భయపెట్టే చంద్రిక | Kamna Jethmalani's ' Chandrika ' completes first schedule | Sakshi
Sakshi News home page

భయపెట్టే చంద్రిక

Published Wed, Sep 3 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

భయపెట్టే చంద్రిక

భయపెట్టే చంద్రిక

‘చంద్రముఖి’ తరహాలో తెలుగు, కన్నడ భాషల్లో ‘చంద్రిక’ చిత్రం రూపొందుతోంది. యోగేష్ మునిసిద్దప్ప దర్శకత్వంలో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి వి. ఆశ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామ్న జఠ్మలానీ, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ శ్రీముఖి, అర్జున్ ఇందులో ముఖ్యతారలు. బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఇటీవలే తొలి షెడ్యూలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అన్యోన్యంగా మెలిగే ఓ కొత్త జంటకు ఓ భవనంలో ఎదురుపడ్డ సంఘటనల సమాహారమే ఈ సినిమా. ‘చంద్రముఖి’ని తలపించేలా భయపెట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. కామ్న జఠ్మలానీ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే పాత్ర ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement