సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూలు జారీ చేసింది. ఆ మేరకు తూర్పు– పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి–పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి రాము సూర్యారావు (ఆర్.ఎస్.ఆర్.మాస్టారు), కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎ.ఎస్.రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ అయ్యే ఈ రెండు స్థానాల భర్తీ కోసం ఈసీఐ గురువారం షెడ్యూలు జారీ చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియను మార్చి 22లోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. షెడ్యూలు జారీ చేయడంతో గురువారం నుంచే ఆ 2 నియోజక వర్గాల పరిధిలోని 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ : ఫిబ్రవరి 16
(ఇదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24
ఉపసంహరణకు తుది గడువు : ఫిబ్రవరి 26
పోలింగ్ : మార్చి 14
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు
ఓట్ల లెక్కింపు: మార్చి 17
Comments
Please login to add a commentAdd a comment