vennapusa gopal reddy
-
Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?
రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో తొలి అంకం ముగిసింది. గత నెల 30న తుది ఓటరు జాబితా ఖరారైంది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రధాన పారీ్టలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులతో పాటు ఆశావహులు ప్రచారపర్వంపై దృష్టి సారించారు. ఆరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లతో సమావేశమవుతున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డిల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటి భర్తీకి ఉపక్రమించింది. ఇప్పటికే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు విస్తృత ప్రచారంలో తలమునకలవుతున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులతో.. యూనియన్ల వారీగా, శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. పట్టభద్రుల కోటాలో 3,28,807 ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 2.52లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే 76వేల ఓట్లు అధికం. పెరిగిన ఓట్లు ప్రభుత్వ పనితీరును, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు ‘అనంత’ నుంచి పోటీ చేస్తోన్న బీసీ నాగరాజు మధ్య ప్రధాన పోటీ ఉండే అకాశం ఉంది. వీరితో పాటు బోరంపల్లి ఆంజనేయులు, గైబున్నీసా, బోయ నాగరాజు, పట్టుపోగుల పవన్ కుమార్‌తో పాటు పలువురు పోటీలో ఉన్నా, పోటీ మాత్రం ఆ ముగ్గురి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నపూస రవీంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తనయుడు కావడం సానుకూలాంశం. రాంగోపాల్‌రెడ్డి పులివెందుల నియోజవకర్గ వాసి. ఎవ్వరికీ తెలియని వ్యక్తి! రవీంద్రారెడ్డి అభ్యరి్థత్వాన్ని ఆరు జిల్లాలలోని 26మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా సమర్థించారు. బాధ్యత తీసుకుని గెలుపునకు కృషి చేస్తున్నారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఓడిపోయామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోర పరాభావం తప్పదని, పోటీ వద్దని టీడీపీ ఇన్చార్జీలు భావించారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పారీ్టగా వైఎస్సార్సీపీ ఉండి ఎమ్మెల్సీ గెలిచిందని, ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి కనీసం పోటీ చేయకుంటే ఆ ప్రభావం కేడర్‌పై బలంగా పడుతుందని నామమాత్రపు పోటీకి సిద్ధమైంది. పోటీకి అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో రాంగోపాల్‌రెడ్డిని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తెలిసిందే. అక్కడ టీడీపీకి ఎలాంటి విజయాలు లేవు. అలాంటి నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలపడం చూస్తే ఈ ఎన్నికలను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. రవీంద్రారెడ్డి 28 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తరచూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలుస్తున్నారు. రాంగోపాల్‌రెడ్డి చంద్రబాబు పర్యటనలో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి. వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూల అంశాలు ►సచివాలయాల ఏర్పాటుతో వేలాది నిరుద్యోగులకు సర్కారు కొలువులు. ►ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు పర్మనెంట్ చేయడం. ►పోలీస్రిక్రూట్మెంట్ ద్వారా 6,900 పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు. ►అభ్యర్థుల వినతి మేరకు వయస్సు సడలింపు నిర్ణయం. ►న్యాయశాఖ పరిధిలో 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ►గ్రూప్–1 నోటిఫికేషన్‌కు చర్యలు. ►వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలన్నీ భర్తీకి నిర్ణయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలోనూ త్రిముఖ పోరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 27,716 ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఓట్లు కూడా పెరిగాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు బీజేపీ నేత ఒంటేరు శ్రీనివాసరెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. కత్తి, ఒంటేరు, రామచంద్రారెడ్డి మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కత్తి ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయ ఎన్నికల్లో యూనియన్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థి గెలుపోటములను యూనియన్లే ప్రభావితం చేయనున్నాయి. దీంతో అభ్యర్థులంతా యూనియన్ల నేతలు, సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’
సాక్షి, అనంతపురం : రాప్తాడులో టీడీపీ నేతలు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులను బెదిరించి భూ రికార్డులను తారుమారు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో కోటీశ్వరులకు కూడా ఇళ్లు మంజూరయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు ఉన్నాయి. కఠిన చట్టాలు అవసరం. భూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ భూములను కాపాడాలి’ అని సూచించారు. చదవండి : మొసలి కన్నీరొద్దు సునీతమ్మా.. -
‘బాబు’కు మతి భ్రమించింది
సాక్షి, అనంతపురం : చంద్రబాబుకు మతి భ్రమించిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడారు. పాలిచ్చే ఆవును కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను హేళనగా మాట్లాడడం చంద్రబాబుకు తగదని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ పాలనను చూసిన ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారనే వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్‌తో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలకు సమర్థవంతంగా ఎదుర్కొని 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలను ఒంటి చెత్తో గెలిపించుకున్నారన్నారు. వైఎస్ జగన్ 50 రోజుల్లోనే హామీలను నేరవేర్చేలా అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి వాటి అమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్‌కు మూడో స్థానం దక్కిందనే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలని హితవుపలికారు. -
రాక్షస పాలనకు చరమగీతం పాడదాం
అనంతపురం సిటీ: రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నగర అధ్యక్షడు చింతా సోమశేఖరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉందనీ, ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా యుద్ధంలో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేశానని ఊదరగొడుతుంటారని, ఎక్కడ పెద్ద పీట వేశారో, ఎవరికి వేశారో, బీసీలు ఎంత అభివృద్ధి చెందారో చూపించాలన్నారు. వడ్డెర్లకు ఒక పలుగు, పార, గంప, మంగళికి ఒక అద్దం, కత్తి, కుర్చీ, చాకలికి ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి ఓ అభివృద్ధి చెందారంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారన్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ అభివృద్ధి చెందారు తప్ప బీసీలకు ఒరిగింది శూన్యమన్నారు. త్వరలోనే టీడీపీ నేతలదౌర్జన్యాలకు చెక్ అనంతపురం పా ర్లమెంట్ సమన్వయకర్త త లారి పీడీ రంగయ్య మా ట్లాడుతూ టీడీపీ అ ధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారన్నారు. టీడీ పీ నేతల దౌర్జన్యాలకు చెక్‌పెట్టే రోజు దగ్గర్లో నే ఉందన్నారు. ఇన్ని రోజులూ కష్టనష్టాలు ప డ్డ వారికి ఈ 30 రోజులు మరింత కష్టపడటం అంత కాష్టమైన పనేమీ కాదన్నారు. వైఎస్ జ గన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇద్దాం పార్టీ రాష్ట్ర కార్య దర్శులు ఎ ల్ఎం మోహన్ రెడ్డి, పైలా నరసింహయ్యలు, గౌస్‌బేగ్, మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం లక్షలా ది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజ ల ఆకాంక్ష అన్నారు. దీన్ని నెరవేర్చుకోవడానికి ప్రతి క్షణం కష్టపడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ స్థానాలను వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. రాజన్న రాజ్యాన్ని సాదిద్దాం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైవీ శివారెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కలిసి వైఎస్సార్ పేరును ప్రజల హృదయాల్లోంచి చెరిపివేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్మోహన్రెడ్డిపై కేసులు నమోదు చేసి అష్టకష్టాలు పెట్టారన్నారు. అన్నింటికీ తట్టుకుని నిలబడి నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు భయపడే స్థాయికి ఆయన ఎదిగారన్నారు. అందరం ఏకమై టీడీపీ అవినీతి, అక్రమ పాలనను అంతమెందించి తిరిగి రాజన్న రాజ్యాన్నా సాధించేందుకు కష్టపడాలన్నారు. కార్యక్రమలో లీగల్ సెల్ నాయకులు నారాయణరెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, లింగాల రమేష్, చింతకుంట మధు, పెన్నోబుళేసు, చామలూరి రాజగోపాల్, మహిళా విభాగం కృష్ణవేణి, గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలగించినఓట్లను చేర్పించాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురామ్ మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లు ఒక ఎత్తూ ఈ 30 రోజులు ఒక ఎత్తన్నారు. గత ఏడు ఎనిమిది నెలలుగా దాదాపు 70 వేల ఓట్లను తొలగించారన్నారు. వెంటనే ఆయా ఓట్లను చేర్పించే ప్రక్రియనుచేపట్టాలన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులను బాబు నమ్మించి మేసం చేశారు
-
‘మేం గెలిస్తే ఓపీఎస్ అమలు చేస్తాం’
సాక్షి, విజయవాడ : 2014లో చంద్రబాబు 630 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే(ఓపీఎస్) అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలకు మంగళం పాడారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి బాబు నిరుద్యోగులను నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నిలు సమీపిస్తోన్న వేళ నిరుద్యోగభృతి అంటూ హడావుడి చేస్తున్నారు.. ఇది కూడా బోగస్‌ని గోపాల్ రెడ్డి మండిపడ్డారు. బాబు ఉదయం లేచింది మొదలు అన్ని అబద్ధాలే చెబుతారంటూ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదంటూ విమర్శించారు. రైన్ గన్స్ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారంటూ మండి పడ్డారు. ఇకనైనా చంద్రబాబు అబద్ధాలు మాని.. పాలనపై దృష్టి పెట్టకపోతే ప్రజలే బాబు పాలనకు చరమగీతం పాడతారంటూ హెచ్చరించారు. -
బినామీలతో టీడీపీ అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడుతోంది
-
చంద్రబాబుకు బుద్ధిచెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
-
ముస్లీం మైనారిటీలకు తీవ్ర అన్యాయం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సీపీఎస్ చేయాలని ఆందోళనకు వారికి ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని మడిపడ్డారు. రాష్ర్టంలో శాంతియుతంగా జరిగే ఉద్యమాలను అణిచివేయడం అప్రజాస్వామిక పరిపాలనకు నిదర్శనం అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే సీపీఎస్‌ను రద్దు చేస్తారని ఆయన చెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు గుత్తి సబ్ జైల్లో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీ. డీ. రంగయ్య, వైఎస్సార్సీపీ రాష్ర్ట కార్యదర్శి పైలా నరసింహయ్యా, గుంతకల్లు నియోజకర్గ సమన్వయకర్త వై. వెంటక రామిరెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు. రాష్ట్రంలో పశువుల కంటే హీనంగా అమ్ముడుపోయిన పార్టీ పీరాయింపుల ఎమ్మెల్యే చాంద్ బాషాకు వైఎస్సార్సీపీని విమర్శించే అర్హత అతనికి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సంతలో పశువులగ కంటే హీనంగా అమ్ముడుపోయిన నువ్వా.. వైఎస్స్సార్సీపీ గురించి మాట్లాడేది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లీం మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. -
‘బాబుకు బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధం’
సాక్షి, అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చలగాటం ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలను చంద్రబాబు వద్ద అశోక్ బాబు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల 15 రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు అశోక్ బాబు ఎవరు? ఉద్యోగుల అంగీకారం లేకుండానే 200 కోట్లు లాగేసుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, అశోక్ బాబులకు ఉద్యోగులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
‘దేశంలో ఫెల్యూర్ సీఎం చంద్రబాబు మాత్రమే’
సాక్షి, అమరావతి: ఏపీ వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల సమావేశం కర్నూల్ జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యయన్నారు. ‘ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీపీయస్ విధానాన్ని రద్దు చేసి పీఆర్సీ బకాయిలు చెలిస్తామని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 99 శాతం మంది ఉద్యోగులు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు. ఉపాధ్యాయ రంగాలపై ప్రభుత్వం నిరంకుశంగా ఉంది. పీఆర్సీ కమిషన్‌ను కమిషనర్ లేకుండా వేయడం హాస్యాస్పదం. ఇది చంద్రబాబు ఉద్యోగుల్ని మోసం చేయడమే. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. స్వార్థం కోసం ప్యాకేజీలను ఆహ్వానించిన ఘనుడు చంద్రబాబు. నాడు హోదా వద్దన్న చంద్రబాబు ప్యాకేజీల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి నేడు యూటర్న్ తీసుకుని హోదా కావాలని అనడం హాస్యాస్పదం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వల్ల ప్రజా ఉద్యమాలు అణచివేయబడ్డాయి. రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కోవడం దారుణం. రాజధాని ప్రాంతంలో భూ నిర్వాసితుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆరువందల అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సిగ్గులేకుండా ఇంకా అబద్దాలు అడుతున్నాడు. శేఖర్ రెడ్డి వద్ద దొరికిన 300 కోట్లలో 250 కోట్లు లోకేశ్‌వే. లోకేశ్ అవినీతిపై పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చంద్రబాబు కనీసం ఖండించలేదు. అనునిత్యం నిప్పు.. నిప్పు అంటున్న చంద్రబాబు అవినీతి ఆరోపణలపై విచారణకు ఎందుకు సిద్ధంగా లేరు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు స్పష్టంగా ఉంటే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి కేయి కిృష్ణమూర్తి ఉత్సవ విగ్రహంలా మారారు. ఎమ్మార్వోను బదిలీ చేసుకోలేని కేయి వల్ల జిల్లాకు వచ్చిన ప్రయోజనం శూన్యం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయో అర్థం కావడంలేదు. తెలంగాణలో ఏకే ఖాన్ లాంటి నిజాయితీ గత అధికారి కూడా నోరు విప్పకపోవడంపై అనుమానాలున్నాయి. దేశంలో అత్యంత దారుణంగా విఫలమైన పరిపాలకుడు ఒక్క చంద్రబాబు మాత్రమే’ అని విమర్శించారు. -
కులాల మధ్య మంత్రి చిచ్చు
అనంతపురం: మంత్రి పరిటాల సునీత గ్రామాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. రామగిరి మండలం పోలేపల్లి చోటు చేసుకున్న ఘటనపై వారు మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ డిల్లీరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అధికార పార్టీ నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండడం టీడీపీ వారికి ఇష్టం లేదన్నారు. ఎంతసేపూ చిచ్చుపెట్టి గ్రూపులు తయారు చేసి తాము లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కులాల చిచ్చుతో శాంతిభద్రతలకు ముప్పు పోలేపల్లిలో కనకదాస విగ్రహం ఏర్పాటు చేయాలని కురుబ కులస్తులు ఏడాదికిందటే సిద్ధం చేసుకున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అయితే విగ్రహం ఏర్పాటు చేయకుండా అధికార పార్టీ వారు అడ్డుపడ్డారని ఆరోపించారు. దీంతో గ్రామంలో కురుబ కులస్తులు వ్యతిరేకమవుతున్నారని భావించి వారి దృష్టి మళ్లించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి గడ్డివాము కల్లాలు తొలగించి బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రకటించారన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే రెడ్డి – కురుబ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తేందుకు కారణమవుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డిని చూసి నేర్చుకోండి బీసీలకు న్యాయం చేయడంలో మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి తనకు తానే సాటి అని, ఆయన్ని చూసి నేర్చుకోవాలని మంత్రి పరిటాల సునీతకు తోపుదుర్తి సూచించారు. స్థలం కొని బీసీలకు పట్టాలివ్వండి ఎస్. రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేసి పట్టాలిప్పించి ఇళ్లు కూడా నిర్మించారని వైఎస్సార్సీపీ నాయకులు చిట్ర రఘునాథ్, బోయ సూరి, గ్రామ రైతులు తెలిపారు. మరి 25 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పరిటాల కుటుంబం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు. గ్రామంలోని బీసీలు కోరుకుంటే రైతులంతా చందాలు వేసుకుని వారి ఇళ్లస్థలాల కోసం భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే గడ్డివాము కల్లాలను తొలగించకుండా ప్రభుత్వం ద్వారా çస్థలం కొనుగోలు చేసి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కుంటిమద్ది కేశవనారాయణ, రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి ఆదిరెడ్డి ఉన్నారు. ఖాళీ కాగితాలతో మభ్యపెట్టొద్దు.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాప్తడు నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించారని, ఒక్క రామగిరి మండలంలోనే 5 వేల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఇదే రామగిరి మండలంలో మంత్రి పరిటాల సునీత కనీసం 500 ఇళ్లు కూడా కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాలంటూ ఖాళీ కాగితాలతో ప్రజలను మభ్యపెట్టొద్దని హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే కనకదాన విగ్రహం ఏర్పాటు చేయించి, ప్రభుత్వంతో భూమి కొనుగోలు చేయించి బీసీలకు పట్టాలిప్పించి పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంతే కాకుండా 10వ పీఆర్సీ బకాయిలు కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ఎన్జీవో నేత అశోక్‌బాబు పోరాడటం లేదని విమర్శించారు. అశోక్‌బాబు రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. -
ఢిల్లీ టూర్లతో సాధించిందేమిటి..?
అనంతపురం : వారినికోసారి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు... తన పర్యటనలతో ఏమి సాధించారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి ఢిల్లీ పాలకులకు శాలువాలు, లడ్డూలను పంచుకుంటూ వారికి వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస క్రీడ, రాక్షస పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని పట్టుబట్టి అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి రోజుకో నాటకం, పూటకో మాట మాట్లాడుకుంటూ దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బహిరంగంగా సోము వీర్రాజు, విష్ణుకుమార్, పవన్‌కళ్యాణ్‌లు ఆరోపిస్తుంటే కనీసం ఖండించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సామాన్య ప్రజలు బతకడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులను చందాలడగడం సిగ్గుచేటన్నారు. పోలవరంలో జరిగినంత అవినీతి మరేదాంట్లో జరగలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
పిల్లలు కాపీ కొడితే టీచర్లకు ఐదేళ్లు జైలుశిక్షా?
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం మూడు పంటలు పండే భూములను దౌర్జనంగా లాక్కుందని విమర్శించారు. రైతుల భూములు లాక్కొని వెయ్యిగజాలు ఇవ్వడం, భూసేకరణ చేసుకొని రైతులను బిక్షగాళ్లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంతో మాట్లాడారు. రైతులు భూములు ఇవ్వమంటే అరెస్టు చేస్తున్నారని, పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. మీరా ప్రసాద్ అనే రైతును వేధించారని వెన్నపూస గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ‘రాజధానిలో భూములివ్వని రైతులను రకరకాలుగా వేధిస్తున్నారు. రాత్రికి రాత్రే భూములివ్వని రైతుల పొలాల్లో రోడ్లు వేస్తున్నారు. గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబుకు అకస్మాత్తుగా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చింది. చంద్రబాబు జీవితమంతా షో చేయడమే, లేచింది మొదలు అబద్ధాలే. అనంతపురం జిల్లాలో కరువుతో రైతులు అల్లాడుతుంటే రెయిన్ గన్ల పేరుతో షో చేశారు. ఆ తర్వాత అనంతపురం వైపు చంద్రబాబు కన్నెత్తి కూడా చూడలేదు. రైతులపై మొసలి కన్నీరు కార్చడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడాలి.’ అని పిలుపునిచ్చారు. టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో టీచర్లు ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారని వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లలు కాపీ కొడితే ఉపాధ్యాయులకు ఐదేళ్లు జైలు శిక్షానా?. విద్యార్థులు పొరపాటున జేబులో పేపర్ పెట్టుకొని వస్తే ఆ బాధ్యత ఉపాధ్యాయుడిదా అని మండిపడ్డారు. టీచర్లను హింసించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడాలేని చట్టాలను చంద్రబాబు ఏపీలో ప్రవేశపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. -
రామయ్యా.. ఇప్పుడేం చెబుతావ్
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి చంద్రబాబు ఇప్పుడు మరో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మేరుగ నాగార్జునతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లుగా తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సింది అసెంబ్లీలో కాదు కేంద్రంలోనని, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. గతంలో అరుణ్ జైట్లీ, వెంకయ్యకు సన్మానాలు చేసి ధన్యవాదాల తీర్మానాలు పెట్టిన సంగతి గుర్తులేదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా భయపడుతుందని దుయ్యబట్టారు. దుగరాజపట్నం పోర్ట్ అవసరం లేదు అని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రంతో పోరాడైనా, నిలదీసైనా ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో కలుషిత నీరు తాగి 10 మంది చనిపోగా, వందల మంది ఆసుపత్రిలో చేరితే తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు. దీనికి బాధ్యత వహించి మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామయ్యా.. ఇప్పుడేం చెబుతావ్: నాగార్జున చంద్రబాబు దళిత వ్యతిరేకని, పదవులు ఇస్తాను అని వారికి అన్యాయం చేయడం బాబు నైజమని మేరుగ నాగార్జున విమర్శించారు. దళితులని బలిపశువులు చేయడం బాబుకు అలవాటేనని, వర్ల రామయ్య ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు ఇప్పటికైనా కళ్లుతెరవాలని సూచించారు. అశోక్‌బాబు వత్తాసు: గోపాల్‌రెడ్డి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తకుండా ఇప్పుడు హోదా అంటున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై ఏరోజూ అశోక్‌బాబు పోరాడలేదని, పైగా ప్రభుత్వానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. -
ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా ?
అనంతపురం సప్తగిరి సర్కిల్: ‘జన్మభూమి’ సభలో సమస్యలపై మాట్లాడితే మైకు లాక్కునే స్థాయికి సీఎం దిగజారడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమం పెద్ద ప్రహసనంగా మారిందన్నారు. ప్రతిసారీ పింఛన్, ఇళ్లస్థలాల కోసం అర్జీలు తీసుకోవడం... వాటిని చెత్తబుట్టపాలు చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు. పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధన, కడప స్టీల్ పరిశ్రమ ఏర్పాటు వంటి ప్రధాన సమస్యలపై పట్టించుకోకుండా... ‘జన్మభూమి’ సభల ద్వారా సీఎం ప్రజలను మాయ చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును 2017 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు... ప్రస్తుతానికి దిమ్మెలు కూడా కట్టలేదన్నారు. పోలవరం 2022 నాటికైనా పూర్తవుతుందో..? కాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇక దుర్గగుడిలో తాంత్రిక పూజలపై రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట చంద్రబాబు సర్కార్ దేవాలయాలు, మసీదులు, గాంధీ విగ్రహాలను కూల్చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, అందువల్లే మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. వీటిని నియంత్రించాల్సిన లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. విద్యావ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర పాఠశాల ఉపాధ్యాయులను నోడల్ అధికారులుగా నియమించి పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని గోపాల్‌రెడ్డి విమర్శించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారనీ, అయితే దోమలు పోలేదు కానీ విద్యార్థులు చదువులు మాత్రం నాశనం అయ్యాయన్నారు. దోమలపై దండయాత్ర చేసే బదులు వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, పార్టీ నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి!
అనంతపురం: సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారని మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గమంత కూడా లేని సింగపూరుకు రైతులను తీసుకెళ్లారని, దానివల్ల ఏమి ప్రయోజనమని ప్రశ్నించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ చేపట్టబోయే పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ నాయకుడు వైవీ శివారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 3న పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త నదీంఅహమ్మద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో మార్పు తెస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జిల్లా నలుమూలలా వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా అర్బన్ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 3న సర్వమత ప్రార్థనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం పార్టీ కార్యాలయం నుంచి సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నివాళులర్పించిన తర్వాత మసీదు, శివాలయం, చర్చిలో పూజలు చేస్తామన్నారు. అనంతరం చెరువుకట్ట శివాలయం వద్ద శివారెడ్డి అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. నాయకుడు వైవీ శివారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు గోపాల్, శీనా, లింగారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ నిబంధనలు మారిస్తే ఊరుకోము
-
చంద్రబాబుకు మతి భ్రమించింది: వెన్నపూస
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను వెంటనే పిచ్చాస్పత్రికి తరలించాలని గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓట్లు వేయకుంటే రేషన్ కట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. సీఎం పదవిలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ఓటమి భయంతోనే ఆయన అభద్రతాభావానికి గురవుతున్నారన్నారు. తనకు ఓటేయకపోతే పెన్షన్లు ఇవ్వనని చంద్రబాబు ఎలా అంటారని నిలదీశారు. చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతన్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రమాదకరమని...ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పెన్షన్లు, రోడ్ల కోసం ఖర్చు పెట్టేది సీఎం చంద్రబాబు సొంత డబ్బు కాదని...అది ప్రజల డబ్బని తెలుసుకోవాలని చురకలంటించారు. కాగా తాను రాష్ట్రానికి, అన్ని వర్గాల ప్రజలందరికి ముఖ్యమంత్రినని మరిచిన చంద్రబాబు...జనంతో కక్ష సాధింపు ధోరణితో మాట్లాడిన విషయం తెలిసిందే. తానిచ్చిన పెన్షన్లు తింటున్నారని...తాను వేసిన రోడ్లపై నడుస్తున్నారని...కానీ తనకు ఓట్లు మాత్రం వేయడం లేదని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. ఓట్ల వేయని గ్రామాలను పక్కకు పెడతానని హెచ్చరించారు. అయితే చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్
అనంతపురం: ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగునీటి కోసం ఆందోళనకు దిగిన ఉవరకొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ సాగునీటి పథకాన్ని తక్షణమే ప్రారంభించాలన్న డిమాండ్‌తో వీరిద్దరూ అనంతపురం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, అధికారులు హామీయిచ్చే వరకు ఆందోళన కొనసాగించేందుకు సిద్ధపడ్డారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనను చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. -
విద్యా వ్యాపారంపై శాసనమండలిలో చర్చిస్తా
అనంతపురం రూరల్ : కార్పొరేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న విద్యా వ్యాపారంపై శాసన మండలిలో చర్చించి, ఫీజు నియంత్రణ చట్టం అమలు కోసం కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పరశురాం అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరుస కరువులతో రైతులు ఉపాధి కోసం వలస పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్య సంస్థలు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి లక్షలాది రూపాయాలు డొనేషన్ల పేరిట వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు తరహాలో 1వ తరగతి నుంచి 10 వరకు ప్రభుత్వ సెక్టార్లోనే విద్యాభ్యాసం అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇక్కడి నుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపు నిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 996 పాఠశాలలతోపాటు 56 వసతి గృహాలను మూసివేసిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారం సాగిస్తున్న పాఠశాలలపై ఐక్య ఉద్యమం చేపట్టాలన్నారు. జిల్లాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి 50 శాతం ఫీజులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాల వద్ద తరగతుల వారీగా ఫీజుల వివరాలతో కూడిన నోటీస్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ ఫీజు నియంత్రణ కోసం కలెక్టర్ ప్రత్యేక చోరవ చూపాలన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సాకే నరేష్, మల్లికార్జున నాయక్, ఆంజనేయులు, జనార్థనరెడ్డి, రాచానపల్లి గోపి, తోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో గెలుస్తానని బాబు కలలు కంటున్నారు
-
‘సీమ’ మండలి పోరులో వైఎస్సార్సీపీ విజయం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో గెలుపొందిన గోపాల్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నెల 20న కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ గోపాల్‌రెడ్డి మెజారిటీ సాధించారు. ఆ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. తద్వారా సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే, విజయానికి అవసరమయ్యే ‘మ్యాజిక్ ఫిగర్’ 67,887గా ఉండడంతో మంగళవారం రాత్రి నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటే వరకూ 22 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. గోపాల్‌రెడ్డి విజయానికి అవసరమైన ఓట్లు 67,887. మ్యాజిక్ ఫిగర్ కంటే 223 ఓట్లు ఎక్కువ పోలవ్వడంతో గోపాల్‌రెడ్డి గెలుపును అధికారులు ఖరారు చేశారు. కాగా ఈ ఎన్నికలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నామనీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి తనై నమ్మకం ఉంచి బి–ఫారం ఇచ్చినప్పుడే తన గెలుపు ఖరారైందని ఎమ్మెల్సీ ఎన్నికైన వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ గెలుపొందారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్సీపీ ముందంజ
-
పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్సీపీ ముందంజ
అనంతపురం/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. పశ్చిమ రాయలసీమ(చిత్తూరు, అనంతపురం) ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆరో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి గోపాల్‌రెడ్డి 12,637 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి రెండో స్థానంలోనూ, పీడీఎఫ్ అభ్యర్థి గేయానంద్ మూడో స్థానంలోనూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర(విశాఖ) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి మాధవ్ 5,045 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ రెండో స్థానానికి పరిమితమైపోయారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ రాయలసీమలో సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ, (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో విఠపు బాలసుబ్రహ్మణ్యం.. తన సమీప ప్రత్యర్థి, అధికార టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక ఓటమి పాలయ్యారు. కత్తి నరసింహారెడ్డికి 3,763 ఓట్ల మెజారిటీ వచ్చింది. అటు ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్సీపీ ముందంజ
-
పరిశ్రమల పునరుద్ధరణకు కృషి
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస హిందూపురం అర్బన్ : రాయలసీమలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం మండలిలో తన వాణి వినిపిస్తానని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏదైనా పోరాటంతోనే సా«ధ్యమవుతుందన్నారు. తనను గెలిపిస్తే రాయలసీమలో మూతబడ్డ పరిశ్రమల పునరుద్ధరణపై మండలిలో ప్రశ్నిస్తానన్నారు. హిందూపురం సమీపంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పెనుకొండ ఆల్వీన్ పరిశ్రమ, కర్నూలులో పేపర్ ఫ్యాక్టరీ, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. మూతపడిన పరిశ్రమలు ప్రారంభించలేని చంద్రబాబు కొత్త పరిశ్రమలు ప్రారంభించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ గోపాల్‌రెడ్డి ఎన్జీఓ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు.. రాయలసీమ ప్రాంత పరిస్థితులపై అవగాహన కల్గిన వ్యక్తి అన్నారు. గోపాల్‌రెడ్డి గెలుపుతో అధికార టీడీపీకి తగిన బుద్ధి వస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు
– చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి హిందూపురం అర్బన్ : ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు మీసాల రంగన్న, సివిల్ సప్లయ్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రవిశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్యాకేజీకి జైకొట్టి రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తోసేశారన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగSభతి అంటూ నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అనంతరం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మూర్ఖత్వ పనికి హిందూపురం పారిశ్రామికంగా వెనుకపడిందన్నారు. హంద్రీనీవా నీళ్లు తెస్తామని బాలకష్ణ తొడలు కొట్టడమే సరిపోయింది.. కానీ ఈ ఏడాది కూడా రావడం కష్టమేనని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా రూ.3 వేల కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉందని సూచించారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో మూడేళ్లయినా పూర్తి కావని విమర్శించారు. గెలుపుతో టీడీపీ పతనం ప్రారంభం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయంతో తెలుగుదేశం పార్టీకి పతనం ప్రారంభం కావాలని హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఓటరు నమోదులో నాయకులు, కార్యకర్తలు ముఖ్యభూమిక పోషించాలని కోరారు. ఉద్యోగ సంఘాల తరఫున సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలన్నారు. నవంబరు 20 లోపు ఓటరు నమోదులు పూర్తి చేయించి మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పారు. తర్వాత మీసాల రంగన్న మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అంతా దోపిడీ సాగుతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, రాప్తాడు జిల్లా యూత్ నాయకులు అమర్నాథ్రెడ్డి, రాప్తాడు మండల నాయకులు వరప్రసాద్‌రెడ్డి, సూర్యనారాయణ, నంద, హిందూపురం బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, మండల కన్వీనర్లు బసిరెడ్డి, నారాయణస్వామి, సదాశివరెడ్డి, నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు, నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెన్నపూస గోపాల్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ మద్దతు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2017 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో రాయలసీమ వెస్ట్(కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల) గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గోపాల్ రెడ్డి అభ్యర్థిత్వానికి, పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల నమోదు మొదలు ఆయన విజయం సాధించేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీకి చెందిన ఇతర నాయకులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపాల్ రెడ్డి గతంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. 1975 నుంచి 1978 వరకు భారత సైన్యంలో పారా ట్రూపర్ గానూ, ఆ తరువాత కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్లో సేవలు అందించారు. టీచర్లు, ఉద్యోగులు, వర్కర్ల జేఏసీకి ఆయన ఛైర్మన్ గానూ వ్యవహరించారు. -
‘నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి’
హిందూపురం అర్బన్ : నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతోందని రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి గెలిచాక మోసం చేశారన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు వెంటనే నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ పద్ధతిని ఎత్తివేసి పాతపద్ధతినే కొనసాగించాలన్నారు. మహిళ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న చైల్డ్ కేర్ సెలవులను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన lకోసం రాజీ లేని పోరాటం సాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ లెక్చరర్ రామచంద్రారెడ్డి, అడ్వకేట్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.