అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సీపీఎస్ చేయాలని ఆందోళనకు వారికి ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని మడిపడ్డారు. రాష్ర్టంలో శాంతియుతంగా జరిగే ఉద్యమాలను అణిచివేయడం అప్రజాస్వామిక పరిపాలనకు నిదర్శనం అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే సీపీఎస్‌ను రద్దు చేస్తారని ఆయన చెప్పారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
గుత్తి సబ్ జైల్లో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీ. డీ. రంగయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట కార్యదర్శి పైలా నరసింహయ్యా, గుంతకల్లు నియోజకర్గ సమన్వయకర్త వై. వెంటక రామిరెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు.
రాష్ట్రంలో పశువుల కంటే హీనంగా అమ్ముడుపోయిన పార్టీ పీరాయింపుల ఎమ్మెల్యే చాంద్ బాషాకు వైఎస్సార్‌సీపీని విమర్శించే అర్హత అతనికి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సంతలో పశువులగ కంటే హీనంగా అమ్ముడుపోయిన నువ్వా.. వైఎస్‌స్సార్‌సీపీ గురించి మాట్లాడేది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లీం మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment