ఫోటోలో ఏడుస్తున్న పాపాయి.. ఇప్పుడు టాప్‌ యాంకర్‌ | Womens Day 2024: Do You Guess This Tollywood Top Anchor | Sakshi
Sakshi News home page

ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్‌ యాంకర్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published Fri, Mar 8 2024 5:14 PM | Last Updated on Fri, Mar 8 2024 6:13 PM

Womens Day 2024: Do You Guess This Tollywood Top Anchor - Sakshi

ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగులో టాప్‌ యాంకర్‌. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. రియాలిటీ షోలో పాల్గొనడమే కాకుండా వాటికి హోస్టింగ్‌ చేసిన ఘనత ఈమె సొంతం. ఆవిడే యాంకర్‌ శ్రీముఖి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీముఖి నోరు తెరిస్తే మాటల ప్రవాహం నదిలా పొంగి పొర్లుతుంది. అంతటి వాగ్దాటి. ఆ మధ్య బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌కు కూడా వెళ్లొచ్చింది. ఆ సమయంలో బిగ్‌బాస్‌ సింబల్‌ (కంటి గుర్తును) పచ్చబొట్టుగా వేయించుకుంది. తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి నేడు ఉమెన్స్‌ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి..
'ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన, నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఏమీ లేని స్థాయి నుంచి ఇక్కడివరకు.. ఆమె సాగించిన ప్రయాణం నాలో స్ఫూర్తిని నింపింది.. లక్షలాదిమంది అభిమానులకు దగ్గరచేసింది. పల్లెటూరిలో పుట్టిపెరిగిన ఆమె చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ తను కన్న కలలను ఎన్నడూ వదిలిపెట్టలేదు. అంకితభావంతో కళను నేర్చుకుంది. బ్యుటీషియన్‌గా మారింది. సాధారణ బ్యుటీషియన్‌గా కాకుండా నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది.

లావుగా ఉన్నానని వెక్కిరింతలు..
నాకోసం, మా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నా విషయంలో ఒక్కసారి కూడా తను నాకు నో చెప్పనేలేదు. లావుగా ఉన్నానని అందరూ వెక్కిరించినప్పుడు కూడా నాకు అండగా నిలబడింది. నాపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఎంతో ఎంకరేజ్‌ చేసింది. నన్ను బలవంతురాలిగా నిలబెట్టింది. త్వరలో ఆమెకు 50 ఏళ్లు నిండబోతున్నాయి. ఇప్పటికీ తను నన్ను ప్రతిరోజూ ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ మమ్మా.. ఐ లవ్యూ మమ్మా..' అని రాసుకొచ్చింది శ్రీముఖి. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: షారుక్‌.. కమల్‌ను విలన్‌ చేద్దామనుకున్నాడు.. కానీ ఆయన..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement