MLA Chand Basha
-
ముస్లీం మైనారిటీలకు తీవ్ర అన్యాయం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సీపీఎస్ చేయాలని ఆందోళనకు వారికి ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని మడిపడ్డారు. రాష్ర్టంలో శాంతియుతంగా జరిగే ఉద్యమాలను అణిచివేయడం అప్రజాస్వామిక పరిపాలనకు నిదర్శనం అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే సీపీఎస్‌ను రద్దు చేస్తారని ఆయన చెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు గుత్తి సబ్ జైల్లో ఉన్న నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీ. డీ. రంగయ్య, వైఎస్సార్సీపీ రాష్ర్ట కార్యదర్శి పైలా నరసింహయ్యా, గుంతకల్లు నియోజకర్గ సమన్వయకర్త వై. వెంటక రామిరెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు. రాష్ట్రంలో పశువుల కంటే హీనంగా అమ్ముడుపోయిన పార్టీ పీరాయింపుల ఎమ్మెల్యే చాంద్ బాషాకు వైఎస్సార్సీపీని విమర్శించే అర్హత అతనికి లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సంతలో పశువులగ కంటే హీనంగా అమ్ముడుపోయిన నువ్వా.. వైఎస్స్సార్సీపీ గురించి మాట్లాడేది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లీం మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. -
ఇదేం విడ్డూరం..?
అనంతపురం ,తనకల్లు: ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఎన్టీఆర్ ప్రభుత్వ ఇళ్లను ప్రారంభించడానికి సోమవారం మండలానికి వస్తున్నారని తెలియడంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్గం నాయకులు హడావిడిగా ఆయన రాకముందే ఇళ్లను ప్రారంభించేశారు. మండలంలోని మలిరెడ్డిపల్లిలో ఎంపీపీ భూక్యా లక్ష్మీ, తనకల్లులోని ఇందిరానగర్‌లో ఎంపీటీసీ నూర్జహాన్ చేత ఇళ్ల ప్రారంభోత్సవాలను చేయించారు. ఎమ్మెల్యే తనను ఏం అంటాడోనని భయపడిన హౌసింగ్ ఏఈ శేఖర్, ఇతర అధికారులు అప్పటికప్పడు స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో పూర్తీకాని ఇంటిని ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేశారు. బయట ఇంటికి సున్నం, రంగులు వేయలేదు, ఇంటి లోపల మరుగుదొడ్లు ఇంకా నిర్మించనేలేదు. అలాగే విద్యుత్ సర్వీసింగ్ కూడా పూర్తీకాకుండా అసంపూర్ణంగా ఉంది. ఇంకా చాలా పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోని ఏఈ స్వయంగా ఇంటికి బయట పూలు కట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కాలువ శ్రీనివాసులు ఉన్న పోస్టర్లను అతికించి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంతో ఎమ్మెల్యే చాంద్‌బాషా వచ్చి ఇంటికి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్లిపోయారు. కొసమెరుపు ఏంటంటే... ఎమ్మెల్యే ప్రారంభించిన ఇళ్లు టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది కాదు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ ఇందిరమ్మ ఇళ్లు’ క్రింద మంజూరు చేసింది. ఈ విషయమై ఏఈకి అడిగితే ‘ఆ ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన మాట వాస్తవమే. అయితే పూర్తయింది టీడీపీ ప్రభుత్వంలో కదా. కాబట్టి అది కూడా ఎన్టీఆర్ ప్రభుత్వ గృహం క్రిందకే వస్తుందని’ చెప్పారు. మండలంలో మొత్తం టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో 280 మంజూరు చేస్తే అందులో ఐదు ఇళ్లు మాత్రమే పైకప్పు వరకు నిర్మించుకోగా, రెండంటే రెండే ఇళ్లు పూర్తీ అయ్యాయని, అంతమాత్రం దానికి ప్రారంభోత్సవాలంటూ ఈ æహడావిడి ఎందుకంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమడగూరు: అధికారుల తీరుతో ఎన్టీఆర్ గృహాలు మంజూరైన లబ్ధిదారులంతా నివ్వెర పోయారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని అన్ని మండలాల్లోనూ టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి నూతనంగా నిర్మించుకున్న గృహాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే అమడగూరు మండలంలో ఒకటి, రెండు గృహాలు మినహాయించి మిగిలినవన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే సోమవారం ఉదయం గృహాల లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ అధికారుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. మీ ఇంటి దగ్గరకు వస్తున్నాం, తోరణాలు కట్టి, టెంకాయ సిద్ధంగా ఉంచాలని అధికారులు పేర్కొన్నారు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు వారు చెప్పినట్లే చేశారు. అంతలోనే అధికారులు వచ్చారు. ఇంటి నిర్మాణం సగంలో ఉన్నట్లే, వారిపని కానించేశారు. ఫ్లెక్సీలు తగిలించి, హారతి పట్టి, కాయ కొట్టి, లబ్ధిదారులను నిలబెట్టి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. కొన్ని గ్రామాలలో సెంట్రింగ్ కూడా తొలగించకనే గృహ ప్రవేశాలను కానించేశారు. ఈ విషయంపై ఏఈ రాజేష్కుమార్రెడ్డిని వివరణ కోరగా మండలంలో 85 ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని సోమవారం 18 గృహాలకు గృహ ప్రవేశాలను చేసినట్లు తెలిపారు. -
ఏం చేశారని వచ్చారు..?
