సాక్షి, అమరావతి: గుంటూరు- కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అధ్యాపక ఉపాధ్యాయ వర్గాలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేయడానికి సమయం కేటాయించారు. ఇక కృష్ణా- గుంటూరు జిల్లాల పరిధిలో మొత్తం 13,505 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8026 మంది పురుషులు, మహిళలు 5479 మంది ఉన్నారు.
►పామర్రులో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఉపాధ్యాయ పట్టభద్రులు.
►పెడనలో 70 మంది, గూడూరులో 20 మంది, కృత్తివెన్నులో 17 మంది, బంటుమిల్లిలో 59 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికల విధుల్లో 1205 మంది..
రెండు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 1205 మందిని వినియోగిస్తున్నారు. పీఓలు 139, పో-1 139, ఓపీఓలు 220, మైక్రో అబ్జర్వర్లు 139, సామాగ్రి పంపిణీకి 241, రిసెప్షన్లు 247, రూట్ ఆఫీసర్లు 40, సెక్టారు ఆఫీసర్లు 490 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఉభయ జిల్లాల్లో 7,765 మంది ఓటర్లు
►మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 43.6 శాతం పోలింగ్ నమోదైంది.
►తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 49 కేంద్రాల్లో ఉపాధ్యాయ వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఉభయ జిల్లాలో మొత్తం 7,765 మంది ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలోని 49 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment