శ్రీకాంత్ హంటింగ్...
శ్రీకాంత్ హంటింగ్...
Published Tue, Nov 12 2013 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
అతనో వేటగాడు. ఎవరినైనా వేటాడాలనుకుంటే... ఆ వ్యక్తి గల్లంతవ్వడం ఖాయం. అంత శక్తిమంతుడు. ఇంతకీ ఈ వేటగాడి వేట దేనికోసం? అతని ఆశయం ఏంటి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘హంటర్’. ‘వేట మొదలైంది’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్, కామ్న జఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ పాత్ర, నటన, కామ్న అందచందాలు ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్స్. చక్రి స్వరపరచిన పాటలు, సురేంద్రరెడ్డి ఛాయాగ్రహణం హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నామని దర్శకుడు తెలిపారు. చంద్రమోహన్, అజయ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Advertisement
Advertisement