వీడికి స్పీడెక్కువ | Srikanths New Film Rechristened Veediki Dookudekkuva | Sakshi
Sakshi News home page

వీడికి స్పీడెక్కువ

Published Mon, Oct 26 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

వీడికి స్పీడెక్కువ

వీడికి స్పీడెక్కువ

భయం అతని డిక్షనరీలో లేదు. ఎలాంటివారినైనా ఢీ కొనడానికి వెనకాడడు. అందుకే అందరూ అతనికి దూకుడెక్కువ అంటుంటారు. అలాంటి వ్యక్తి ఓ సవాల్‌ను స్వీకరించి దూకుడుగా ఎలా ముందుకెళ్లాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘వీడికి దూకుడెక్కువ’. శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా సత్యనారాయణ ద్వారంపూడి దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. స్వర్గీయ చక్రి స్వరపరిచిన ఈ పాటలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేంద్రరెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘దర్శక, నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్ కెరీర్‌లోనే ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుంది. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని అన్నారు. ఈ వేడుకలో చక్రి సతీమణి శ్రావణి, పాటల రచయితలు భాస్కరభట్ల, కందికొండ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement