నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయట పడింది: హారీష్‌ రావు | Harish Rao Comments On Congress At Graduate MLC Election Campaign | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసం బయట పడింది: హారీష్‌ రావు

May 24 2024 6:56 PM | Updated on May 24 2024 7:32 PM

Harish Rao Comments On Congress At Graduate MLC Election Campaign

సాక్షి, ఖమ్మం: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ మోసం బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఉచిత బస్సు తప్పా పథకాలన్నీ తుస్సేనని విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ బండి రివర్స్‌ గేర్‌లో నడస్తుందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటలు కరెంటు వస్తే.. ఇప్పుడు 14 గంటలు మాత్రమే వస్తుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి అడిగితే భట్టి విక్రమార్క మేము అనలేదని నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ 100 కోట్లు ఇస్తా అని 100 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారు. అబద్దాలు, మోసాలు, ఉన్న పతకాలు ఊడగొట్టటం తప్పా.. కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమిలేని విమర్శించారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తుందని ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరావు మండిపడ్డారు. తమ్మినేని వీరభద్రం తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలపడం ముదిగొండ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందన్నారు. ప్రశ్నించే  గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న ఏ రోజైనా పేద విద్యార్థుల కోసం మాట్లాడలేదని అన్నారు. 56  కేసులున్న తీన్మార్ మల్లన్నను పట్టభద్రులా ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారా అని  ప్రశ్నించారు.


ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కామెంట్స్..

  • నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండరు లేదు..
  • తనను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల పట్ల ప్రశ్నించే గోతుకకై పోరాడుతా.
  • కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయడం లేదు.
  • నేను ఎమ్మెల్సీ గా గెలిస్తే నా జీతంతో పేద విద్యార్థుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement