'చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి' | mla chand basha criticise babu on home for poor people | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి'

Published Tue, Nov 17 2015 11:57 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

'చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి' - Sakshi

'చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి'

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సూచించారు. అనంతపురం పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని ఈ సందర్భంగా చాంద్ బాషా గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కా ఇళ్లు నిర్మించని కారణంగా.. భారీ వర్షాలు కురిసి పక్కా ఇళ్లు లేని వాళ్లు చనిపోతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఇళ్లు లేని పేదలు మృతిచెందుతున్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement