
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రం ‘బద్మాషులు’.
ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని, ఆ అనుభూతిని నలుగురూ పంచుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవితంలో మనకి తారసపడే వారిలాగే ఉంటూ నవ్విస్తుంటుంది. పూర్తి వినోదంతో పాటు గొప్ప సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, కెమేరా: వినీత్ పబ్బతి.
Comments
Please login to add a commentAdd a comment