వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌ | Visweswara Reddy, vennapusa gopal reddy arrested | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌

Published Fri, Jun 23 2017 1:12 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌ - Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్‌

అనంతపురం: ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగునీటి కోసం ఆందోళనకు దిగిన ఉవరకొండ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ సాగునీటి పథకాన్ని తక్షణమే ప్రారంభించాలన్న డిమాండ్‌తో వీరిద్దరూ అనంతపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, అధికారులు హామీయిచ్చే వరకు ఆందోళన కొనసాగించేందుకు సిద్ధపడ్డారు.

వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనను చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్‌ సీపీ నాయకులు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement