Anchor Sreemukhi Getting Ready for Marriage?, Posted Special Valentines Day Wishes - Sakshi
Sakshi News home page

sreemukhi: వాలెంటైన్స్‌ డే రోజున షాకిచ్చిన యాంకర్‌ శ్రీముఖి

Published Tue, Feb 15 2022 7:18 PM | Last Updated on Wed, Feb 16 2022 10:06 AM

Anchor Sreemukhi Shares Special Post On Valentines Day - Sakshi

యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.

తాజాగా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. 'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్​' అంటూ లవ్‌ ఎమోజీలతో ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్‌ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్‌ని కూడా రివీల్‌ చెయ్‌ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement