![Anchor Sreemukhi Fires On Wedding Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/sreemukhi.gif.webp?itok=tHvkEbIO)
టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాదీకి చెందిన ఓ బిజినెస్‌మెన్‌తో ఏడడుగులు వేయబోతుందన్నది ఆ వార్త సారాంశం. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు రావడం.. తీరా అవన్నీ తూచ్ అని ఆవిడే స్వయంగా వెల్లడించడం తెలిసిన విషయమే!
అయితే మరోసారి గాసిప్‌రాయుళ్లు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేయడంతో ఫైర్ అయింది శ్రీముఖి. 'అదంతా ఫేక్.. ఎంత దారుణంగా తయారయ్యారంటే నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి అతడినే పెళ్లి చేసుకోబోతున్నానంటూ థంబ్‌నైల్స్ పెడుతున్నారు. ఇదెంత ఘోరం? ఈ రూమర్లు వినీవినీ అలిసిపోయాను. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు' అని అసహనం వ్యక్తం చేసింది.
ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపింది. మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అప్పుడు తానే స్వయంగా ఈ ప్రపంచానికి అరిచి మరీ చెప్తానంటోంది బుల్లితెర రాములమ్మ.
చదవండి: ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి
మీ లవర్ ఎక్కడ? తమన్నాను ఆటాడుకున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment