ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. పశ్చిమ రాయలసీమ(చిత్తూరు, అనంతపురం) ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. అయిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి గోపాల్‌రెడ్డి 11,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.