Kamna jetmalani
-
ఒకప్పడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
కామ్నా జెఠ్మలానీ ఒకప్పడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. పలువురు అగ్రహీరోలతోనూ నటించింది. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆ తర్వాత గోపిచంద్‌తో కలిసి రణంలో కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కామ్నాకు గుర్తింపు వచ్చింది. ఆమె మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్లో జయం రవి పక్కన నటించింది. ఆ తర్వాత సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్ఎంపీ, టాస్, అందమైన అబద్దం, కింగ్, కత్తి కాంతారావు, యాక్షన్ 3డీ, చివరిగా శ్రీ జగద్గురు ఆదిశంకరలో కనిపించింది. ఆ తర్వాత రెండు కన్నడ సినిమాలు కూడా చేసింది. ముంబయిలో కామ్నా జెఠ్మలానీ పుట్టి పెరిగింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ముద్దుగుమ్మ. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన కామ్నా తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం కష్టమే. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. వారితో కలిసి కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) -
ఇంకా సాధించాల్సింది ఉంది!
‘‘ఈ మధ్య కాలంలో నాకు సరైన విజయాలు రాలేదన్న మాట నిజమే. ‘వీడికి దూకుడెక్కువ’ సినిమా మాత్రం ఆ లోటు తీరుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సత్యం ద్వారపూడి దర్శకత్వంలో శ్రీకాంత్, కామ్నా జెత్మలానీ జంటగా బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ - ‘‘నా కెరీర్లో ‘ది బెస్ట్’ సినిమా ఇది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. పరిశ్రమకు వచ్చి చాలా కాలమైనా ఇంకా సముద్రంలో ఈదుతున్నట్టే ఉంది. ఇంకా సాధించాల్సింది ఉంది. ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఓ హారర్ చిత్రంలో నటిస్తున్నా. ‘అమ్మ’ రాజశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇక మా అబ్బాయి రోషన్ సంగతంటారా! తను ఇంకా చిన్నపిల్లాడే. వాడి భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. మొన్నీ మధ్యే ‘రుద్రమదేవి’లో నటించాడు. ప్రస్తుతం ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. హీరోగా వాడు పెద్ద స్థాయికి చేరుకుంటాడా లేదా అన్నది వాడి అదృష్టమే’’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రముఖిలా ఉండదు!
ఓ చిత్రకారుని జీవితంలోకి చంద్రిక అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఓ ఆత్మ రూపంలో అతణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అసలు ఎందుకు వచ్చింది? అతనికీ, ఆ ఆత్మకూ సంబంధం ఏమిటనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘చంద్రిక’. యోగేశ్ దర్శకత్వంలో కార్తీక్ జయరామ్, కామ్నా జెత్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా వి. ఆశ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ఈ చిత్రంలో హారర్‌తో పాటు రొమాన్స్, కామెడీ అన్ని అంశాలుంటాయి’’అని కామ్నా జెత్మలానీ చెప్పారు. ‘‘ ‘చంద్రముఖి’కీ, ఈ సినిమాకూ పోలికలుండవు. ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్‌గా ఉంటుంది’’ అని శ్రీముఖి అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే సమకూర్చిన సాజిద్ ఖురేషి మాట్లాడుతూ- ‘‘డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తుంది. కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఎంతో ప్యాషన్‌తో నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గుణ్వంత్ సేన్, ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు.