అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పలు అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతల ప్రలోభాలతో కొందరు ఉద్యోగులు వైఎస్సార్‌సీపీ ఓట్లను టీడీపీ బాక్సుల్లో వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కౌంటింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరు ఓట్లను టీడీపీ బాక్సుల్లో ఒక ఉద్యోగి వేయడం అనుమానాలకు తెరలేపింది. దీనిపై రీకౌంటింగ్ చేయాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేథన్‌గార్గ్‌కు లిఖిత పూర్తకంగా వినతి ప్రతం అందజేశారు రవీంద్రారెడ్డి.
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా వెర్రి తలలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఎల్లో మీడియా పైశాచిక ఆనందం పొందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా లెక్కింపు జరిగినట్లు రోత రాతలు రాస్తోంది. పట్టభద్రల ఓట్లన్నంటినీ కలిపి లెక్కిస్తున్నప్పటికీ జిల్లాలు, నియోజకవర్గాల వారిగా లెక్కింపు జరుగుతుందని అసత్యపు రాతలు రాస్తోంది. పులివెందులలో టీడీపీ మెజారిటీ అంటూ పచ్చ మీడియా తన పైత్యాన్ని మరోసారి బయటపెట్టింది. వాస్తవాన్ని వక్రీకరించి ఎల్లో మీడియా వికృత ప్రచారానికి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment