీ తెలిపారు. -
ఎవరు కారణం?
వారిద్దరికీ కొత్తగా పెళ్లైంది. చూడముచ్చటైన జంట. ఎన్నో కలలతో కొత్త ఇంట్లో కాపురం పెట్టారు. మొదట్లో బాగానే ఉన్నా, హఠాత్తుగా ఆ ఇంట్లో అనుకోని భయానక సంఘటనలు జరుగుతాయి. దానికి కారణం ఎవరు? దెయ్యమా...లేక మనిషా...? తెలుసుకోవాలంటే ‘చంద్రిక’ చూడాల్సిందే అంటున్నారు ఈ చిత్ర దర్శక, నిర్మాతలు. కార్తీక్ జయరామ్, కామ్నా జఠ్మలాని ముఖ్య తారలుగా ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో వి.ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్ మునిసిద్దప్ప దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఇటీవలే యూ ట్యూబ్‌లో నేరుగా విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌గారి ‘చంద్రముఖి’లా చిరకాలం గుర్తుండిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాజిద్ ఖురేషి స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. -
కలవరం.. కలకలం...!
ఓ పెద్ద భవంతి. అక్కడ లేని సౌకర్యమంటూ ఉండదు. కొత్తగా పెళ్లయిన ఓ జంట ఆ భవంతిలో కాపురం పెట్టింది. కట్ చేస్తే అక్కడ కలకలం మొదలైంది. ఏవేవో వింత సంఘటనలు ఈ జంటను కలవరం పెట్టాయి. ఈ నేపథ్యంలో ‘చంద్రిక’ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది. టైటిల్ రోల్ కామ్నా జఠ్మలాని పోషిస్తున్నారు. కార్తీక్ జయరామ్, శ్రీముఖి, గీరీశ్ కర్నాడ్, ఎల్బీశ్రీరాం తదితరులు ఇందులో ముఖ్యతారలు. యోగేశ్ మునిసిద్దప్ప దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రముఖి, కాంచన , గంగ చిత్రాల తరహాలోనే హరర్ ఎంటర్టైనర్ ఇదని, ‘చంద్రముఖి’ని మించి ఈ సినిమా రూపొందుతోందని, త్వరలో పాటలు విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. -
కడపలో కామ్నజెఠ్మలాని సందడి
-
చంద్రముఖి తరహా 'చంద్రిక'!!
-
హ్యాపీ ‘హ్యాపీ’గా...
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళంలోని జీటీ రోడ్లో కొత్తగా ‘హ్యాపీ’ షాపింగ్‌మాల్‌ను సినీనటి కామ్నా జఠ్మలానీ సోమవారం అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాపింగమాల్ పేరులోనే ‘హ్యాపీ’ ఉందని, వచ్చే కొనుగోలుదారులు కూడా హ్యాపీగానే షాపింగ్ చేసుకుని వెళ్తారని నవ్వుతూ చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్లతో, మెట్రో నగరాల్లో ఏర్పాటు చేసే మాదిరిగా శ్రీకాకుళంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. షోరూం ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోణార్క్ శ్రీను మాట్లాడుతూ జిల్లాలోనే హ్యాపీ షాపింగ్‌మాల్ అతి పెద్దదని పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అన్నిరకాల వస్త్రాలు తమ వద్ద లభిస్తాయన్నారు. షోరూం ప్రతినిధి బరాటం చంద్రశేఖర్, బరాటం లక్ష్మణరావు, అంధవరపు వరహానరసింహం, అంధవరపు సూరిబాబు, కొంచాడ సోమేశ్వరరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సినీనటి కామ్నాతో కరచాలనంచేసేందుకు మహిళలు ఎగబడ్డారు. ఆమెను చూసేందుకు అభిమానులు పోటెత్తగా, షోరూమ్ బయట వారినుద్దేశించి ఆమె హుషారుగా మాట్లాడారు. -
శ్రీవారికి ప్రేమగా వంట
కథానాయికగా వెండితెరపై తళుక్కుమన్న కామ్నా జెఠ్మలాని.. ఇప్పుడు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. ఎనిమిది నెలల కిందట ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. కలవారి కోడలిగా కొత్త ఇన్నింగ్స మొదలెట్టింది. శుక్రవారం మాదాపూర్‌లోని వీవీనగర్‌లో జీసీ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కామ్నా ‘సిటీ ప్లస్’తో కాసేపు ముచ్చటించింది. పుట్టింది, పెరిగింది ముంబైలోనే. అమ్మ, నాన్న, నేను తమ్ముడు, చెల్లి.. మై ఫ్యామిలీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అమ్మ హౌస్‌వైఫ్. తమ్ముడు కూడా ఇప్పుడు బిజినెస్‌లో ఉన్నాడు. నేను మా ఇంట్లో 65 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్లను. అందుకే అల్లారుముద్దుగా చూసుకుంటారు. టెక్స్టైల్ డిజైనింగ్ చేశాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డిజైనర్‌గా సెటిల్ అయి ఉండేదాన్ని. ఫ్యూచర్లో పిల్లలకు సంబంధించిన ఒక ఇన్నోవేటివ్ ఫీల్డ్‌ను నెలకొల్పుతాను. ఎప్పటికీ మరచిపోలేను కాలేజ్ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఓ షో చూసిన డెరైక్టర్ హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. సినిమాల కోసమే 9 ఏళ్ల కిందట మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చా. అప్పుడు శిల్పకళావేదికలో పెర్ఫార్మెన్స్ ఇచ్చా. అప్పటికి నేనెవరో తెలియకపోయినా.. అక్కడున్నవారంతా నన్నెంతో అభినందించారు. ఆరోజు మరచిపోలేను. ఏనాటి బంధమో... నాకు హైదరాబాద్‌తో ఏదో తెలియని అనుబంధం ఉంది. సిటీలో బాగా నచ్చే ప్లేస్ గోల్కొండ ఫోర్ట్. అక్కడ షూటింగ్ కోసమని వారం రోజులు ఉన్నాను. ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో మారిపోయింది. నేను ఫస్ట్‌టైం సిటీకి వచ్చినప్పుడు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సూపర్బ్. అక్కడ రోడ్లు, చెట్లు, వ్యూ.. కొత్తగా అనిపిస్తాయి. బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లో సెట్ దోశ భలే ఇష్టం. కొత్తగా.. హ్యాపీగా... ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా అత్తగారిల్లు బెంగళూరు. అక్కడే ఉంటున్నా. మా ఆయన సూరజ్. మెకానికల్ ఇంజనీర్. ఆయనకు స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఉంది. షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పినా నో ప్రాబ్లమ్. నా లైఫ్ ఫుల్ సెక్యూర్డ్. మా శ్రీవారి హైట్ 6.2 అడుగులు.. ఆయన పక్కన నిల్చుంటే క్రేజీగా అనిపిస్తుంది. నా వంటల ఎక్స్పరిమెంట్స్ అంటే ఆయనకు ఇష్టం. మా అమ్మకు ఫోన్ చేసి మరీ ప్రేమగా వండి పెడుతుంటాను. నేను ప్రాపర్ హోమ్ మేకర్నని అనుకుంటున్నాను. కుకింగ్, నా భర్తను, అత్తయ్యను చూసుకోవడం ఇవన్నీ కొత్తగా ఉన్నా హ్యాపీగానే ఉంది. - శిరీష చల్లపల్లి -
‘బ్యాండ్ బాలు’స్టిల్స్
-
భయపెట్టే చంద్రిక
‘చంద్రముఖి’ తరహాలో తెలుగు, కన్నడ భాషల్లో ‘చంద్రిక’ చిత్రం రూపొందుతోంది. యోగేష్ మునిసిద్దప్ప దర్శకత్వంలో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి వి. ఆశ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామ్న జఠ్మలానీ, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ శ్రీముఖి, అర్జున్ ఇందులో ముఖ్యతారలు. బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అన్యోన్యంగా మెలిగే ఓ కొత్త జంటకు ఓ భవనంలో ఎదురుపడ్డ సంఘటనల సమాహారమే ఈ సినిమా. ‘చంద్రముఖి’ని తలపించేలా భయపెట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కామ్న జఠ్మలానీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయే పాత్ర ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్. -
చంద్రికా మూవీ స్టిల్స్
-
ఓరుగల్లులో తారల హంగామా
-
'వీడికి దూకుడెక్కువ' సినిమా స్టిల్స్
-
వీడికి దూకుడెక్కువ...
శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ‘హంటర్’ సినిమా టైటిల్ మారింది. ‘వీడికి దూకుడెక్కువ’ అనే టైటిల్‌ని దీనికి ఖరారు చేశారు. ఇందులో కామ్నా జఠ్మలాని కథానాయిక. సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా ఇది. త్వరలో పాటలను విడుదల చేస్తాం. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. సింగపూర్, మలేసియాల్లో చిత్రీకరించిన పాటలు కనువిందు చేస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి. -
కామ్నకు పెళ్లయిపోయిందా?
కథానాయిక కామ్న జఠ్మలానీకి పెళ్లయిపోయిందా? మూడు నెలల క్రితమే ఆమె పెళ్లి చేసుకున్నారనే వార్త వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్‌తో ఆమె వివాహం జరిగిందని, ఆ వేడుకకు తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు కథానాయికలను మాత్రమే కామ్న ఆహ్వానించారని వినికిడి. ‘ప్రేమికులు’ సినిమాతో నాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ రణం, సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్ఎంపీ లాంటి సినిమాలు చేశారు. ఇటీవలే ‘భాయ్’లో నాగార్జునతో కలిసి నటించారు. ఈ పెళ్లి వార్త రూమరా? ఒకవేళ నిజమైతే కామ్న ఎందుకు రహస్యంగా ఉంచినట్టు? అసలు నిజం కామ్నానే చెప్పాలి. -
శ్రీకాంత్ హంటింగ్...
అతనో వేటగాడు. ఎవరినైనా వేటాడాలనుకుంటే... ఆ వ్యక్తి గల్లంతవ్వడం ఖాయం. అంత శక్తిమంతుడు. ఇంతకీ ఈ వేటగాడి వేట దేనికోసం? అతని ఆశయం ఏంటి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘హంటర్’. ‘వేట మొదలైంది’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్, కామ్న జఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ పాత్ర, నటన, కామ్న అందచందాలు ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్స్. చక్రి స్వరపరచిన పాటలు, సురేంద్రరెడ్డి ఛాయాగ్రహణం హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శకుడు తెలిపారు. చంద్రమోహన్, అజయ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.