Anchor Ravi And Sreemukhi Met After 2 Years In Show, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Anchor Ravi - Sreemukhi: రెండేళ్ల తర్వాత కలిసిన యాంకర్స్‌ రవి-శ్రీముఖి..

Published Mon, Jan 24 2022 9:02 AM | Last Updated on Mon, Jan 24 2022 10:21 AM

Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral - Sakshi

Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్‌ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు. 'సమ్‌థింగ్‌ స్పెషల్'‌ అనే  ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్‌ షోతో మరింత ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్‌, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు.

అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్‌ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది.

బిగ్‌బాస్‌ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్‌ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement