కామ్నా జెఠ్మలానీ ఒకప్పడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. పలువురు అగ్రహీరోలతోనూ నటించింది. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆ తర్వాత గోపిచంద్‌తో కలిసి రణంలో కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కామ్నాకు గుర్తింపు వచ్చింది.
ఆమె మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్‌లో జయం రవి పక్కన నటించింది. ఆ తర్వాత సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ, టాస్, అందమైన అబద్దం, కింగ్, కత్తి కాంతారావు, యాక్షన్ 3డీ, చివరిగా శ్రీ జగద్గురు ఆదిశంకరలో కనిపించింది. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు కూడా చేసింది.
ముంబయిలో కామ్నా జెఠ్మలానీ పుట్టి పెరిగింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ముద్దుగుమ్మ. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన కామ్నా తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం కష్టమే. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. వారితో కలిసి కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment