![Vijaya Sai Reddy Slams Chandrababu Over Anantapur Girl Child Death - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/2/chandrababu_1.jpg.webp?itok=294afJd9)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాన్ని సింగపూర్ స్థాయికి చేర్చాననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోతలు వాస్తవాల్ని దాయలేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలోని కమ్మరవాండ్లపల్లిలో ఓ చిన్నారి ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యంపాలై మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఒక పసిబిడ్డ మట్టితిని చనిపోయిందనే గుండె బద్దలయ్యే వార్త మీడియాలో వచ్చిందన్నారు. బాబు కోతలు ఈ కఠిన వాస్తవాన్ని దాయలేవని.. బాధిత కుటుంబానికి ఆహారం, నివాస వసతి కల్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విఙ్ఞప్తి చేశారు.
చదవండి : అన్నంలేక మన్ను తిన్న చిన్నారి మృతి
తన ఖాతాలో వేసుకునేవాడు..
ఫొని తుఫాను ముందస్తు సహాయ కార్యక్రమాలకు కేంద్రం రూ. 200 కోట్లు విడుదల చేసిందని మీడియాలో వచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కేటాయింపుల విషయం బయటకు తెలిసేది కాదని.. వచ్చిన డబ్బు ఏమయ్యేదో చెప్పేవారు కాదన్నారు. దీంతో కలెక్టర్లు, ఉద్యోగుల పని అంతా తానే చేసినట్టు.. చంద్రబాబు వారి శ్రమను తన ఖాతాలో వేసుకునేవారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment