బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసినట్లే ఉంటుంది. మాట్లాడటం మొదలుపెట్టిందంటే మాటల ప్రవాహం జలపాతంలా ముందుకెళ్తూనే ఉంటుంది. మాటలు, పాటలు, ఆటలు, స్టెప్పులు.. ఇలా అన్నింటా జోష్ చూపించే శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో అలరిస్తోంది. దీనికి తోడు ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో తన అందచందాలు ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ బర్త్‌డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ వైట్ డ్రెస్సులేసుకోగా తమ్ముడితో కేక్ కట్ చేయించింది శ్రీముఖి.
అతడి ముఖానికి కేక్ రుద్దుతూ, తమ్ముడిని ఆప్యాయంగా ముద్దాడుతూ ఫోటోలు దిగింది. వీటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట పుకార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! దీనిపై రాములమ్మ తీవ్రంగానే స్పందించింది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తారని మండిపడింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున పెళ్లి ఆలోచన వచ్చినా అందరికీ చాటింపు వేసి మరీ చెప్తానని చెప్పుకొచ్చింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment