హ్యాపీ ‘హ్యాపీ’గా...
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళంలోని జీటీ రోడ్‌లో కొత్తగా ‘హ్యాపీ’ షాపింగ్‌మాల్‌ను సినీనటి కామ్నా జఠ్మలానీ సోమవారం అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షాపింగమాల్ పేరులోనే ‘హ్యాపీ’ ఉందని, వచ్చే కొనుగోలుదారులు కూడా హ్యాపీగానే షాపింగ్ చేసుకుని వెళ్తారని నవ్వుతూ చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్‌లతో, మెట్రో నగరాల్లో ఏర్పాటు చేసే మాదిరిగా శ్రీకాకుళంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. షోరూం ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోణార్క్ శ్రీను మాట్లాడుతూ జిల్లాలోనే హ్యాపీ షాపింగ్‌మాల్ అతి పెద్దదని పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అన్నిరకాల వస్త్రాలు తమ వద్ద లభిస్తాయన్నారు. షోరూం ప్రతినిధి బరాటం చంద్రశేఖర్, బరాటం లక్ష్మణరావు, అంధవరపు వరహానరసింహం, అంధవరపు సూరిబాబు, కొంచాడ సోమేశ్వరరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సినీనటి కామ్నాతో కరచాలనంచేసేందుకు మహిళలు ఎగబడ్డారు. ఆమెను చూసేందుకు అభిమానులు పోటెత్తగా, షోరూమ్ బయట వారినుద్దేశించి ఆమె హుషారుగా మాట్లాడారు.