అనంతపురం , తలుపుల: మండల పరిధిలోని ఈదులకుంట్లపల్లి పంచాయతీలోని మడుగుతండా గ్రామంలో సోమవారం నూతన గృహాలు ప్రారంభించడానికి ఎమ్యెల్యే అత్తార్ చాంద్‌బాష వచ్చారు. తొలుత గ్రామంలోకి రాగానే మీరు మా గ్రామంలో ఒక్క ఇల్లు అయినా మంజూరు చేశారా , ఒక్కరోడ్డు అయినా వేయించారా? ఏం చేశారని మాగ్రామానికి వచ్చారు అని మడుగుతండాకు చెందిన దేవేంద్రనాయక్, దేవా నాయక్‌లు ఎమ్యెల్యేని నిలదీశారు. మా గ్రామంలో వందలాది ఎకరాలను ఫారెస్ట్ అధికారులు పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొంటే పల్లెత్తు మాట మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆర్డీఓ వెంకటేష్, రూరల్ సీఐ శ్రీధర్‌లు సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనుతిరిగారు. అనంతరం నూతన గృహ ప్రవేశాన్ని ఎమ్యెల్యే చేతుల మీదుగా చేయించారు. -
పార్టీ ఫిరాయించి వెన్నుపోటు పొడిచారు
-
ఎమ్మెల్యేను అడ్డుకున్న కందికుంట వర్గీయులపై కేసులు
నల్లచెరువు : కదిరి ఎమ్మెల్యే అక్తర్ చాంద్‌బాషాను అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులపై కేసు నమోదైంది. మండల పరిధిలోని గోరంట్లవారిపల్లి గ్రామంలో ఈ నెల 26వ తేదీ(శనివారం) జనచైతన్య యాత్రలో భాగంగా పర్యటించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కందికుంట అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయమై గాజిఖాన్పల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఫయాజ్‌ఖాన్ ఆదివారం నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు ఐదుగురిపై 143, 341, రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితులలో ఎ-1గా ఎంపీటీసీ మహబుబ్‌బాషా, ఎ-2గా జగన్మోహన్రెడ్డి, ఎ-3గా నరసారెడ్డి, ఎ-4గా వెంకటరమణ, ఎ-5గా రాజారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. -
అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్‌బాషా !
► టీడీపీలో చాంద్‌బాషాకు వరుసగా ఎదురుదెబ్బలు ► టార్గెట్ చేసిన పయ్యావుల, కందికుంట ► మినీమహానాడు నుంచి మధ్యలోనే వెనుదిరిగిన చాంద్ ► కందికుంట పంచన చేరిన కీలక అనుచరుడు కేఎం బాషా ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’ అన్నట్లుంది కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా పరిస్థితి. టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్సీపీని కాదని టీడీపీలో చేరారు. ఈయన రాకను మొదటి నుంచి టీడీపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా సైకిలెక్కారు. చేరిక తర్వాత చాంద్‌కు టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి వేదికపై టార్గెట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన వెనుక ఉన్న నేతలను కూడా దూరం చేస్తూ ఒంటరిని చేస్తున్నారు. ఈ పరిణామాలతో చాంద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్సార్సీపీలో ప్రత్యేక గౌరవం ఉండేదని, పార్టీ మారడంతో జనంలో కూడా చులకన య్యానని మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అనంతపురం: కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా 2014 వరకూ టీడీపీలో ఓ సామాన్య కార్యకర్త. నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేనిపేరు. టీడీపీలోనే కొనసాగివుంటే జీవితకాలంలో ఎమ్మెల్యే కాదు కదా, కనీసం మునిసిపల్ చైర్మన్ కూడా అయ్యేవారు కాదని కదిరివాసులు అంటున్నారు. మైనార్టీలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ చాంద్‌ను నిలబెట్టింది. మైనార్టీలు కూడా పార్టీపై ఉన్న ప్రేమాభిమానాలతో ఆయన్ను గెలిపించారు. అదే టీడీపీ జిల్లాలోని 14 స్థానాల్లో ఒక్కచోట కూడా మైనార్టీకి టిక్కెట్టు ఇవ్వలేదు. చాంద్ మాత్రం నైతికత మరచి టీడీపీలో చేరారు. ఈయన రాకను మాజీ ఎమ్మెల్యే కందికుంటతో పాటు పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. టీడీపీ అధిష్టానం మాత్రం పక్కా ప్రణాళికతో చాంద్ మెడలో పచ్చకండువా కప్పేసింది. ఆ కండువాతోనే విశ్వసనీయత కోల్పోయారని, రాజకీయజీవితం ప్రశ్నార్థకమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. టార్గెట్ చేసిన టీడీపీ నేతలు ఈ నెల 3న జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చాంద్‌పై ఎమ్మెల్సీ పయ్యావులతో పాటు మాజీ ఎమ్మెల్యే కందికుంట పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ‘మేము పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ మారలేదు. కొందరు రెండేళ్లు కూడా ఉండలేకపోతున్నారని’ కేశవ్ విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈనెల 23న కళ్యాణదుర్గంలో జరిగిన మినీమహానాడులోనూ టార్గెట్ చేశారు. ‘కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా ఎటు అధికారం ఉంటే అటు వస్తుంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని మరచిపోం’ అని పరోక్షంగా చాంద్‌ను ఉద్దేశించి అన్నారు. నిజానికి కందికుంట.. పరిటాల వర్గీయుడు. పరిటాల వర్గానికి, కేశవ్ వర్గానికి విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా కేశవ్ ప్రతిసారీ ఇలా స్పందించడాన్ని చూస్తే చాంద్ రాకను టీడీపీలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఇదే వేదికపై కందికుంట మాట్లాడుతూ ‘ఒకే ఒరలో రెండుకత్తులు ఇమడలేవు. తుప్పుపట్టిన కత్తి అయితే ఇమిడేందుకు అవకాశం ఉంటుందేమో. కానీ నేను యుద్ధం చేసే కత్తిగా ఉండాలనుకుంటున్నా’నంటూ నేరుగా చాంద్‌తో కలవలేనని తేల్చేశారు. ఈ మాటలతో చిన్నబోయిన చాంద్ అర్ధంతరంగా మహానాడు నుంచి వెనుదిరిగారు. చాంద్ వెళ్లిపోతుంటే వేదికపై అంతా నవ్వుకున్నారు. ఇదీ కొనుగోలు కథ మహానాడు నుంచి చాంద్ వెళ్లిన తర్వాత టీడీపీ నేతలు ఆయన పార్టీలోకి వచ్చేందుకు దారితీసిన పరిస్థితులపైనే చర్చించుకున్నారు. రూ.5.70 కోట్లతో బేరం కుదిరిందని, ఇందులో మొదటివిడతలో రూ.3.70 కోట్లు, వారం కిందట మరో రూ.50 లక్షలు ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చాంద్మాత్రం తనకు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారని అందరితో చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం చాంద్ వైఎస్సార్సీపీ ఇమేజ్‌తోనే గెలిచారని, సొంతంగా వెయ్యిఓట్లు కూడా ప్రభావితం చేయలేరని తేల్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇస్తామనడంలో వాస్తవం లేదని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా కందికుంటతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు చాంద్ ముఖ్య అనుచరుడు కేఎం బాషాను కందికుంట తనవైపు లాగేసుకున్నారు. పార్టీ మారే సమయంలో కూడా ఐదుగురు కౌన్సిలర్లు మినహా ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాంద్ వెంట వెళ్లలేదు. వీరిలో నలుగురు ఆయన బంధువులు. శివశంకర్‌నాయక్ తక్కిన కౌన్సిలర్. ఈయనూ కందికుంట వర్గంలో చేరారు. దీంతో బంధువులు మినహా ఒక్క కార్యకర్త కూడా వెంట లేక చాంద్‌బాషా పూర్తి ఏకాకి అయ్యారు. -
డీజీపీని కలిసిన ఎమ్మెల్యే
కదిరి (అనంతపురం) : కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన.. హోం గార్డుల వేతనాలు పెంచాలని, పీఎస్ క్వార్టర్స్ ఆధునీకరించాలని కోరుతూ డీజీపీకి వినతి పత్రం అందించారు. -
'చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సూచించారు. అనంతపురం పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని ఈ సందర్భంగా చాంద్ బాషా గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కా ఇళ్లు నిర్మించని కారణంగా.. భారీ వర్షాలు కురిసి పక్కా ఇళ్లు లేని వాళ్లు చనిపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఇళ్లు లేని పేదలు మృతిచెందుతున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా డిమాండ్ చేశారు. -
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి: చాంద్ పాషా
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని, కేంద్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ పాషా అన్నారు. గుంటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ అనంతపురంలో 107మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజధాని శంకుస్థాపన సంబరాలు పేరిట దోచుకుంటున్నారని అన్నారు. మరోవైపు రాజధాని నిర్మాణానికి విరాళాల పేరిట హుండీలు పెట్టి ప్రజలను అందులో డబ్బులు వేయాలని కోరుతున్నారని, ఈ పరిస్థితులు రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉందో తెలుపుతున్నాయని అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు లభిస్తున్నదని, దీక్ష తరలివచ్చిన జనంతో గుంటూరు నిండిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పణంగా పెట్టి జగన్ దీక్ష చేస్తున్నారని, ఇలాంటి నేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం తమ అదృష్టంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద పణంగా పెడుతున్నారని విమర్శించారు. -
'కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి'
-
రైతులు సుఖంగా ఉన్నారా..
వారికి భరోసా ఇవ్వకుండా ఆ మాటెలా చెబుతావు? చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే చాంద్‌బాషా సాక్షి, హైదరాబాద్ : తన పాలనలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటూ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ‘రైతుకోసం చంద్రన్న యాత్ర’ విజయోత్సవ ముగింపు సభను జరుపుకోవడం దురదృష్టకరం, బాధాకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాషా అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘అనంతపురం జిల్లాలో ముగింపుసభ ఎందుకు పెట్టారు? ఏ జిల్లాలో లేనివిధంగా 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా?’’ అని ఆయన సీఎంను ప్రశ్నించారు. ఆత్మహత్యల గురించి ప్రస్తావించకుండా, వారికెలాంటి భరోసా ఇవ్వకుండా రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని ఎలా చెబుతారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రగల్భాలు చెప్పుకోవడమేంటీ? ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు ఇచ్చిన నివేదికలో రైతుల రుణాలు రూ.94 వేల కోట్లుంటే కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే చెల్లించి రుణమాఫీ చేసేశామని ప్రగల్భాలు చెప్పుకోవడం ఏమిటని చాంద్‌బాషా నిలదీశారు. అనంత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన ఘనత బాబుదే.. తమ జిల్లాలో రైతులకివ్వాల్సిన 2013-14 సంవత్సరానికి సంబంధించిన రూ.603 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకొచ్చాక ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికారమిషన్ నుంచి ఒక్క రైతుకూ సాయం చేయడంగానీ, ప్యాకేజీ ఇవ్వడంగానీ చేయలేదని దుయ్యబట్టారు. -
బరితెగించిన టిడిపి నేతలు