సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా | Suspense thriller film | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా

Published Sun, Jan 25 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా

సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా

 సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో నచ్ అనే చిత్రం తెరకెక్కనుంది. మలయాళంలో 17 చిత్రాలు నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన మరికార్ ఫిలింస్ అనుబంధ సంస్థ మరికాల్ ఆర్ట్స్ తమిళంలో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఈ సంస్థ తొలి ప్రయత్నంగా నచ్ అనే చిత్రాన్ని నిర్మించనుంది. చిత్ర వివరాలను దర్శకుడు అహ్మద్ మరికాల్ తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించనున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. కత, కథనాలు నవ్యతతో కూడి వుంటాయన్నారు.
 
 చిత్ర కథ మొత్తం 12 పాత్రల చుట్టూ తిరుగుతుందని తెలిపారు. అంగాడితెరు ఫేమ్ మహేష్, సంజీవ్, ప్రవీణ్ ప్రేమ్, రియాజ్‌ఖాన్, కాళీ, మదుమిత బెనర్జి, పూనం జవర్, ఎదన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నార ని చెప్పారు. వీరితో పాటు ప్రముఖ నటుడు మమ్ముట్టి సోదరుడు ఇబ్రహీం కొడుకు మక్భుల్ సల్మాన్ ఒక హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక దర్శకుడితో పాటు  సీనియర్ నటీనటులున్నట్లు చెప్పారు. చిత్రానికి మన్సూర్ అహ్మద్, గౌరి లక్ష్మి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభించి చెన్నై, కేరళ, మలేషియా ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement