
ఎమ్యెల్యేను నిలదీస్తున్న గ్రామస్తులు
అనంతపురం , తలుపుల: మండల పరిధిలోని ఈదులకుంట్లపల్లి పంచాయతీలోని మడుగుతండా గ్రామంలో సోమవారం నూతన గృహాలు ప్రారంభించడానికి ఎమ్యెల్యే అత్తార్ చాంద్‌బాష వచ్చారు. తొలుత గ్రామంలోకి రాగానే మీరు మా గ్రామంలో ఒక్క ఇల్లు అయినా మంజూరు చేశారా , ఒక్కరోడ్డు అయినా వేయించారా? ఏం చేశారని మాగ్రామానికి వచ్చారు అని మడుగుతండాకు చెందిన దేవేంద్రనాయక్, దేవా నాయక్‌లు ఎమ్యెల్యేని నిలదీశారు. మా గ్రామంలో వందలాది ఎకరాలను ఫారెస్ట్ అధికారులు పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొంటే పల్లెత్తు మాట మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆర్డీఓ వెంకటేష్, రూరల్ సీఐ శ్రీధర్‌లు సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనుతిరిగారు. అనంతరం నూతన గృహ ప్రవేశాన్ని ఎమ్యెల్యే చేతుల మీదుగా చేయించారు.