వీడికి దూకుడెక్కువ... | srikanth new movie titled as 'veediki dookudu ekkuva' | Sakshi
Sakshi News home page

వీడికి దూకుడెక్కువ...

Published Fri, Dec 20 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

వీడికి దూకుడెక్కువలో కామ్నా జఠ్మలాని ,శ్రీకాంత్

వీడికి దూకుడెక్కువలో కామ్నా జఠ్మలాని ,శ్రీకాంత్


 శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ‘హంటర్’ సినిమా టైటిల్ మారింది. ‘వీడికి దూకుడెక్కువ’ అనే టైటిల్‌ని దీనికి ఖరారు చేశారు. ఇందులో కామ్నా జఠ్మలాని కథానాయిక. సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే సినిమా ఇది. త్వరలో పాటలను విడుదల చేస్తాం. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. సింగపూర్, మలేసియాల్లో చిత్రీకరించిన పాటలు కనువిందు చేస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement