అనంతపురం సిటీ: రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నగర అధ్యక్షడు చింతా సోమశేఖరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉందనీ, ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా యుద్ధంలో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేశానని ఊదరగొడుతుంటారని, ఎక్కడ పెద్ద పీట వేశారో, ఎవరికి వేశారో, బీసీలు ఎంత అభివృద్ధి చెందారో చూపించాలన్నారు. వడ్డెర్లకు ఒక పలుగు, పార, గంప, మంగళికి ఒక అద్దం, కత్తి, కుర్చీ, చాకలికి ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి ఓ అభివృద్ధి చెందారంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారన్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ అభివృద్ధి చెందారు తప్ప బీసీలకు ఒరిగింది శూన్యమన్నారు.
త్వరలోనే టీడీపీ నేతలదౌర్జన్యాలకు చెక్
అనంతపురం పా ర్లమెంట్ సమన్వయకర్త త లారి పీడీ రంగయ్య మా ట్లాడుతూ టీడీపీ అ ధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారన్నారు. టీడీ పీ నేతల దౌర్జన్యాలకు చెక్‌పెట్టే రోజు దగ్గర్లో నే ఉందన్నారు. ఇన్ని రోజులూ కష్టనష్టాలు ప డ్డ వారికి ఈ 30 రోజులు మరింత కష్టపడటం అంత కాష్టమైన పనేమీ కాదన్నారు. వైఎస్ జ గన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇద్దాం
పార్టీ రాష్ట్ర కార్య దర్శులు ఎ ల్‌ఎం మోహన్ రెడ్డి, పైలా నరసింహయ్యలు, గౌస్‌బేగ్, మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం లక్షలా ది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజ ల ఆకాంక్ష అన్నారు. దీన్ని నెరవేర్చుకోవడానికి ప్రతి క్షణం కష్టపడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2 పార్లమెంట్ స్థానాలను వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
రాజన్న రాజ్యాన్ని సాదిద్దాం
రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైవీ శివారెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కలిసి వైఎస్సార్ పేరును ప్రజల హృదయాల్లోంచి చెరిపివేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి అష్టకష్టాలు పెట్టారన్నారు. అన్నింటికీ తట్టుకుని నిలబడి నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు భయపడే స్థాయికి ఆయన ఎదిగారన్నారు. అందరం ఏకమై టీడీపీ అవినీతి, అక్రమ పాలనను అంతమెందించి తిరిగి రాజన్న రాజ్యాన్నా సాధించేందుకు కష్టపడాలన్నారు. కార్యక్రమలో లీగల్ సెల్ నాయకులు నారాయణరెడ్డి, అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, లింగాల రమేష్, చింతకుంట మధు, పెన్నోబుళేసు, చామలూరి రాజగోపాల్, మహిళా విభాగం కృష్ణవేణి, గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
తొలగించినఓట్లను చేర్పించాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురామ్ మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లు ఒక ఎత్తూ ఈ 30 రోజులు ఒక ఎత్తన్నారు. గత ఏడు ఎనిమిది నెలలుగా దాదాపు 70 వేల ఓట్లను తొలగించారన్నారు. వెంటనే ఆయా ఓట్లను చేర్పించే ప్రక్రియనుచేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment