మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు | If You Not Vote To TRS Your Future Is Not Good Says TS Minister Srinivas Goud | Sakshi
Sakshi News home page

మాకు ఓటేయకుంటే బాగుపడరు.. మంత్రి శాపనార్ధాలు

Published Sat, Mar 6 2021 3:18 AM | Last Updated on Sat, Mar 6 2021 11:28 AM

If You Not Vote To TRS Your Future Is Not Good Says TS Minister Srinivas Goud - Sakshi

టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే బాగుపడరని.. అన్ని తిని ఓటు వేయకుంటే మీకే నష్టం.. మంత్రి  వ్యాఖ్యలు

జడ్చర్ల టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న వారు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే బాగుపడరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘అన్ని తిని ఓటు వేయకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆ కుటుంబం బాగుపడదు. స్పృహలో ఉండి ఓట్లు వేయాలి’అని పేర్కొన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి, మీ అందరి మంచి చెడు చూసేటోళ్లమని.. అందుకే తమను ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement