భయపెట్టే చంద్రిక
కొత్తగా పెళ్లయిన జంట వారిది. వాళ్ళ మధ్య అనుకో కుండా కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చంద్రిక’. యోగేశ్ దర్శకత్వంలో కార్తీక్ జయరామ్, కామ్నా జెత్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా వి.ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ 25న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సాజిద్ ఖురేషీ అందించిన స్క్రీన్‌ప్లే హైలైట్. హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఉత్కంఠ భరితంగా సాగుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్ సేన్, ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు.