చంద్రముఖిలా ఉండదు! | Chandrika Set To Release On September 25 | Sakshi
Sakshi News home page

చంద్రముఖిలా ఉండదు!

Published Thu, Sep 24 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

చంద్రముఖిలా ఉండదు!

చంద్రముఖిలా ఉండదు!

ఓ చిత్రకారుని జీవితంలోకి చంద్రిక అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఓ ఆత్మ రూపంలో అతణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అసలు ఎందుకు వచ్చింది? అతనికీ, ఆ ఆత్మకూ సంబంధం ఏమిటనే కథాంశంతో  తెరకెక్కిన చిత్రం ‘చంద్రిక’. యోగేశ్ దర్శకత్వంలో కార్తీక్ జయరామ్, కామ్నా జెత్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా వి. ఆశ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ఈ చిత్రంలో హారర్‌తో పాటు రొమాన్స్, కామెడీ అన్ని అంశాలుంటాయి’’అని  కామ్నా జెత్మలానీ చెప్పారు. ‘‘ ‘చంద్రముఖి’కీ, ఈ సినిమాకూ పోలికలుండవు.
 
   ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్‌గా ఉంటుంది’’ అని శ్రీముఖి అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే సమకూర్చిన సాజిద్ ఖురేషి మాట్లాడుతూ- ‘‘డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తుంది. కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఎంతో ప్యాషన్‌తో నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గుణ్వంత్ సేన్, ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement